-
భావ శకలం 2 … జకోమో లెపార్డి , ఇటాలియన్ కవి
మనిషికి చెందిన ఏదైనా క్షణికమే: ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి* నిజమే చెప్పాడు: చెట్ల ఆకులూ, మానుషప్రకృతీ ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. కాని, ఈ మాటలని పట్టించుకునే వాళ్లు తక్కువ. అందరికీ, చపలమైన ఆశ, వయసు తమతో శాశ్వతంగా ఉంటుందని. మన యవ్వనపుష్పం పచ్చగా అందంగా మెరుస్తూ కనిపిస్తే గర్విష్ఠి అయిన విశృంఖల ఆత్మ వృధాగా అనేక అందమైన ఊహలు ఊహిస్తుంది వయసూ, మృత్యువు అన్న ధ్యాస లెకుండా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు రోగాం…
-
శైశవానందం… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
“నాకు ఏ పేరూ లేదు; పుట్టి రెండురోజులయింది. అంతే!” మరి నిన్ను ఏమని పిలవాలి? “నేను ఆనందంగా ఉన్నాను. ఆనందమే నా పేరు.” నీజీవితం ఆనందమయమగు గాక! నిజమైన ఆనందం! రెండురోజుల వయసుగల శైశవానందం. మధురానందం అని పిలుస్తాను నిన్ను. నువ్వు అలా నవ్వితే చాలు నేను ఆనందంతో గీతాలాలపిస్తాను. నీ జీవితం ఆనందమయమగు గాక! . విలియం బ్లేక్ (28 November 1757 – 12 August 1827) ఇంగ్లీషు కవి . . Infant…
-
కార్డినల్ న్యూమన్ స్మృతికి … క్రిస్టినా రోజేటి ఇంగ్లీషు కవయిత్రి
(సమాధిలో నువ్వెక్కడకి పోగలవు.) . శిలువ తరఫున పోరాడి అలసిన యోధుడా, విశ్రమించు, తుదకు అన్నిటినీ అక్కునచేర్చుకునే నిద్ర, నిద్రపో; నువ్వు నాట్లువేసిన రోజు సుదీర్ఘమయినది, నిద్రించి ప్రతిఫలం అందుకో, నువ్వు చాలా కాలం ఉపవశించేవు, నీ ఆత్మతృప్తిగా విందు భోజనం చెయ్యి. అవును, ప్రేమ నిండుగా అనుభవించడం నీవంతు, ఎందుకంటె, నువు కనపరిచినప్రేమ, పైపైది కాదు, లోతైనది, నీ ప్రేమ నిండుపున్నమనాటి పోటువంటిది, కొంచెపునరుల పిల్లకాలవలలు నీ వరద ముందు దిగదిడుపే. నీకిపుడు రాత్రి అయింది,…
-
నిర్భాగ్యుడి మరణశయ్య… కెరొలీన్ ఏన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి
మెల్లగా అడుగులెయ్యండి… తల వంచుకొండి గౌరవపురస్సరంగా తల అవనతం చెయ్యండి ఇక్కడ ఏ గుడిగంటలూ మోగవు… అయినా ఒక అమర్త్యాత్మ శరీరంనుండి నిష్క్రమించబోతోంది. ఓ తెరువరీ! నువ్వు ఎంతో గొప్పవాడివై ఉండొచ్చు అయినా, కనీసగౌరవంతో తల వంచుకో; ఆ పాడుబడ్డ పూరిపాకలో… ఆ నామమాత్రమైన పక్కమీద నీకంటే గొప్పవాడు పరున్నాడు. ఆ బిచ్చగాడి గుడిశలో మృత్యువు రాజసాన్ని ప్రదర్శిస్తోంది. ఎవరూ లేరులే… లోపలికి నడు ఈ రాజమందిరానికి ఎవరూ కాపలా లేరులే లోపలికి తొంగిచూడు చెమ్మగా చల్లగా…
-
వియోగవేళ… ఆలివ్ ఎలినార్ కస్టాన్స్, బ్రిటిషు కవయిత్రి
లేదు, ప్రియతమా! లేదు, సూర్యుడింకా నెత్తిమీదే ఉన్నాడు, నిన్న రాత్రి నువ్వు, “సూర్యాస్తమయం తర్వాత” కదా వెళతా నన్నావు. తోటలోకి రా, అక్కడ పూలు వాడిపోతుంటే నోటమాట రాదు; బహుశా అదే మంచిది: అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు” అన్న మాట! విను! పక్షులు ఎంత మధురంగా వసంతగీతాలాలపిస్తున్నాయో! త్వరలో అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ శ్రమలో మౌనం ఆవహిస్తుంది మనం కూడా వయసువస్తున్నకొద్దీ ఉల్లాసాన్ని మరిచిపోతాం జీవితపు బాధ్యతలు నెత్తిమీద పడి… వాటితో పాటే బాధాకరమైన…
-
సౌందర్యం… ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, అమెరికను
సౌందర్యం సత్యం యొక్క వన్నెగాని, మెరుగు గాని కాదు అది మనిషి ఆనందం కోసం సృష్టించబడిందీ కాదు. ఆ మాటకొస్తే, స్వర్గంలోని కిటికీలగుండా సుదూరంగా చూస్తే నరకం కూడా చాలా సుందరంగా కనిపిస్తుంది. . ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అమెరికను. ( సూచన: ఈ వ్యక్తి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అవడానికి అవకాశాలు కనిపించడం లేదు. 1917 ఆగష్టు సంచికలో ఈ కవిత పడే నాటికి హిచ్ కాక్ కి 18 నిండలేదు. 1919 తర్వాతే అతనిలోని సాహిత్య…
-
క్షీణచంద్రుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి
1 పలుచని మేలిముసుగులో దాగుని క్రమంగా మతిస్థిమితం కొల్పోతూ, సన్నగా, పాలిపోయి,తన మందిరంలోంచి వణుకుతూ బయటకి నడిచి వస్తున్న మృత్యుముఖంలో ఉన్న స్త్రీలా చీకటి తూరుపు దిశను నిరాకారమైన తెల్లని ముద్దలా చంద్రుడు ఉదయించేడు. 2 ఎందుకు నువ్వు అలా పాలిపోయావు, అకాశాన్ని ఎక్కిన అలసటవల్లా, భూమిపై తొంగి చూడడం వల్లా, వేరే పుట్టుక పుట్టిన నక్షత్రాల మధ్య తోడులేక తిరగడం వల్లా? దేని మీదా దృష్టిపెట్టలేని సంతృప్తిలేని కళ్ళలా, ఎప్పుడూ మార్పుకి లోనవడం వల్లా? .…
-
పిల్లవాడూ- ముసలాయనా… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
“అప్పుడప్పుడు నేను చెమ్చా జార్చెస్తుంటాను,” అన్నాడు కుర్రాడు, “ఓస్, అంతే కదా, నేను కూడ జార్చెస్తుంటాను,” అన్నాడు ముసలాయన. కుర్రాడు గుసగుసగా, “అప్పుడప్పుడు పక్కతడిపేస్తుంటాను,” అన్నాడు. దానికి నవ్వుతూ, ” ఓ అదా, అప్పుడప్పుడు నేనూ చేస్తుంటాను,” అన్నాడు. “ఎందుకో, నాకు తరచు ఏడుపొస్తుంటుంది,” అన్నాడు కుర్రాడు. ముసలాయన తల తాటిస్తూ, “నేనూ అంతే” అన్నాడు. ఫిర్యాదుగా “నాకు అన్నిటికంటే బాధించే విషయమేమిటంటే, పెద్దవాళ్ళు ఎప్పుడూ నన్ను పట్టించుకోరు,” అన్నాడు కుర్రాడు. ముడుతలపడ్డ చెయ్యి వెచ్చగా…
-
వల .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నీమీద ఎన్నో గీతాలు రాసేను, కానీ ఏ ఒక్కటీ నిన్ను పూర్తిగా ఆవిష్కరించలేదు… అదెలాంటి ప్రయత్నమంటే, నక్షత్రాన్ని పట్టుకుందికి ఆకాశం మీదకి వలవేయడం లాంటిది. నా చేతిని దొన్నెలా చేసి ఆత్రంగా సముద్రపు నీరు పట్టడం లాంటిది, తీరా చూడబోతే, పట్టిన నీటికి ఆ నీటికున్న చిక్కని నీలి సొగసులు ఉండవు. . సారా టీజ్డేల్ (ఆగష్టు 8, 1884 – జనవరి 29, 1933) అమెరికను కవయిత్రి . Sarah Teasdale Image Courtesy:…
-
ప్రేమకి ఒక పరిభాష ఉంది… హెలెన్ సెలీనా షెరిడన్, ఇంగ్లీషు కవయిత్రి
ఏ కాలంలోనైనా ప్రేమకో పరిభాష ఉంటుంది… అదొక నిగూఢ, పురాతన ప్రేమపూర్వక చిత్రలిపి… ఇంతకుముందు ఎన్నడూ చెప్ప బడని… కన్నీట రాసిన ఆ కథ ఒక్క హృదయమే చదవగలదు. ప్రేమకి దాని కొలమానాలు దానికున్నాయి, అప్పటివరకు ఇవ్వని చనువు పరిమితులు గుర్తించడానికి … ప్రపంచాన్ని పరిహసించగలదాన్ని కొలవడానికి, అది మృత్యువంత గంభీరమూ, రోదసి అంత ఉన్నతమూ. ప్రేమకి దాని గుప్తనిధులుదానికున్నాయి నిజమైన ప్రేమనీ, సేవనీ సమ్మానించడానికి. పరులకి పనికిరానివైనా, అవి అమూల్యమైనవే, సృష్టిలో ఏ వస్తువూ వాటి…