అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 16, 2014

    గడ్డిపరక… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి

    నువ్వో కవిత కావాలంటావు నీకో గడ్డిపరక అందిస్తాను. నువ్వు అదేం బాగులేదు కవితని ఇవ్వమని అడుగుతావు. ఈ గడ్డిపరక సరిపోతుందిలే, ఇది చక్కని మంచువలిపాలు చుట్టుకుంది నేను రాయబోయే ఏ ప్రతీకకన్నా ఇది చాలా సన్నిహితమూ, పరిచయమైనదీను అంటాను. “ఇది కేవలం గడ్డిపరకంటే గడ్డిపరక అసలిది కవిత్వం కానే కాదు ఇదెంతమాత్రం సరిపోదు,” అంటావు. నేను నీకు గడ్డిపరకనే ఇస్తాను. నీకు చాలా కోపం వస్తుంది. గడ్డిపరక ఇవ్వడం సులభం అంటావు. ఇది అర్థ రహితం. గడ్డిపరక…

  • జనవరి 15, 2014

    కిటికీ… సాకీ

    [సుమారు పది పదిహేను సంవత్సరాల క్రిందట అనుకుంటాను, “Readers Digest” ప్రత్యేక కథల సంపుటిలో ఈ Open Window కథ మొదటి సారి చదివాను.  మనసుమీద చెరగని ముద్ర వేసింది. ఈ కథకి ఆయువుపట్టు చివరి వాక్యమే. ఎక్కడా అసంబద్ధత లేకుండా, ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టకుండా, ఎంత నిశితంగా పరీక్షించినా (నా మట్టుకు) తప్పుదొరక్కుండా పకడ్బందీగా కనిపించింది దీని అల్లిక.  Short Story(చిన్న కథ) అన్నపదానికి అక్షరాలా నిర్వచనంగా చూపించొచ్చు దీన్ని. ఇంగ్లీషు అచ్చులో 2,…

  • జనవరి 14, 2014

    నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే… ఎమిలీ డికిన్సన్, అమెరికను

    నాకు ద్వేషించడానికి సమయం లేదు, ఎందుకంటే మధ్యలో, మృత్యువు అడ్డు వస్తుంది, జీవితం మరీ అంత నిడుపైనదేం కాదు నా శత్రువులందర్నీ మట్టుపెట్టగలగడానికి. నాకు ప్రేమించడానికీ అంత తీరికలేదు, కానీ ఏదో పరిశ్రమ చెయ్యాలి కాబట్టి; చిన్నపాటి ప్రయత్నం చాలు ప్రేమకి అనుకుంటాను, అదే నాకు అసంఖ్యం. . ఎమిలీ డికిన్సన్ డిశంబరు 10, 1830 – మే 15, 1886 అమెరికను కవయిత్రి. . http://en.wikipedia.org/wiki/File:Emily_Dickinson_daguerreotype.jpg . I had no time to hate,…

  • జనవరి 13, 2014

    కిటికీలోంచి చూస్తున్న బాలుడు … రిచర్డ్ విల్బర్, అమెరికను కవి

    మంచుమనిషి ఒక్కడూ అలా పొద్దుపోయి రాత్రల్లా చలిలో నిలబడ్డం ఆ బాలుడు భరించలేకపోయాడు పళ్ళు పటపట మనిపించేలా గాలి ఊళలేస్తూండడం విని ఆ కుర్రాడు ఏడవ సాగేడు. నీళ్ళు నిండిన అతని కళ్ళు,  పాలిపోయి తారునలుపుకళ్ళ మంచుమనిషినీ, స్వర్గంనుండి బహిష్కరించినపుడు “ఏడం” దీనంగా చూసిన చూపులాంటి అతని చూపుల్నీ చూడలేకపోతున్నాడు. అయినా, మంచుమనిషి హాయిగానే ఉన్నాడు లోపలికిపోయి చావాలన్నకోరిక ఏమాత్రం లేదు. కాకపోతే, ఆ అబ్బాయి ఏడవడం అతన్ని కదిలించింది. గడ్డకట్టిన నీరే అతని స్వభావం అయినప్పటికీ అతని మెత్తనికళ్ళలోంచి…

  • జనవరి 12, 2014

    అస్పష్ట సంగీతం… వాల్టర్ డి లా మేర్, ఆంగ్ల కవి

    రాలుతున్న ఉల్క నిశ్శబ్ద మార్గం, చప్పుడు చెయ్యని వాన; నిశ్చలమైన అగడ్తనీటితో పొగమంచు మౌన భాషణ, నిద్ర మరచిన పూవు విడిచే నిట్టూరుపూ, ఆ గంట మోగించని స్వరమూ … నిద్రమత్తు వదిలి అంతరాంతరాల్లోని మనిషి తిరగబడతాడు, గర్భంలో రహస్యంగా రూపుదిద్దుకుంటుంది స్వచ్ఛమైన ప్రేమ ప్రమాణం పలకకపోయినా అంత విశ్వాసంగానూ కొట్టుకుంటున్న గుండె… అన్ని శబ్దాలూ కడకు నిశ్శబ్దం దగ్గరకి రావలసిందే! . వాల్టర్ డి లా మేర్ 25 April 1873 – 22 June…

  • జనవరి 11, 2014

    నిపుణహస్తస్పర్శ… మైరా బ్రూక్స్ వెల్ష్, అమెరికను

    See a Lovely Video Of this poem here అది బాగా దెబ్బతింది, మచ్చలుపడింది, ఆ వేలంపాటగాడు  ఆ తుక్కు వాయులీనం మీద తన విలువైనకాలం అట్టే వృధాచెయ్యదలుచుకోలేదు అయినా నవ్వుముఖంతో దాన్ని పైకెత్తి అరిచేడు: “మహాజనులారా! దీన్ని ఎంతకు కొంటారు,” అని ప్రారంభించేడు “ఎవరు ముందుగా పాటప్రారంభిస్తారు? ఒక డాలరా? ఒకటీ. రెండు డాలర్లు? రెండూ! దీన్ని మూడు డాలర్లిచ్చి ఎవరు తీసుకుంటారు?” మూడు డాలర్లు … ఒకటోసారి; మూడు డాలర్లు… రెండోసారి; అయిపోతోంది,…

  • జనవరి 10, 2014

    పొగ మంచు … సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి

    (పొగ మంచు ప్రవాహంలో మునిగిన అమెరికను వాసులకి) ఆకసం మీద దండెత్తే మహానగాలు విశాలమైన పొగమంచుతెరల ప్రవాహంలో మునిగిపోయాయి నా గుమ్మం ముందర అల్లుకున్న ఫ్లాక్స్ తీవె గరుడపచ్చ బిందువులు దండలా రాలుస్తోంది . పదే పదడుగుల దూరంలో ధృఢమైన నేల కరుగుతున్న మేఘంగా మారిపోతోంది వేదన, ఉల్లాసముల మేళవింపులో నిశ్శబ్దం ఎల్లెడా పరుచుకుంది ఒక్క పిట్టకి కూడా గట్టిగా కూయడానికి మనసొప్పడం లేదు. . భూమీ, ఆకాసమూ, సముద్రమూ పోల్చుకోలేని ఈ ప్రపంచంలో ఏ మార్పూ…

  • జనవరి 9, 2014

    Timeless Journey …. Katta Srinivas, Telugu, Indian

    World won’t end if all material things cease, But when thinking ceases, No matter how much matter is left, The world ends! Time shall not stop Just because you throw away all clocks. The day when motion stops It ends abruptly on its own!! Just for the absence of greetings Friendships won’t taper. They come…

  • జనవరి 8, 2014

    Anand 2 … Dr. Pulipati Guruswamy, Telugu, Indian

     ‘Daddy! Don’t you sing me a song?’ Hailed Anand from the entrance even before he walked into the room. I was just wondering what the matter was for his unusual request. He must have guessed it from my silence. He said, ‘all my classmates are singing for an event. It’s is only me who knew…

  • జనవరి 7, 2014

    కీర్తన… సారా ఫ్లవర్ ఏడమ్స్, ఇంగ్లీషు కవయిత్రి

    ఎండనీ అతనే పంపుతాడు, చినుకునీ అతనే పంపుతాడు రెండూ పువ్వు విరబూయడానికి ఒక్కలాగే కావాలి. అలాగే కష్టాలూ సుఖాలూ ఒక్కలాగే పంపుతాడు ఈ ఆత్మకి తగిన పోషణనివ్వడానికి. తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి చుట్టుముట్టినా నాది కాదు, ఎప్పుడూ నీ ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. విసుక్కున్నా, తాము ప్రేమించి, విశ్వసించే తల్లిదండ్రుల్ని పిల్లలు నిందించగలరా? ఓ సృష్టి కర్తా! నేను నీకు ఎల్లప్పుడూ విశ్వాసముగల, ప్రియమైన బిడ్డగా ఉంటాను: తండ్రీ! నన్ను వెలుగు ముంచెత్తినా, చీకటి…

←మునుపటి పుట
1 … 161 162 163 164 165 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు