మంచిసమాధానాలు కూడా తీసుకురావాలని అభిలషిస్తున్నాను.
కాలం చేసిన గాయాలని కాలమే మాన్పుతుంది.
గత సంవత్సరంలో తగిలిన గాయాలు
ఈ సంవత్సరం జ్ఞాపకాలుగా మిగిల్చిపోవాలని ఆశిస్తున్నాను.
****
(1802 లో గేథే ఇంట్లో జరిగిన జరిగిన ఒక విందు ప్రేరణతో 1804లో వ్రాసిన కవిత)
ఓ విధీ! కొత్తగా ప్రారంభించడానికీ మరలిపోవడానికీ మధ్య ఆనందంగా ఉండేలా అనుగ్రహించు. తీయనైన జ్ఞాపకాలు గుర్తు చేసుకోడానికీ భవిష్యత్తుకీ మధ్య చూస్తుండగానే ఆయువు తరిగిపోతుంది వేదనల ఋతువులు అవెప్పుడూ దుఃఖంలో నిజాన్ని దూరంచేస్తాయి ప్రేమా, ఆనందమూ ఎడబాటవుతాయి.
అపురూపమైన రోజులు మళ్ళీ మమ్మల్ని ఏకం చేస్తాయి అందమైన పాటలు మనసు తేలికచేసి గుండె ధైర్యాన్ని ఇస్తాయి. అలా కలుసుకున్న మేము ప్రసన్నంగా ఆలోచిస్తాము ఆ పారవశ్యంలో, విచారమూ దుఃఖమూ చెల్లాచెదరౌతాయి.
ఆహ్! విధీ! నీ కల్పన ఏంత వింతగా ఉంటుంది! పాత బంధాలు పెనవేసుకుంటాయి ప్రతిఫలం కొత్తగా దొరుకుతుంది ఓ విధీ! నీకు కృతజ్ఞతలు. గుడ్డిగా, స్థిమితంలేకుండా ఉండే మాకు ప్రేమతో అనుగ్రహించేవాటన్నిటికీ నీకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము. మార్పులో వేడుకలు స్పష్టమైన ప్రేరణలు నిష్కళంకమైన ప్రేమ తృప్తిగా మనసు వెదజల్లే వెలుగు నిన్నటివరకూ మా శరీరం ముడుతలు దేరి నిరాశలో విచారంలో మగ్గడం అందరూ చూసి ఉంటారు ఇప్పుడు మామీద లీలగా ఒక నిజం వాలింది. ఈ కొత్తదనం మాకూ కొత్తే ఒకరినొకరు విడలేని జంటగా నృత్యం చేస్తూ ప్రక్కకి వాలినట్టు ముందు కనుమరుగైపోయి తర్వాత ప్రత్యక్షంఅయినట్లు ఒకరిమీద ఒకరికున్న అపేక్ష గహనమైన జీవితమూ అస్పష్టమైన దారుల్లోంచి కొత్తసంవత్సరం 1802 లోకి నడిపించుగాక ! . జాన్ వుల్ఫ్ గాంగ్ వాన్ గేథే
28 August 1749 – 22 March 1832
జర్మను కవి
.
On The New Year
[Composed for a merry party that used to meet, in 1802, at Goethe’s house.]
స్పందించండి