-
ఫ్యుడ్రోయంట్ నౌక … సర్ ఆర్థర్ కానన్ డోయల్, ఇంగ్లీషు కథారచయిత
దేశపు ఖజానా నిండుకుందని ఎవరన్నారు, తమకు రావలసిన చెల్లింపులు రావేమోనని ఎవరికి భయం, ఒకప్పటి మన చారిత్రక సంపద అంతా ద్రవ్యంగా మార్పిడిచెయ్యడానికి నిశ్చయించుకున్నప్పుడు? గడ్డురోజులు వచ్చినా, వ్యాపారం మందంగా ఉన్నా, బొగ్గూ, ప్రత్తీ తమవిలువకోల్పోయినా, మనకి మారకం చేసుకుందికి ఇంకా మిగిలే ఉంది… మనకి వారసత్వంగా వచ్చిన గత చరిత్ర. ఇప్పటికీ ఇంకా ఏ మహారాజుదో, దేశనాయకుడిదో చివికి, మన్నైన శరీరమున్న సమాధులేన్నో ఉన్నాయి; అమ్మకానికి పెట్టడానికి షేక్స్పియర్ ఇల్లుంది, మిల్టను ఇల్లు దానికి…
-
మా తండ్రి సమాధి దగ్గర… హ్యూ మెక్ డెర్మిడ్, స్కాటిష్ కవి
నేనింకా చిన్న వాణ్ణే, నువ్వు మేఘాల్లో తేలి వెళ్ళిపోయావు ఇప్పుడు మనం ఇద్దరం లోయకి అటూ ఇటూ ఉన్న పర్వతాల్లా ఒకర్నొకరు చూసుకుంటుంటాం. నేను ఇపుడు నీకేమీ కాను. నా మనసు, కాదు నీ కొడుకు అలా చూస్తుంటాడు నీ మృత్యువనే పెద్ద మేఘం కమ్ముకొస్తుంది అది మధ్యనున్న అగాధాన్ని తలపిస్తుంది. ఒక బతికున్న మనిషి మృతుడు గురించి ఆలోచిస్తాడు ఇప్పుడిక కొంచెపుటాలోచనలు రావడం అసంభవం. . హ్యూ మెక్ డెర్మిడ్ 11 August 1892…
-
నాగేటి చాలు… పెడ్రాక్ కోలం, ఐరిష్ కవి
ఎక్కు! త్వరగా కొండపైకి ఎక్కు, కృషీవలా! ఆకాశం అంచులదాకా ఎక్కు. పద పద. విత్తనాలు విసురుతూ, ఆనందంతో నాల్గుపక్కలా జల్లుతూ, పద పద. కొండ అంచుకి ఆవలివైపు విశాలమైన తీరం మీద కడలికెరటాలు చేసే లయకి అనుగుణంగా పదాలు పాడుతూ… దిగువ, నేలక్రింద, చీకట్లో తల్లులు నిద్రలో ఉన్నారు ఉయ్యాలలు విశ్రాంతి తీసుకుంటున్నై వెలబారిన నివురు లోలోపల నిప్పు-రవ్వ కూడా నిద్రిస్తోంది. ఓ నేలపట్టీ! ఓ దార్శనికుడా! చీకటికీ నిద్రకీ తలవంచు! నన్ను పుడమికి అంకితంచెయ్యి. నేను…
-
మాతృగర్భం… జార్జి విలియం రసెల్, ఐరిష్ కవి
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో) నల్లరేగడి మీద నాగేటికర్రు విశ్రాంతి తీసుకుంటోంది తిరగబడిన నల్లటిమట్టిపెల్లమీద మంచుముద్ద కూచుంది శ్రమతో అలిసిన గుర్రం, తీరిగ్గా నెమరువేసుకుంటోంది అదిగో రైతుకుర్రడు సూర్యోదయాన్ని తలెత్తి చూస్తున్నాడు. మొగ్గతొడుగుతున్న దట్టమైన కంచె ఉదయకిరణాలవెలుగులో అంచులంట బంగారు రంగు స్ఫటికాలతో మెరుస్తున్నాది నిర్లక్ష్యంగా కనిపించే నగర గోపురాలమీద ఏకైక సౌందర్యం అతనికోసం ప్రకాశిస్తోంది. ఏ రోజుకి ఆ రోజు ఉదయాస్తమయాలు ఆవిష్కరించబడుతూ కనులు చూడలేని అందాల్ని మనకి కనిపింపజేస్తాయి తనగర్భంలో మహోన్నతమైన ఆ…
-
పుడమి… జాన్ హాల్ వీలాక్ అమెరికను కవి
ఓ అజ్ఞాత కీటకమా! శ్రావ్యమైన నీ సంగీతమూ, నా కవితా కూడా, సమస్తమైన కవిత్వానికీ ఆలవాలమై మౌన, గంభీరమైన ఈ పుడమికి ఒక్కలాగే చెందుతాయి. మనం రాసేదీ, పాడేదీ అంతా ఆమె సుషుప్తావస్థలో ఉండి అటూ ఇటూ కదులుతున్నప్పుడు మగతలో ఆమె గుండెచేసే సవ్వడులే. మనం ఆనందంతో కేరినా, దుఃఖంతో కీరినా నువ్వూ, నువ్వూ నేనూ ఇద్దరం ఆమె గొంతులమే. ఆమె అగోచరమైన సౌందర్యాన్ని ఈ ధూళి ఎంతో నేర్పుగా ప్రకటిస్తుంది; డాంటే కలలైనా, కీచురాయి…
