-
కీర్తికాంత … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
కాలు నిలవని పిల్లలాంటి కీర్తికాంత, ఆమెకు పాదాక్రాంతులై సేవచేసేవారిని చూస్తే, ఇంకా సిగ్గునభినయిస్తూనే ఉంటుంది. కానీ మనసులో నిశ్చింతగా ఉండే వెర్రివాడు ఎవడైనా ఉంటే దాసోహమంటూ అతని వెంటే ఎక్కువగా తిరుగుతుంటుంది; ఆమె ఒక సంచారిణి; ఆమె పక్కనలేకపోయినా తృప్తిగా ఉండడం అలవాటులేనివారిని ఆమె పలకరించదు; ఆమె ఒక మోసకత్తె…ఆమె చెవిలో ఎవరూ గుసగుసలాడరు, ఆమె గూర్చిమాటాడేవారు అభాండాలు వేస్తున్నారని అనుకుంటుంది; ఆమె అచ్చంగా సంచారిణే… నైలు నదీ తీరాన పుట్టింది అసూయాపరురాలైన పోటిఫార్* భార్యకి సాక్షాత్తూ…
-
కృషి… విలియం హేమండ్, ఇంగ్లీషు కవి
ప్రేమని మొదటగా పాదుకొల్పడానికి ప్రేమలేఖలతో మొదలెట్టిన నేను, వెర్రినై, తెలుసుకోలేకపోయాను, ముఖంచిట్లింపూ కసురు చూపులూ ఆమోదసూచికలేనని… నిర్లక్ష్యమనే చూపులకు బలై ముక్కలుగా విరిగిపోయిన మనసు చీదరింపులనే చట్రాలలో నలిగి నలిగి విత్తు మొలకెత్తిస్తుందని తెలియనైతి. సంకోచం ప్రేమని నిప్పులలోకి తోస్తుంది; మంచుకురిసే నేలలు తమకితాము వేడెక్కలేవు: అశ్రద్ధ దానిమీద ఆలోచిస్తూ కూచుంటుంది హేమంతంలో విత్తుమీద మంచు పేరుకున్నట్టు. మేమిద్దరమూ ఒకరినొకరు కలుసుకోకుండా పంత పండదు ప్రేమపంట ఒక్కటే సమృద్ధిగా పండి చివరకి ఒక్కటిగా మిగిలిపోతుంది మిగిలినవేవీ జీర్ణమయితేనేగాని…
-
సానెట్ 33… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరము నేను చెప్పలేనన్ని అద్భుత సూర్యోదయాల్ని చూశాను మహోన్నత గిరిశృంగాలని రాజమకుటాలుగా రూపిస్తూ, చిలకపచ్చని మైదానాలని పసిడి కాంతులతో ముద్దాడుతూ, కళతప్పిన సెలయేళ్ళకు మహత్తరమైన దివ్య రుచులద్దుతూ; అంతలోనే నిరాధారమైన నీలిమేఘాలు కూడబలుక్కుని రోదసి రారాజు దివ్యవదనానికి అడ్డుగా తెరకట్టి ప్రపంచానికి అతని వదనాన్నీ, వెలుగులని దూరం చేస్తే పడమటకి అవమానభారంతో తను ఒంటరిగా క్రుంగడమూ తెలుసు; అయినప్పటికీ నా సూర్యుడు ఒక రోజు ఉదయాన్నే తన పూర్వ దీధుతులతో నా…
-
ఓ నా కవితా!… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
పద, ఆమె దగ్గరకు వెళ్ళు, బెదిరిపోకు ఆమె అందాన్ని చూసి పురుషులు సంకోచించినట్టు; నీ వైపు తీక్షణంగా చూడదులే, నిన్ను చూసి ముఖం అటు తిప్పుకోదు కూడా. ఆమె మనోఫలకం మీద నువ్వు నిలిచేలా నీకు కొన్ని సొగసులు అద్దుతానులే, ఒకటి రెండు లోపాలు కూడా కలగలిసిపోవచ్చు వాటిని ఆమె నవ్వుకుంటూ క్షమించెస్తుంది. . వాల్టర్ సావేజ్ లాండర్ జనవరి 30, 1775 – 17 సెప్టెంబరు 1864 ఇంగ్లీషు కవి . To His Verse…
-
సాయంస్తుతి… ఫిల్లిస్ వ్హీట్లీ, ఆఫ్రికను అమెరికను కవయిత్రి
సూర్యుని చివరి వెలుగులు తూరుపుని విడిచిపెట్టగానే రోదసి ఒక్క సారి ఘంటరావాలతో నిండిపోయింది అద్భుతమైన దృశ్యం! అప్పుడే వికసిస్తున్న వసంతపు సుగంధాలని చిరుగాలి నలుదిక్కులా మోసుకొస్తోంది. సెలయేళ్ళు గలగలమంటున్నాయి; పక్షులు నవరాగాలాలపిస్తున్నాయి; గాలిలో వాటి సమ్మిళిత సంగీతం తెరలు తెరలుగా తేలియాడుతోంది. ఆహ్! ఆకాశంనిండా ఎన్ని అందమైన రంగులు అలముకున్నాయి. పడమరమాత్రం ముదురు ఎరుపురంగును అద్దుకుంది నల్లని చీకటి తెరలను దించడంతో పాటు వెలుగులనూ విరజిమ్మే సృష్టికర్త సంకీర్తనలతో నిండి అవనిమీద ప్రాణంతో స్పందించే…
