-
చిన్న చట్టిలో తాండ్ర పంపుతూ దొరసానికి పంపిన ‘చిన్న ‘ త్రిపదలు… రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషు కవి
చిన్న దేవుడికి చిన్న గుడి చాలు చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు. చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు చిన్న బుర్రకి చిన్న దండ చాలు నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు. చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు చిన్న…
-
మలి ఎదుగు… విబిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి
మనిషికి తెలుసు “బర్చ్” చెట్టు ఎప్పుడూ కొమ్మ నరకబడినచోటే పెరుగుతుందని … అసలు అడవి సంగతే అంత, నేనూ అదే మార్గం అనుసరిస్తాను. ఎందుకంటే, ఇప్పుడు నా శోకం పోగొట్టబడి నాలోని అనుమానాలు పటాపంచలయ్యేయి గనుక నాకూ ఇక మంచిరోజులు ముందున్నాయి నేనూ వెలుగుల్లో స్నానం చేస్తాను. . వినిఫ్రెడ్ వెల్స్ (1893- 1939) అమెరికను కవయిత్రి. . Second Growth . Men know that the birch-tree always Will grow where they…
-
అందమైన వల… రాబర్ట్ గ్రేవ్స్, ఇంగ్లీషు కవి
పిల్లలు ఉదయం ఎంతవేడిగా ఉందో చెప్పలేరు, గ్రీష్మఋతువులోని గులాబి ఎంత రసానుభూతినిస్తుందో, ఆకాశాన ముసురుకునే మునిమాపు చీకట్లు ఎంత భయదమో, బాజాలువాయిస్తూ పక్కనుంచిపోయే పొడవాటి సైనికపటాలం ఎంత భయానకమో వాళ్ళు చెప్పలేరు. కానీ, మనకి మాటలున్నాయి, ఎంత మండు వేసవి రోజునైనా తెలియకుండా గడపడానికి; గులాబుల భావోద్రేకతను అధిగమించగల మాటలున్నాయి, వేలాడుతున్న చీకట్లని మాయం చెయ్యగలం, సైనికులనీ, భయాన్నీకూడ పారద్రోలగలం. మనని కట్టిపడేసే అందమైన పద”జాలము” ఉంది, పట్టలేని ఆనందం నుండీ, భయాన్నుండీ రక్షణ నివ్వగలది; కడకి…
-
డేలియా … శామ్యూల్ డేనియల్, ఇంగ్లీషు కవి
నీ బంగరు కేశాలపై హేమంతం మంచుకురిసినపుడు, గడ్డకట్టిన కాలం దగ్గరలోని పూలన్నీ తునిమినపుడు ఎప్పటికీ తొలగని చీకటిలా నీ రోజులు కనిపించినపుడు, ఇన్నాళ్ళ నీ బలమైన నమ్మకాలూ వఠ్ఠి తప్పులేనని తేలినపుడు; అప్పుడు, నేను రంగు రంగుల కుంచెలతో చిత్రించబోయే ఈ చిత్రాన్ని చూడు, అదేమంత పనికిరానిది కాదు. ప్రకృతీ పరమేశ్వరుడూ నీకిక్కడ ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించు; నిన్ను నువ్వు పరిశీలించుకుని నేను నీకై ఎంతకృషిచేశానో తెలుసుకో; బహుశా, ఇదే నీకు శాశ్వతమైన స్మృతి చిహ్నం కావొచ్చు,…
-
ప్రవాసం లో ప్రేమగీతం… స్టీపెన్ రుడాన్ స్కీ, యుక్రేనియన్ కవి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ వీచు. అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ. అక్కడ ఓ మారుతమా, సడిచేయకు, నెమ్మది! ఆమె ముఖం మీద నిశ్చలంగా…
-
పదో ఏడు వచ్చినపుడు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
(చిన్నపిల్లల కోణం నుండి బాల్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు కలిగే మనోవ్యథ బాగా చెప్పిన కవిత. ) ఆ ఆలోచన వచ్చేసరికే అనిపించింది నాకు ఏదో జరగబోతోందని… గుడ్డిదీపం క్రింద చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పికంటే, ఏ కడుపునొప్పికన్నా కూడా తీవ్రమైనది… ఉత్సాహానికి అమ్మవారు వచ్చినట్టు, మనసుకి రోగం వచ్చినట్టు ఆత్మని కురూపిని చేసే అంటురోగం వచ్చినట్టు… ఏదో జరగబోతోందని. సింహావలోకనం చేసుకుందికి మూడు ఆదివారాలైనా కాలేదనొచ్చు, కానీ ఒక విషయం మీరు మరిచిపోతున్నారు: ఇద్దరిచేత పరిచయం చెయ్యబడడంలోని సంక్లిష్టతనీ ఒక్కరిగా…
-
కుమ్మరివాని మట్టి… మేరీ ట్యూడర్ గార్లాండ్, అమెరికను కవయిత్రి.
మనం ప్రపంచాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి తిరిగి అతకబోతే మనం వాటితో ఏమిటి తయారుచెయ్యగలం? మనం కొండదగ్గరకి వెళ్ళిచూస్తే, అది ఒకప్పటి మాహా పర్వతం అయి ఉంటుంది; మనం సన్నగా పారుతున్న సెలయేటిని చూస్తే అది ఒకప్పటి మహా నది అయి ఉంటుంది; గాలికి చెల్లాచెదరైన ఓక్ చెట్ల పొదల్లో తిరుగాడబోతే అదొకప్పటి కారడవి అయి ఉంటుంది; మనకపుడు తెలుస్తుంది మనం వెనక్కి మళ్ళి వచ్చినతోవనే తిరిగి రాలేమని, కనీసం ‘ఈ క్షణం’ మనల్ని…
-
IV… లావో జూ: తావో తె చింగ్ నుండి
తోవ నిండైనది; వాడుకవల్ల అరిగిపోదు. సంఖ్యాకమైన ఈ జీవరాశుల మాత్రిక గంభీరమైనది. పదునైన దాని పదును మొక్కబోనీ, చిక్కుముడులు విప్పు. కాంతి తీక్ష్ణత తగ్గించు. పాత దారులనే అనుసరించు. నీడలతో నిండి అది అసలున్నట్టే తెలియదు. ఈ దారి ఎవరు వేసారో నాకు తెలియదు. ఇది చూడబోతే అనాదిగా ఉన్నట్టే ఉంది. . లావో జూ: తావో తె చింగ్ నుండి (అతి ప్రాచీన చినీ గ్రంధం) . IV The Way is full: use…
-
ఋణగ్రస్తుడు… సారా టీజ్డేల్, అమెరికను
ఈ బొందిలో ఊపిరి ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ, నల్లగా కాలుడు ఎదురైనపుడు దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు; ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ నాకు కోరిక సడలనప్పుడు; కాలం దాన్ని లొంగదీసుకోకుండా చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు, విధితో నేనెందుకు వాదులాడుతాను? ఎందుకంటే, నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది: నేను జీవితానికి ఋణపడి ఉన్నాను నాకు జీవితం కాదు. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి Debtor… . So…
-
పూ రేకులు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జీవితం ఒక ప్రవాహం మన గుండె గులాబి రేకుల్ని ఒకటొకటిగా దాని మీదకి విసురుతాము. ముగింపు కలలో కరిగిపోతుంది, అవి మన దృష్టికి అందకుండా తేలి పోతాయి, అవి ఆనందంగా చేసే తొలి ప్రయాణం మాత్రమే మనం చూడగలం. ఆశలబరువు మోసుకుంటూ ఆనందంతో ఎరుపెక్కి మన తొలి గులాబి రేకుల్ని మనమే చెల్లాచెదరు చేస్తాము. విశాలమవుతున్న వాటి పరిధి, అవి ఎంతదూరం ప్రయాణించగలవో మనకి ఎన్నడూ తెలియదు. ఆ ప్రవాహం పరుగుతీస్తున్నకొద్దీ వాటిని తనతో ఈడ్చుకుపోతుంది. ప్రతీదీ…