అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 29, 2015

    రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి

    ఒకటి తర్వాత ఒకటి పగలూ రాత్రీ ద్వారాలుగా ఉన్న ఈ పాడుబడ్డ సత్రంలో, చూడు, సుల్తానులు ఒకరి వెనక ఒకరు ఇక్కడ బసచేసిన ఆ గంటా, ఘడియా తమ వైభవాల్ని ప్రదర్శించి, ఎవరిత్రోవన వాళ్ళు పోయారో! . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియను కవి .. Rubaiyat – XVI . Think, in this battered Caravanserai Whose doorways are alternate Nights and Day,…

  • జనవరి 28, 2015

    సూక్తి … మార్షల్, ప్రాచీన రోమను కవి

    గతకాలపు కవులని తీసిపారెస్తావు జీవితం బాగులేదని నిందిస్తావు. నీ స్తోత్రాలకి ఒక దణ్ణం; నీ పొగడ్తలు పడి చావవలసినంత గొప్పవేమీ కావు . మార్షల్ క్రీ. శ. 1 వ శతాబ్ది. ప్రాచీన రోమను కవి .  Epigram  . You puff the poets of other days, The living you deplore. Spare me the accolade: your praise Is not worth dying for.   Martial Marcus Valerius Martialis…

  • జనవరి 27, 2015

    II… లావొ జూ సంకలనం (చీనీ) నుండి

    ప్రపంచానికి అందాన్ని అందంగానే తెలుసు అందుకే అక్కడ కురూపితనం కూడా ఉంది. ప్రపంచానికి మంచిని మంచిగానే తెలుసు అందుకే అక్కడ చెడు కూడా ఉంది. అస్తిత్వమూ, శూన్యమూ ఒకదాన్నొకటి సృష్టించుకుంటాయి కష్టమూ, సుళువూ ఒకదాన్నొకటి నిర్వచించుకుంటాయి, పొడవూ, పొట్టీ ఒకదానికొకటి హద్దులేర్పరచుకుంటాయి, ఎత్తూ, పల్లమూ ఒకదానిమీద ఒకటి ఆధారపడతాయి. గళమూ, స్వరమూ ఒకదాన్నొకటి శృతిలో ఉంచుకుంటాయి, పాతదీ, కొత్తదీ ఒకదాన్నొకటి అనుసరిస్తాయి, విజ్ఞులు  కర్మకి అకర్మ ద్వారా కట్టుబడి ఉంటారు, మౌనంద్వారా చెప్పదలచుకున్నది వ్యక్తపరుస్తారు. ఒక రీతిలో…

  • జనవరి 26, 2015

    బందీ… లిలీ ఏ లాంగ్, అమెరికన్ కవయిత్రి

    “నేను” అనబడే ఈ ఒంటరి జైలులో ఈ సృష్టి ప్రారంభానికి ముందునుండీ బందీని. నేను విడుదలయేసరికి,  తెల్లని నక్షత్రధూళితో, ఈ లోకాలన్నీ పరిగెత్తాల్సిందే, మొదట పరిగెత్తి నట్టు. నేను గోడకేసి నాచేతులు బాదుకుంటాను, తీరా చూస్తే కొట్టుకుంటున్నది నాగుండెకే. ఎంత గుడ్డితనం! ఏమీ సంకెల! . లిలీ ఎ లాంగ్ (1862 – 1927) అమెరికను కవయిత్రి . Immured . Within this narrow cell that I call “me”, I was imprisoned…

  • జనవరి 25, 2015

    అందమూ – నిర్మలత్వమూ… సాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రి

    ఒక సుందరమైన పురుషుడు చూపులకి మాత్రమే అందంగా ఉంటాడు నిర్మలమైన పురుషుడు నిర్మలంగానే కాకుండా అందంగా కూడా ఉంటాడు. . సాఫో క్రీ. పూ. 7 వశతాబ్ది  ప్రాచీన గ్రీకు కవయిత్రి                                                     Sappho   The Handsome and the Pure . The handsome man is handsome only in looks. The Pure man pure as well as Handsome. . Translated by : George Theodoridis) Sappho (…

  • జనవరి 24, 2015

    Run Planets, Run!… D. Vijaya Bhaskar, Telugu, Indian

    Run Planets, Run! There you see, Man is coming after you! Don’t be conned by his sacred band of hair there are drills hid in his hand. Be on guard! He is visiting to steal and stash away  your riches. Thinking with thousand brains Man can reach out for you stretching out hands hundred times…

  • జనవరి 23, 2015

    అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి

    (జీవితంలో చివరి క్షణాన్ని చక్కగా చెప్పిన కవిత ) వేదనకి అంతిమంగా ఒక ద్వారం తెరుచుకుని ఉంటుంది. నన్ను చెప్పనీ:  నాకు గుర్తుంది. దాన్ని నువ్వు మరణం అంటావు. నెత్తిమీద ఏవో చప్పుళ్ళు.  తమాలవృక్షాల కొమ్మలల్లాడుతున్న చప్పుడు. ఎండిన నేలమీద ఒక్క సారి తళుక్కుమని మెరిసిన నీరెండ చైతన్యం చీకటి గుంతలో కప్పడిపోయాక బ్రతకడం దుర్భరం. దానితో  అంతా సరి: నువ్వు భయపడినంతా అయింది ఒక ఆత్మగా మిగిలి, మాటాడలేక అకస్మాత్తుగా ముగిసిపోవడం బిగుసుకున్న మట్టి కొద్దిగా…

  • జనవరి 22, 2015

    వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    వసంతమా! ఏమి పని ఉందని మళ్ళీ వచ్చేవు? అందాలు తోడుతెస్తే సరిపోదు. అప్పుడే విచ్చుకుంటున్న లేలేత చిగుళ్ళ ఎర్ర దనాన్ని చూపించి నన్ను శాంతపరచలేవు. నాకు తెలిసిందేదో నాకు తెలుసు. కుంకుమపువ్వు కేసరాల మొనలవంక చూస్తుంటే మెడమీద ఎండ చుర్రుమంటోంది. మట్టి వాసన చాలా బాగుంది. అంటే అక్కడ మృత్యువాసనలేదన్నమాట. అయితే దానర్థం ఏమిటి? ఒక్క నేలలోపలే మగాళ్ళ బుర్రల్ని పురుగులు దొలచడం లేదు. అసలు ప్రాణం దానిమట్టుకు దాని గురించి  ఆలోచిస్తే ఏమీ లేదు…. ఒక…

  • జనవరి 21, 2015

    పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి

    నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు, మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు, అది వసంతమో, హేమంతమో, వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను; జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది, చూపూ, ముందుచూపూ లేని గుడ్డిదాన్ని, చిగురిస్తున్న నా తనులతని పోల్చుకోలేనిదాన్ని … అప్పటికి ఎన్నో వసంతాలు పూత ఎరుగని దాన్ని. దాన్నే గనుక గుర్తుతెచ్చుకోగలిగితేనా! ఎటువంటి రోజది!  నిరుడు కురిసిన హిమసమూహంలా దాని జాడలేకుండా కరిగిపోనిచ్చాను; నా కప్పుడు…

  • జనవరి 20, 2015

    మరువలేనిది… జోస్ టొలెంటినో మెండోంకా, పోర్చుగీసు కవి

    ఏ హెచ్చరికలూ లేకుండానే ఈ విశాలమైన  పచ్చని చేలనీ అత్యంత నిగూఢమైన రహస్యాల్నీ మనం వాగ్దానం చేసిన స్పష్టతనీ… అన్నీ ఇట్టే విడిచిపెడతాము. కానీ, అదేమిటో, చిత్రంగా కేవలం మనల్ని ఒక్కసారి చూసిన వ్యక్తిని మరిచిపోడానికి  సంవత్సరాలు పడుతుంది. . జోస్ టొలెంటినో మెండోంకా 15th Dec 1965 పోర్చుగీసు కవి . . Without warning we lose the vastness of the fields singular enigmas the clarity we swear We’ll…

←మునుపటి పుట
1 … 128 129 130 131 132 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు