-
నిష్పాక్షికత … లావోజి, చీనీ కవి
అర్థంచేసుకున్నవాడు ఉపదేశాలివ్వడు; ఉపదేశాలిచ్చేవాడు అర్థం చేసుకోలేడు. నీ తీర్పులు, అభిప్రాయాలూ పక్కనబెట్టు; నీ వివేచనకి కళ్ళెం వేసి, నీ లక్ష్యాన్ని సులభంచేసుకో, ప్రపంచాన్ని ఆమోదించు. స్నేహం, శత్రుత్వం లాభం నష్టం కీర్తి, అపకీర్తి నిన్ను ఏమాత్రం తాకవు. ప్రపంచం నిన్ను అంగీకరిస్తుంది. . లావోజి చీనీ కవి తావో తే చింగ్ ( లావోజీ అనే నామాంతరం గల) క్రీ. పూ. 4 శతాబ్దపు సంకలనం నుండి. . VERSE 56 Impartiality. .…
-
సైకిలుమీద కొండ దిగుడు… హెన్రీ ఛార్లెస్ బీచింగ్, ఇంగ్లీషు కవి
కాళ్ళు పైకెత్తి, చేతులు నిలకడగా పట్టి, నేను కొండ దిగడానికి సిద్ధంగా ఉన్నాను. బాణంలా, జాగ్రత్తగా మనసుపట్టి నడుపుతుంటే గాలి పక్కనుండి సర్రున పోతోంది. జోరుగా, ఇంకా జోరుగా, గుండే ఒక్కసారి ఎవరో పైకెత్తేసినట్టు, మనసునవ్వులో తేలుతోంది, గొంతు అరుపులతో, “ఓ పక్షిరాజమా, చూడు, చూడు, నేనూ ఎగురుతున్నా. ఇదేనా, ఇదేనా నీ ఆనందహేతువు? అలా అయితే, ఓ విహంగమా నేను కుర్రాణ్ణయినా ఒక అద్భుతమైన క్షణం పాటు నీలా గాలిలో నేనూ తేలిపోయాను. ఓ హృదయమా!…
-
డాడాయిస్ట్ కవిత రాయడం ఎలా?… ట్రిస్టన్ జారా, రుమేనియన్ కవి
(18 వ శతాబ్దపు చివర ప్రారంభమై 19 వశతాబ్దపు మొదటిసగం బహుళప్రచారంలో ఉన్న కాల్పనిక వాదానికి (Romanticism) తిరుగుబాటుగా యూరోపులో వచ్చిన ఉద్యమం డాడాయిజం. దానికి ఆద్యుడు ట్రిస్టన్ జారా. పైకి ఒక వరసా, వాడీ, అర్థం పర్థం లేని కవిత్వం రాయడంగా కనిపించినప్పటికీ, దీనిలో ఒక మౌలికమైన భావన ఉంది: అది, కవిత్వం అన్నది మనం ఎలా యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చేమో, అంతే యాదృచ్ఛికంగా కవిత వస్తుంది తప్ప, “పనిగట్టుకుని రాసేది కవిత్వం…
-
ఆ గతించేది కాలం కాదు… రస్కిన్ బాండ్, భారతీయకవి
గుర్తుందా, చాలా కాలం క్రిందట మనిద్దరం తీయని బాధతో కలలు కలబోసుకున్నాం? సుదీర్ఘమైన ఆ వేసవి పగళ్ళలో, ఏదో పిట్ట పాడిన తీయని పాట రహస్యంగా గాలి అలలలో తేలియాడడం? మరొక పక్షి నల్లని రెక్కలు విప్పి ఆకసంలోకి ఎగరడం, దాన్ని అనుసరించి ఇంకొకటి పోవడం? ఎప్పటిమాటో, అక్కడొక గులాబి నల్లబడటం? ఆ పల్లవి నువ్వు పాడినదే: “ఆ గతిస్తున్నది కాలం కాదు… నువ్వూ… నేనే.” . రస్కిన్ బాండ్ 19 మే 1934 భారతీయ కవి…
-
అప్పటికప్పుడు … పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియన్ కవి
ఫిడియాస్ సృష్టి అప్పటికప్పుడు చేప నీళ్ళలో వదలడమే ఆలస్యం ఈదడం ప్రారంభిస్తుంది. . పీటర్ పోర్టర్ 16 February 1929 – 23 April 2010 ఆస్ట్రేలియన్ కవి (ఫిడియాస్ అన్న గ్రీకు శిల్పి శిల్పాలు ఎంత జీవకళ ఉట్టిపడేవంటే, అవి నిజమైనవేమోనన్న భ్రమ కల్పించేవట. ఇక్కడ మనం కావలస్తే బాపుగారిని ప్రతిక్షేపించుకోవచ్చు బాగా అర్థం అవడానికి. ) చూడడానికి ఈ కవితలో ఏముంది అనిపించవచ్చు. కేవలం శిల్పం గురించి చెప్పి ఉంటే, ఒక అతిశయోక్తి అలంకారం…
-
ప్రతి ఊరూ స్వంత ఊరే… తమిళ కవిత
ప్రతి ఊరూ స్వంత ఊరే ప్రతి వ్యక్తి నాకు చుట్టమే. మంచీ చెడూ ఇవతలివాళ్ళ వల్ల కలగవు. బాధా, నివారణా వాటంతట అవే కలుగుతాయి. చావు మనకి కొత్తకాదు. ‘జీవితం తీయన’ అని పెద్దగా పండగ చేసుకోము. అలాగే, కోపం వచ్చిందని అది చేదని నిందించము. మన జీవితాలు ఎంత ప్రియమైనవైనప్పటికీ వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి, మెరుపులు ఛేదించిన ఆకాశం నుండి కుంభవృష్టిగా కురిసిన వర్షానికి వడిగా పారుతున్న మహానదుల్లో మధ్యమధ్య తగిలే రాళ్ళకి కొట్టుకుని…
-
సీగల్స్… ఇ. జె. ప్రాట్, కెనేడియన్ కవి
అవి ఎగిరిన ఒక క్షణకాలాన్ని వర్ణించడానికి భాషలో ఉపమానాలు లేవు… వెండి, స్ఫటికం, దంతం… ఇవన్నీ వెలవెలబోతున్నాయి. నీలి ఆకసం మీద చెక్కబడిన ఆ దృశ్యం నిరుపమానమైనది, ఎందుకంటే, వాటి ఎత్తూ, ఆ రెక్కల వైశాల్యమూ, నీలాకాశపువంపులో చుక్కల తీరాలని ధిక్కరిస్తుంది, లేదా, ఉపమానంగా మంచు చిన్నబోతుంది. ఇప్పుడు ఒకదాని వెనక ఒకటి పచ్చని చెట్ల కొమ్మలమీద వాలుతూ లేక వాటి రెక్కల అంచున సూర్యుడి సప్తవర్ణాలు పట్టి ఒక్కసారిగా వెయ్యి రెక్కలు విచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడా…
-
ఎక్కడో ఒకచోట… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
ఏక్కడో ఒకచోట ఒకరుంటారు ఎన్నడూ ఎరుగని ముఖం, ఎన్నడూ వినని గొంతు నే నడిగిన మాటకి ఇంకా, ఓహ్! ఇంకా ప్రతిస్పందించని.. హృదయం. ఎక్కడో ఒకచోట, దగ్గరో, దూరమో నేలలూ సముద్రాలకీ ఆవల, కనరాని చోట; అలా తిరుగాడే చందమామకంటే దూరంగా ప్రతిరాత్రీ దాని నడకని పరిశీలించే నక్షత్రానికి ఆవల… ఎక్కడో ఒకచోట, దూరంగానో, దగ్గరో, మధ్యలో ఒక గోడో, ఒక దడో అడ్డుగా ; పచ్చికపరుచుకున్న నేలమీద చివరి ఆకులు రాల్చే శిశిరంలా. . క్రిస్టినా…
-
రైల్లో… జేమ్స్ థామ్సన్, స్కాట్లండు
ఇప్పుడు ఈ కవిత చదువుతుంటే మనకి గొప్పగా కనిపించకపోవచ్చు. కానీ, ఆవిరియంత్రం కనిపెట్టబడి, పట్టాలమీద రైళ్ళు పరిగెత్తడం, అందులో ఒకేసారి కొన్ని వందలమంది ప్రయాణించగలగడం మొదటిసారి చూస్తున్నప్పుడు ఆ అనుభవం వేరు. అయితే, ఈ కవితలో కొసమెరుపు చివరి రెండు లైన్లే. కవి ఎప్పుడు వైయక్తికమైన అనుభవాన్ని సార్వజనీనం చేస్తూ, తాత్త్వికచింతన చెయ్యగలుగుతాడో అప్పుడు ఆ కవిత కొన్ని వేలరెట్లు ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది. . మనం రైల్లో ముందుకెళుతుంటే ఇళ్ళూ చెట్లూ వెనక్కి పరిగెడుతుంటాయి, కానీ మైదానాలమీది…
-
పొగ మంచు…. కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను
20 వ శతాబ్దం రెండవదశకంలో ఎజ్రా పౌండ్, HD, Amy Lowell మొదలైన వాళ్ళు, కొద్దికాలమే అయినా, బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన “ఇమేజిస్టు” ఉద్యమపు భావపరంపరలో చూడాలి. అవసరానికి మించిన మాటలూ, అలంకారాలతో చెప్పదలుచుకున్న వస్తువుకప్పడిపోయిన ఆనాటి విక్టోరియన్ సంప్రదాయాలకి తిరుగుబాటుగా వచ్చింది ఈ ఉద్యమం. ఏ అలంకారాలూ, వాచాలతా లేకుండా, సరియైన పదాలు వాడుతూ (దగ్గరగా ఉండే పదం కూడా వాళ్ళు నిరసించారు) కవి తను చెప్పదలుచుకున్నది శిల్పం చెక్కినంత శ్రద్ధగా చెప్పాలి. ఈ కోణంలో…