-
There Comes A Day… Saif Ali Gore Syed, Indian
1 There comes a day So full of grief, that its gloom overwhelms The joy of razing Babri Masjid to the ground. 2 That day is not far off Dawns sooner than the Doomsday prophesied in Quran and Bible That day is too close and comes doubling up. 3 That day … there will be…
-
భల్లూకపు కౌగిలి … మైకేల్ ఓండాట్షీ, కెనేడియన్ కవి
తనదగ్గరకి వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దివ్వమంటాడు గ్రిఫిన్. అలాగేలే అని నేను అరుస్తాను. చేస్తున్నపని పూర్తిచేసి, తర్వాత మరొకటి, మరొకటి పూర్తిచేసి మెల్లిగా నడుచుకుంటూ మా కుర్రాడి గదివేపు తిరుగుతాను. వాడు నవ్వుతూ రెండుచేతులూ చాచుకుని నేనివ్వబోయే భల్లూకపు కౌగిలివంటి గాఢాలింగనానికి ఎదురుచూస్తుంటాడు. అయినా, నా ఆనురాగానికి ఆ అమానవీయమైన పేరేమిటి? గట్టిగా హత్తుకుంటే మృత్యువు చూపిస్తుందది. నేను హత్తుకుంటే, వాడి లేత ఎముకలూ వెచ్చని మెడా నన్ను అతుక్కుంటాయి. ఆ పైజమాలోని సన్నని బిగువైన శరీరం…
-
పాఠకుని ఎంపిక … టెడ్ కూసర్, అమెరికను కవి
ముందు ఆమె అందంగా ఉండాలి ఒక ఏకాంతపు మధ్యాహ్న వేళ నా కవిత్వ పుస్తకం దగ్గరకి నడవాలి, తలస్నానంచేసి వచ్చిన ఆమె మెడదగ్గర జడ ఇంకా తడిగా ఉండాలి. ఆమె రెయిన్ కోటు తొడుక్కోవాలి అది కూడా బాగా పాతది, డబ్బుల్లేక ఎన్నాళ్ళబట్టో ఉతకక మురికిగా ఉండాలి. ఆమె కళ్ళజోడు తీసి, పుస్తకాల షాపులో నా కవిత్వ పుస్తకం పేజీలు తిరగేసి, తిరిగి దాన్ని పుస్తకాల షెల్ఫ్ లో ఉంచెస్తుంది. ఆమె తనలో ఇలా అనుకుంటుంది, ”…
-
ముదిమి – వయసు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి.
చాలాకాలం క్రిందట, ఒక వేసవి ఉదయాన ఆడుకుంటున్న పాప పక్కనించి వెళ్ళాను; అలా పక్కకి రాగానే, చిన్నతనపు ఉత్సాహంతో “దా! మనిద్దరం ఆడుకుందాం!” అని పిలిచింది. కానీ నా చూపులు దూరానున్న శిఖరం మీద ఉన్నాయి చీకటిపడేలోగా అదెక్కగలిగితే సంతోషమే. అందుకని కొంత అసహనంతో అన్నాను: ” లేదు! నేను నీతో ఆడడానికి మరీ ముసలివాడిని” అని. చాలా ఏళ్ళు గడిచిపోయేక, శీతకాలంలో నా కాళ్ళలో కొండలెక్కగల సత్తా సన్నగిలేక చక్కని పచ్చికబయల్లో ఒక…
-
వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కవిత రాయమన్నప్పుడు… హీడెన్ కరూత్ , అమెరికను కవి
నిజానికి నాదగ్గర ఒకటేమిటి ఒకటికంటే ఎక్కువే ఉన్నాయి కవితలు వాటితో పాటే ఇదికూడా మీకు చెబుతాను ఆ పీడకల ఉందే, అదే, అల్జీరియా యుద్ధానికి వ్యతిరేకంగా ఒకటి రాసేను , మరొకటి కొరియా యుద్ధానికి వ్యతిరేకంగా మరొకటి నేను పాల్గొన్నదానికి వ్యతిరేకంగా నాకు గుర్తులేదు ఈ మూడూ కాకుండా ఇంకెన్నిన్నున్నాయో నేను కుర్రాడిగా ఉన్నప్పుడు అబిసీనియా, స్పెయిన్ హార్లాన్ కౌంటీలు… అందులో ఒక్కరంటే ఒక్కరు బతికిబట్టకట్టలేదు… గొంతుకలు బద్దలై ఆడ, మగ, పిల్లలు అన్నతేడా లేకుండా ఒక్కరు…
-
నేను రాస్తాను… మార్గరెట్ వాకర్. అమెరికను కవయిత్రి
నేను రాస్తాను నేను నా ప్రజల పాటలు రాస్తాను వాళ్లు రాత్రి చీకటిలో గీతాలు పాడడం వినాలి. ఏడ్చి బొంగురుపోయిన వాళ్లగొంతులలో కడపటి స్వరాన్ని నేను పట్టుకోగలగాలి. నేను వాళ్ళ కలల్ని మాతలలోకి మళ్ళిస్తాను వాళ్ళ ఆత్మల్ని స్వరాలుగా మలుచుకుంటూ… సూర్యుడి వెలుగువంటి వాళ్లనవ్వుల్ని ఒక పాత్రలో పట్టి చీకటి ఆకాశంలోకి వాళ్ళ నల్లని చేతులు విసిరేసి వాటిని నక్షత్రాలతో నింపుతాను ఆ వెలుగులని అన్నిటినీ కలిపి ఎంతగా నుజ్జు చేస్తానంటే ఉషోదయవేళ దీధుతులు విరజిమ్మే సరసులా…
-
చిన్నతనం… ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్, ఇంగ్లీషు కవయిత్రి
ఓ రోజు మేడమెట్లనానుకున్న కటకటాల్లోంచి మా పెద్దమ్మమ్మ’ఎట్టీ’ స్నేహితురాలు వెళ్ళిపోతున్నప్పుడు ఆమె మెడలోని పగడాల దండతెగిపోడం చూసేదాకా… నేననుకుంటూండేదాన్ని పెద్దవాళ్ళు బిగువైన మెడలూ, ముక్కు చుట్టూ ముడుతలూ చేతులమీద బాగా బలిసిన పాముల్లా నరాలూ గొప్పగా కనిపించడానికి ఎంచుకుంటారేమోనని. అవిదొర్లిపోతుంటే ఆమె వెదకడానికి తెగ అవస్థ పడింది. అప్పుడు నాకు అర్థమయింది, ఆమె ముసలితనమూ నా చిన్నతనమూ మా అధీనంలో లేనివని. . ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్ (30 March 1886 – 19 August 1960)…
-
శుక్రవారం … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
ప్రశాంతమైన శుక్రవారం బావురుమంటున్న శుక్రవారం పాత ఇరుకుసందుల్లా భయపెట్టే శుక్రవారం బద్ధకంగా అనారోగ్యపు ఆలోచనల శుక్రవారం వంకరటింకరగా విస్తరించిన దుర్గంధపు శుక్రవారం ఎదురుచూడడానికి ఏదీలేని శుక్రవారం అణిగి ఉండవలసిన శుక్రవారం… శూన్యమైన ఇల్లు ఒంటరిగా దివుదివుమంటూన్న ఇల్లు యువత తిరుగుబాటుకివ్యతిరేకంగా మూసిన ఇల్లు వెలుగుకోసం కలలుగనే చిమ్మచీకటి ఇల్లు ఒంటరితనం, శకునాలూ, అస్థిరతా కూడిన ఇల్లు కర్టెన్లూ, పుస్తకాలూ, బీరువాలూ, చిత్రపటాలూ ఉన్న ఇల్లు ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో గంభీరంగా ప్రవహిస్తున్న…
-
ఖగోళంతో కసరత్తు … పీట్ హెయిన్, డేనిష్ కవి
నక్షత్రాలు పొదిగిన రాత్రి ఆరుబయట తలక్రిందులుగా నిలబడి కాళ్ళు పైకి ఆకాశంలోకి వేలాడేలా విడిచిపెట్టండి. తారానివహంతోకూడిన ఆకాశమే కాసేపు మీరు నడవడానికి ఎంచుకున్న ఆధారం అనుకొండి. శీతశైలాలూ, మహానగాగ్రాలూ, మరుగుతున్న అంతశ్శిలాద్రవమూ నీరూ, ఇనుమూ, ఖనిజాలతో కూడిన అపారమైన ఈ భూగోళపు బరువు మీ తలపై మోస్తున్నట్టు ఊహించి… కాసేపు చిత్రంగా దృఢమైన ఈ గ్రహం బరువు అంతే చిత్రంగా స్థిరమైన మీ తలపై నిలకడగా నిలబెట్టండి . పీట్ హెయిన్ 16 December 1905 –…
-
పున్నమి రేయి… జాన్ ఫ్లెచర్ ఇంగ్లీషు కవి
ఈ రేయి ఎంత అందంగా ఉంది! ప్రశాంతవాతావరణంలో మంచువంటి చల్లదనం; మబ్బుగాని, మసకగాని, ధూళిగాని, నలకగాని ఈ నిర్మలమైన ప్రకృతి ప్రశాంతతని భగ్నం చెయ్యడం లేదు. నీలి నీలి రోదసి కుహరాల్లోంచి అదిగో దూరంగా దివ్యమైన పూర్ణచంద్రబింబం దొర్లిపోతోంది. నిలకడగా కురిసే ఆ వెన్నెలల వెలుగులలో దిగువన ఒక ఎడారి వృత్తం పరుచుకుని ఉంది సముద్రంలా ఆకాశపువడ్డాణాన్ని తొడుక్కుని, ఆహ్! ఈ రేయి ఎంత అందంగా ఉంది! . జాన్ ఫ్లెచర్ 1579–1625 ఇంగ్లీషు కవి, నాటక…