-
పల్లెటూరి డాక్టరు … ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత
Watch this story turned into a beautiful Japanese animation picture here నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను;…
-
ఈ మట్టిలో సారం ఉంది… ఆర్థర్ స్ట్రింగర్, అమెరికను కవి
. ఈ మట్టిలో అపారమైన సారం ఉంది ఈ నేలలో జవమూ జీవమూ ఉన్నాయి. పెల్లగిలిన మట్టిలో ఊరటా, ఆకాంక్షలూ దాగున్నాయి; అందుకే, నా ఆత్మని ఇందులో విత్తనంలా పాదుకొల్పుతాను రేపు అది పాటగానో, పువ్వుగానో తిరిగి నను చేరుకుంటుంది. ఎంతో శాంతగంభీరంగా, స్థిరంగా, అమరికగా ఉండే ఈ పుడమిని తల్లిని తిరిగి చేరుకోడం మంచిదని నేనెరుగుదును. అది ఎంత నెమ్మదిగా తెలిసీ తెలియనట్లు శ్వాసిస్తుంది! సువిశాలమూ, సంపన్నమూ అయినా ఆ వక్షము ఏదో ఒకరోజు మనలనందరినీ…
-
విద్యుద్దీపం… టాం క్లార్క్ అమెరికను కవి
అదిలేకుండా పాపం మన పూర్వీకులు ఎంత ఒంటరి జీవితం గడిపేవారో! చీకటి చిత్తరువుల్లాంటి భయంకరమైన గుహల్లో వెలుగుచొరని చలి ప్రదేశాలమధ్యా నలుగురూ నాలుగుపక్కలా పడుక్కుని గుడ్డివాళ్లలా ఒకరి ముఖాలు ఒకరు నవ్వితే పడే సొట్టలకోసమూ ఆవేశాల ఆనవాళ్లకోసమూ సణుక్కుంటూ, తడుముకుంటుండేవారేమో. ఎంత విసుగెత్తే సంభాషణలు నడిచేవో వాళ్ళ మధ్య! బహుశా పాత కవిత్వం అంత నిరాసక్తంగా ఉండడానికీ ప్రసిద్ధమైన వాటిలోని విషాదఛాయలకీ కారణం సుదీర్ఘమైన దీపాలులేని చీకటి రాత్రులనుండి రావడమేనేమో! దీపాలతో పాటే హాస్యోక్తులూ వచ్చి ఉంటాయి.…
-
నేను చనిపోయిన పిదప… రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి
నేను చనిపోయిన పిదప స్పందనలేని ఈ మట్టిమీద ఆడంబరానికి, లేని దుఃఖాన్ని ప్రదర్శించవద్దు; బ్రతికున్నప్పుడు నేను ప్రేమించిన నా మిత్రులందరూ ఒక కన్నీటిబొట్టు వదిలి, నా భార్యాబిడ్డల్ని ఓదార్చొచ్చు. నేను చనిపోయిన పిదప అపరిచితుల్ని పక్కనుండి పోనీండి. నా దేశ దిమ్మరి జీవితం గూర్చి హర్షించడానికిగాని అవమాంచడానికిగాని ఎందుకూ, ఎలా అన్నప్రశ్నలడగనీయొద్దు. ఆశాశ్వతమైన కీర్తి కుసుమాల్ని నాపై వేయనీయొద్దు. నేను చనిపోయిన పిదప హత్యాసదృశంగా విమర్శించిన నాలుక అంతవరకు నాగూర్చిచెప్పిన అబద్ధాలన్నిటినీ మరిచిపోయి అది…
-
పాతపాట … ఆర్థర్ కెచం, అమెరికను
నేను ప్రౌఢవయసులో ఉన్నప్పుడు… అబ్బో! అదెప్పటి మాట! అదృష్టం ప్రతి పురుషుణ్ణీ వరిస్తుందనీ కాలమొక్కటే శతృవనీ; ప్రేమ ప్రతి వసంతంలో పూచే మల్లెపువ్వు వంటిదనీ ఎవరికి నచ్చిన పూవ్వు వాళ్ళు ఎంచుకోవాలనీ… ఆ వయసులో అలా అనిపించడం సహజం. కానీ యవ్వనమొక పొదుపెరగని దూబరగొండి ఎంత సులువుగా వస్తుందో అంత సులువుగా పోతుంది ఒకప్పుడు గాలిలో తేలుతున్నట్టు పడే అడుగులు ఇప్పుడు బరువుగా పడుతున్నాయి. మల్లెతీగ తెల్లని ముసుగేసుకుంది, కోయిల గొంతెత్తి నిర్మలంగా పాడుతోంది మనిషిజీవితంలోమాత్రం వసంతం …