వర్గం: అనువాదాలు
-
సానెట్ 35… షేక్స్పియర్
నువ్వు చేసిన వాటి గురించి ఇక వగవొద్దు: గులాబులకి ముళ్ళూ, స్వఛ్ఛమైన జలకి బురద, సూర్యచంద్రుల్ని కనుమరుగుచేస్తూ మేఘాలూ, గ్రహణాలూ తియ్యని మకరందాన్నిచ్చే పువ్వుకి గొంగళి పట్టడమూ సహజమే. మనుషులందరికీ ఏవో లోపాలుంటాయి, నన్ను కూడా కలుపుకుని నీ తప్పుల్ని ఉపమనాలతో సమర్థిస్తున్నందుకు, నన్ను నేను వంచన చేసుకుంటున్నాను, నీ తప్పుని లేపనంగా రాసుకుని నీ చేసినవే కాదు, చెయ్యని నేరాలని కూడా ఉదారంగా క్షమిస్తూ; ఎందుకంటే, నీ విషయాసక్తమైన పొరపాటుకి ఆస్కారం కల్పిస్తూ (నీ ప్రతివాదినీ…
-
సానెట్ 34… షేక్స్పియర్
ఇంత అందమైన రోజుని ఎందుకు వాగ్దానం చేసి నన్ను ఏ మెయికప్పులూ లేకుండా బయలుదేరేలా పురికొల్పావు? బడుగు మేఘాలు దారిలో నన్ను దాటి ముందుకుపోయి వాటి దట్టమైన నల్లటి పొగల్లో నీ ప్రతాపాన్ని కనుమరుగుచెయ్యడానికా? నువ్వు అప్పుడప్పుడు మేఘాల్ని చీల్చుకువచ్చి వర్షం దెబ్బతిన్న నా ముఖం మీది చినుకుల తడి ఆరబెడితే సరిపోదు గాయాన్ని మాన్చగలిగినా అవమానం తొలగించలేని గాయం గురించి ఏ మనిషీ గొప్పగా చెప్పుకోలేడు నీకు జరిగిన అవమానం నా దుఃఖానికి ఉపశమనం ఇవ్వదు…
-
సానెట్ 32… షేక్స్పియర్
మిత్రమా! మొరటు మృత్యువు నా ఎముకల్ని మట్టితో కప్పి, తృప్తిగా జీవించిన నా జీవితం నీ కంటే ముందు ముగిసినపుడు, నా అదృష్టం ఒకసారి సింహావలోకనానికి ఉపక్రమించి ఈ నీ ఆరాధకుడి పిచ్చిరాతలేవో నీకు చదవాలనిపించినపుడు ఇతరులు రాసిన రాతలన్నిటి ముందూ ఇవి వెలవెలపోయినా, వీటిని కేవలం నామీద ప్రేమకొద్దీ దాచుకో! ఇందులో గొప్ప కవిత్వం ఉందని కాదు; కాలంతోపాటు వాటి విలువ ఎలా పెరుగుతుందో సరిపోల్చుకో. లబ్దప్రతిష్ఠుల కవితలను మించి నిలబడతాయి. అప్పుడైనా, ఈ ఒక్క…
-
సానెట్ 30… షేక్స్పియర్
నా ఆలోచనా నివహాల పర్వాలకు గుట్టుచప్పుడుకాకుండా గతకాలపు విషయాల జ్ఞాపకాలను ఆహ్వానిస్తానా… నే సాధించాలనుకున్న ఎన్నో విషయాలు సాధించలేదని గుర్తొచ్చి విలువైన నా జీవితకాలాన్ని వృధాచేశానే అని బాధకలుగుతుంది: నాకు ఏడవడం అలవాటు లేకపోయినప్పటికీ, ఏడవడం ప్రారంభిస్తాను: అంతుతెలియని చీకటిలోదాగిన నా అపురూపమైన మిత్రులకోసం అప్పటికి ఎన్నడో మానిపోయిన ప్రేమ గాయాలకు మరోసారి శోకిస్తాను, కంటికి కనరాని నే పోగొట్టుకున్న అనేక వస్తువులకై అలమటిస్తాను మళ్ళీ మీదచెప్పిన బాధలకే మరొకసారి బాధపడతాను ఒకదాని వెనక ఒకటి, ఒకదాని…
-
సానెట్ 29… షేక్స్పియర్
ప్రజల దృష్టిలో చులకనై, అదృష్టంచే వెలివేయబడి నా బహిష్కరణస్థితికి ఒంటరిగా శోకిస్తూ వ్యర్థమైన ప్రార్థనలతో వినిపించుకోని దైవాన్ని వేడుకుంటూ నన్ను నేను పరికించుకుని, అదృష్టహీనతకి నిందించుకుంటూ ఎన్ని లేకున్నా ఆశ నన్ను విడనాడకుండా ఉంటే బాగుణ్ణని కోరుకుంటూ ఎక్కువమంది మిత్రులున్న అతనిలా ఉంటే బాగుండుననో ఈ వ్యక్తికున్న నైపుణ్యము, ఆ వ్యక్తికున్న పరిచయాలూ వాంఛిస్తూ నాకు సంతృప్తినిచ్చేదాంతో సంతుష్టిచెందలేకుండా ఈ ఆలోచనల ప్రవాహంలో నన్ను నేను అసహ్యించుకుంటూ నీ గురించి ఒక్కసారి తలుచుకుంటానా, అంతే, ఒక్క సారి…
-
సానెట్ 28… షేక్స్పియర్
విశ్రాంతి నుండి లభించే సుఖానికి దూరమైన నేను అలాంటపుడు, సుఖావస్థకి ఎలా చేరుకోగలను చెప్పు ? పగలుపడ్డ శ్రమ రాత్రికి తీరడం పోయి, రాత్రీ పగలూ, పగలూ రాత్రీ వేధిస్తుంటే ఎలా? ఆ రెండూ ఒక దానికొకటి శత్రువులైనా, స్నేహితుల్లా నను వేధించడానికి మాత్రం చేతులు కలుపుతున్నాయి. ఒకటి శ్రమకి గురి చేసీ, రెండవది నేను ఎంత కష్టపడినా, నీనుండి ఇంకా దూరమేనని గుర్తుచేస్తూను. నేను పగటితో అంటాను సంతోషపరచడానికి:నువు కాంతిమంతుడవు; ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మినా, అతనిని…
-
సానెట్ 18… షేక్స్పియర్
ఈ రోజు (ఏప్రిల్ 23, 2016) షేక్స్పియర్ 400వ వర్ధంతి. ఏప్రిల్ 26 1564న బాప్టిజం జరిగినట్టు రికార్డులు చెపుతున్నాయి. అప్పటి అచారాలను బట్టి 23 ఏప్రిల్ అతని పుట్టిన రోజుకూడా అవడానికి అవకాశం ఉంది. సాహిత్యంలో కీర్తిప్రతిష్టలు ఎప్పుడూ దేశ, కాల, భాషాపరిమితులకు లోబడి ఉంటాయి. ఒకవేళ కొందరు ఇతరభాషలలోకి అనువదించబడినా, వాళ్ల రచనల విషయం గాని, రీతి గాని కాలపరీక్షకు నిలిచిన సందర్భాలు చాలా అరుదు. బహుశా ప్రపంచసాహిత్యంలో అటువంటి అరుదైన గుర్తింపుకి నోచుకున్నది షేక్స్పియర్, కాళిదాసులు…
-
సానెట్ 27… షేక్స్పియర్
పాటుబడి, అలసిపోయి, నేను తొందరగా పక్కెక్కుతానా నడిచి నడిచి బడలిన నా అవయవాలకి విశ్రాంతినిద్దామని; సరిగ్గా అప్పుడే మొదలౌతుంది మరో ప్రయాణం నా తలలో, శరీరం పని అయిపోయిందనగానే, మనసు పని మొదలుపెడుతూ: నా ఆలోచనలన్నీ,(నే నున్న చోటునుండి దూరంగా) నీ కోసం భక్తితో తీర్థయాత్రకు ఉపక్రమిస్తాయి, అరమోడ్చిన నా కనురెప్పల్ని సాగదీసి తెరిచి మరీ అంధులు చూడగలిగే చీకటిలోకి చూపులు సారిస్తాయి. ఉన్న తేడా అల్లా, అదృశ్యమైన నా ఆత్మ దివ్యచక్షువుకి చర్మచక్షువుకి అగోచరమైన నీ…
-
సానెట్ 26 … షేక్స్పియర్
నా ప్రేమకు నెలవైన ఓ స్వామీ! నీకు దాస్యం చేయడంలోనే నా సేవా ధర్మాన్నిమీ ప్రభుపాత్రత కట్టిపడేసింది, అందుకే నీకీ లిఖిత సందేశాన్ని పంపుకుంటున్నాను,నాలో విధినిర్వహణమాత్రమే చూడండి, ప్రదర్శించే తెలివిని కాదు. సేవానిరతి ఘనమైనా, మందబుద్ధియైన నాలాంటి వాడు మాటల్లో చెప్పలేకపోవడంలోనే దానిని తేటతెల్లం చేస్తాడు; నా జీవితాన్ని ఏ గ్రహాలు శాసిస్తునాయో గాని, వాటి అనుగ్రహ వీక్షణాలు నా మీద ప్రసరించి, నిరాడంబరమైన నా ప్రేమని సవస్త్రను చేసి మీ అభిమానానికి యోగ్యుడనని ఋజువుచేసేదాకా మీ…
-
సానెట్ 25… షేక్స్పియర్
గ్రహాలు అనుకూలంగా ఉన్న అదృష్టవంతుల్ని వాళ్ళు పొందే సమ్మానాలకీ, బిరుదులకీ గర్వపడనీ, అటువంటి అదృష్టానికి నోచుకోని నాలాంటి వాడు అటువంటి వాటి సత్కారాలలో ఆనందాన్ని వెతుక్కోలేడు. రాకుమారుల అనుగ్రహానికి పాత్రులైనవారు సూర్యముఖిలా తమ సర్వశక్తులూ వాళ్లకే అంకితం చేసి బ్రతుకుతారు; దానితోపాటే వాళ్ల అహంకూడా సమాధిచేసుకుంటారు, వాళ్ళు కన్నెర్ర చేస్తే తమ గొప్పదనం మటుమాయం కదా మరి. పాపం ఎన్ని వేలసార్లు విజయాన్ని సమకూర్చిపెట్టినా పరాక్రమవంతుడైన గొప్ప యోధుడు ఒక్కసారి ఓటమిపాలైతే సమున్నత గౌరవ పీఠం నుండి…