అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • అక్టోబర్ 20, 2015

    మూగ ప్రేమికుడు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

    ఆవేశాలని వరదలతోనూ, సెలయేళ్లతోనూ పోలుస్తారు: లోతులేనివి గలగలమంటాయని, లోతైనవి సడిచేయవని; కనుక, అభిమానం మాటల్లోకి దిగితే, అనిపిస్తుంది అంతరాంతరాల అడుగున ఉన్నదంతా డొల్లేనని. కానీ ఎవరు సులభంగా మాటాడగలరో, వాళ్ళు మాటల్లోనే గ్రహిస్తారు ఒక ప్రేమికుడికి ఉండవలసినదేదో తమదగ్గర లోపించిందని. . వాల్టర్ రాలీ ఇంగ్లీషు కవి 1552-1618 . Sir Walter Raleigh . The Silent Lover . Passions are liken’d best to floods and streams: The shallow murmur,…

  • అక్టోబర్ 19, 2015

    సంతోషక్షణం… జలాలుద్దీన్ రూమీ, పెర్షియన్ కవి

    నువ్వూ- నేనూ వరండాలో కూర్చున్నది ఒక సంతోష క్షణం చూడడానికి ఇద్దరం గాని నువ్వూ నేనూ ఒకే ఆత్మ మనిద్దరమూ పూదోట సౌందర్యంతో పక్షుల కిలకిలారావాలతో ఇక్కడ జీవనస్రవంతిని అనుభవిస్తున్నాం. చుక్కలు మనల్ని గమనిస్తుంటాయి మనం వాటికి సన్నని సినీవాలి అంటే ఏమిటో చూపిస్తాము. మన అహాలు వదులుకుని ఇద్దరం కలిసి ఉంటాము మనిద్దరం భవిష్యత్తుగురించి నిష్ఫలమైన ఊహాగానాలు చెయ్యం మనిద్దరం నవ్వుతూ ఉంటే ఆకసంలో పక్షులు పళ్ళు రుచిచూస్తుంటాయి ఒక ఆకృతిలో ఈ భూమి మీద…

  • అక్టోబర్ 17, 2015

    పదచిత్రం… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి

    దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న కెరటాల అంచున ఓడల నీడలు తేలియాడుతున్నాయి. ఆకసం వాలిన చోట పొడవాటి  గోధుమరంగు గీత ఒకటి జానెడు ఉప్పు కయ్యల్లో చేతులకొద్దీ ఇసుక మేటలు వేస్తోంది. స్పష్టంగా కనిపించే ఆ అంతులేని ముడతలు, భంగపడి,లోపలికి ముడుచుకుని, నిష్క్రమిస్తున్నాయి. చిరుకెరటాలు ముక్కలై, సముద్రపు ఒడ్డును పగులుతున్న తెల్లని నురగలతో కడుగుతున్నాయి. కెరటాల అంచున లేత నీలపు వెలుగులో ఓడల నీడలు తేలియాడుతున్నాయి. . కార్ల్…

  • అక్టోబర్ 15, 2015

    నిర్ణయం … అలెగ్జాండర్ బ్రోం, ఇంగ్లీషు కవి

    అందంగా ఉన్న ముఖం గురించీ ఎర్రని పెదాలూ, బుగ్గలగురించీ ఆమె కురుల గురించీ గాని, తీరుగా దిద్దిన ముంగురుల గురించిగాని దేవదూతలా ఆలపించే అరుదైన గంధర్వ గాత్రం గురించి గాని చెప్పొద్దు; నాకు ఎంపిక చేసుకునే అవకాశం ఉండి ఉంటే నేను ఇవన్నీ ఎంచుకుని ఉండేవాడిని. కానీ, నువ్వు నేను ప్రేమించి తీరాలంటే అందులోను అది ఆమె అయి ఉండాలంటే నన్ను ఒప్పించడానికి ఒక్కటే షరతు ఆమె నన్ను ప్రేమించాలి. మీ ఆడవాళ్ళ సౌందర్యాలు సౌందర్య సాధనాలకి…

  • అక్టోబర్ 14, 2015

    The Silent Horizon… Ravi Verelly, Telugu, Indian

    Even the tree that blossoms wild and loquacious Turns taciturn sometimes. Dabbing leaves with the hues of heart It drops them as epistles to the earth. Even that clamorous and eloquent chatterer with directions… The sky… suffers silently within. The few words that shuttle in the gullet, Like thunder and lighting, It writes with the…

  • అక్టోబర్ 13, 2015

    Ruba… KN Malleswari, Telugu, Indian

    While coming home from office I stopped at the turn of the street and looked apprehensively at the sky as a swarm of menacing black clouds from north-east started sieging it… Damn the rain! It won’t just pour down for some time and clear. It would settle into a mizzle. Nobody knows how long would…

  • అక్టోబర్ 12, 2015

    జన్మ హక్కు… జేనెట్ లూయీ, వెల్ష్ కవయిత్రి

    నగరాలకి దూరంగా మారే మనుషులకి దూరంగా పల్లెల్లో పుట్టిన మనలో కొందరికి ఒక జన్మ హక్కు ఉంది అదెవ్వరూ అమ్మగలిగేది కాదు అదొక రహస్య ఆనందం, అది ఎవరూ మాటల్లో చెప్పగలిగేదీ కాదు.  ఎందుకంటే మనమందరం మహోన్నతమైన విషయాలకి బంధువులం:   అడవి బాతుల విహారాలకీ తెల్లని గుడ్లగూబల రెక్కలకీ ; గండుమీనులకీ, సాలమన్ లకీ గిత్తలకీ, గుర్రాలకీ క్రౌంచపక్షుల అరుపులకీ సువాసనలు వెదజల్లే మూలికలకీ.  చెట్ల ఔన్నత్యమూ సెలయేళ్ళ త్వరితగతీ మంచు చేసే ఇంద్రజాలం మన కలల్ని…

  • అక్టోబర్ 11, 2015

    అడవిలో కాలిబాట…. రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి

    డెబ్భయి ఏళ్ళయి ఉంటుంది వానా, వాతావరణమూ మరొకసారి జతగలిసి అడవిలోని ఆ కాలిబాటని కనపడకుండా చేశాయి. వాళ్ళు చెట్లు నాటకముందు… ఒకప్పుడు అడవిలో ఆ త్రోవ ఉండేదని ఇప్పుడు ఎవరూ ఊహించలేరు. అదిగో ఆ ఆరుబయట బంజరులో పొదల క్రింద ఉమ్మెత్త చెట్లు బలిసినచోట ఆ త్రోవ ఉండేది. జాగ్రత్తగా గమనించే వాళ్ళకే కనిపిస్తుందది.  పావురం ఎక్కడ పొదుగుతుందో   నీటికుక్క ఎక్కడ పొర్లుతుందో అక్కడ అడవిలో ఒక కాలిబాట ఉండేదని. అయినప్పటికీ, ఒక వేసవి సాయంత్రం…

  • అక్టోబర్ 6, 2015

    ఇదీ స్త్రీ ప్రపంచం… ఈవన్ బోలండ్, ఐరిష్ కవయిత్రి

    మన జీవన విధానం ఏమీ మారలేదు మొదటి సారి చక్రం కత్తికి పదునుపెట్టిననాటినుండి బహుశా దీపం వత్తి ఎక్కువ ప్రజ్వలిస్తుందేమో చక్రాలు నిలకడగా ఉంటాయేమో మనం మాత్రం అలాగే ఉన్నాము. మన జీవితాలని కొలుచుకుంటాం సంఘటనల కొండగుర్తులద్వారా మరిచిపోయినవీ కళ్ళెదుట కనిపించేవీ మిగిలిపోయిన రొట్టెముక్కా, జమాఖర్చుల పద్దులూ, వాషింగ్ పౌడరికి ఎంత ఇచ్చేము వాడు ఎంత కట్టేదూ ఇంకా ఆరెయ్యాల్సిన తడిగుడ్డలెన్ని… చారిత్రక వ్యక్తుల్లా మన అసంపూర్ణ కార్యాలనుబట్టి మనల్ని అంచనా వేస్తుంటారు మనం ఎన్నడూ కాలేము:…

  • అక్టోబర్ 5, 2015

    పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి

    మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు వాళ్లు నాగలివెంట నడిచి, ఒళ్ళు వంచిపనిచేసేవారు వాళ్లు విత్తనాలు నాటుతూ పొలమంతా తిరిగే వాళ్ళు వాళ్ళు నేలపని చేసి, పంటపండించేవారు. వాళ్ళు దృఢంగా,ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూఉండేవారు మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైన వాళ్ళు మా అవ్వలకీ మామ్మలకీ ఎన్నో జ్ఞాపకం ఉండేవి కుంకుడుకాయ, ఉల్లిపాయ, తడిమట్టి వాసన వేసేవాళ్ళు వాళ్ళ చురుకైన చేతులమీద నరాలు ఉబ్బి వంపులుతిరిగేవి వాళ్లు ఎప్పుడూ ఏదో మంచిమాట చెబుతూనే ఉండేవారు మా అవ్వలూ అమ్మమ్మలూ…

←మునుపటి పుట
1 … 104 105 106 107 108 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు