వర్గం: అనువాదాలు
-
నేను పవనాన్ని… జో ఏకిన్స్, అమెరికను
నేను నిలకడలేని పవనాన్ని నువ్వు నిశ్చలమైన ధరిత్రివి; నేను ఇసుకమీద అటూ ఇటూ కదలాడే నీడని. నేను గాలికి అల్లల్లాడే పత్రాన్ని నువ్వు తొణకక నిలబడే వృక్షానివి; నువ్వు తన ఉనికినుండి కదలని నక్షత్రానివి నేను చంచలమైన సముద్రాన్ని. నువ్వు శాశ్వతమైన వెలుగువి నేను దివిటీలా సమసిపోతాను; నువ్వు రసార్ణవంలో ముంచెత్తే సంగీతానివి నేను? … ఒక కేకని. . జో ఏకిన్స్ (30 October 1886 – 29 October 1958) అమెరికను కవయిత్రి .…
-
నూత్నసంవత్సరం… గేథే , జర్మను కవి
బ్లాగు మిత్రులకీ, శ్రేయోభిలాషులకీ, వారి కుటుంబాలకీ నూతన ఆంగ్ల సంవత్సరం 2016 ఉజ్జ్వలమైన భవిష్యత్తుకి కొత్తమార్గాలు కొనిరావడమే గాక, గతకాలపు సమస్యలకి మంచిసమాధానాలు కూడా తీసుకురావాలని అభిలషిస్తున్నాను. కాలం చేసిన గాయాలని కాలమే మాన్పుతుంది. గత సంవత్సరంలో తగిలిన గాయాలు ఈ సంవత్సరం జ్ఞాపకాలుగా మిగిల్చిపోవాలని ఆశిస్తున్నాను. **** (1802 లో గేథే ఇంట్లో జరిగిన జరిగిన ఒక విందు ప్రేరణతో 1804లో వ్రాసిన కవిత) ఓ విధీ! కొత్తగా ప్రారంభించడానికీ మరలిపోవడానికీ మధ్య ఆనందంగా ఉండేలా…
-
సంభాషణ… వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను
“జీవితమా!ఓపిక పట్టు. ప్రేమ గుమ్మందగ్గర ఉన్నాడు. తను లోనికి వచ్చినపుడు, స్వాగతించి సుఖంగా కూచోనీ. పాపం ఎన్ని రోడ్లు తిరగవలసి వచ్చిందో ఆలోచించు. ఎంతకాలం అతను నిర్రిక్షించవలసి వచ్చిందో ఊహించు.” “లాభం లేదు. ప్రేమని లోనికి రానిస్తే నాకు ఆలస్యం అయిపోతుంది. అతనికంటే ముందు మరొకడు వచ్చేడు. ఇపుడు ఖాళీ లేదు. నేను ఆ బంధం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించేను. ప్రేమనే అవకాశం కోసం వేచి ఉండనీ. వస్తే కాల్చుకుతినెస్తాడు” “జీవితమా! కాస్త తీరిక చేసుకుని…
-
గని కార్మికుడు… మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను
పైనున్న వాళ్ళందరూ నిన్నెరుగుదురని అంటారు; వాళ్ళు చెప్పేది అబద్ధం. నువ్వు నా తండ్రివి; నేను పనిచేసే నిశ్శబ్దం నా తల్లి; ఒక్క కొడుక్కే తెలుసు తండ్రి సంగతి. మనిద్దరం ఒక్కలాటి వాళ్ళమే నాన్నా! మన అంతరంగాల్ని బహిర్గతం చెయ్యం, జ్ఞానం మనల్ని ఒదిగి ఉండేలా చేస్తుంది. బయటకి వెళితే నేను కూడా నా సోదరులతో పాటే తాగి అరుస్తుంటాను- తమ ఉనికికి కారకులైన తల్లిదండ్రుల్ని మరిచే చాలామంది పిల్లల్లా. కానీ నువ్వు మళ్ళీ గట్టిగా ఒడిసి పట్టుకుంటావు;…
-
అరుణోదయం… గార్డన్ బాటమ్లీ, ఇంగ్లీషు కవి
ముక్కున కరుచుకున్న నత్తగుల్లని ఒక రాయికేసి బాదుతోందొక పక్షి; విరగకాసిన చెట్టుకొమ్మనుండి ఒక పిట్ట కొమ్మ విరిగిపోతుందేమో అనిపించేట్టు వేలాడుతోంది; ప్రభాతగీతాలింకా ప్రారంభం కాలేదు, కానీ ఆ విశాలమైన చెట్టు ఆవరణ చీకటిలో ఎగురుతూ, పులుగులన్నీ కిచకిచలాడసాగేయి. ఎందుకంటే, ఒక గుడ్లగూబ ఇప్పుడే తనగూడు చేరుకుంది. . గార్డన్ బాటమ్లీ 20 February 1874 – 1948 ఇంగ్లీషు కవి Dawn . A Thrush is tapping a stone With a snail-shell in…
-
సైనికుడు… రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి
నేను మరణించడం జరిగితే, నా గురించి ఇలా తలపోయండి: ఎక్కడో దేశంకాని దేశంలో ఓ మూల ఒకింత జాగా ఉంటుంది అది ఎప్పుడూ ఇంగ్లండునే తలపోస్తుంది. అక్కడ ఆ అపురూపమైన నేలలో అంతకంటే విలువైన మట్టి దాగుంది. ఆ మట్టి ఇంగ్లండులో పుట్టి, రూపుదిద్దుకుని, జ్ఞానం సంపాదించింది, ఇంగ్లండు ఒకప్పుడు ప్రేమించడానికి పూలనీ, తిరగడానికి త్రోవల్నీ ఇచ్చింది, అది ఇంగ్లండులో ఒక భాగం, అది అన్నిరకాలుగా ఇంగ్లండునే ప్రతిఫలిస్తుంది, అక్కడి నదుల్లో ములిగి, అదృష్టం కొద్దీ అక్కడి సూర్యుడి…
-
శరణార్థులు … గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్, అమెరికను కవయిత్రి
బెల్జియం -1914 . “అమ్మా! చంద్రుడు బూరుగుచెట్లుదాటి పోతున్నాడు రోడ్డు ఎంతకీ తరగదు, తెల్లగా కనుచూపుమేరా, మనం ఊరు ఇంతత్వరగా చేరలేమేమో, చెప్పవూ, ఇంతకీ మనమెక్కడున్నామో?” “నాన్నా, కన్నా, కాస్త ఓపికపట్టరా తండ్రీ, మళ్ళీ మనకి త్రోవ కనిపిస్తుందిలే, (భగవంతుడా! ఎవ్వరూ నడవని త్రోవ చూపించు దేవుడా ! ఏమనిషికంటాపడకుండా రక్షణ కల్పించు!”) “అమ్మా! నాకు నువ్వు చెప్పనే లేదు, నన్నుతొందరగా ఎందుకు లాక్కొచ్చావో! నేను సైనికులు పక్కనుండి వెళ్ళడం చూశాను నాకు కాసేపు నిలబడితే బాగుణ్ణనిపించింది.”…
-
అతను నిష్క్రమించాడు… డేవిడ్ హార్కిన్స్, సమకాలీన ఇంగ్లీషు కవి
క్రిస్టియన్ మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. *** క్రిందటి సంవత్సరం మనతో గడిపిన వ్యక్తులు ఈరోజు మనతో ఉండకపోవచ్చు. వాళ్ళను మరిచి మనం పండుగచేసుకుంటున్నామన్న బాధా, అసంతృప్తి కొందరిలో కనిపించవచ్చు. మరణించిన జ్ఞాపకాలు ఒక్కటే కాదు మనల్ని నడిపించవలసినది. వాళ్ళు ఆశించి అసంపూర్ణంగా విడిచిపెట్టిన పనులను వాళ్ళ గుర్తుగా మనం పూర్తిచెయ్యడమే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన సరియైన నివాళి. “నలుగురు కూచుని నవ్వే వేళల నాపేరొకపరి తలవండి” అంటుంది గురజాడవారి పుత్తడి బొమ్మ “పూర్ణమ్మ” తమ అన్నదమ్ములతో.…
-
నను చివరిసారిగా ప్రేమించు… ఏలిస్ కార్బిన్, అమెరికను
కడసారి నను ప్రేమించు, ఇష్టం లేదా, విడిచిపెట్టు; కటువైన మాటలు, ఈ సగం సగం మాటల్లా, నన్ను బాధించవు; చివరగా చెబుతున్నా, అయితే నన్ను ప్రేమించు, లేదా విడిచిపెట్టు. కడసారిగా నను ప్రేమించు, లేకుంటే నువ్వు చెప్పిన ఆఖరిమాటే చివరి మాట కానీ; నను ప్రేమించు లేదా విడిచిపెట్టు… ఒక ఎగిరే పక్షిలా, మబ్బుతునకలా, ఆవిరిలా… కడసారిగా నను ప్రేమించు… నేనిపుడు శిలపై జాల్వారుతున్న జలని. . ఏలిస్ కార్బిన్ April 16, 1881 – July…