-
ల్యూసైల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు కవి
మనం కవిత్వం సంగీతం, కళలూ లేకుండా బ్రతకొచ్చు; మనం హృదయమూ, అంతః కరణా లేకుండా బ్రతకొచ్చు; స్నేహితులు లేకుండా, పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు; కానీ ఏ నాగరీకుడూ వంటవాళ్లు (కుక్స్) లేకుండా బ్రతకలేడు. అతను పుస్తకలు లేకున్నా బ్రతకొచ్చు… జ్ఞానానిదేముంది, వగవడం తప్ప? ఏ ఆసలూ లేకుండ బ్రతకొచ్చు… ఆశదేముంది, మోసగించడం తప్ప? అతను ప్రేమలేకుండాకూడా బ్రతకొచ్చు, అనురాగానిదేముంది, కోరికతో కృశించడం తప్ప? కానీ భోజనం అవసరం లెకుండా బ్రతికే మనిషిని చూపెట్టండి? . . ఓవెన్…
-
వసంతమొక అజ్ఞాత హస్తం… ఇ. ఇ. కమ్మింగ్స్, అమెరికను కవి
బహుశా వసంతమొక అజ్ఞాత హస్తం… (అదెక్కడనుండి అంత జాగ్రత్తగా పొడచూపుతుందో అంతుచిక్కదు) జనాలు తొంగి చూసే కిటికీని సవిరిస్తూ (వాళ్ళు ఒకపక్కనుండి ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళకి బాగా పరిచయమైనవీ, ఏమీ తెలియనివీ వస్తువుల్ని జాగ్రత్తగా స్థలాలు మారుస్తూ, ఒక పద్ధతిలో పెడుతూ ) అన్నిటినీ ఎంతో మెళకువతో పరివర్తనచేస్తూ… వసంతం బహుశా కిటికీలో మనకి బాగా పరిచయమైన చెయ్యిలాంటిది (కొత్తవస్తువుల్నీ, పాతవస్తువుల్నీ చాలా పదిలంగా మార్పులు చేస్తూ, మనుషులు జాగ్రత్తగా పరిశీలిస్తుంటే ఆ పువ్వుని కోణాన్ని ఒక…
-
ప్రిమ్రోజ్ … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
“నాకెందుకు పూలలో యువరాణివంటి అందమైన కుసుమాన్ని పంపిస్తున్నా?”వని అడుగు “మంచుముత్యం జతచేసిన ఈ ప్రిమ్రోజ్ ని ఎందుకు పంపుతున్నా?”వని అడుగు నీ చెవుల్లో రహస్యంగా చెబుతాను: ప్రేమలోని తియ్యదనంలో కన్నీళ్ళుగూడా కలగలిసి ఉంటాయని. “ఈ పువ్వెందుకు పసిడివర్ణంలో ఉన్నా అంత దీనంగా వాడిపోయినట్టుందేమిటి? అని అడుగు. “ఈ తొడిమ ఎందుకు బలహీనంగా ఉండి వంగిపోయినా, రాలిపోవడం లేదేమి?” అని అడుగు నే బదులు చెబుతాను: అవి ప్రేమికునిలో అణగారుతున్న ఆశలు ఎలా ఉంటాయో గ్రహిస్తున్నాయని. . రాబర్ట్…
-
ఏకాంతము … లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
తోవచూపట్టని కీకారణ్యాల్లో ఆనందం ఉంది; ఒంటరి తీరాల్లో అలవిమాలిన పారవశ్యం కలుగుతుంది; ఎవ్వరూ చొరలేని చోటకూడ సహవాసాలుంటాయి, గంభీరమైన సముద్రంలోకూడా ఎగసిపడే అలలచప్పుళ్ళున్నట్టు; మనిషంటే నాకు ప్రేమ తక్కువేం లేదు, ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తా నంతే! మా ఈ భేటీల్లో నేను నా రాబోయే జన్మల్లోనో లేదా గతించిన జన్మల్లోనో ఈ విశ్వంలో విలీనమైన విషయాలను నెమరువేసుకుంటూ, ఎంతగా అనుభూతిస్తానంటే నేను మాటల్లో చెప్పలేను; అలాగని అంతా దాచుకోనూలేను. ఓ అగాధ వినీల సాగరమా! దొర్లుకుంటూ పో!…
-
సమస్య… పీట్ హెయిన్, డేనిష్ కవి
మనకు బాగా నచ్చిన ప్రణాళికలు ఎందుకూ కొరగాకుండా పోతాయి మనం నిర్మించుకున్న అత్యున్నత ఆశాసౌధాలు కుప్పకూలిపోతాయి ఎందుకంటే ముందు ఎంతో చక్కగా గీసిన గీతల్ని తర్వాత అంత చక్కగానూ పొరపాటని సరిదిద్దుతాము . పీట్ హెయిన్, (కలం పేరు కుంబెల్ (సమాధిరాయి)) 16 డిశంబరు 1905- 17 ఏప్రిల్ 1996 డేనిష్ కవి, రచయిత, శాస్త్రజ్ఞుడు, గణితవేత్త, . . On Problems ( A Grook*) . Our choicest plans have fallen through…
-
నిమిత్త సుఖం … కెన్నెత్ బర్క్, అమెరికను
నేలంతా పచ్చగా ఉంది వార్తలు కట్టేసేనేమో ఈ క్షణంలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒక చేతిలో పుస్తకం మరో చేతిలో పానీయం ఇంతకంటే ఏం కావాలి కీర్తీ మెరుగైన ఆరోగ్యమూ ఓ పది మిలియను డాలర్లూ తప్ప? . కెన్నెత్ బర్క్ (May 5, 1897 – November 19, 1993) అమెరికను సాహిత్యవేత్త . ఈ కవితలోని మాధుర్యమంతా నగరజీవితానికి అలవాటుపడిన మనల్ని సున్నితంగా వెక్కిరించడంలో ఉంది. మనం ప్రకృతి ఆరాధకులమనీ, శేషజీవితాన్ని ఏ…
-
జన్మాంతర వాసనలు… విలియం స్టాఫోర్డ్ , అమెరికను కవి
ఒక్కోసారి విశాలమైన ఆకాశంలోకి పక్షులు వీడిన జాడ ననుసరిస్తూనో, లేక కేవలం ఊరికేనో నిరీక్షిస్తూ నిలబడతావు. ఏదో లీలగా అనిపిస్తుంది ఇంతకుముందెప్పుడో ఇలాగే జరిగినట్టు; అక్కడ ఏదో ప్రశాంతత, పిల్లగాలి వీస్తుంటుంది; ఎక్కడో సెలయేటి తీరాన్నో, నది ఒడ్డునో; నీరుబిల్లిలా ఒక్క సారి జాగరూకుడవవుతావు; నువ్వు ఇప్పుడు చూసిన ఈ విశాల నిరామయ లోకంలాటివే, వేరు లోకాల్లో మరొకసారి వేగుచుక్కలా ఉదయిస్తావు, ఒక క్షణ కాలంపాటు, ఈ నిర్నిబంధ ప్రకృతి ఒడిలో. 2 అడవుల్లో ఏదో గుసగుస…
-
కవితా చాతురి … ఆర్చిబాల్డ్ మేక్ లీష్, అమెరికను కవి
ఒక గుండ్రని పండులా, కవిత స్పర్శకి తెలిసి మౌనంగా ఉండాలి ఎప్పటివో పాతపతకాలు బొటనవేలితో మాటాడినట్టు మూగగా మాటాడాలి నాచుపట్టిన కిటికీపక్క నాపరాయిపలకలు భుజాలరాపిడికి అరిగినట్టు చప్పుడుచెయ్యకుండా అరిగిపోవాలి ఎగురుతున్న పక్షుల్లా కవిత భాషాతీతంగా ఉండాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా కాలానికి తెలియకుండా అది కదలాలి చీకటికి చిక్కుపడ్డ చెట్లు విస్తరిస్తున్న వెన్నెలలో ఒకటొకటిగా కొమ్మలు కనిపించినట్టు, అర్థమవాలి శీతకాలపు చెట్ల ఆకుల వెనక కదిలే చంద్రుడిలా ఒక్కొక్క జ్ఞాపకపు పొరా విడిచిపెట్టాలి నెమ్మదిగా నింగినెక్కుతున్న చంద్రుడిలా…
-
తబ్బిబ్బైన శతపాది… అజ్ఞాత కవి
ఒక శతపాది ఎంతో హాయిగా ఉండేది అనుకోకుండా ఒక రోజు ఒక కప్ప నవ్వులాటకి: “నీకు ఏ కాలు తర్వాత ఏ కాలు పడుతుందో కాస్త చెప్పవా?” అని అడిగేదాకా. ఆ ప్రశ్న దాని మనసుని ఎంతగా అతలాకుతలం చేసిందంటే అది తబ్బిబ్బై తన గుంతలో ఎలా పరిగెత్తాలో ఆలోచిస్తూ ఉండిపోయింది. . అజ్ఞాత కవి ఈ లిమరిక్కు(కవిత)లో సౌందర్యం ఒక్కోసారి మనం ఎలా Self-conscious అవుతామో తెలియజెయ్యడమే. మామూలు సమయంలో ఎంత నేర్పుగా, అలవోకగా ఒక…
-
యాభై ఏమిటి చెబుతోంది… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
నేను చిన్నగా ఉన్నప్పుడు నా అధ్యాపకులందరూ ముసలివాళ్ళు నా ఉత్సాహం నీరుకారిపోయేదాకా అర్థాన్ని వదిలి పదాలకోసం ప్రాకులాడేను, కరిగించిన లోహంలా ఎలా పోతపోస్తే అలా తయారయ్యాను. నేను బడికి వెళ్ళి వయోజనుడనై అంతా గతంగురించి నేర్చుకున్నాను ఇప్పుడు నేను ముసలివాడిని, కానీ, నా గురువులు పిల్లలు. ఒక మూసలోపొయ్యడానికి ఒదగనివి స్వయంగా ఫలించి, ఎదుగుతాయి; ఎలా అతుకులువెయ్యాలా అని నేను పాఠాలతో సతమతమౌతున్నాను ఇప్పుడు బడికి వెళుతున్నది పిల్లలనుండి భవిష్యత్తు నేర్చుకుందికి. . రాబర్ట్ ఫ్రాస్ట్ (March 26,…