అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 7, 2015

    సానెట్- 100 షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

    ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం ఎక్కడున్నావు కవితా, చాలరోజులయింది మమ్మల్ని మరిచావా? నీకు ఈ శక్తి అంతా ఎక్కడనుండి వస్తుందో వివరించవా? నీ ఆవేశాన్ని అర్హతలేనివాటికి వినియోగిస్తున్నావా? హీనమైన వస్తువు ప్రచారానికి నీ శక్తిని ధారపోస్తున్నావా? ఓ మతిభ్రమించిన కవితా! నీ కీర్తి పునరుద్ధరించుకో కాలాన్ని నిష్ప్రయోజనంగా దుర్వినియోగంచేసిన అపవాదునుండి; ఏదీ, నీ గౌరవం ఇనుమడింపజేసే గీతాల్ని ఇంపుగా ఆలపించు నీ కలానికి పదునునీ, వివేకాన్ని తిరిగి ప్రసాదించు. లే! తీసుకున్న విశ్రాంతి చాలు! నా…

  • డిసెంబర్ 6, 2015

    ప్రేమికులు… హొరేస్ హోలీ, అమెరికను

    కవిత శీర్షికనుబట్టి పైపైకి చూస్తే అది స్త్రీ పురుషుల మధ్య ప్రేమని సూచిస్తున్నట్టు ఉన్నా, అది మనిషికి భగవంతునితో ఉండే అనుబంధాన్ని సూచించే ఆధ్యాత్మిక భావనలున్న కవిత. “ఈ సృష్టికి మూలకారకుడైన భగవంతుడు ఒక్కడే అనీ, అన్ని మతాలూ ఆ మూలపురుషుడినుండే వచ్చేయనీ, జాతులూ, సంస్కృతులలో ఎంత వైవిధ్యము ఉన్నప్పటికీ మానవాళి అంతా ఒక్కటే అనీ చెప్పే “బహాయి మతానికి” గత శతాబ్దంలో విస్తృతంగా సేవచేసిన వ్యక్తి. మనం భగవంతుణ్ణి వర్ణించడానికి చెప్పే మాటలన్నీ అతన్ని వర్ణించలేక…

  • డిసెంబర్ 5, 2015

    మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తర్వాత… హెలెన్ హోయట్, అమెరికను కవయిత్రి

    మృత్యుముఖంలోంచి బయటికొచ్చినదగ్గరనుండి, దాని భీకరత్వాన్ని, భయాన్నీ చూసి ఉండడం చేత జీవితం ఇప్పుడు నాకు ప్రాణప్రదం అయింది అది లేకపోవడం అంటే ఏమిటో గ్రహించడం చేత! ఇప్పుడు బాధలు బాధించవు,చింతల చింత లేదు, అన్నీ పోగొట్టుకోవడమంటే ఏమిటో తెలిసేక. నేను మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన దగ్గరనుండీ మృత్యువు నిత్యమూ నన్నంటి తిరుగుతున్న కొద్దీ ఓహ్, ఏమి చెప్పను! ప్రపంచం చాలా విశాలమయింది మృత్యువును దగ్గరగా చూసిననాటినుండి! నా సమయం ఇప్పుడు చాలా అపురూపమైనది ఎందుకంటే కాలం నిలిచిపోవడమంటే ఏమిటో…

  • డిసెంబర్ 4, 2015

    అకస్మాత్ చీకటి… షార్మెల్ ఐరిస్, ఇటాలియన్- అమెరికను కవి

    అలసిపోయిన ‘రోజు ‘ పడమటి కొండవాలులో జోగుతోంది పాపం! ఆ శ్రామికుడు నిద్రావస్థకి అంచుల్లో తేలిపోతున్నాడు. సూర్యుడనే రైతు, అస్తమయమనే గానుగవద్ద, ఎర్రగా తనరంగులో సారాయిని పిండుకుంటున్నాడు. ఆహ్! సంధ్యా తరంగిణులమీద జాల్వారుతున్న పసిడిచాయ గంజాయి మొక్క తన కెంజాయవన్నె కలల భాండాగారం తెరుస్తోంది చంద్రుడనే కొడవలితో ‘రాత్రి’  గోధుమపంట కోసి తన పాదాలచెంత నక్షత్రాల పనలు మోపుచేస్తోంది. ఎగిరి ఎగిరి అలసిన పక్షులారా! ఓ మనసా! సేదదీరండి. ఈ పచ్చని మైదానమనే వాగులో ఎక్కడా చలనం…

  • డిసెంబర్ 3, 2015

    Tranquillity… Manasa Chamarti Telugu, Indian

    O Vault of Heaven! When you sizzle all of a sudden with a streak of lightning or when I rattle feverishly to find expression to an idea What a turmoil it is! But once you melt into drops… And I flow into a poem… what a seize of tranquility! . Manasa Chamarti Telugu Poet .…

  • డిసెంబర్ 2, 2015

    పురాతన చర్మపత్రం … ఆల్ఫ్రెడ్ క్రీం బోర్గ్, అమెరికను కవి

    ఆకాశం ఒక అందమైన పురాతన చర్మపత్రం… దానిమీద సూర్యుడూ చంద్రుడూ ప్రతి రోజూ తమ దినచర్య నమోదుచేస్తుంటారు. దాన్ని అంతటినీ చదవాలంటే మహా జ్ఞాని కంటే కూడా ఎక్కువ భాషాపటిమ గలిగి ఉండాలి. ‘కలా’మతల్లి కంటే కూడా ఎక్కువ దివ్యదృష్టీ, భావుకతా కలిగి ఉండాలి. కానీ, దాన్ని అనుభూతి చెందడానికి మాత్రం మనిషి దానికి వినమ్రంగా అంతేవాసిత్వం నెరపాలి: ఎంత శ్రద్ధగా విడవకుండా శుశ్రూష చెయ్యాలంటే, ఒక సముద్రం లాగనో లేక, ఒక భూమిలాగనో… నిరంతరం, ఒకేఒక్క…

  • నవంబర్ 30, 2015

    మరచిన జాతీయ చిహ్నం… వచేల్ లింజీ అమెరికను కవి

    (జాన్ పి. ఆల్ట్ గెల్డ్ (30 డిశంబరు 1847- మార్చి 12 1902) స్మృతిలో) Read about John P Altgeld here మరుగుపడ్డ జాతి చిహ్నమా… ఆ రాతి క్రింద ప్రశాంతంగా నిద్రించు… కాలం ఇక తనపని చూసుకుంటుంది… మట్టి నీ సంగతి చూసుకునేట్టుగానే. “హమ్మయ్య, అతన్ని కప్పెట్టాం’ అనుకుంటున్నారు నీ శత్రువులు, లోన సంతసిస్తూనే వాళ్ళ విచాఆన్ని సమర్థవంతంగా నటించేరు, ద్వేషాన్ని ప్రకటించకుండా   వాళ్ళు నీ మీద గుర్రు మన్నారు, దూషించేరు, తిట్టిదిగపోశారు…

  • నవంబర్ 29, 2015

    కానుక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    ప్రియతమా, చూడు! నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నా మాటలు నీకు అందమైన అలంకరణ సామగ్రి వాటిని నువ్వు నీ అల్మారాలలో అందంగా అలంకరించుకుంటావు. వాటి ఆకారాలు చిత్రంగా, సమ్మోహనంగా ఉంటాయి అవి ఎన్నో వన్నెల్లో, ఎన్నో జిలుగుల్లో, ఆకర్షిస్తుంటాయి. అంతే కాదు, వాటినుండి వెలువడే సుగంధం గదిని అత్తరు, పన్నీటివాసనలతో నింపుతుంది. నేను చివరి మాట చెప్పేసరికి నువ్వు నా సర్వస్వాన్నీ పొంది ఉంటావు. కానీ, నేనే… జీవించి ఉండను. . ఏమీ లోవెల్ February 9,…

  • నవంబర్ 28, 2015

    “అమూర్తులు”… స్యూమస్ ఓ సలివాన్, ఐరిష్ కవి

    మేము మరుగుపడ్డ చోట్లనుండి ఒక రహస్యద్వారం గుండా ఇక్కడ పచ్చగా విరిసినవైపుకి వెన్నెల్లో బయటకి వస్తాము. అక్కడ రాత్రంతా మేము ఆటపాటల్లో మునిగిపోతాము ఎంతగా గంతులేస్తామంటే ఈ నేల ఎన్నడూ చూసి ఉండదు ఆడుతూ గెంతుతూ పదంలేని రాగాలు తీస్తుంటే ఆ రాగం ఎంత కమ్మగా ఉంటుందంటే పక్షులు కూడా చిన్నబోతాయి. అక్కడ ఎందరో కన్నియలుంటారు నశ్వరమైన శరీరం ధరించినవాళ్ళు తమ లేత కన్నులనిండా పుడమి గురించి ఆశలు నింపుకున్నవాళ్ళు ఈ అడవి సొగసుకి ఉబికిన సంగీతం…

  • నవంబర్ 25, 2015

    జీవితమా! నే నేవర్ని?… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

    జీవితమా! నే నేవర్ని? అవిశ్రాంతంగా తిరిగే జీవకణాలు పదిలంగా పొదువుకున్న నీటి తిత్తినా? అ వెందుకు పనిచేస్తున్నాయో వాటికే తెలియదు, ఒక క్షణం ఆగవు, వాటి యజమాని ఎక్కడ ఉన్నాడో నాకు అంతుపట్టదు వాటిని పనిచెయ్యమని అడగను, అయినా అవి కష్టపడి పనిచేస్తాయి, అవొక ప్రపంచాన్ని అల్లుతాయి ఒకరినొకరు వాడుకునేలా; ఏ లక్ష్యం సాధించడానికో నాకు తెలీదు, ఎప్పుడు మొదలో తెలీదు ఎవర్ని పొగడాలో, ఎవర్ని తెగడాలో, ఎవర్ని ముద్దుచెయ్యాలో తెలియదు. ఒక అద్భుతంలో మరొక అద్భుతం…

←మునుపటి పుట
1 … 100 101 102 103 104 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు