అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 9, 2014

    మృగతృష్ణ… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

    మార్గమధ్యంలో దప్పికతో అతను ఆగేడు కనుచూపుమేర ఆవరించిన వేడి బంజరులమీంచి అకస్మాత్తుగా, చల్లని తళతళ మెరుస్తున్న నీటితో దూరాన అందంగా ఒక పచ్చని బీడు కనిపించింది. ఎన్నాళ్ళనుండో మనసులో పదిలపరచుకున్న కోరిక పాదాలక్రింద ప్రేమపూర్వకంగా పచ్చని తివాచీ పరిచింది; ఊసరక్షేత్రాలు ఒక్కసారిగా రాజనాల చేలుగా మారిపోయేయి. ఆలస్యమైనవాళ్ళదే నష్టం అన్నట్టు త్రోవ ఎంతో హాయిగా ఉంది.  అతని మనసులో ఆ అపురూపమైన స్త్రీ ఒకసారి మెరిసింది; మగాళ్ళందరూ కష్టించి ఎదురుచూసే… ఉద్యానం ప్రతి హృదయమూ కోరుకునే ప్రశాంత…

  • నవంబర్ 7, 2014

    ఇమడలేనితనం… చెస్లా మీవోష్, పోలిష్ కవి

    . నేను స్వర్గంలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేను. అది కేవలం నా జన్యువుల్లో ఉన్న బలహీనత. అంతే! ఈ భూమ్మీద గులాబిముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ పుండయింది. సూర్యుడిని మేఘాలుకమ్ముకున్నప్పుడల్లా, నేను బాధపడ్డాను. ఉదయంనుండి సాయంత్రం దాకా మిగతావాళ్ళలా పనిచేస్తున్నట్టు నటిస్తాను కాని అగోచరమైన దేశాలకి అంకితమై, నా మనసు ఇక్కడ ఉండదు. మనః శాంతికి ఊర్లోని ఉద్యానాలకి పోతాను అక్కడున్న చెట్లూ పూలూ ఉన్నవి ఉన్నట్టు పరిశీలిద్దామని, కానీ, అవి నా చెయ్యి తగలగానే, నందనోద్యానాలైపోతాయి. నా…

  • నవంబర్ 6, 2014

    57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత

    నువ్వు గొప్ప నాయకుడివి కాదలచుకుంటే, తావోని చదివి అనుసరించక తప్పదు. నియంత్రించడానికిచేసే ప్రయత్నాలన్ని ఆపు. స్థిరపడిపోయిన ప్రణాళికలూ, ఆలోచనలూ వదిలెయ్ ప్రపంచం దాన్ని అదే నడిపించుకుంటుంది.  నువ్వు నిషేధాలు పెంచుతున్న కొద్దీ ప్రజల నైతికతకూడా తగ్గుతుంది. నీకు ఆయుధాలు ఎక్కువయినకొద్దీ నీ ప్రజలకు అంత తక్కువ భద్రత ఉంటుంది. నువ్వు రాయితీలు ఇస్తున్నకొద్దీ ప్రజలు అంత స్వయం సమృద్ధిలేనివాళ్ళవుతారు. అందుకనే గురువు ఇలా సెలవిస్తున్నాడు: చట్టాన్ని పక్కకి తప్పించాను, ప్రజలు నిజాయితీపరులయ్యారు. ఆర్థిక సూత్రాల్ని పక్కనబెట్టాను, ప్రజలు…

  • నవంబర్ 5, 2014

    గుడ్ నైట్, గుడ్ నైట్… జొవానా బెయిలీ, స్కాటిష్ కవయిత్రి

    సూర్యుడస్తమించాడు, చీకటిపడింది, ఆకాశంలో చుక్కలు మిణుకుమంటున్నాయి దీపమైనా, దివిటీ అయినా ఎక్కువసేపు ఉల్లాసమైన రోజుని ఇక పొడిగించలేవు; ఝాములు దొంగలా తెలీకుండా జారుకున్నాయి మనం సెలవుపుచ్చుకోక తప్పదు, గుడ్ నైట్, గుడ్ నైట్ పెళ్ళికూతురు పొదరింటిలోకి పంపబడింది, ఆటలూ, ఆకతాయిపాటలూ ముగిసిపోయాయి; ప్రేమికుల మాటలు పలచనై, కొందరు అయిష్టంగా ప్రేయసికి వీడ్కోలు చెబుతున్నారు. నాట్య రంగం ఇప్పుడు మూగబోయింది, అక్కడ ఏ పాదమూ నర్తించడం లేదు, గుడ్ నైట్, గుడ్ నైట్! అలరుబోడి తన ఆచ్ఛాదిత శయ్య…

  • నవంబర్ 4, 2014

    క్రమశిక్షణ లేమి… కింగ్ క్రిమ్సన్, బ్రిటిష్ రాక్ బాండ్

    నాకు మాత్రం ఇది గుర్తుంది. దానితో గంటలు గంటలు దొర్లిపోయేవి దానిమీద వ్యామోహం తగ్గే వేళకి, నేను ఎంతగా అందులో లీనమయ్యేనంటే మరొకటి చెయ్యడానికి పాలుపోలేదు.  కొన్ని రోజులపాటు అలాగే కొనసాగేను దానితో దాగుడుమూతలాడుతూ… అంటే, రోజల్లా అటుచూడడం మానేసి తర్వాత అటుచూడడం అన్నమాట దానిమీద ఇంకా ఇష్టం మిగిలుందో లేదో చూడ్డానికి. చిత్రం! నాకు ఇంకా ఇష్టం మిగిలే ఉంది. . కింగ్ క్రిమ్సన్ రాక్ బాండ్ ఇంగ్లండు    King Crimson, 2003, L–R…

  • నవంబర్ 3, 2014

    నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి

    నేను నిలకడలేని పవనాన్ని నువ్వు నిశ్చలమైన నేలవి; నేను ఇసుకతిన్నెలమీద క్షణికమై నిలిచే పదముద్రని. నేను ఇట్టే కంపించే తలిరాకుని నువ్వు మొక్కవోని మహా వృక్షానివి; నువ్వు స్థిరమైన తారానివహానివి నేను చంచలమైన నీటిపుట్టని. నువ్వు నశ్వరమైన కాంతిపుంజానివి— నేనొక దివిటీలా సమసిపోతాను; ఉప్పొంగిన సంగీత కెరటానివి నువ్వు, నే నేవో పిచ్చికూతలు కూస్తుంటాను. . జో ఏకిన్స్ October 30, 1886 – October 29, 1958 అమెరికను కవయిత్రి . Zoe Akins . I…

  • నవంబర్ 2, 2014

    సౌందర్య పిపాసి కీట్స్ కి… కౌంటీ కలెన్, అమెరికను కవి

    Epitaph on Keats Tombstone reads: THIS GRAVE CONTAINS ALL THAT WAS MORTAL OF A YOUNG ENGLISH POET WHO ON HIS DEATH BED IN THE BITTERNESS OF HIS HEART AT THE MALICIOUS POWER OF HIS ENEMIES DESIRED THESE WORDS TO BE ENGRAVEN ON HIS TOMB STONE “Here lies One Whose Name was writ in Water” .…

  • నవంబర్ 1, 2014

    XXVI … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

    ఇల్లు పూర్తయేదాకా దాని ప్రాపులు అండగా ఉంటాయి, తర్వాత వాటిని తొలగిస్తారు… నిటారుగా, సమర్థవంతమై  ఇల్లు  పునాదులపై తనంతతాను నిలబడుతుంది; బరమానీ, వండ్రంగినీ గుర్తుచేసుకోవడం మరచి. సంపూర్ణమైన జీవితానికి అటువంటి సింహావలోకనం అవసరం. బల్లచెక్కా, మేకుల గతం తాపీగా తయారవడం, ఆధారాలు కూలిపోవడం… అవి ఆత్మగా స్థిరపరుస్తాయి. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి   Emily Dickinson   . XXVI . The props assist…

  • అక్టోబర్ 31, 2014

    చాప్మన్ కళ్ళతో హోమరును చూసినపుడు … కీట్స్, ఇంగ్లీషు కవి

    (కీట్స్ 220 వ జయంతి సందర్భంగా నివాళి) . ఎంతోమంది కనకమణిమయములైన దేశాలు తిరిగి, గొప్ప సామ్రాజ్యాలనీ, మహానగరాలనీ చూసి ఉండొచ్చు; నేనుకూడా కవులు సూర్యుడికి సవినయంగా మొక్కులు చెల్లించే దాపటి ద్వీపాలనెన్నో దర్శించాను. వాటిలో ఒక సువిశాలమైన ద్వీపాన్ని గభీరమైన నుదురుగల హోమరు స్వంతం చేసుకున్నాడు; కానీ, చాప్మన్ స్పష్టంగా, విశదంగా చెప్పేదాకా అందులోని స్వారస్యాన్ని ఆస్వాదించలేకపోయాను. మొదటిసారి తన వీక్షణాపరిథిలోకి ఒక కొత్తగ్రహం వచ్చినపుడు రోదసివీక్షకుడుపొందే అనుభూతి చెందాను. డేరియన్ శిఖరాగ్రం నుండి డేగకన్నులతో…

  • అక్టోబర్ 30, 2014

    మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు… షెల్లీ, ఇంగ్లీషు కవి

    మృదుల కంఠస్వరాలు మరుగైనపుడు సంగీతం, జ్ఞాపకాలలో నినదిస్తుంది. కమ్మని పూవులు వాడిపోయినా, వాటి నెత్తావి, మేల్కొలిపిన ఇంద్రియంలో పదిలం. గులాబి రేకులు, గులాబి రాలిపోయినా, ప్రియుల సమాధులపై పోగుబడతాయి. అలాగే నువ్వు లేకున్నా, నీ గూర్చిన ఆలోచనలూను; ప్రేమ ఎప్పుడూ నివురుగప్పి ఉంటుంది.   . షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft voices die,…

←మునుపటి పుట
1 … 134 135 136 137 138 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు