అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 14, 2014

    ఆత్మహత్య… హార్హి లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

    రాత్రి ఇక ఒక్క నక్షత్రమూ మిగలదు. ఆమాటకొస్తే, అసలు రాత్రే మిగలదు నేను మరణిస్తాను, నాతో పాటే దుర్భరమైన ఈ సమస్త విశ్వమూను. నేను పిరమిడ్లని తుడిచిపెట్టెస్తాను. ధనాన్నీ, ఖండాలనీ, అక్కడి అన్నిరకాల ముఖాలనీ, పోగుపడ్డ గతాన్నీ నేను చెరిపెస్తాను. చరిత్రనీ, పాటు, మట్టినీ మట్టిలో కలిపెస్తాను. నేనిపుడు కడపటి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను. చిట్టచివరి పక్షి పాట వింటున్నాను. నే నెవరికీ ఏదీ వారసత్వంగా మిగల్చను. . హార్హి లూయిస్ బోర్హెస్ 24 August 1899 – 14 June…

  • సెప్టెంబర్ 13, 2014

    అనంతం… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి

    ఓ వయసా! కాలమా! శలవు! చూడండి, నేను నిష్క్రమిస్తున్నాను. నేను వెళ్ళబోయేచోట మాత్రం శాశ్వతంగా ఉంటానని తెలుసు.   నా ఈ నేత్రాలు త్రి కాలాలూ  ఎలా ఈ సువిశాల అనంతత్వంలో కొట్టుకుపోయాయో చూడగల్గుతాయి. అక్కడ చంద్రబింబం నక్షత్రాల్ని  శాసించదు; బదులు, రాత్రితో పాటే, ఆమెకూడా అంతులేని వెలుగులో మునకలేస్తుంది. . రాబర్ట్ హెర్రిక్ 24 August 1591 – 15 October 1674 ఇంగ్లీషు కవి .   . Eternitie . O Yeares!…

  • సెప్టెంబర్ 12, 2014

    వసంతాగమనం… థామస్ కారీ, ఇంగ్లీషు కవి

    శీతకాలం గడిచిందేమో, ధరిత్రి తన హిమస్వచ్ఛమైన శుక్లాంబరాల్ని విడిచింది. ఇక గడ్డిపరకలమీద మంచు పీచుమిఠాయిలా , స్వచ్ఛంగా పారే సెలయేటి తరగలమీదా నిర్మలమైన సరస్సుమీదా మీగడతరకలా … పేరుకోదు గోర్వెచ్చని ఎండ కొయ్యబారిన నేలని కరిగించి మెత్తబరుస్తుంది; మరణించిన పిచ్చుక పునరుజ్జీవిస్తుంది. చెట్టుతొర్రలో మత్తుగా పడుక్కున్న కోకిలనీ, గండుతుమ్మెదల్నీ తట్టిలేపుతుంది. కువకువలాడుతూ గాయకగణం స్వరరచనచేస్తూ దర్పంగా వసంతుణ్ణి ప్రకృతిలోకి ఆదరిస్తాయి. లోయలూ, కొండలూ, వనాలూ, సరికొత్త శోభతో కళ్ళు కాయలుగాచేలా ఎదురుచూస్తున్న చైత్రాన్ని స్వాగతిస్తాయి. . థామస్…

  • సెప్టెంబర్ 11, 2014

    స్మృతి గీతిక… రాబర్ట్ వైల్డ్ , ఇంగ్లీషు కవి

    ఇక్కడ క్రీస్తులో కొంత భాగం పరుంది;నేలపాలైన ఒక తారక; బంగారు తునక; భగవంతుడు స్వర్గంలో సద్వర్తనులకు విందు చేస్తే, అక్కడ ఉండవలసిన హేమ పాత్రిక. . రాబర్ట్ వైల్డ్ 1615–1679 ఇంగ్లీషు కవి . Epitaph : “Here lies a piece of Christ” . Here lies a piece of Christ; a star in dust; A vein og gold; a china dish that must Be used…

  • సెప్టెంబర్ 10, 2014

    నా మాట నమ్మకు… ఏ కె టాల్ స్టాయ్, రష్యను కవి

    ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమించడం లేదంటే ప్రియతమా! నువ్వు నా మాట విశ్వసించకు. కెరటాలు వెనక్కి తగ్గేయని సముద్రాన్ని నమ్మకు అది కొత్తగా విరుచుకు పడుతుంది. అప్పుడే మనసు రాగరంజితమై నీకై పరితపిస్తోంది. మరోసారి నా స్వాతంత్ర్యాన్ని నీకు సమర్పించుకుంటాను. అప్పుడే అలలు ఆనందంతో తుళ్ళుతూ ఉరకలేస్తున్నాయి ఎరిగిన ఆ ప్రేమ తీరాలని తిరిగి ముంచెత్తడానికి. . ఏ కె టాల్ స్టాయ్ 5 September 1817 – 10 October 1875 రష్యను కవి   …

  • సెప్టెంబర్ 9, 2014

    నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి

    నేను మాటాడిన మాటలన్నీ నేను రాసిన పదాలన్నీ విషాద భరితమైన నీ గుండెలు చేరే దాకా… అలుపులేకుండా వాటి రెక్కలని సాచాలి, విరామమెరుగకుండా ఎగరాలి… ఎగిరి, ఆ రాత్రి, ప్రవహిస్తున్న నీ కన్నీరు నక్షత్రకాంతిలో మెరిసినా, తుఫాను చీకట్లకు నల్లబడినా, నా పాటను నీకు వినిపించాలి. . విలియం బట్ల యేట్స్ 13 June 1865 – 28 January 1939 ఐరిష్ కవి  . . Where My Books Go . All the…

  • సెప్టెంబర్ 8, 2014

    నిద్ర… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

    (కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా,  సర్ ఫిలిప్ సిడ్నీ నుండి  ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది. ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి…

  • సెప్టెంబర్ 7, 2014

    వీడ్కోలు… హారియట్ మన్రో, అమెరికను కవి

    శలవు!  అంతా ముగిసిపోయిందని దుఃఖించకు. ఇదే సరియైన సమయం. ఆనందపు రెక్కల నికుంజవిహారి, మధుపాయి పువ్వును వీడిందని వగవొద్దు. అది ప్రకృతి ధర్మం.  ప్రేమ క్షణికం. ఓహ్! ప్రేమేమిటి, అన్నీ క్షణికమే. జీవితం ఆనందంగా గడిచింది. మృత్యువుని కూడా పరమానందమే. ఆకుల్ని రాలిపోనీ. . హారియట్ మన్రో 23 డిశంబరు 1860 – 26 సెప్టెంబరు 1936 అమెరికను కవి. . A Farewell . Good-by!—no, do not grieve that it is over,       …

  • సెప్టెంబర్ 6, 2014

    మృత్యువుకి వినతి … కెరొలీన్ సదే, ఇంగ్లీషు కవయిత్రి

    ఓ మృత్యువా! భయపెడుతూ రాకు, ఏమాత్రం ప్రతిఘటించని ఈ ఎరని ఎగరేసుకుపోడానికి సాయంత్రపు నీడలా రా, అంత నిశ్శబ్దంగానూ, అంత చాటుగానూ! నా కన్నులు మూసి, ఊపిరి తీసుకుపో; అప్పుడు నేను ఇష్టంగా, ఓహ్, ఇష్టంగానే నిన్ను నేను అనుసరిస్తాను. . సున్నితంగా తాకితే సరిపడేచోట ఇనపగొలుసుల అవసరమేముంది చెప్పు? ఈ అలసిన ఆత్మ పట్టించుకోకపోయినా అంత ఘోరంగా, అంత భయానకంగా నల్లని ఆకృతితో భయపెట్టవలసిన అవసరం ఏముంది? నెమ్మదిగా పిలిస్తే, సుకుమారంగా అడిగితే చాలదూ అఖండమైన…

  • సెప్టెంబర్ 5, 2014

    అటువంటి దేశాన్ని చూసి జాలిపడు… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్ అమెరికన్ కవి

    (మహాకవులు ఎప్పుడూ దార్శనికులే. వాళ్ళ కృతులు పరిమితం కావచ్చునేమో గాని వాళ్ళ పలుకుల విస్తృతి అపరిమితం. అవి దేశకాల అవధుల్ని అవలీలగా జయించి వాటిలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి. ఈ కవితలోని ప్రతి పాదములో చెప్పిన భావానికీ (లేదా వేదనకీ), నేడు మనదేశ వ్యవస్థలో పొల్లుపోకుండా ఉదాహరణలు కనిపిస్తాయి.  అంతకంటే గొప్పనిదర్శనం ఏమిటి కావాలి?) ఏ దేశ ప్రజలకి అఖండమైన విశ్వాసాలుండి, ఆచరణలో అవి మృగ్యమో; ఏ దేశం అక్కడ నేయని బట్టని తొడుక్కుని, అక్కడపండని పంటని…

←మునుపటి పుట
1 … 139 140 141 142 143 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు