అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 4, 2014

    చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

    చవకబారు సత్రంలో నువ్వు ఎన్నడైనా ఉండి ఉండకపోతే నీకు జీవితం అంటే ఏమిటో తెలియనట్టే… అక్కడ ఒక్కటే బల్బూ 56 మంది మనుషులూ మంచాలమీద ఇరుక్కుంటూ… అందరూ ఒకేసారి గురకపెడుతూ; అందులో కొందరి గురక నమ్మలేనంత దీర్ఘంగా, గట్టిగా ఘోరంగా అమానుషంగా ఉండి సాక్షాత్తూ నరకంనుండి వస్తున్నాయా అనిపిస్తుంది. ఆ మృత్యుఘోషని మరపించే గురకకి దానితో కలగలిసిన దుర్గంధానికీ నీకు మతిపోయినంత పనిజరుగుతుంది: ఎన్నడూ ఉతికి ఎరగని మేజోళ్ళూ మలమూత్రాల వాసన పట్టెసిన లో దుస్తులూ వాటిమీదనుండి…

  • సెప్టెంబర్ 3, 2014

    తుదిపలుకులు… జాన్ నీహార్ట్, అమెరికను కవి

    ఓహ్! నన్ను సమాధిలో వెతక్కు నేనా మట్టిలో కనిపించను! వెలుగులో కలిసిపోడానికి ఆ చికటి కుహరానికి ఒక కంత పెడతాను. గడిచిన అన్ని సందర్భాలతో చెలిమిచేశాను దిమ్మతిరిగే ఆనందమైనా, నొసలు చిట్లించే దుఃఖమైనా; నేను గడ్డితోనూ స్నేహానికి సిద్ధమే ఎండకాగే తలిరాకుతోనైనా సిద్ధమే. మృత్యువు నన్ను కనుమరుగుచెయ్యలేదు; బాధతో సానపట్టిన ఆనందపు కత్తి పట్టి వానచినుకుల, మెరుపుల, మేఘాల పటాలాలతో జతగూడుతాను. ఆహ్! నా కణాల్లో ఏదో తెలియని ఉత్తేజం నన్ను ఆనందంతో చురుకుగా లేవనెత్తుతుంది విశ్వ…

  • సెప్టెంబర్ 2, 2014

    స్పెయిను కి… జోస్ జొరిల్ల, స్పానిష్ కవి

    ఓ నా దేశమా! నీకోసం ఎన్ని కన్నీళ్ళు కారేయి! ఎంతమంది సోదరుల రక్తం ఏరులై ప్రవహించింది! ఎంతమంది వీరులు అపురూపమైన నీ నేలమాళిగల్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు ! ఎనాళ్ళనుండో మా కళ్ళు కవోష్ణ బిందువులతో నిండేయి… ఎన్నిసార్లో అవి బయటకి ఉబుకుదామని ప్రయత్నించేయి! కాని, ప్రతి సారీ మరో యుద్ధభూమికి మొగ్గుతూ విపత్తులకీ, రక్తానికీ జారి పడడం మానుకున్నాయి. చూడు! అదిగో అల్లంత దూరాన ఉన్న అడవులూ, నేలగుండెమీద నిద్రిస్తున్న పంటచేలూ, ఈ లోయలపై తమ పచ్చని…

  • సెప్టెంబర్ 1, 2014

    అదృష్టాన్ని వెతుక్కుంటూ… జూరి ఫెడ్కోవిచ్, బ్యుకోవియన్ కవి

    సోదరా! నువ్వు ఇంటిపట్టున ఉన్నావు వ్యవసాయం చేసుకుంటూ నేను అదృష్టాన్ని వెతుక్కుంటూ మైళ్ళకి మైళ్లు తిరుక్కుంటూ జర్మనీకి పరిగెత్తేను. ఇక్కడ ఈ బ్యుకోవినా ఆకాశం క్రిందకి వచ్చేను, రాళ్ళూ రప్పలతో కూడిన తియరోల్ చేరుకున్నాను. ఎక్కడైనా అదృష్టం కలిసొస్తుందేమోనని ఇంకా తిరుగుతూనే ఉన్నా. సోదరా!  నువ్వు మంచిపని చేశావు ఇన్నాళ్ళూ వ్యవసాయం చేసుకుంటూ. నాకు అదృష్టం కలిసిరాలేదు. నేను దాన్ని వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చేను అసలది అది ఉన్నది … ఆ పంటపొలాల్లో. . జూరి ఫెడ్కోవిచ్…

  • ఆగస్ట్ 31, 2014

    Trust-Deficit… Maheshkumar Kathi, Telugu, Indian

    The fact that I am wingless Has inhibited my desire to fly high into the sky The concern for constraints of space Restrained expanding my horizons The fetters of the heart reconciled: Pal! This is life. There is always a conflict Between the wonted common existence And the uncommon exotic desires. “Oh, you man, who…

