-
అద్భుతమైన లుకేషియా స్నేహనికి గురుతుగా… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి
ఆనందం పరాకాష్ఠకు చేరిన ఈ క్షణం దాకా నా జీవితం జీవితం కాదు. అపవాదుల భయం లేకుండా నేనిపుడు అనొచ్చు, నేను నీదాన్ని కాదు, నేను నువ్వే. ఈ కాయము శ్వాసించింది, నడిచింది, నిద్రించింది దానితో ప్రపంచం అంతా నమ్మింది ఇందులో ఆత్మ ఉండి ఈ పనులన్నీ చేయిస్తోందని. కాని వాళ్ళంతా పొరబడ్డారు. ఎందుకంటే, కీ ఇచ్చిన వాచీ నడిచిన తంతే నా చేష్టలూను; నిన్ను కలిసినదాకా ఈ ఒరిండాకి ఆత్మ అంటూ ఒకటి లేనే లేదు.…
-
వీడ్కోలు… ఛార్ల్స్ కింగ్స్ లీ, ఇంగ్లీషు కవి
నా చక్కని తల్లీ, నీకు వదిలిపెట్టడానికి విలువైనదేదీ లేదు; పేలవమైన నా కథని ఆలపించడానికి ఎవరూ ప్రయత్నించరు; కానీ నేను మరణించేలోగా నీకు అనవరతమూ మార్గదర్శి కాగల ఒక జీవిత సత్యాన్ని బోధించగలను. బంగారు తల్లీ! అందరితో మంచిగా ఉండు; ఎవరి తెలివి వాళ్ళని ప్రదర్శించనీ; పొద్దల్లా కలలుకంటూ కూచోకుండా, గొప్ప పనులు చేసి చూపించు; అలా చేసి, అనంతమైన నీ జీవితాన్నీ, చివరకి మరణాన్ని కూడా ఒక మధురమైన గీతంగా మలుచుకో. . ఛార్ల్స్ కింగ్స్…
-
దేవుని వరాలు… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
దేముడు మొదట మనిషిని సృష్టించినపుడు ప్రక్కన ఒక గ్లాసునిండా వరాలు ఉంచుకున్నాడు, తనలో తాను “మనం మనదగ్గర ఉన్నదంతా ఇచ్చెద్దాం. చెల్లా చెదరుగా ఉన్న సృష్టిలోని సంపదలన్నీ ఒక్కచోటకి పోగుపడనిద్దాం” అనుకున్నాడు. అనడమే తడవు, ముందు బలం దారి తీసింది; అందం దాన్ని అనుసరించింది, తర్వాత వివేకం, కీర్తి, ఆనందం: ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, దేముడు ఒక క్షణం ఆగేడు, అన్ని సంపదలలోకీ అట్ట అడుగున “విశ్రాంతి” పడిఉండడం గమనించేడు. ఇలా అనుకున్నాడు: నా జీవికి ఈ…
-
మొర … ఎబ్ నెజర్ ఏలియట్, ఇంగ్లీషు కవి
చలిగా, లోతుగా, నల్లగా కెరటాలు సాగుతుంటాయి ఎక్కడా గాలి ఊసు లేని సముద్రం మీద ఎవరికీ ఎరుకలేని ఏ చారెడు నేలకోసమో! . ఆ చీకటి అలలతరగలమీద తేలుతూ వినీ వినిపించక, శతృ, మిత్రుల శోకాలు, ఎవరికీ తెలియని ఏ నేలనో వెతుక్కుంటూ పోతాయి. దూరాన రక్షించమంటూ విధివంచితుడెవరో అరుస్తున్నాడు; ఈ లోకంలోని బాధలనుండి విముక్తుడై మిగతావాళ్ళలాగే ఎవరికీ తెలియని తీరానికి పోతున్నాడు. ఆ వెళుతున్నవాని వెంట కొన్ని వేల మంది పోయినా గాలి ఆడని ఆ…
-
జత గ్లోవ్జ్ పందెంలో ఓడిపోయినపుడు… జేమ్స్ రస్సెల్ లోవెల్, అమెరికను కవి
మేం పందెం వేసుకున్నాం, ఆమె ఎండవస్తుందనీ, నేను వర్షం పడుతుందనీ. అందులో, కించిత్తు కుతంత్రం ఉందని ఒప్పుకోవాలి, నిజం చెప్పాలంటే ఎందుకంటే, ఆమెకు ముందుగా గెలుస్తానన్న ధీమాలేకపోతే మేమిద్దరం కలిసిపంచుకున్న ఈ వెచ్చదనం ఆమె సృష్టించి ఉండేదా? . జేమ్స్ రస్సెల్ లోవెల్ 22 ఫిబ్రవరి 1819 – 12 ఆగష్టు 1891 అమెరికను కవి, విమర్శకుడు, సంపాదకుడు, దౌత్యవేత్త . . James Russell Lowell Epigrams: With a Pair of Gloves Lost…
-
కామన… పూష్కిన్, రష్యను కవి
రోజులు సాగుతూ ఉంటాయి; ప్రతిక్షణమూ విఫలప్రేమ వల్ల గాయపడ్డ నా మనసులోని బాధనీ దుఃఖాన్ని ఇనుమడింపజేస్తూ చీకటి మిగిల్చి నిద్ర పోనీని కలలకీ, వెంటాడే కోరికలకీ దారితీస్తుంది; అయినా, నేను ఫిర్యాదు చెయ్యను; బదులుగా, శోకిస్తాను; కన్నీళ్ళు నాకు మనశ్శాంతి నిస్తాయి, ఇచ్చి శలవుతీసుకుంటాయి. గాఢమైన దుఃఖానికి బందీ అయిన నా మనసుకి, నా మాటనమ్మండి, చెప్పలేని ఆనందం కలుగుతుంది. జీవితమా! సాగిపో! రిక్తాత్మా! రా, ముందుకి ఎగిరిపో, నిశ్శబ్ద తమోశూన్యంలోకి అంతర్థానమైపో! నా ప్రేమ గురించి…
-
స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు
నిజమైన నమ్మకం ఎన్నడూ లేని వాళ్ళు వాళ్ల మనసుల్లో దేముడు లేడంటారు. వాళ్ళ నడవడి అంతా రోతగా ఉంటుంది అందులో ఒక్కడికీ దైవత్వం అంటే తెలీదు. స్వర్గంనుండి దేముడు వాళ్లని గమనించేడు వాళ్ల నడవడి ఎలా ఉంటుందో చూద్దామని. ఎందులోనూ నిశ్చయం లేక, పక్కతోవలు పట్టి ఏ ఒక్కడూ కూడా ఋజుమార్గంలో పోయినవాడు లేడు. వాళ్ల మనసుల్లో, మాటల్లో అంతా కపటమే. పెదవి విప్పితే విషపూరితమైన లాలూచీ మాటలు వాళ్ళ మనసులు చెడిపోయాయి; నోర్లు తాటిపట్టెలు, వాళ్ళు…
-
నీ ఉనికికి దోహదం చేసే వాళ్ళతో తిరుగు … రూమీ, పెర్షియను కవి
నీ అస్తిత్వానికి దోహదం చేసే వాళ్లతో తిరుగు అంటీ ముట్టనట్టు ఉండేవాళ్లతో వొద్దు; వాళ్ల ఊర్పులు నోటంట నీరసంగా వస్తాయి; ఈ దృశ్య ప్రపంచంతో కాదు, నీ బాధ్యత చాలా గంభీరమైనది. గాలిలోకి ఎగరేసిన మట్టి ముక్కలై రాలిపోతుంది. నువ్వు ఎగరడానికి ప్రయత్నించకపోతే, ఎగిరి నిన్ను అలా ఖండ్ఖండాలుగా చేసుకోకపోతే, మృత్యువే నిన్ను ముక్కలుముక్కలు చేస్తుంది, అప్పుడు నువ్వు ఏదవుదామనుకున్నా సమయం మించిపోతుంది. ఆకులు పండిపోతాయి. చెట్టు కొత్త వేరులు తొడుగుతుంది ఆకుల్ని పచ్చగా మార్చుకుంటుంది. నీకింకా…
-
తొలిసంజ… షెల్లీ, ఇంగ్లీషు కవి
తొలిసంజ మేల్కొలపగలిగిన అన్నిటినీ మేల్కొలిపింది స్వేచ్ఛగా తిరిగే పిచుకల్నీ, పిట్టల్నీ, కోయిలలనీ, గొల్ల వనిత పాటల్నీ, తోటమాలి దోకుడుకత్తి చప్పుడునీ, ప్రభాత ప్రార్థన ఘంటనీ, గండు తుమ్మెదలనీ: మంచోడుతున్న మొక్కజోన్నకంకులపై మిణుగురులు సేదదీరుతున్నై, విద్యార్థి సరిచెయ్యడం మరచిన లాంతరు వత్తుల్లా, నదీ తీరాన్న అవి కొడిగడుతున్నాయి. కందిరీగ తన ఝంకారం మరిచిపోయింది కొండమీదా, మైదానం మీదా కీచురాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాయి, రైతు తుపాకికి చప్పుడుకి దౌడుతీస్తున్న ఏనుగుల మందలా రాత్రి భయాలూ, పీడకలలూ, ప్రతి ఒక్కటీ తొలికిరణానికి…
-
నీ కోసం నేను వదులుకున్నవి… రఫేల్ ఆల్బెర్టి, స్పానిష్ కవి
నీ కోసం నా తోటా, నా ఉద్యానమూ, నిద్రపోక ఎదురు చూసే పెంపుడు కుక్కలూ, నా జీవితాన్ని ముందే హేమంతంలోకి నెట్టిన నా వసంతంలాంటి వయసూ… ఒక భయాన్నీ, ఒక అదురుపాటునీ, ఆరని మంటలాంటి ప్రతిభనీ, నిస్సహాయంగా వీడ్కోలుపలికే రక్తపుజీరల కన్నులలో నా ప్రతిబింబాన్నీ వదిలిపెట్టేను. నది ఒడ్డున విషణ్ణలైన పావురాయిల్నీ, మైదానంలో గుర్రాలనీ, నిన్ను చూడడానికి కమ్మని సముద్రపు సుగంధాన్ని వదిలిపెట్టేను. నీ కోసం నాదనుకున్న ప్రతీదీ విడిచిపెట్టేను. ఓ రోము మహానగరమా! నా బాధలకీ,…