అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 9, 2014

    వైమానికుడి మనోగతం … గేరీ క్లాడ్ స్టోకర్, అమెరికను

    తుఫాను తర్వాత మేఘాలతో నాట్యం చెయ్యాలన్నా, దొర్లుతూ, ఎగురుతూ జారుతూ, వంపులు తిరుగుతూ పోవాలన్నా మనసులో పెల్లుబికే ఆనందాన్ని అనుభూతి చెందాలన్నా స్వేచ్ఛకి అచ్చపు నిర్వచనమైన విమానంలో ఎగరాలిసిందే. భూమిని దాని బాధలకు దాన్ని వదిలేసి పైపైకి ఎగిరి వసంతకాలపు స్పష్టమైన పగటి వెచ్చదనాన్ని తెలుసుకోవచ్చు; ఒత్తిడులన్నీ కరిగిపోయి, వాటినుండి విముక్తి పొందేక చివరకి రోజు ముగిసే వేళకి తిరిగి నేలమీదకి చేరుకోవచ్చు. ఒక వేళ అలా ప్రయాణిస్తున్నప్పుడు నాకు మృత్యువు సమీపిస్తే అది పట్టపగలు కానివ్వండి,…

  • జూలై 7, 2014

    నలభైఏళ్ళ మగాళ్ళు… డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి

    నలభై ఏళ్ళు వచ్చిన మగాళ్ళు మళ్ళీ తాము అక్కడికి రామని తెలిసిన గది తలుపులను నెమ్మదిగా వెయ్యడం నేర్చుకుంటారు. చివరి మెట్టు ఎక్కిన తర్వాత ఆగినపుడు కాళ్ళక్రింద కదలిక చిన్నదే అయినప్పటికీ, పడవ పైభాగం మీద నిలబడినప్పటిలా, కదుల్తున్నట్టు అనుభూతి చెందుతారు. అద్దం లోతుల్లో చిన్నప్పుడు వాళ్ళ నాన్న ‘టై’ ని రహస్యంగా కట్టుకోవడం సాధన చేసిన కుర్రాడి ముఖం తిరిగి చూస్తారు. గడ్డం నిండా పరుచుకున్న నురుగుతో చిత్రంగా కనిపించిన నాన్న ముఖం ఇప్పటికీ స్పష్టంగా…

  • జూలై 6, 2014

    దార్శనికత … సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

    నాకు కాలగతిలో కలిసిపోయే వస్తువులన్నీ ఇష్టం; వాటి క్షణికతే   నిలకడలేని నిశ్శబ్దాలమీద సంగీతమై, క్రమంగా అంతరిస్తుంది. సుడిగాలులు, పక్షులు, లే చివుళ్ళు, అన్నీ ఒక వెలుగు వెలిగి రాలిపోతాయి    ప్రపంచానికి ఆనందాన్ని వెదజల్లుతాయి;  దానికి మెరుపులా లయబద్ధంగా కదలగల అవయవాలు కావాలి,  ప్రభాతవేళ యవ్వనపు జిగితో వెలిగే మోమూ, మృత్య్తువుతో ముగిసే క్షణణకాల ప్రేమా…   “ఓ సౌందర్యమా! నువ్వు నశ్వరమైన వస్తువులోంచే జనిస్తావు సుమీ!”    . సీ ఫ్రై ససూన్ (8 September…

  • జూలై 5, 2014

    కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

    కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద, క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో, లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన, పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం, అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది, ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ…

  • జూలై 4, 2014

    లక్షణాల ఏకరువు … డొరతీ పార్కర్, అమెరికను

    నాకు నా మానసిక స్థితి నచ్చదు; ఎప్పుడూ కఠినంగా, నిర్దయగా, చాడీలు చెబుతూ ఉంటాను. నాకు నా కాళ్లు నచ్చవు, నా చేతులంటే  అసహ్యం, నాకు చక్కని ప్రదేశాలకు వెళ్ళాలని ఉండదు. నాకు ఒకేలా వెలుగుచిమ్మే ఉదయవేళ నచ్చదు; నాకు రాత్రి పడుక్కోవాలంటే చికాకు. సీదాసాదా అమాయకపు మనుషులంటే ముఖం చిట్లిస్తాను. నేను చిన్నపాటి జోకు కూడా సహించలేను. నాకు బొమ్మలువెయ్యడంలో, రాసుకోడంలో మనశ్శాంతి లేదు. నా ప్రపంచం అంతా ఎందుకూ పనికిరానిది. నా కలలన్నీ కరిగిపోయాయి;…

  • జూలై 3, 2014

    భగవత్సృష్టి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

    ఓహ్! ప్రకృతీ! నిన్ను ఇంతకంటే గాఢంగా హత్తుకోలేను! నీ తెమ్మెరలేమిటి! విశాలమైన ఆకాశాలేమిటి! పడిలెస్తూ ఎగసిపడే నీ మంచుదొంతరలేమిటి! నీ ఈ వనాలు, ఈ శరదూదయం, పెరిగి సడలే తీపు, అన్నీ రంగులకోసం పోటీపడుతున్నాయి! ఆ సన్నని కొండవాలు, చెట్ల గుబురుపై తొలగుతున్న చీకటీ మనసుదోచుకుంటున్నై. ఓ విశ్వమా! ప్రకృతీ! నేనూ ఇంతకంటే దగ్గర రాలేని అసమర్థురాలిని! ఇందులోని మహిమగురించి చాలా కాలంగా తెలుసు; కానీ  మరీ ఇంత అందంగా ఉంటుందని ఎన్నడూ తెలుసుకోలేకపోయాను; ఇక్కడ ఎంత…

  • జూలై 2, 2014

    వాయిదావేసిన కల … లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను

    వాయిదావేసిన కల ఏమవుతుంది? ఎండబెట్టిన జిగురులా గట్టిపడిపోతుందా? పుండులా సలిపి సలిపి రసి కారుతుందా? కుళ్ళిన మాంసంలా కంపుకొడుతుందా? లేక పాకంతో చేసిన తీపి వంటకంలా పంచదార పైన పేరుకుని తెట్టుకడుతుందా? బహుశా బరువు ఎక్కువైన సంచిలా క్రిందకి వేలాడిపోతుందేమో! లేక, కొంపదీసి విస్ఫోటిస్తుందా? . లాంగ్స్టన్ హ్యూజ్ (February 1, 1902 – May 22, 1967) అమెరికను. . . Dream Deferred . What happens to a dream deferred? Does…

  • జూలై 1, 2014

    కొన్ని జీవితాలంతే! … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను

    పొద్దు పొడవబోతోంది. టెలిఫోను తీగలమీద కాకులు నిరీక్షిస్తున్నాయి నిన్న నే మరిచిపోయిన సాండ్ విచ్ ని ప్రశాంతమైన ఈ ఆదివారం ఉదయం 6 గంటలకి తింటుంటే. ఆ మూలని ఒక జోడు నిటారుగా నిలబడి ఉంది రెండవది దానిపక్కనే ఒత్తిగిలి పడుంది. నిజం! కొన్ని జీవితాలంతే! వృధా అవడానికే ఉంటాయి. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను. . . It was just a little while…

  • జూన్ 29, 2014

    రుబాయీ XI… ఉమర్ ఖయ్యాం, పెర్షియన్ కవి

    ఇక్కడ, ఈ పొదరింటి క్రింద ఒక రోట్టె ముక్కా, ఒక పాత్రనిండా మద్యం, ఒక కవిత్వ పుస్తకం… ఈ నిర్జనప్రదేశంలో… పక్కన సాకీ! నువ్వు పాడుతుంటే, చాలు! ఈ ఏకాంతప్రదేశమే స్వర్గతుల్యం. . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియన్ కవీ, ఖగోళ శాస్త్రజ్ఞుడూ . Omar Khayyam Image Courtesy: http://en.wikipedia.org . Here with a Loaf of Bread beneath the Bough, A Flask of…

  • జూన్ 28, 2014

    రుబాయీ – 51… ఉమర్ ఖయ్యాం, పెర్షియన్ కవి

    ఆ రాసే చెయ్యి రాస్తూనే ఉంటుంది, ఎంతరాసినా ఆగదు; ముందుకు పోతూనే ఉంటుంది; నీ ప్రార్థనలూ, మేధస్సూ అందులో ఒక్క వాక్యాన్ని కూడా వెనక్కి వచ్చి సరిదిద్దేలా చెయ్యలేవు, నువ్వు ఎన్ని కన్నీళ్ళు కార్చు; ఒక్క అక్షరంకూడా చెక్కుచెదరదు. . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు. (అనువాదం: ఫిజెరాల్డ్ ) . Rubai- LI The Moving Finger writes; and,…

←మునుపటి పుట
1 … 145 146 147 148 149 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు