వర్గం: అనువాదాలు
-
రాకుమారి… బ్యోర్న్ స్టెయిన్ బ్యోర్న్ సన్, నార్వే కవి
రాకుమార్తె తన స్వంత పొదరింటిలో ఒంటరిగా కూర్చుంది ఆ యువకుడు కోటబురుజు పీఠం దగ్గర కూచుని బూరా ఊదుతున్నాడు. “ఎందుకు ఎప్పుడూ పాడుతుంటావు? బ్రతిమాలుకుంటాను. ఊదకు. సూర్యాస్తమయ మయితే, అది నా ఆలోచనలు స్వేచ్చగా దూరంగా విహరించనీయదు. తన స్వంత పొదరింటిలో రాకుమార్తె దీనంగా కూచుంది. ఆ యువకుడు కొమ్ము ఊదడం ఆపేసేడు. “ఓహ్! నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? బ్రతిమాలుతాను పాట వాయించు. సూర్యాస్తమయితే, అది నా ఊహలకి రెక్కలు తొడిగి ఎక్కడికో విహరింపజేస్తుంది. తన స్వంత…
-
ఇంటి మారాజు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
కూచుని ఆ ఇద్దర్నీ చూస్తుంటాను కానీ ఒంటరిగా కాదు, వాళ్ళో దేవదూతని కూడా అలరిస్తుంటారు తెలియకుండానే. ముఖం అచ్చం చంద్ర బింబంలా ఒక రాజ అతిథి వేంచేసేరు ఎగురుతున్న జుత్తుతో తన సింహాసనం మీద ఆసీనుడై చెంచాతో టేబిలుమీద వాయిద్యం వాయిస్తూ నిర్లక్ష్యంగా దాన్ని క్రిందకు విసిరేసేడు, మునుపెన్నడూ చూడనిదాన్ని అందుకునే ప్రయత్నంలో. ఇవి స్వర్లోకపు మర్యాదలా? మనసు హరించే మార్గాలూ, కళాకలాపాలా? అహా! సందేహం లేదు. అతిథి ఏంచేసినా ఆలోచించే చేస్తాడు, ఏం చేసినా బాగుంటుంది;…
-
ఇంట్లో పిల్లలు లేరు… క్లారా డోలివర్, అమెరికను కవయిత్రి
నా కర్థమయింది, ఇంట్లో పిల్లల్లేరని ఇల్లు మరీ శుభ్రంగా, పొందికగా ఉంది. నేల మీద చేతుల్తో ఇష్టమొచ్చినట్టు విసిరేసిన ఆట బొమ్మలు కనిపించడం లేదు. కిటికీల మీద వేలిముద్రలు లేవు, కుర్చీల మీద గీతలు లేవు; కర్ర బొమ్మలు వరుసలో నిలబెట్టి లేవు, లేదా జంటలుగా తరలించిందీ లేదు; కాలివేళ్ళదగ్గర బాగా మురికిపట్టి చిరుగులు పడ్డ మేజోళ్ళు లేవు పోగువెయ్యడానికి; చిన్న చిన్న మరమ్మత్తు చెయ్యడానికి అన్నీ పిల్లలబట్టలతో కూడిన మేటలు లేవు ఆర్చడానికి ఏ చిన్న…
-
చిత్రపటంతో … ఆర్థర్ సైమన్స్, ఇంగ్లీషు కవి
బీరువాలోంచి విచార వదనం ఒకటి నన్ను పరికిస్తోంది… గతించిన ప్రేమకు అవశేషం నా ప్రేతాత్మకి సగ భాగం. నాకు ఇష్టమైన ఆ నిరీక్షించే కళ్ళు నన్ను పరిశీలిస్తూ ఎంతగా అభిమానించేవని… ఏమిటో ఇప్పుడు బరువైన జ్ఞాపకాల దొంతరలు ఆమె నిరీక్షించే చూపులు. ఓ నా ప్రేమ చిహ్నమా, నీకు అన్యాయం జరిగింది, తిరిగి రా: అలనాటి ప్రేమలోని బాధలన్నీ, అప్పుడు భరించి, ఇపుడు మరుగుపడినా, మళ్ళీ తిరిగిరా! వాటిని మరిచిపోకు, కానీ మన్నించు! ప్చ్! సమయం మించిపోయింది! ఏడ్చిప్రయోజనం లేదు.…
-
పైబడుతున్న వయసు… జార్జి క్రేబ్, ఇంగ్లీషు కవి
ఆరేళ్ళు గడిచిపోయాయి, ఆరుకు ముందు ఇపుడు నలభై, కాలం అలవాటుగా తన మాయలు పన్నడం ప్రారంభించింది: ఒకప్పుడు యువతుల కనులకు సొగసుగా కనిపించిన గోధుమ రంగు ఉంగరాలజుత్తు,రానున్న తెలుపు పొడచూపుతోంది; ఒకప్పుడు వెచ్చగా ఉండే నెత్తురు ఇప్పుడు చల్లబడడం ప్రారంభించింది దానితో పాటే, మనిషిని వశం చేసుకునే కాలం శక్తీ పెరగసాగింది. ఒకప్పుడు నడవడమో, స్వారీ చెయ్యడమో అలవాటు, ఇపుడు సవారీ చెయ్యాలన్న కోరిక కలగడం లేదు; ఒక మోస్తరు తొందరగా నడిచినా ఒళ్ళు వేడెక్కిపోతుంది, కాస్తంత…
-
వేసవి వాన… హార్ట్లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
దుమ్ము దట్టంగా పేరుకుంది; తెల్లగా చిరాకుగా ఉంది, అరబ్బు ఏడారి ఇసుకని కొట్టొచ్చినట్టు అనుకరిస్తూ. అడవులూ, పర్వతాలూ ఎండవేడికి కునుకుతీస్తునాయి; బయళ్ళు ఎండకి మాడిపోయి దాహంకోసం తపిస్తున్నట్టున్నాయి; చిన్న సెలయేళ్ళు వాటి కాలువలని బోడిగా విడిచిపెట్టాయి అవి ఏమిటో పోల్చుకుందికి ఒక్క చలమైనా లేకుండా; సన్నబడిపోయిన నది ఆకలితో అలమటిస్తున్న రాక్షసుడి ఎముకల్లాంటి రాళ్ళ మధ్య మెరుస్తోంది. ఒక్క సారిగా కొండలు నల్లబడ్డాయి, క్రిందని పొయ్యిలోంచి వచ్చినట్టు గాలి వేడిగా; అక్కడ ఉండడం మహాకష్టం. జూనో అసూయతో…
-
మూడు రోజులు… జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను
చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ఓహ్, నిన్నరాత్రి చూశాను సూర్యుణ్ణి కాంతి విహీనంగా చీకటి సముద్రంలోకి గుంకుతూ ‘నిన్న ‘ ఒక భయంకరమైన ప్రేతాత్మ. చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ప్రతి పొద్దూ సరి కొత్త సమస్యలతో పొడుస్తుంది అయినా, ఉత్సాహంగా, ధైర్యంగా, రంగంలోకి దిగుతాను, ‘ఈ రోజు ‘… నా పోరాటం కొనసాగిస్తాను చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! కానీ అంతా ముగిసిపోయేక, విజయం సాధించేక, ఆహా! మనసా! ఏమి చెప్పను? నా బాధలూ, అశాంతీ…
-
మధురక్షణం … మేరీ ఫ్రాన్సిస్ బట్స్, బ్రిటిషు రచయిత్రి
తీరుబాటులేని పనితో గడిచిన రోజు ముగిసింది ఇంటిపనులు చక్కబెట్టుకోడం అయింది పగలల్లా చికాకు పరిచిన బాధ్యతలు సూర్యుడితోపాటే శలవుతీసుకున్నాయి చీకటి చిక్కబడుతున్న సంధ్యవేళ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూచున్నాను గులాబి పువ్వులాంటి నా చిన్నారి నా గుండెమీద నిద్రపోతోంది. తెల్లని కనురెప్పలు పట్టు పోగు అంచుతో పల్చబదుతున్న వెలుగుని నిరోధిస్తున్నాయి ఒక చిన్ని పిడికిలి గట్టిగా బిగిసి అమ్మ చేతివేళ్ళని ఆసరాగా పట్టుకుంది మెత్తని దుప్పటి ముడతల్లో ఇంతసేపూ చురుకుగా ఉన్న పాదాలు చివరికి ఎలాగైతేనేం విశ్రాంతి…