-
XXXI ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
భవిష్యత్తు ఎన్నడూ మాటాడలేదు; మూగవాళ్ళలా కనీసం ఎన్నడూ చేష్టలతోనో, సంజ్ఞలతోనో నిగూఢమైన భావి విషయాలను తెలియపరచనూలేదు. కానీ, సరియైన సమయం వచ్చినపుడుమాత్రం వాటిని అక్షరాలా ఆచరణలో చూపిస్తుంది…వాటిని తప్పించుకుందికీ, ప్రతిక్షేపించడానికీ చెయ్యగల అన్ని అవకాశాలని ముందే వమ్ముచేస్తూ. సంపదలైనా, సర్వనాశనమైనా రెంటిపట్లా దానికి ఒకే అనాశక్తత; విధి దానికి ఆదేశించిన శాసనాన్ని తు.చ. ఆచరించడమే దాని కర్తవ్యం. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను…
-
అకాల మృత్యువు… హార్ట్ లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
ఆమె వేకువ తుషారంలా హరించిపోయింది సూర్యుడు ఇంకా పైకి ఎగబ్రాకక ముందే; ఆమె జీవించింది ఎంత స్వల్పసమయమంటే, నిట్టూర్పు అంటే అర్థం ఏమిటో ఆమెకి తెలీదు. గులాబి చుట్టూ దాని సువాసన వ్యాపించినట్టు ఆమె చుట్టూ ప్రేమ తేలియాడింది. గుట్టుచప్పుడుకాకుండా, మృత్యువు సమీపిస్తోందన్న స్పృహ, భయంలేకుండా,ఆమె పెరిగింది. ప్రేమే ఆమె సంరక్షకురాలిక్కడ కానీ, ప్రేమే మృత్యువుముందు తలవాల్చింది ప్రేమకి దయ కలిగినప్పుడు భయం దేనికి, కానీ, మృత్యువు అంత దయతో ఉంటుందా? . హార్ట్ లీ కోలరిడ్జ్…
-
డబ్బు… ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
మూడునెలలకొకసారి, కదూ, డబ్బు నన్ను దెబ్బలాడుతుంటుంది “ఎందుకిక్కడ నన్ను ఇలా వృధాగా పడి ఉండమంటావ్? నువ్వు ఇంతవరకు ఎరుగని వస్తువుల్నీ, సుఖాన్నీ ఇవ్వగలను. మించిపోయిందిలేదు ఇప్పుడైనా కొన్ని చెక్కులు సంతకం చెయ్యి.” నేను మిగతావాళ్ళవంక చూస్తాను, వాళ్ళడబ్బుల్తో ఏమిటిచేస్తారా అని. మేడమీద అయితే ఖచ్చితంగా డబ్బు దాచుకోరు. బహుశా ఈపాటికి, కారూ, పెళ్ళామూ, రెండో ఇల్లు ఉండి ఉంటుందేమో జీవితంలో డబ్బు పాత్ర చాలానే ఉందని ఒప్పుకోవాల్సిందే. – నిజానికి, తరిచిచూస్తే, వాళ్ళలో ఒక సామాన్యధర్మం కనిపిస్తుంది:…
-
పేరు… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
నా పేరుతో నీ కేమిటి అనుబంధం? అది సమసిపోతుంది దూర తీరాలలో ఎక్కడో ఏకాంతంగా దొర్లుకుంటూ వెళ్ళి ఒడ్డున పగిలైన అలలా… లేదా, చీకటి కీకారణ్యంలో ఒక కేకలా. నీ వాళ్ళ సమాధులమధ్య ఒక స్పందనలేని గీతగా మిగులుతుంది; అర్థం కాని భాషలో గజిబిజిగా అల్లుకున్న ఒక సమాధి లిపిలా అదేమిటి మరి? ఎప్పుడో గతించిన కాలం, ఎన్నో పిచ్చి కలలమధ్య తప్పిపోయిన ఒక కల, జ్ఞానదేవత కటాక్ష వీక్షణాలు జ్ఞాపకాలుగా నీ ఆత్మపై ప్రసరించవులే. ఒకవేళ…
-
What if … Nishigandha, Telugu, Indian
Silly! These evenings are always like that… They gently walk through the open windows And over the frail fagged countenances. A dewy flower flutters, swings and drops Into the valley like a streak of light. And a long reticent journey begins… What if those nights hadn’t cared to visit Brushing aside the catch…
-
బాల-వధువు … ఊడ్గరూ నూనుక్కల్, ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి
వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు. ఏ ఆనందమూ లేని పండు ముసలి. బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి. అతని గుడిశలో నా బాల్యం సమాధి, కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది నేను కోరుకున్నది ప్రేమ నా ఈడువాడే జోడు కావాలని. చామనచాయతో నవ్వుతూ తుళ్ళే దున్వా నన్ను ఇష్టపడ్డాడు. ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు. అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు! దుఃఖం నన్ను చుట్టుముడుతోంది. కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి. ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో గూడుకట్టుకుని…
-
నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి
వాసనచూద్దామని, నా వైపుకి ఒక లేత గులాబి రెమ్మని వంచేను. నేను అంతగా వంచినా, బాగానే, విరిగిపోకుండా నిలదొక్కుకుంది. కానీ, దాన్ని వెనక్కి వదిలెయ్యగానే ఆ నాజూకు కొమ్మ ఎంత హేలగా, ఎంత తూగుతో యథాస్థితికి వచ్చిందంటే… చెప్పడం కష్టం. నాకు అనిర్వచనీయ ఆనందాన్నిచ్చింది. నాకు తెలుసు… మీకేమైనా సందేహమా? వెనుతిరిగి చూస్తే…దానిగురించే గుసగుసలుపోడం విన్నాను. . థామస్ ఎడ్వర్డ్ బ్రౌన్ మే 5, 1830- 29 అక్టోబరు 1897 ఇంగ్లీషు కవి . . I…
-
విశ్వంలో ఒక పరమాణువు … రిఛర్డ్ ఫీన్మన్, అమెరికను భౌతిక శాస్త్రవేత్త
… నేను ఒంటరిగా సముద్రపొడ్డున నిలబడి ఆలోచిస్తున్నాను దూసుకువస్తున్న కెరటాలు, అసంఖ్యాకమైన అణువులు దేనిమట్టుకు అదే పిచ్చిపట్టినట్లు దానిపని అది చేసుకుంటూ అంత వైరుధ్యంలోనూ కలిసి తెల్లని నురుగు సృష్టిస్తూ… యుగాలు జగాలకి ముందు, ఏ కన్నూ దానిపై పడకమునుపు ఇప్పటిలాగే, ఏళ్లతరబడి అలా ఒడ్డును బాదుతూనే ఉన్నాయి. ఎందుకు? ఎవరికోసం? ప్రాణమన్న ఊసులేని ఈ మృత గోళం మీద ఎవర్ని రంజింపడానికని? పోనీ ప్రశాంతంగా ఉందా? అదీ లేదు. రోదసిలోకి సూర్యుడు…
-
పగవాడు కలగంటున్నాడు… నార్మన్ హెచ్ రసెల్, అమెరికను కవి
ఎప్పుడైతే నా పగవాడు నిద్రపోతున్నాడని చూశానో వాడికి ఎదురుగా నిశ్చలంగా నిలబడ్డాను రాత్రిపూట గుడ్లగూబలా చేపకోసం ఎదురుచూస్తున్న కొంగలా. ఒక్క వేటు వెయ్యడానికి కత్తి ఎత్తేను. అప్పుడు గమనించాను శత్రువు కలగనడం అతని పెదాలమీద చిన్న దరహాసం మెరిసింది అతని కాళ్లు వణికేయి అతను నిద్రలో ఏవో చప్పుళ్ళు చేసేడు అతని మనసులో ఆనందకరమైన కలే మెదిలుంటుంది. నాకు ఒక్కడికే ఇది గుర్తుంటుంది. మిగతావాళ్ళకి అందరికీ నా శత్రువు గుర్రాన్ని చూపిస్తాను ఎవరికీ ఈ విషయం చెప్పను…
-
A Funny Call!… Palaparthy Indrani, Telugu, Indian
My daughter got a new pal yesterday: It’s our new neighbour’s kid. My daughter started playing with her happily displaying all her toys. That kid was just picking up how to speak. After a while they both came to me in the kitchen. “Mommy! I want water,“ asked my daughter. Immediately, her friend repeated, “Mommy!…