అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 24, 2014

    ఆలోచనలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

    వాళ్ళు నా ఆత్మని తూలికలదుప్పటిలో చుట్టారు వెచ్చగా, హాయిగా ఉండేలా చూశారు ఒక పాత పూజా కర్పటము వేసి చక్కగా చెక్కిన కుర్చీలో జాగ్రత్తగా కూచోబెట్టేరు. నా కాళ్ళకి బంగారు జోళ్ళు తొడిగేరు అది బొటనవేలుదగ్గరా, మడమదగ్గరా నొప్పెట్టింది; నా పాదాలు వయసు వాటాడి, అలసిపోయాయి, ఎలా ఉన్నాయి అని అయినా అడగలేదు. నేనిప్పుడేమయిపోయానో అని బెంగ వాళ్ళకి నా కోసం కీచుగా అరుస్తూ వెతుకుతునారు; పొడుగ్గా మొలిచిన గడ్డిదుబ్బుల్లో దాగున్నాను, వాళ్ళు పక్కనుండి పోతుంటే నవ్వుతున్నాను.…

  • సెప్టెంబర్ 23, 2014

    ప్రేమిక … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    నీ గురించి ఇతరులు తెలుసుకున్నదానికంటే ఎక్కువ తెలియడం ఒక జీవితానికి దక్కే అపూర్వ గౌరవం, నీ గొంతు లోని రాగాలు, వాటి ఛాయలూ, రాయిలా, నిశ్చలంగా, ఏమాత్రం చలించని నీ చిత్తమూ. ఎంతో ఆనందంగా, ఏకాంతంగా,సిగ్గిలే నీ హృదయం, గంభీరమైన నవ్వూ, స్వాభిమానంలోని అభిమానం, మృదుత్వాన్ని నిర్వచించే ఆ మృదుత్వం…  ఇవన్నీ భూమంత సంపన్నమూ, ఆకసమంత విశాలమూ.  . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . .…

  • సెప్టెంబర్ 22, 2014

    ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి

    ఎక్కడో దూర దేశంలో ఉన్న ఇంటికి నువ్వు ప్రయాణమయ్యావు. ఇంతకుముందెన్నడూ ఎరుగనంత దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి. అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి ప్రయత్నించేను; ఈ బాధకి అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు. మన గాఢమైన చుంబనం నుండి నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు. ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు మరో అందమైన చోటు గురించి చెబుతూ “మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ మనం ఇద్దరం…

  • సెప్టెంబర్ 21, 2014

    నన్ను విడిచిపెట్టావు… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

    ప్రియతమా! నాకు రెండు వారసత్వంగా వదిలావు. మొదటిది ప్రేమ వారసత్వం. భగవంతుడికే గనక ఆ వారసత్వం దక్కుంటే ఎంతో సంతోషించేవాడు.   అనంత సాగరాల్లాంటి ఎల్లలు లేని బాధనీ వదిలావు, కాలానికీ అనంతానికీ మధ్య నన్నూ, నీజ్ఞాపకాన్నీ మిగిల్చి. . ఎమిలీ డికిన్సన్  December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి   . You left me . You left me, sweet, two legacies,— A legacy of…

  • సెప్టెంబర్ 20, 2014

    సంగతులు 18- కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

    సూర్యుడు పసిడికిరణాలని వడకడుతున్నాడు సూర్యుడు నిశ్శబ్దాన్ని కూడా వడకడుతున్నాడు. ఆకాశంలో మేఘాలు మిరిమిట్లుగొలుపుతున్నాయి.  తెమ్మెర వీస్తున్న పూదోటలో నడుస్తున్నాను ఎండిపోయిన పండుటాకులను కాళ్లతో తొక్కుకుంటూ… పాలరాతి పలకమీద ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి దాని మీద ప్రేమికులు మౌనంగా కూచున్నారు; ఆకులు ఖాళీ బల్లమీద చెదురుమదురుగా పడి ఉన్నై.  అదిగో అక్కడి తేటనీటికొలను, వణుకుతున్నట్టు, సూర్యుడి వేడి కిరణాల్ని అలలతో జాడిస్తోంది. దూరాన పొడవాటి ఒంటరి చెట్టు, అసహనంగా ఆకాశంక్రింద ఎండలో ఊగుతోంది. ప్రియతమా! నేను ఒంటరిగా…

  • సెప్టెంబర్ 19, 2014

    ప్రేమ ఒక రోగం… సామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి

    ప్రేమ విపత్తులతో నిండిన ఒక రోగం; దానికి ఏ మందూ పనిచెయ్యదు; త్రుంచుతున్నకొద్దీ పెరిగే మొక్కలాంటిది వాడిన తర్వాత ఎందుకూ కొరగాదు ఎందుచేత? మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది; దాన్ని అనుభవించలేదా, అయ్యో అంటూ నిట్టూరుస్తుంది. ప్రేమ ఒక మానసిక హింస, ఎన్నటికీ వదలని తుఫాను భగవంతుడు దాన్నో రకంగా చేశాడు ఎప్పుడూ సుఖం ఉండదు, పూర్తవదు, కరువూ ఉండదు, ఎందుచేత? మనం దాన్ని అనుభవించినకొద్దీ అది తరుగుతుంది; దాన్ని అనుభవించలేదా, అయ్యో అంటూ నిట్టూరుస్తుంది.…

  • సెప్టెంబర్ 18, 2014

    భ్రమణ గీతం… ఆల్ఫ్రెడ్ హిచ్, అమెరికను (బహుశా)

    కాలంతో పాటే  నేనూ దేశదేశాలు తిరుగుతాను కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను; ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం నాకు ద్వారం దగ్గర స్వాగతం పలుకుతుంటుంది.   స్నేహితులు మారరు, ప్రేమలో వేడి తగ్గదు. జీవితం ఏ మార్పూ రాబట్టదు; నాకు పాతవన్నీ ఎప్పటికీ పాతవే కొత్తవి ఎప్పుడూ కొత్తవే.     కాలంతో పాటే  నేనూ దేశదేశాలు తిరుగుతాను కాలంలాగే నేనూ, వెనక్కి తిరిగి రాను; ఎప్పుడూ ఒక కొత్త అజరామరమైన ముఖం నాకు ద్వారం…

  • సెప్టెంబర్ 17, 2014

    మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి

    మన బాధలు సత్యం ; కానీ మన సమస్త సుఖాలు ఊహాజనితాలు. రోగాలు వాటంతట అవే వస్తాయి, చికిత్స మాత్రం అంత సులువుగా దొరకదు. మన అపార ధనరాశులూ, ఇంద్రభవనాలూ కేవలం మన సమాధులకు పెరటిళ్ళు; కనీ వినీ ఎరుగని మహానగరాలైనా తుదకు మిగిలేది సమాధుల భాండాగారాలుగానే. ప్రపంచపు నిర్లక్షాన్నుంచి మనల్ని దాచుకునే వ్యర్థ ప్రయత్నమే మన శౌర్యప్రదర్శన; మన నగ్నత్వంలో నిండుగా కనిపించే లోపాలని కప్పిపుచ్చుకుందికి ఆరాటపడుతూనే ఓటమిలోనే మేలుజరిగిందని గొప్పలుపోతూ గర్వంతో వెకిలినవ్వులు నవ్వుతాం.…

  • సెప్టెంబర్ 16, 2014

    దూరంగా … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

    ప్రతిస్పందనలేని ఈ నేలమీది నిశ్శబ్దమూ, ప్రత్యుత్తరం లేని కడలి గంభీరమైన ఘోషా, రెండూ నాకు ఒకే అర్థాన్ని అందిస్తున్నాయి: దూరం, దూరం. మేం దూరంగా ఉంటున్నాం. నువ్వుకూడా  దూరంగా  ఉండు ఖచ్చితమైన హద్దులో: అదే నీ లోపలి శాంతి; మేము నిన్ను కట్టిపడెయ్యము; కాని, నీకు నువ్వు వేసుకున్న సంకెళ్ళనుండి ఎవరు విడిపించగలరు? ఏ హృదయం నిన్ను కదల్చగలదు? ఏ చెయ్యి నిను తాకగలదు? ఒకోసారి గర్వంగా, మరోసారి బేలగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాతరోజులు గుర్తొస్తుంటాయి అప్పుడు…

  • సెప్టెంబర్ 15, 2014

    నిలకడ లేమి … జెఫ్రీ ఛాసర్, ఇంగ్లీషు కవి

    (ఈ కవిత 600 సంవత్సరాలక్రిందటిది అంటే నమ్మడం కష్టం. ఇదేదో నిన్ననో మొన్ననో రాసినట్టుంది.  మనుషుల స్వభావంలో అప్పటినుండీ ఇప్పటివరకూ ఏమీ మార్పు లేదన్నమాట.) ఒకప్పుడు ప్రపంచం ఎంత నిలకడగా, కలిసికట్టుగా ఉండేదంటే మనిషి మాట ఇచ్చేడంటే, అది తన ధర్మంగా ఆచరించేవాడు. ఇప్పుడంతా అబద్ధమూ, మాటతప్పడమూను. ఇచ్చిన మాటా, చేసిన చేతా చివరకి వచ్చేసరికి తల్లక్రిందులై, ఒకదానికొకటి పొంతనలేకుండా ఉంటాయి. ప్రపంచం అంతా ఇంతేనా, కేవలం స్వార్థం, లాభాపేక్షేనా నిలకడలేమితో అంతా సర్వనాశనం కావలసిందేనా? మనుషులు ఈ…

←మునుపటి పుట
1 … 138 139 140 141 142 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు