అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 17, 2015

    లండన్… ఎఫ్. ఎస్. ఫ్లింట్, ఇంగ్లీషు కవి

    ఓ నా అందమైన లండను నగరమా! ఆ సూర్యాస్తమయమో, తెల్లని ఎత్తైన ఆ ‘బర్చి’ చెట్టు ఆకుల పరదాలోంచి లీలగా మెరుస్తున్న ఆకాశమో, ఇక్కడి ప్రశాంతతో, లే పచ్చికమీద కువకువలాడుతూ గంతులేస్తున్న పిట్టలగుంపో, అన్ని వస్తువులమీదా సన్నగా పరుచుకుని వాటిని కనుమరుగుచేస్తున్న చీకటో … కాదు నా మనసు దోచుకుంటున్నది. చంద్రబింబం అలా మహావృక్షాల శిరసులమీంచి ఆకసానికి ప్రాకుతుంటే ఆ నక్షత్రాల గుంపులో ఆమెను* ఊహించుకుంటాను వెళుతూ వెళుతూ ఆ చంద్రబింబం మనుషులమీద ప్రసరించే కాంతిని ఊహించుకుంటాను. నా…

  • డిసెంబర్ 16, 2015

    కురితీర్ తో లియాడేన్… మోరీన్ ఫాక్స్, ఐరిష్ కవయిత్రి

    (జానపద గాథ: లియాడేన్, కురితీర్ ఇద్దరూ 7 వశతాబ్దికి చెందిన ఐరిష్ కవులు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కురితీర్  పెళ్ళిప్రయత్నాలు చేసుకుంటూ కొంతకాలం కనబడపోయేసరికి, లియాడెన్ ఏవో తెలియరాని కారణాలకి సన్యాసినిగా దీక్షతీసుకుంటుంది. అది తెలుసుకున్న కురితీర్ నిరాశకు లోనై తనుకూడా సన్యాసిగా దీక్షతీసుకుంటాడు. మొదట్లో వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోడానికే పరిమితమైనా కొన్నాళ్ళకి వాళ్ళ దీక్షభగ్నం అవుతుంది. అపుడు కురితీర్ తన ఆత్మను రక్షించుకుందికీ, శేషజీవితాన్ని ప్రాయశ్చిత్తంతో గడపడానికీ ఆమెని విడిచిపెడతాడు) I నాకే గనక…

  • డిసెంబర్ 15, 2015

    యూదు సైనికుడు… ఫ్లారెన్స్ కైపర్ ఫ్రాంక్, అమెరికను కవయిత్రి

    (ఒక్క జార్ చక్రవర్తి పదాతి దళంలోనే సుమారు 2.5 లక్షలమంది యూదులు … ఒక పత్రికలో వార్త) వాళ్ళు నాకు సైనికుడి దుస్తులు తొడిగేరు చేతిలో తుపాకీ పెట్టి ఈ పరాయిదేశంలో నాకు నచ్చినవాణ్ణి ధైర్యంగా చంపమని వాళ్ళు నన్ను పంపేరు పాపం, చాలా మంది తమదేశంకోసం మరణిస్తారు చాలామంది విశాల భూభాగాన్ని గెలవడానికి మరణిస్తారు కాని నేను నా బిడ్డను హతమార్చిన నా జన్మభూమికోసం ప్రాణాలర్పిస్తాను. ఎన్ని వందలసంవత్సరాలబట్టి దేశాలు పుట్టి, అభివృద్ధిచెంది, మాయమవడంలేదు! శాంతి…

  • డిసెంబర్ 14, 2015

    తుఫాను భయం… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి

    చీకటిలో గాలి మామీద కక్ష గట్టినట్టు వీస్తూ తూర్పువైపు గది కిటికీని మంచుతో బాదుతూ, తన అరుపుల్ని నిగ్రహించుకుని “ఒరే పిరికిపందా! రారా బయటికి” అని గుసగుసలాడినట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్లకుండా ఉండడానికి పెద్దగా విచికిత్స అవసరం లేదు. అబ్బే! లాభం లేదు.  నా బలాబలాలు బేరీజు వేసుకుంటాను మేమిద్దరం, ఒక బిడ్డ. మాలో నిద్ర రానివాళ్ళం దగ్గరగామునగదీసుకుని ఒకపక్క పొయ్యిలో నిప్పు నెమ్మదిగా ఆరిపోతుంటే మరోపక్క చలి ఎలా మెల్లిగా పాకురుతుంటుందో గమనిస్తుంటాం. తుఫాను గాలి…

  • డిసెంబర్ 13, 2015

    ఇంద్రజాలం… హామ్లిన్ గార్లాండ్, అమెరికను

    నాచుపట్టినట్టున్న ఒక శిలని నా అరచేతిలోకి తీసుకున్నాను … దానిమీద ఒక్కొక్క మరక ఎర్రని-బంగారం రంగులో ఉంది దిగంబరంగా ఉన్న ఈ కొలొరాడో కొండల మధ్య హోరుమంటూ గాలి చేస్తున్న శబ్దాన్ని కళ్ళుమూసుకుని వింటున్నాను. నా చుట్టూ మంఛు ఒత్తుగా పరుచుకుని ఉంది. బూడిదరంగులో ఏనాటివో బాగా ఎదిగిన ఈ దేవదారు చెట్లు ఎండిపోయి, బోసిగా చిక్కుపడ్డ జూత్తులోంచి సాంబ్రాణిపొగలా వాటిమధ్య వీస్తున్న గాలితోపాటు గుర్రుమంటున్నాయి; తెల్లని రెక్కలతో గర్వంగా మహారాణిగారి ఠీవితో, దర్పంతో తెల్లగా మెరుస్తూ,…

  • డిసెంబర్ 12, 2015

    Ajeya … Kuppili Padma, Telugu, Indian

    “All the Rajani fans Don’t miss the chance Lungi dance, Lungi dance, Lungi dance…” I was about to enter the Land Mark Bookshop when the song reverberated in high pitch. I reached for the railing and peeped down. Many people like me were looking down from all floors. On the ground floor, more than hundred…

  • డిసెంబర్ 11, 2015

    సంపెంగపువ్వు… రవీంద్రనాథ్ టాగూర్, భారతీయ కవి

    సరదాకి, నేను సంపంగి పువ్వునై చిటారుకొమ్మన పూచేననుకుందాం. గాలి కితకితలకి నవ్వుతూ కొత్తగా చిగురించిన ఆకులమీద ఊగుతుంటే, అమ్మా, నీకు తెలుస్తుందా? నువ్వు “అమ్మాయీ? ఎక్కడున్నావు?” అని పిలుస్తావు. నేను నాలోనేను నవ్వుకుంటూ మౌనంగా మాటాడకుండా ఊరుకుంటాను. నేను మెల్లగా రేకల కన్నులు విప్పి నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తుంటాను. నువ్వు స్నానం చేసేక, తడిజుత్తు నీ భుజం మీద పరుచుకుని ఉంటే, సంపెంగచెట్టు నీడవెంబడే నువ్వు తులసికోటదగ్గరకి పూజచెయ్యడానికి వెళతావు. నీకు సంపెంగపువ్వు వాసన తెలుస్తుందిగాని…

  • డిసెంబర్ 10, 2015

    జోకు… విల్ఫ్రెడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి

    ఇద్దరం ఇరుక్కుని కూచున్నప్పటికీ అతను జోకు వెయ్యడం మానలేదు, అందువల్ల మరొక కొత్తజోకు వెయ్యడానికి ప్రయత్నించినపుడు పగలబడి నవ్వుతుండగా ప్రమాదవశాత్తూ అతని తల బయటకి కనిపించింది. అతను జోకు వేస్తుండగానే తుపాకీ పేలింది… దేముడికెరుక… మిగతాది ఎపుడు వింటానో! . విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ 2.10.1878- 26.5. 1962 ఇంగ్లీషు కవి . The Joke . He’d even have his joke While we were sitting tight, And so he needs…

  • డిసెంబర్ 9, 2015

    బ్రాడ్వే… హెర్మన్ హేగ్డార్న్, అమెరికను కవి

    (Note: బ్రాడ్వే న్యూయార్క్ లో ప్రసిద్ధిపొందిన సినిమాహాళ్ళకీ, నాటకశాలలకీ, రెస్టారెంట్లకీ నెలవైన ఒక వీధి.) . ఈ పేరులేని ముఖాలు చుక్కల్లా ఎలా ఉన్నాయో… లెక్కనేనన్ని మడుతున్న నిప్పుకణికలివి! విహాయస వీధిలో పేలవంగా నడిచే నక్షత్రాల ఊరేగింపు ఈ ఆత్మల పాలపుంత! ఒక్కొక్కటీ స్వయంప్రకాశమైన ఒక నీహారిక ఓహ్, ప్రభూ! ప్రతి వదనమూ ఒక ప్రపంచం! ఆరుబయట సడిలేని చీకటిలోకి నా చూపు సారిస్తాను: ఆ దూర తారలలో, ఏ ఉద్యానాలు, ఏ భవంతులున్నాయో, ఏ మానవ…

  • డిసెంబర్ 8, 2015

    నేను చంపిన సైనికుడు… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    మేము గతంలో ఎప్పుడైనా ఏ పాత సత్రం దగ్గరో కలిసి ఉండి ఉంటే, పక్కపక్కన కూచుని సరదాగా మద్యం సేవించి ఉండేవాళ్లమి. కాని పదాతి దళంలో పెరిగి ఉండడం వల్ల ఒకరికొకరు ఎదురై తేరిపార చూసుకుంటున్నప్పుడు అతను నా మీదా నేనతని మీదా కాల్పులు జరుపుకున్నాం అతను ఉన్నచోటే కూలబడి చనిపోయాడు. అతన్ని నేను కాల్చి చంపేను ఎందుకంటే, తను నా శత్రువు గనుక… అంతే!— అతను నా శత్రువే అనుకొండి అది స్పష్టం. సందేహమేమీ లేదు……

←మునుపటి పుట
1 … 99 100 101 102 103 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు