మాటాడని పసివాడు… ఎలెన్ బార్ట్ లెట్ కరియర్

ప్రపంచమంతా తనచుట్టూ తిరగడాన్ని
పసివాడు ఊయలలో కూచుని చూస్తుంటాడు
మార్మికమైన మౌనంలో మునిగిపోయి
చుట్టూ ఎంత కోలాహలం జరుగుతున్నా;
పసివాడి తీరు పూలను పోలి ఉంటుంది
ఎవ్వరూ ఇంతవరకు
ఒక్క మాటైనా విని ఉండరు
మౌనంగా కూచున్న మా బాబు నోటంట

బిత్తరపోతూ పిల్లలవంక చూస్తాడు
వాళ్ళు నవ్వుకుంటూ తనపక్కనుంచి పోతుంటే,
ప్రతిగా వాడి ముఖంనిండా నవ్వులు విరుస్తాయి,
పచ్చని పచ్చికమీది సూర్యరశ్మి
అక్కడనుండి పూల హృదయాలలోకి ప్రవహించినట్టు;
కానీ ఇంతవరకు
ఒక్క మాటైనా వినిపించలేదు
మా ప్రాణప్రదమైన బాబు నోటంట.

మా బాబుకి అద్భుతమైన తెలివి ఉంది
చెప్పకపోయినా భావాలను చూపగలడు,
కుతూహలంతో చూసే అందరి కళ్ళూ కప్పి
ఎవరికీ తెలియని అర్థంగాని
పువ్వులూ, తుమ్మెదలూ, తేనెటీగల సంగతుల్లా.
అందుకేనేమిటి
ఇంతవరకు మా బాబు
ఒక్క మాటకూడా మాటాడనిది?

ఓ, బాబూ, నీ నీలి కళ్లలో
మౌన దేవత నవ్వుతున్నది,-
నీ మాటలు ఇకపై ఎంత విలువైనవైనా
నీ మౌనం అంతకంటే విలువౌతుంది,
మా బాబుని అందరి మనసులనీ కొల్లగొడుతూ
తను విన్నది ఏది
తిరిగి మాటాడక పోవచ్చు
పక్షుల్లా, పువ్వుల్లా, తేనెటీగల్లా.
.
ఎలెన్ బార్ట్ లెట్ కరియర్

.

Silent Baby

The baby sits in her cradle,    

  Watching the world go round,       

Enrapt in a mystical silence,   

  Amid all the tumult of sound.        

She must be akin to the flowers,      

    For no one has heard

    A whispered word    

From this silent baby of ours.

Wondering, she looks at the children,        

  As they merrily laughing pass,      

And smiles o’er her face go rippling,         

  Like sunshine over the grass

And into the heart of the flowers;    

    But never a word      

    Has yet been heard   

From this silent darling of ours.       

Has she a wonderful wisdom,

  Of unspoken knowledge a store,    

Hid away from all curious eyes,       

  Like the mysterious lore       

Of the bees and the birds and the flowers?

    Is this why no word  

    Has ever been heard  

From this silent baby of ours?

Ah, baby, from out your blue eyes  

  The angel of silence is smiling,—   

Though silvern hereafter your speech,       

  Your silence is golden,—beguiling 

All hearts to this darling of ours,     

    Who speaks not a word     

    Of all she has heard, 

Like the birds, the bees, and the flowers.

.

Ellen Bartlett Currier

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds:  Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/18.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: