అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఏప్రిల్ 8, 2014

    మూడురోజులు … జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను కవి

    చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం!  నిన్న రాత్రి సూర్యుణ్ని చూశాను ఏ వెలుగులూ లేకుండా చీకటిగుహలోకి క్రుంగిపోతూ… నిన్న…ఆహ్! ఒక భయంకరమైన ప్రేతం.   చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం! ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘర్షణతో తెల్లారుతుంది; అయినా సరే, ధైర్యంగా, ఉత్సాహంతో, రంగంలోకి దిగుతాను, ఈ రోజు… యుద్ధంలో పాలుపంచుకుంటాను. చెయ్యవలసినదనంతం; చేసింది స్వల్పం! కానీ అంతా అయిపోయేక, గెలుపు సాధించినట్టే. ఓహ్! నా మనసా! ఈ కష్టాలూ, ఈ దుఃఖమూ రేపు… తో … హాయిగా అన్నీ…

  • ఏప్రిల్ 7, 2014

    The Liberated Nymph… Manasa Chamarti, Telugu, Indian

      Oh, Me! How tender you look! The flower blushed as tenderly.   You must forever remain like this for my sake! Pulchritude fluttered in delight.   Can you sing any lays? Music turned its voice   Won’t you bless me with a kiss? Love embraced in consummating angst.   House should be kept spick…

  • ఏప్రిల్ 6, 2014

    కవిత్వంతో పరిచయం … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి

    వాళ్ళని ఒక కవిత తీసుకుని రంగు గాజుపలకని దీపానికి అడ్డంగాపెట్టి పరీక్షించినట్టు చూడమన్నాను, లేదా దాని గూటికి చెవిగట్టిగా ఆనించి వినమన్నాను. కవితలోకి ఒక ఎలుకని విడిచిపెట్టి అది బయటకివెళ్ళే దారి ఎలాకనుక్కుంటుందో గమనించమన్నాను, లేదా కవితలోకి నడుచుకుంటూ వెళ్ళి దాని గోడల్ని తడుముతూ స్విచ్ ఎక్కడుందో వెదకమన్నాను. వాళ్ళని నీటిమీద స్కీయింగ్ చేస్తున్నట్టు పద్యం ఉపరితలం మీద తేలియాడమన్నాను ఒడ్డున ఉన్న కవి పేరువైపు చెయ్యి ఊపుతూ. కాని వాళ్ళు చేద్దామనుకుంటున్నదల్లా పద్యాన్ని ఒక కుర్చీకి…

  • ఏప్రిల్ 5, 2014

    నిజమైన ఎరుక … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి

    నీకన్నీ తెలుసు; నేను వృధాగా ఆశిస్తున్నాను ఏ పొలం దున్నాలా, ఏ విత్తు నాటాలా అని… నేలంతా ముళ్ళకంపలతో, కలుపుతో నల్లబారింది ఇక వానకురిసినా, కన్నీరు కురిసినా దానికి ఒకటే. నీకన్నీ తెలుసు; నేను అలా ఊరికే కూచుని నిరీక్షిస్తాను చేవతప్పిన చేతులతో, చూడలేని కళ్లతో, కడపటి ముసుగు తొలగించేదాకా, తొలిసారి ద్వారాలు తెరుచుకునేదాకా నీ కన్నీ తెలుసు; నాకు చూపులేదు. నా జీవితం వృధా పోదని నాకు నమ్మకం ఏ శాశ్వత దివ్యలోకాలలోనో మనం తప్పక…

  • ఏప్రిల్ 4, 2014

    వర్షాగమనం… థామస్ బెయిలీ ఏల్డ్రిచ్, అమెరికను కవి

    వర్షం పడుతుందని మాకు తెలుసు, ఎందుకంటే పొద్దుటినుంచీ, సన్నని మంచుబిందుల తాళ్ళపై ఊగుతూ వర్షాధిదేవత తన బంగారు నీటి బొక్కెనలను దించుతోంది ఎండి, శుష్కించి, ధూళి ఎగజిమ్మే పగుళ్ళుబారిన పర్రలుగా మారిన చవిటి, బాడవ పొలాలమీదకి. పువ్వులలో దాగున్న తుహినబిందువులని పైకివిరజిమ్ముతూ సముద్రంలోంచి మణుల్ని వెలికితీసి నేలమీద రత్నాల రాశులుగా విరజిమ్మడానికి. మాకు తెలుసు వర్షం వొస్తుందని, ఎందుకంటే, చెట్లు వాటి ఆకుల అడుగుభాగాల్ని చూపిస్తున్నాయి, పలకబారి జేగురులోకిమారిన పండ్లు గాలికి దాక్కున్నాయి, మెరుపులిపుడు చంచలమైన వర్షధారల…

