వర్గం: అనువాదాలు
-
నాకు తెలుసు… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి
నా శరీరం ఎంత దుర్బలమో నాకు తెలుసు బయటి శక్తులూ, లోపలి బలహీనతలూ దాన్ని చంపగలవు; నా మనసు దివ్యస్వభావమూ తెలుసు కానీ, దాని తెలివీ, ఇఛ్ఛ కలుషితమైపోయాయి. నా ఆత్మకి అన్నీ తెలుసుకోగల శక్తి ఉందని తెలుసు కానీ అది గుడ్డిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది; నేను ప్రకృతి గారాబు పట్టిలలో ఒకడినని తెలుసు కానీ చాలా అల్పవిషయాలకీ, బలహీనతలకీ దాసుణ్ణి. నాకు జీవితం బాధామయమనీ, క్షణికమనీ తెలుసు నా ఇంద్రియాలు ప్రతిదానిచే కవ్వింపబడతాయనీ తెలుసు, చివరగా, నాకు…
-
కవన కళ … ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అరచేతిలోని గుండ్రని పండులా కవిత మౌనంగా ఉండాలి. బొటనవేలికి వేలాడుతున్న పతకాల్లా కనిపించాలి, మాటాడకూడదు. నాచు పట్టి, అరిగిపోయిన కిటికీగట్టు నాపరాయి పలకలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎగురుతున్న పక్షులగుంపులా కవిత మాటలకందకుండా ఉండాలి * చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు కవిత కాలాతీతంగా ఉండాలి. విడిచిపెడుతున్నపుడు, రాతిరిలో చిక్కుబడ్ద చెట్ల కొమ్మల్ని చంద్రుడు ఒకటొకటిగా వీడినట్టు వీడాలి పూర్తయిన తర్వాత, హేమంతపు చంద్రుడు విడిచిపెట్టే ఒక్కొక్క జ్ఞాపకంలా వదలాలి. చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు కవిత కాలాతీతంగా ఉండాలి. *…
-
దేముడు లేడు… ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి
“దేముడు లేడు” అంటాడు దుర్మార్గుడు, “అది నిజంగా ఎంత అదృష్టమో, లేకపోతే, నన్నేమి చేసేవాడో అది ఊహ కందని విషయం.” “దేముడు లేడు,”అనుకుంటాడు యువకుడు, “నిజంగా ఉండడం అంటూ తటస్థిస్తే, మనిషి ఎప్పుడూ పసివాడుగా ఉండాలని కోరుకుంటాడనుకోను.” “దేముడు లేడు, ఉండి ఉంటేనా,” ఒక వ్యాపారి అనుకుంటాడు,”ఊహకి చిత్రంగా ఉంటుంది అతను నేను ఏదో నాలుగు డబ్బులు చేసుకుంటే దాన్ని తప్పుగా తీసుకోవడం.” “దేముడు ఉన్నా లేకున్నా,” అనుకుంటాడో ధనికుడు “పెద్ద తేడా ఏమీ పడదు. ఎందుకంటే…
-
భ్రమ … మ్యూరియల్ రుకేసర్, అమెరికను కవయిత్రి
( గ్రీకు ఇతిహాసంలోని ఒక చిన్న సంఘటనని ఆధారంగా తీసుకుని ఒక పదునైన స్త్రీవాదకవిత అల్లింది కవయిత్రి, ఏ ఆర్భాటాలూ, ప్రవచనాలూ లేకుండా. కవిత ముగింపు ఎంత సునిశితంగా చేసిందో గమనించగలరు.) . చాలా కాలం గడిచేక ఈడిపస్, వయసు ఉడిగి, గుడ్డివాడై రోడ్డుమీద నడుస్తున్నాడు. అతనికి బాగా పరిచయమున్న వాసన ముక్కుపుటాలను తాకింది. అది సింహిక (sphinx)ది. ఈడిపస్ అన్నాడు:”నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది. నేను నా తల్లిని ఎందుకు గుర్తించలేకపోయాను?” “నువ్వు తప్పు సమాధానం చెప్పేవు,”…
-
కిటికీ ప్రక్క బాలుడు… రిచర్డ్ విల్బర్, అమెరికను కవి
మంచుమనిషి (స్నోమాన్*) అలా ఒక్కడూ చీకటిపడ్డాక చలిలో నిలబడటం చూసి తట్టుకోవడం అతనివశం కాలేదు. ఈదురుగాలి ఇక రాత్రల్లా పళ్ళుకొట్టుకునేలా గడగడ వణికించడానికి సిద్ధం అవడం చూసి ఆ చిన్ని కుర్రాడికి ఏడుపొచ్చింది. బహిష్కృతుడైన ఏడం స్వర్గం వీడుతూ చూసిన చూపువంటి దైవోపహతుడైన చూపు చూస్తున్న పాలిన ముఖం, తారు కళ్ళుకలిగిన ఆ బొమ్మని కన్నీరు నిండిన కళ్ళలోంచి అతని చూపులు చేరకున్నాయి. అంత పరిస్థితిలోనూ, మంచుమనిషి సంతృప్తిగానే ఉన్నాడు, అతనికి ఇంటిలోనికి పోయి చనిపోవాలని లేదు.…
-
కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు, మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు, రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి. ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు, మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని. అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు, నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు. అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే జతగా మనం…
-
లుసీల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు
మనం కవిత్వం, సంగీతం, లలితకళలు లేకుండా బ్రతకొచ్చు; మనం మనసూ, హృదయం లేకుండా బ్రతకొచ్చు; మనం స్నేహితులూ, పుస్తకాలూ లేకుండా బ్రతకొచ్చు; కానీ నాగరిక మానవుడు వంటవాళ్ళు లేకుండా బ్రతకలేడు. పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు… వేదన తప్ప జ్ఞానం ఏమి మిగులుస్తుంది? ఆశలేకుండా బ్రతకొచ్చు… ఆశ అంటే మోసం తప్ప మరేమిటి? ప్రేమ లేకుండా బ్రతకొచ్చు… చింతించడానికి తప్ప ఆవేశం దేనికి పనికొస్తుంది? కానీ అన్నం తినకుండా బ్రతకగలిగిన మనిషెక్కడున్నాడో చూపించండి? . ఓవెన్ మెరెడిత్ 9…
-
మత్తులో పడండి… చార్లెస్ బోద్ లేర్, ఫ్రెంచి కవి
నిత్యం మత్తులో జోగండి అంతే! అది చాలా అవసరం! భయంకరమైన కాలం బరువు మీ భుజాలను పుండు చేసి భూమికి కృంగదీసే అనుభూతి పొందకుండా ఉండాలంటే పూటుగా తాగి ఆ మత్తులో అలాగే ఉండండి! ఏమిటి తాగాలి? మదిరో, కవిత్వమో, శీలమో, ఏదో ఒకటి. కానీ, తాగడం మాత్రం మరవొద్దు. ఒక్కోసారి మీకు ఏ రాజప్రాసాదాల్లోనో, గోతిలోని పచ్చగడ్దిమీదో, అంధకారమయమైన మీ ఒంటరి గదిలోనో మీ మత్తు దిగిపోయో, ఎగిరిపోయో పొరపాటున స్పృహ వస్తే గాలినో కెరటాన్నో…
-
అసుర సంధ్యవేళ… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
Hear this lovely poem here పగటికీ రాత్రికీ మధ్య మునిమాపులో చీకటి నలుదిక్కులా ముసురుకునే వేళ పగలుచేసే పనులకు విశ్రాంతి సమయం వస్తుంది దాన్నే (బాల)”అసుర సంధ్యవేళ” అంటారు. సరిగా నా నెత్తిమీది గదిలో పిల్లల పాదాల చప్పుడు వినిపిస్తోంది, తలుపు అప్పుడే తెరుచుకున్న ధ్వని చిన్నారుల తియ్యని మెత్తని గుసగుసలు. నే చదువుకునే గది దీపం వెలుగులో పెద్ద హాలులోని మెట్లు దిగుతూ గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా, బంగారు జుత్తులో ఈడిత్…
-
శలభము చెప్పిన పాఠము… డాన్ మార్క్విజ్, అమెరికను
(గమనిక: ఈ కవిత బొద్దింకలో ప్రవేశించిన కవి చెబుతున్నాడు.) ఓ రోజు సాయంత్రం నేనో దీపపు పురుగుతో మాటాడుతున్నాను అది విద్యుత్ బల్బులోకి ఎలాగైనా దూరిపోయి అక్కడి ఫిలమెంటుమీద మాడిపోవాలని ప్రయత్నిస్తోంది నే నడిగాను, మీరెందుకు ఇలాంటి సాహసాలు చేస్తారని. అది ఈ పురుగులకి సంప్రదాయమా? “అది బల్బు గనుక, గాజు తొడుగుంది గనుక సరిపోయింది గాని, దానికి బదులు అక్కడ ఏ కొవ్వొత్తో ఉండి ఉంటే, ఈ పాటికి బూడిదకూడా మిగలకుండా మాడిపోయేదానివి నీకు బుద్ధిలేదా?”…