-
నే పోయిన తర్వాత … హెన్రీ ఆస్టిన్ డాబ్సన్, ఇంగ్లీషు కవి
నే పోయిన తర్వాత నా సమాధి కంటే ఎత్తుగా గడ్డిమొలిచినపుడు … ఇష్టంగానో అయిష్టంగానో ప్రపంచం నన్ను చిరుకవిగా గుర్తించడానికి బేరీజు వేస్తుంటుంది అప్పుడు నేను ప్రశ్నించనూ లేను, జవాబూ చెప్పనూలేను. నేను ఉదయాకాశాన్ని చూడనూ లేను నడిరేయి గాలి నిట్టూర్పులు వినలేను నే పోయిన తర్వాత అందరు మనుషుల్లాగే నేనుకూడా మూగగా ఉండిపోతాను. అయినప్పటికీ, ఇపుడు నేను బ్రతికుండగా, ఎవరైనా ఇలా చెప్పగలిగితే సంతోషిస్తాను: “అతను తన కలాన్ని కళకి అంకితం చేశాడు సిగ్గుచేటు పనులకీ,…
-
కడసారి ప్రార్థన… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను
ఎలాగైతేనేం, చివరకి, తేలికగా కోటలా భద్రమైన ఈ ఇంటి గోడల మధ్యనుండీ చక్కగా దువ్విన కురుల కౌగిలిబంధాలనుండీ మూసిన తలుపుల చెరసాలనుండీ నన్ను ఎగిరిపోనీ. ఓ మనసా! తలుపులు తెరూ! చప్పుడు చెయ్యకుండా ఇక్కడినుండి పోనీ; మెత్తనైన తాళంచెవితో గుసగుసలాడుతూ తాళం తెరూ… తొందరపడకు! ఓరిమి వహించు, (ఓ నశ్వరమైన శరీరమా, నీమీది మోహం వదలదు సుమీ! ఓ ప్రేమపాశమా, నీ బంధం ఒకంత వదలదు సుమీ!) . వాల్ట్ వ్హిట్మన్ మే 31 1819 –…
-
మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి
మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు అది నేనే కావాలని కోరుకుంటున్నాను, ఎప్పటిలా ఇంటిలో హాయిగా ఉండు అలా అయితేనే నే కోరుకున్నది జరుగుతుంది. నా మనసుకూడా నీది చేసుకుని నీ మోకాళ్ళమీద బిడ్డకి పాటపాడు, లేదా, ఒంటరిగా నీలో నువ్వు నీ కోసం రాసిన పాటలు చదువుకో. . రాబర్ట్ బ్రిడ్జెస్ 23 October 1844 – 21 April 1930 ఇంగ్లీషు కవి . Robert Bridges . When Death to…
-
కాలానిది చక్రగతి… రాబర్ట్ సౌత్ వెల్… ఇంగ్లీషు కవి
ఒకసారి నరికినచెట్టు, కొన్నాళ్ళకి మళ్ళీ చిగురించవచ్చు పూర్తిగా బోడులైన మొక్కలు మళ్ళీ పూలూ కాయలూ కాయవచ్చు అలవిమాలిన కష్టాలుపడే అభాగ్యుడికిసైతం ఉపశమనం లభిసుంది ఎండిపోయిన నేల సైతం వర్షపు చినుకును పీల్చుకోగలుగుతుంది కాలం చక్రంలా దొర్లుతుంది, భాగ్యాభాగ్యాలు దారి మళ్ళుతుంటాయి: కష్టం నుండి సుఖానికీ, సుఖం నుండి కష్టానికీ అదృష్టాంబోనిధి నిరంతరం పోటులోనే ఉండదు అది తన అలలను విలైనంత వెనక్కి తీసుకుంటుంటుంది; అవి ముందుకీ వెనక్కి ఒక క్రమంలో వచ్చిపోతుంటాయి ఆ మగ్గము ముతకబట్టనీ, నూరోనంబరూనీ…
-
మన జీవితం ఏమిటి? … సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
మన జీవితం ఏమిటి? కేవలం మన ఆవేశాల ప్రదర్శన మరి సంతోషం సంగతి? ఆగి ఆగి వినిపించే సంగీతం మన మాతృగర్భాలు “గ్రీన్ రూం”ల వంటివి ఈ లఘు జీవిత హాస్యనాటికకి వేషధారణ చేసుకుందికి. ఈ ప్రపంచం ఒక రంగస్థలం; విధి ప్రేక్షకుడు కూచుని చూస్తూ ఎవడు తప్పు చేస్తున్నాడా అని గమనిస్తుంది; మలమల మాడ్చే ఎండనుండి నీడనిచ్చే సమాధులు నాటకం అయిపోయిన తర్వాత వాలిపోయే తెరల్లాటివి; అలా ఈ గుర్రపు పందేల ఆట ఆడుతూ తాత్కాలికంగా…