  • ఆగస్ట్ 30, 2014

    థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి

    ఎన్నిదిక్కులు తిరిగినా ఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా; విరిగి రాలిపోవడమే తప్ప ఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా; జీవితపర్యంతమూ నీటికి దూరంగా నిలిచిన వంతెనలా; టేగస్ నదికి దూరంగా ఉన్న పుష్పించి ఫలించలేని వృక్షాల్లా; చీకటి క్రీనీడల్లోనే ఆనందం అనుభవించే చిమీరియన్లలా; వాటి కూనలే అందమైనవని భ్రమించే కోతుల్లా… ఎవరు తన అభిప్రాయమే సరియైనదని వల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో, ప్రామాణికమైన ఋజువులకి గాని హేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచక కూలంకషంగా చర్చించిన తీర్పు వెలువడకముందే…

  • ఆగస్ట్ 29, 2014

    హాప్స్… బోరిస్ పాస్టర్ నాక్, రష్యను కవి

    ఐవీ లత చుట్టుముట్టిన ఈ విల్లో చెట్టు నీడన, నీనడుముచుట్టూ నే చేతులువేసి, పొడవుకోటు మన భుజాలపై కప్పుకుని, ఇప్పటివరకు ఎరగని పెద్ద తుఫానుబారినుండి రక్షణ తీసుకుంటున్నాం. అది ఐవీ లత అనుకున్నాను, నాది పొరపాటు. పొదలన్నిటా వ్యాపించి ఈ అడవిని చుట్టింది ఐవీ లత కాదు, హాప్స్. నీ సామీప్యం మత్తెక్కిస్తోంది! నెచ్చెలీ! పద. ఈ పొడుగుకోటుని నేలపై పరుద్దాం. . బోరిస్ పాస్టర్ నాక్ (10 February 1890 – 30 May 1960) రష్యను…

  • ఆగస్ట్ 28, 2014

    కనుక… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    ఓహ్, నా అహాన్ని అణచడానికిగాని, నా అభిప్రాయాల్ని వంచి మార్చడానికిగానినువ్వెన్నడూ ప్రయత్నించలేదు కనుక…ఆదిమ మానవుడిలా నేను సగం భయంతో జీవించేలా చెయ్యలేదు గనుక…ఏదో విజయ గర్వంతో చెప్పాపెట్టకుండా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎన్నడూ అనుకోలేదుగనుక…నన్ను స్వీకరించు!ఇంతకుముందుకంటే ఇప్పుడునిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. తిరుగులేని నా ఆత్మని కూడాదానితోపాటు నీకు సమర్పించకపోతే ఈ శరీరపు కన్యాత్వమొక్కటీ అపురూపమూ, అరుదూ కాదు కనుకగాలిలా ఏ నియంత్రణలోనూ లేని నా మనసునీ, నా కలల్నీ కూడా తీసుకో! నిన్ను “స్వామీ” అని సంభోదిస్తాను,ఎందుకంటే…

  • ఆగస్ట్ 27, 2014

    బుల్లిపిట్ట… అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్, రష్యను కవి

    నేను  పరదేశంలోనైనా సంప్రదాయపు అలవాట్లూ, విధులూ నిర్వర్తిస్తాను. నేను సంతోషంగా ఒక బుల్లి పిట్టను వసంతోత్సవాల్లో స్వేచ్ఛగా విహరించమని వదుల్తాను.  ఇప్పుడు నాకు ఎంతో ఊరటగా ఉంది. అందుకు సర్వశక్తిమయుడైనదేముడికి ఎంతైనా ఋణపడి ఉన్నాను. అతని సృష్టిలో కనీసం ఒక జీవికైనా నేను స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేను. . అలెగ్జాండర్ సెర్గెవిచ్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి. .   Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . A Little Bird…

  • ఆగస్ట్ 26, 2014

    సమాధానం… సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి

    మోగించండి! కొమ్ములొత్తండి! వేణువులూదండి  ఈ సమస్త ఇంద్రియ జగత్తుకీ చాటింపు వెయ్యండి: కొన్ని యుగాల అనామకపు జీవితం కన్న ఉదాత్త జీవితం ఒక గంట అయినా … మిన్న. . సర్ వాల్టర్ స్కాట్ (15 August 1771 – 21 September 1832) స్కాటిష్ కవి, నవలాకారుడూ, నాటక కర్తా. . . Answer . Sound, sound the clarion, fill the fife! To all the sensual world proclaim, One…

←మునుపటి పుట
1 … 140 141 142 143 144 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు