అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 26, 2014

    అర్థరాత్రి నిద్రలో… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను

    1 అర్థ రాత్రి నిద్రలో, వ్యధాభరితమైన అనేక ముఖాలు, చూడటానికి ప్రాణాంతకంగా గాయపడ్డ చూపులు —                                వర్ణించనలవిగాని ఆ చూపులు; వెల్లకిలాపడిన నిహతులు, చేతులు బార్లా జాపుకుని, కలగంటి, కలగంటి, కలగంటి. 2 ప్రకృతి దృశ్యాలు, పంటచేలు, మహానగాలు, తుఫానువెలిసిన తర్వాతి అందమైన ఆకాశాలు… రాత్రిపూట అద్భుతంగా ప్రకాశిస్తూ చందమామ తళతళా మెరుస్తూ,  క్రింద మేము కందకాలు తవ్వుతూ మట్టి పోకలుపోస్తున్న చోట కాంతి ప్రసరిస్తూ, కలగంటి కలగంటి కలగంటి 3 అవన్నీ గతించిపోయి ఎన్నేళ్ళో…

  • జనవరి 25, 2014

    తమార్ కి ఊరడింఫు … స్టాలింగ్స్, అమెరికను కవయిత్రి

    (ఒక పురాతన భాండాన్ని పగులగొట్టిన సందర్భంగా) . తమార్! నేనేమీ పురాతత్వవేత్తని కానని నీకు తెలుసు, నాకు ఆ మట్టయినా, ఈ మట్టయినా ఒకలాగే ఉంటాయి. అయినప్పటికీ, ఇన్ని వందల ఏళ్ళు భూకంపాలూ, వరదలూ, యుద్ధాలూ, వాతావరణం తట్టుకోగలిగిందంటే మాటలుకాదు చివరకి నీ చేతిలో పగిలిపోయింది. గురుత్వాకర్షణ వల్లో, లేక అలా రాసిపెట్టి ఉందో— అలా యుగాలతరబడి ఎక్కడో సొరుగుల్లో, దూర దేశాల్లో ఎలా పగలకుండా ఉండగలిగిందా అని ఆశ్చర్యపోతున్నాను నీ చేతివేళ్ళ మృదుస్పర్శలో ఎక్కడో ఉడుకు రక్తపు…

  • జనవరి 24, 2014

    ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన … ఎడ్మండ్ స్పెన్సర్ , ఇంగ్లీషు కవి

    ఒకరోజు ఆమె పేరు ఇసుకలో రాసాను సముద్రతీరాన, కాని అలలు వచ్చి దాన్ని ఊడ్చుకుపోయాయి, మళ్ళీ మరో సారి చేత్తో రాసేను మళ్ళీ కెరటం వచ్చి నా శ్రమని హరించింది. “ప్రయోజనం లేదు, ప్రియా” అంది ఆమె, “నువ్వు అనవసరంగా శ్రమపడుతున్నావు, నశ్వరమైన దాన్ని శాశ్వతం చెయ్యడానికి నా మట్టుకు నాకు ఇలాగే నశించిపోవడం ఇష్టం. దానితో పాటే, నా పేరూ అలాగే చెరిగిపోవాలి. “వీల్లేదు,” అన్నాను నేను, “విలువలేనివి మట్టిలో కలిసేమార్గాలు ఎన్నుకోనీ, నీ కీర్తి…

  • జనవరి 23, 2014

    ఎదురు జవాబు… సారా టీజ్డేల్, అమెరికను

    నేను మట్టిలో తిరిగి కలిసిపోయేక సంతోషంతో అతిశయించిన ఈ శరీరం ఒకప్పుడు తను విర్రవీగిన ఎర్ర, తెల్లకణాలను వదుల్చుకున్నాక… నా మీద నుండి పురుషులు నడిచిపోతూ తెచ్చిపెట్టుకున్న లేశమాత్రపు జాలితో మాటాడితే నా మట్టి తిరిగి  గొంతు తెచ్చుకుని వాళ్ళకి గట్టిగా ఇలా ఎదురుచెబుతుంది: “చాలు, ఆపండి! నేను సంతృప్తిగా ఉన్నాను. మీ జాలి నాకక్కరలేదు! వెనక్కి తీసుకొండి. సంతోషమన్నది నాలో ఒక జ్వాల ఎంత నిలకడ అంటే అంత సులువుగా ఆరదు; సులువుగా ఒదిగే రెల్లు…

  • జనవరి 22, 2014

    పీసా గీతం LXXXI … ఎజ్రా పౌండ్ , అమెరికను

    నువ్వు ప్రేమించిందే శాశ్వతం, మిగతాదంతా పనికిమాలినదే నువ్వు ప్రేమించించింది నీనుండి వేరుచెయ్యబడలేదు నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం, ఈ సృష్టి ఎవరిది, నాదా, నీదా, లేక ఎవరికీ చెందదా? ముందుగా గ్రహించేది దృశ్యమానం, తర్వాతే స్థూలప్రపంచం స్వర్గం… అది నరకలోకలోకపు చావడులలో ఉన్నా నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం నువ్వు ప్రేమించేది నీ నుండి లాక్కోబడలేదు. . ఎజ్రా పౌండ్ 30 October 1885 – 1 November 1972 అమెరికను . .…

  • జనవరి 21, 2014

    ఆఖరి సుమం… అలెగ్జాండర్ పుష్కిన్. రష్యను కవి

    కొత్తగా కుసుమించిన పుష్పపు సొబగులు దివ్యంగా ఉండొచ్చు; నాకు మాత్రం చివరి సుమమే ఇష్టం. నా కలలూ. ఆశలూ, కోరికలన్నిటిలోనూ ఎప్పుడూ నా మనసుకి పునస్సమాగమమే బాగుంటుంది మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలకంటే, వీడ్కోలుపలుకుతూ గడిపిన ఘడియలే స్ఫూర్తినిస్తాయి. . అలెగ్జాండర్ పుష్కిన్ 6 జూన్  1799 – 10 ఫిబ్రవరి  1837 రష్యను మహాకవి . Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . The Last Flower . Rich the first flower’s graces be,…

  • జనవరి 20, 2014

    రోజులు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి.

    రోజులెందుకున్నాయి? మనం బ్రతికేది వాటిలోనే. అవివస్తుంటాయి, పదేపదిసార్లు మేల్కొలుపుతూ ఉంటాయి. మనం సుఖంగా బ్రతకవలసింది అందులోనే. వాటిలో తప్ప ఇంకెక్కడ మనం బ్రతకగలం? ఆహ్! ఈ సమస్యకి సమాధానం కనుక్కోడమే తడవు వైద్యుడూ,  పురోహితుడూ వాళ్ళ వాళ్ళ పొడవాటి దుస్తుల్లో పొలాలంబడి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. . ఫిలిప్ లార్కిన్ 9 ఆగష్టు 1922 – 2 డిశంబరు 1985 ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ, గ్రంధాలయాధికారి. ఈ కవితలో  చివరి పాదాల్లో చూపించిన చమత్కారంతో దీని సౌందర్యం ఒక్కసారిగా…

  • జనవరి 19, 2014

    కరుణారసం … విలియం షేక్స్పియర్

    కరుణ రసానికి ఎన్నడూ లోటురాదు…నిరంతరం అది సన్నని తుంపరలా దివినుంది జాలువారుతూనే ఉంటుంది క్రిందనున్న ఈ భువికి; దాని అనుగ్రహం ద్విగుణం… అటు దాత, ఇటు గ్రహీత ఇద్దరూ ధన్యులౌతారు. అది బలవంతులలోకెల్ల బలమైనది;  అది కిరీటంకంటే, దాన్ని ధరించిన చక్రవర్తిలా సమున్నతం; దర్పానికీ, విభ్రమానికీ చిహ్నమైన రాజ దండం కేవలం లౌకికాధికారాన్ని మాత్రమే సూచిస్తుంది; అందులోనే రాజులపట్ల భయభీతులు నిక్షిప్తమై ఉంటాయి; కానీ, కరుణ రాజ్యాధికారానికి అతీతమైనది; అది ప్రభువుల హృదయపీఠాలనధిరోహిస్తుంది, సాక్షాత్తు అది భగవంతుని…

  • జనవరి 18, 2014

    రిటర్ శిఖరం అధిరోహిస్తూ జాన్ మూర్… గేరీ స్నైడర్, అమెరికను.

    దాని ముఖాన్ని పదే పదే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎక్కడం ప్రారంభించేను , నా పట్టులు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ. సగం దూరం ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోవలసి వచ్చింది… రెండుచేతులూ బారజాపి, కొండముఖానికి దగ్గరగా అతుక్కుని వేలాడుతూ, చెయ్యి గాని  కాలు గాని క్రిందకిగాని మీదకిగాని కదపలేక. ఇక నా పతనం నిశ్చయం అయిపోయినట్టే. ఇక పడిపోక తప్పదు. ఒక క్షణం నివ్వెరపాటు, తర్వాత, నిర్జీవంగా కొండ అంచునుంది క్రిందనున్న మంచుదిబ్బలమీదకి దొర్లుకుంటూపోవడమే. ఉక్కిరిబిక్కిరిచేస్తున్న ఆలోచనలతో…

  • జనవరి 17, 2014

    నవంబరు రాత్రి … ఎడిలేడ్ క్రాప్సీ

    శ్రద్ధగా విను… చాలా అస్పష్టమైన సడితో… ప్రేతాత్మల అడుగుల్లా… మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుంది విడివడి క్రిందకి రాలుతున్నాయి… . ఎడిలేడ్  క్రాప్సీ సెప్టెంబరు 9, 1878 – అక్టోబరు 8, 1914 అమెరికను కవయిత్రి. . http://en.wikipedia.org/wiki/File:A_crapsey.jpg . November Night . Listen … With faint dry sound, Like steps of passing ghosts, The leaves, frost-crisp’d, break from the trees And fall. . Adelaide Crapsey…

←మునుపటి పుట
1 … 160 161 162 163 164 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు