-
మన్మధుడి వేదన… థామస్ మూర్. ఐరిష్ కవి
బాల మన్మధుడు, ఒక సారి, అలసి గులాబిశయ్యపై తన తల వాల్చేడు; దురదృష్టవశాత్తూ, ఆ చిన్నారి ఆకుల మధ్య నిద్రిస్తున్న తేనెటీగను గమనించలేదు. తేనెటీగ నిద్ర లేచింది — వెర్రి కోపంతో, లేస్తూనే కటుక్కున కుట్టింది పాపం ఆ బాలుణ్ని. అతని ఏడుపులు పెడబొబ్బలూ హృదయవిదారకం వాళ్ళ అమ్మదగ్గరకి పరుగు పరుగున వెళ్ళి, “అమ్మా! అమ్మా! చూడు. ఒళ్ళు మండిపోతోంది; బాధతో చచ్చిపోతున్నాను, నిజం. ప్రాణం పోతోంది. చిన్న పురుగు ఏదో కోపంతో కరిచింది — బుల్లి…
-
కోరిక … కేథరీన్ టైనన్, ఐరిష్ కవయిత్రి
నాకు ఏ శ్వేత సౌధాలూ అనుగ్రహించవద్దు ఏ మౌక్తిక, స్వర్ణ ప్రదేశాలూ అక్కరలేదు; నాకు ఒక నాలుగేళ్ల బిడ్దని ప్రసాదించు, చాలు, ఆనందపు అవధులు చవిచూడడానికి. నాకు ఏ గులాబివన్నె రెక్కలూ వద్దు దొంతులు దొంతులు ధవళ వస్త్రాలూ వద్దు; నాలుగు వత్సరాల బాలుడినివ్వు అదే నాకు సర్వస్వం. నాకు ఏ రత్నఖచిత స్వర్ణ కిరీటాలూ వద్దు ఏ సంగీత సాధనాలూ, సాహిత్య పరికరాలూ వద్దు; నా ఒడిలో ఒదిగిపోయే నాలుగేళ్ళ వయసుగల లేత గోధుమరంగుజుత్తుగల బిడ్డని…
-
డేలియా మైదానంలో కనిపించగానే… జార్జ్, లార్డ్ లిటిల్ టన్, ఇంగ్లీషు రాజనీతిజ్ఞుడు
డేలియా అలా మైదానంలో కనిపించగానే సుకుమారమైన భయాలు నన్ను చుట్టుముట్టి, నేను సమీపిస్తాను గాని, ఏమీ మాటాడలేను, మనసా, ఒక విషయం చెప్పు, దీన్ని ప్రేమంటారా? ఆమె మాటాడినప్పుడల్లా, ఆనందంతో పరవశించిన నా చెవులు, వేరెవరి మాటల్నీ వినడానికి ఉత్సాహం చూపవు, ఆమె తెలివినితప్ప మరొకరి తెలివిని గుర్తించవు: మనసా, ఒక విషయం చెప్పు, దీన్ని ప్రేమంటారా? ఆమె మరొక కుర్రాణ్ణి గనక పొగిడితే, నేనూ ఒకప్పుడు ఆమె ప్రియమిత్రుడినైనప్పటికీ, వాడికి తక్షణం శత్రువునైపోతున్నాను: మనసా, ఒక…
-
కోయిలా- మిణుగురూ… విలియం కౌపర్, ఇంగ్లీషు కవి.
పగలల్లా ఆ పల్లెని తనపాటతో మురిపించిన ఒక కోయిల ఇంకా పూర్తిగా చీకటి పడనే లేదు తన పాట ఆపడం ఇంకా పూర్తవనే లేదు, అప్పుడే, దాని శ్రమకి తగ్గట్టుగా కడుపులో ఆకలి వెయ్యడం మొదలైంది. ఆశగా నాలుగుపక్కలా పరికించి చూస్తే దూరంగా, నేలమీద ఏదో కనిపించింది చీకటిలో మిణుకుమిణుకు మెరుస్తూ, దాని వెలుగును బట్టి పోల్చుకుంది మిణుగురని; మామిడి కొమ్మ మీంచి క్రిందకి వాలింది, దాన్ని పొట్టలో వేసుకుందామే తరవాయి. కోయిల ఉద్దేశ్యాన్ని గ్రహించిన…
-
అనుభూతి … ఆర్థర్ రింబాడ్, ఫ్రెంచి కవి
చక్కని వేసవి రాత్రుల్లో లేత పచ్చికని తొక్కుతూ, గోధుమలు గుచ్చుకుంటుంటే, పొలాలంబడి నడుచుకుంటూ వెళ్తాను… కలలు కంటూ, నా కాళ్ళకింద చల్లదనాన్ననుభవిస్తాను, ఏ ఆచ్ఛాదనా లేని నా శిరస్సుని చిరుగాలి అనునయానికి వదిలేస్తూ. ఒక మాటగాని, ఒక ఆలోచనగాని ఉండదు; నా ఆత్మలో అనంతమైన ప్రేమతత్త్వం పెల్లుబుకుతుంది, నెచ్చెలి చెంత ఉన్నవాడిలా, ఆనందంగా ప్రకృతిలో ఏ గమ్యమూ లేని దేశదిమ్మరిలా అలా దూరతీరాలకు సాగిపోతాను. . ఆర్థర్ రింబాడ్, (20 October 1854 – 10…
-
ఒక్క గుండెనైనా … ఎమిలీ డికిన్సన్, అమెరికను
ఎమిలీ డికిన్సన్ స్మృతిలో ఒక్క గుండెనైనా పగలకుండా ఆపగలిగితే నా జీవితం వృధా కానట్టే; ఒక జీవితంలోనైనా కష్టాన్ని తగ్గించగలిగితే, బాధని ఉపశమింపజెయ్యగలిగితే, శోషిల్లుతున్న ఒక పక్షినైనా రక్షించగలిగి దాని గూటికి చేర్చగలిగితే, ఫర్వాలేదు… నా జీవితం వృధా పోలేదు. . ఎమిలీ డికిన్సన్ (December 10, 1830 – May 15, 1886) అమెరికను. . . If I Can Stop One Heart From Breaking . If I can stop…
-
పరోక్షము… రిఛర్డ్ జాగో, ఇంగ్లీషు కవి
డేలియా దూరంగా ఉన్నప్పుడు, గుదిబండ తగిలించినట్టు కాళ్ళీడ్చింది కాలం; ఆమె వెంట ఉన్నప్పుడు పాటలోనూ వేదనలేదు ఏ రోజూ విసుగు కలగలేదు. ఓ అసూయాగ్రస్త కాలమా! నీ విధి తిరగరాయి; నీ నడకని మరింత నెమ్మది చెయ్యి, ఎంత కష్టపడాలో పడు, ఎంత దోచుకుంటావో దోచుకో ఆమె పక్కన ఉన్నప్పుడు క్షణాలనన్నిటినీ. . రిఛర్డ్ జాగో (1 October 1715 – 8 May 1781) ఇంగ్లీషు కవి. . . Absence . With leaden…
-
ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ! … ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి
ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ, నువ్వొక మిధ్యవి, అయినా విసిగిస్తూ ఉంటావు ఎప్పుడూ గతకాలపు వైభోగాలు గుర్తుచేస్తూ గతాన్ని అంతటినీ ఒక బాధగా మిగులుస్తావు. ప్రపంచం లాగే, నువ్వూ బాధితుల్నే బాధిస్తావు, నీ నవ్వులు, పాపం ఆ బడుగు జీవి వేదనను పెంచుతూంటుంది ఎవడైతే అందరి శ్రేయస్సూ ఆశిస్తుంటాడో వాడికి తప్పకుండా నువ్వో బద్ధ శత్రువవుతావు. . ఆలివర్ గోల్డ్ స్మిత్ (10 November 1730 – 4 April 1774) ఐరిష్ కవి. . Oliver…
-
గరికలో మిలమిల… వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి.
ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి మిలమిలలతో మెరిసిన దాని అందం మనకళ్ళముందునుండే మాయమైతే నేమి? గరికలో మెరిసిన ఆ పువ్వు సౌరభమూ, మెరుపులూ ఆ క్షణాలూ ఇక తిరిగి రాకపోయినా మనమేమీ బాధపడము. బదులుగా అది విడిచివెళ్ళిన దానిలోనుండి ఏదోధైర్యాన్నీ అనాదిగా మనసు స్పృశించే సానుభూతి పంచుకుంటాం… మానవ హృదయంలో బాధలు చూస్తున్నపుడు అసంకల్పితంగా చిప్పిలే ఆత్మీయ అనుభూతి అది ఒక సారి పొందిన అనుభూతి శాశ్వతంగా ఉంటుంది; అదే విశ్వాసం మృత్యువును చూస్తున్నపుడూ కలుగుతుంది. కాలం…
-
The Guest … Shajahana, Telugu, Indian
The Guest . I said, “Welcome to my guest.” He said, “No, I am a refugee. A dove that has escaped The talons of pursuing hawks. ” I just treated him as a guest. I could not make out what to serve him. “May I know what would you like…?” I meant food. “Like…