-
పాతపాట…యెహోష్, యిద్దిష్ కవి
పూదోటవంటి జపానులో ఎక్కడో మారుమూల, ఈ పాట పాడుకునే వారు: ఒక సామురాయ్ లోహకారుడితో ఇలా అన్నాడు: “నాకో కరవాలము చేసిపెట్టు అది నీటిమీద గాలితరగలా తేలికగా, గోధుమ చేను కోతలపుడు పాడే పాటలా, చాలా సుదీర్ఘంగా, ఏ పగుళ్ళూ లేక, పాములా చురుకుగా, ఎటుపడితే అటు వంగుతూ మెరుపువేగంతో కదలాలి! పట్టుబట్టంత మెత్తగా, పల్చగా, సాలెపట్టంతా సన్నగా, చలీ, బాధంత నిర్దాక్షిణ్యంగా ఉండాలి.” “వీరుడా! చేతిపిడి మీద తమ ఆదేశం?” “చేతి పిడి మీద, సజ్జనుడా, ప్రవహిస్తున్న సెలయేటినీ,…
-
పచ్చికబయళ్ళలో లార్క్ పక్షి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వానవెలిసిన తర్వాత మిగిలే వెండివెలుగులో ఇంకా చినుకులు రాలుస్తున్న మెరుగు పచ్చ పొదలమధ్యనుండి పచ్చికబయళ్ళలోని లార్క్ పక్షుల కుహూరవాలు వినడానికి ఒంటరిగా, మహారాణిలా, ఎంతో ఉత్సాహంతో కాలిబాటపట్టేను. బ్రతుకన్నా, చావన్నా నాకు భయపడడానికి ఏముంది? అసలు ఈ మూడూ తెలిసినవారు లోకంలో ఎవరున్నారని: రాత్రి ముద్దూ, గొంతులో పాట పలుకేటప్పుడు రెక్కతొడిగే ఆనందం, ఈ వెండి వెలుగుల ప్రకృతి హేలలో లార్క్ పక్షుల రసధునీ? . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29,…
-
Love in a Hospital… Ismail, Telugu Poet, Indian
.It was not yet time for your visit I was watching the cityscape through the window earth had stretched its sharp nails of shadows Tearing open the sky, it swallowed the Sun. And the Bacilli were sweeping through every corner, drawing the last trace of hope from the moans. It was time for your visit…
-
పేదమహరాజు (సానెట్) .. బార్తలొ మేయో ది సెయింట్ ఏంజెలో, ఇటాలియన్ కవి
(కవి తన పేదరికం గూర్చి హాస్యంగా చెబుతున్నాడు) . దారిద్య్రంలో నేను ఎంత గొప్పవాడినంటే ఈ క్షణంలో పారిస్, రోం, పీసా, పాడువా బైజాంటియం, వెనిస్, ల్యూకా, ఫ్లారెన్స్, ఫర్లీ వంటి అన్నినగరాలకి సరఫరా చెయ్యగలను. నా దగ్గరఅచ్చమైన అనేక ‘శూన్యం’, ‘పూజ్యం’ నాణెపు నిల్వలున్నాయి. దానికి తోడు ప్రతి ఏడూ, సున్నాకీ, శూన్యానికీ మధ్య ఉన్నన్ని ఓడలనిండా వచ్చి పడిపోతుంటాయి. బంగారం, విలువైన రత్నాల రాశులయితే నాదగ్గర చక్రాల్లా చెక్కినవి వంద సున్నాల విలువైనవున్నాయి; అన్నిటికంటే,…
-
మృత్యుఘంటికలు (సానెట్)… ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి
ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/…
-
సానెట్ 2 … లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి
నా పెదవినుండి వెలువడిన మధుర గీతాల్లారా, నను విడిచిపొండి, సంగీతానికి శృతిబద్ధమైన వాద్యపరికరాల్లారా, నను వీడిపొండి, మైదానాల్లోని రమణీయమైన ఎగిసే నీటిబుగ్గలారా, నను వీడిపొండి కొండకోనల్లోని మంత్రముగ్ధుణ్ణిచేసే తరు, లతాంతాల్లారా, నను వీడిపొండి, అనాదిగా వేణువునుండి వెలువడుతున్న రసధునులారా, నను విడిచి పొండి, జనపదాల్లోని విందు, వినోద, జాతర సమూహాల్లారా, నను విడిచిపొండి, రెల్లుపొదలలోదాగిన జంతు, పక్షి సమూహాల్లారా, నను వీడిపొండి, శీతలతరుచాయలలో హాయిగా విశ్రమించే గోపకులారా, నను వీడిపొండి, నాకిపుడు ఏ సూర్య చంద్రులూ ఉదయించి…
-
సానెట్… లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి
కాలమూ మనిషీ ఎన్నడూ స్థిరంగా ఉండరు; అదృష్టం దూరమైన మనిషి ధైర్యమూ దూరమౌతుంది; సరి కొత్త స్వభావాన్ని సంతరించుకున్న ప్రకృతితో ఈ ప్రపంచమంతా “తిండిపోతు మార్పు” ఆహారంలా కనిపిస్తోంది. ఏ దిక్కు చూసినా అంతులేని సరికొత్త చిగుళ్ళు కనుపిస్తున్నాయి ఎంతగా అంటే, ఈ భూమి ఇంత భరించగలదని ఊహించలేనంత. బహుశా గతాన్ని గురించిన శోకమే నిలకడగా ఉంటుంది, గతంలో చేసిన మంచికై వగపూను, అది నిజంగా మంచి అయితే. కాలం పచ్చదనంతో మొన్నటిదాకా ఈ మైదానాన్ని ఉల్లాసం…
-
మంచు సోన … కర్దూచీ, ఇటాలియన్ కవి
చీకటి ముసిరిన ఆకాశం నుండి నిశ్శబ్దంగా, నెమ్మదిగా కురుస్తోంది మంచు నగరంలో, అరుపులూ, జీవవ్యాపారాల సందడీ సద్దుమణుగుతోంది పరిగెడుతున్న చక్రాల శబ్దాలూ, వీధి వర్తకుల అరుపులూ, యువత కేరింతలూ, ప్రేమగీతాలూ వినిపించడం లేదు. కాలావధులు లేని ప్రపంచపు నిట్టూర్పుల్లా, నిద్రపోతున్న మెట్లమీదుగా లోహపుజాడీనుండి గంటలు కరకుగా బొంగురుగా మూలుగుతున్నాయి. దారితప్పిన పక్షులు కిటీకీ అద్దాలమీద పదే పదే కొట్టుకుంటున్నాయి నా సహచర ప్రేతాత్మ మిత్రులు వెనుదిరిగి, నావంకచూస్తూ పిలుస్తున్నారు. శలవు ప్రియతములారా, త్వరలో కలుద్దాం, భయమెరుగని ఓ…
-
పరమాత్మ… మైకేలేంజెలో, ఇటాలియన్ శిల్పి, కవి
నా ప్రార్థనల వెనుక నీ ఆశీస్సులున్నపుడు తండ్రీ! ఆ ప్రార్థనలు అర్థవంతమై ఉంటాయి: నిస్సహాయమైన నా హృదయం జీవంలేని మట్టి వంటిది, తనంత తానుగా ఏ మంచి, పవిత్రమైన వాక్యాల సారాంశాన్నీ గుర్తించి గ్రహించ సమర్థురాలు కాదు. నీవు విత్తువి, నీ అనుగ్రహంతో ప్రయత్నం వేగవంతమౌతుంది, నీవే గనక మాకు సరియైన మార్గాన్ని చూపించకపొతే దాన్ని ఏ మనిషీ కనుక్కోలేడు; నీవు మార్గదర్శనం చెయ్యి! నా మనసులోకి ఎటువంటి ఆలోచనలు జొప్పిస్తావంటే ఆ ప్రభావంతో నీ పవిత్రమైన…