  • ఏప్రిల్ 3, 2014

    Edna St. Vincent Millay

    Image Courtesy: http://upload.wikimedia.org అతని దగ్గర ఏవి ఉండేవో, ఏవి కోల్పోయేడో ఇక్కడ ఒక చిట్టా రాసేడు. ఆ తర్వాత అతనికి రావలసిన బకాయిలు ఒక చిట్టా, దాని వెనక అతనిదగ్గర ఇప్పుడు ఏమి ఉన్నాయో, ఇంకా ఏమి కావాలో; ఆ లెక్కలన్నీ పూర్తయేక అతని తాహతుకి ఏవి ఉండాలో వ్రాసి మిగతావాటితో జత చేశాడు. తర్వాత అతనికి హక్కుగా రావలసినవీ, అతను సాధించలేకపోయినవీ, అతన్ని మోసగించి తీసుకోబడినవీ, చివరగా, అతనిదగ్గర దొంగిలించబడినవీ చిట్టాలు తయారయ్యేయి. ఈ…

  • ఏప్రిల్ 2, 2014

    నా పేరు … మార్క్ స్ట్రాండ్, కెనేడియన్ అమెరికను కవి.

    ఒకనాటి రాత్రి, పచ్చికబయలంతా స్వర్ణహరితమై ఉన్నపుడు సుగంధం నిండిన వాతావరణంలో, చంద్రకాంతశిలలతోచేసిన నిలువెత్తు కొత్త సమాధుల్లా వెన్నెల్లో చెట్లు కనిపిస్తున్నపుడు, నైసర్గిక ప్రకృతి అంతా కీటకాల అరుపులతో ప్రతిధ్వనిస్తున్నపుడు, నేను గడ్డిలో మేనువాల్చి, పైన పరుచుకున్న అనంతదూరాలను తలుచుకుంటూ చివరకి నేనేమౌతాను… నన్ను నేనెక్కడ కనుక్కోగలనని ప్రశ్నించుకున్నాను… నా ఉనికి నేను మరిచినప్పటికీ, ఒక క్షణంపాటు, నక్షత్రాలుపొదిగిన సువిశాల ఆకాశం నాదేననిపించింది, తొలిసారి వర్షాన్నీ, గాలిహోరునీ వింటున్నట్టు, మొదటిసారిగా నా పేరు నేను వింటున్నట్టు అది నా…

  • ఏప్రిల్ 1, 2014

    కవీ – అతని కవితలూ… లాంగ్ ఫెలో, అమెరికను కవి

    వసంతం వచ్చేసరికల్లా పక్షులు ఎక్కడనుండి వస్తాయో తెలియనట్లు; సాయంత్రం అవడం తడవు రోదసికుహరాల్లోంచి చుక్కలు పొడిచినట్లు మేఘాల్లోంచి చినుకులు రాలినట్లు, భూమిలోంచి బుగ్గలు వాగులై ప్రవహించినట్లు అంత అకస్మాత్తుగానూ, నిశ్శబ్దంలోంచి చిన్నదో పెద్దదో చప్పుడు ఉత్పన్నమైనట్టు; ద్రాక్షతీగకి ద్రాక్షగుత్తులు వేలాడినట్లు; చెట్లకి పళ్ళు కాసినట్లు; దేవదారుకొమ్మల్లో గాలి చొరబడినట్లు; సముద్రం మీద అల్లలు ఉప్పొంగినట్లు; క్షితిజరేఖ మీద ఓడల తెల్లని తెరచాపలు లేచినట్లు; పెదాలమీద చిరునవ్వు మొలిచినట్లు, నురగలు ముందుకు తోసుకువచ్చినట్లు; అనంతాగోచర లోకాలకుచెంది స్పష్టాస్పష్ట ఆకృతులనుండి…

  • మార్చి 31, 2014

    ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

    బ్లాజ్ఞ్మిత్రులకీ, సందర్శకులకీ  జయ ఉగాది శుభాకాంక్షలు. ఈ  సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ, మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను *** మెత్తని సముద్రపుటిసకమీద నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన నీ నవ్వు నాకింకా గుర్తే! “ఏమిటది, చంటిపిల్లడిలా! నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!” ఆ క్షణం తర్వాత ఇయాంథే పేరు రాసేను ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా; భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా. . వాల్టర్ సేవేజ్ లాండర్…

  • మార్చి 30, 2014

    పద్యం -38… ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి

    నిన్న రాత్రి ఊరంతా తిరుగుతూ మట్టి కూజాలమ్మే దుకాణం దగ్గర ఆగేను, వాటిపక్కన నిశ్శబ్దంగా నిల్చున్న నేను, అవి ఇలా అనడం విన్నాను: ఎన్నో ఏళ్ళుగా మేము మా దారంట వచ్చిన లెక్కలేనంతమంది కుమ్మరుల, వ్యాపారుల ఆప్యాయపు స్పర్శకు పులకించాము. వాళ్ళందరూ అకస్మాత్తుగా నిష్క్రమించారు– మమ్మల్ని వదిలి మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళేరో ఏమో! . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు.…

←మునుపటి పుట
1 … 153 154 155 156 157 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు