వర్గం: అనువాదాలు
-
అసలు లేని వడ్డీ… రూమీ, పెర్షియన్ కవి
తినబొయేదానిమీద ఆశే, ప్రేమికుని నిలబెట్టేది; చేతిలో రొట్టె ఉండనక్కరలేదు; ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు అస్తిత్వానికి బానిస కాడు. ప్రేమికులకి అస్తిత్వంతో పనిలేదు. ప్రేమికులు అసలు లేకుండా వడ్డీ గణిస్తారు. రెక్కలులేకుండానే ప్రపంచం చుట్టివస్తారు; చేతులు లేకుండనే, పోలోబంతిని మైదానం బయటకి కొనిపోతారు. వాస్తవం ఆచూకీ పట్టుకోగలిగిన డార్విష్ అతని చేతులు ఖండించబడినా, బుట్టలల్లగలిగేవాడు ప్రేమికులు తమ డేరాలని శూన్యంలో నిలబెట్టేరు వాటి లక్షణం, గుణం రెండూ శూన్యాన్నిపోలినవే. . రూమీ పెర్షియను కవి The lover’s food…
-
గోడలు…. కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
మరో ఆలోచనా, జాలి, బిడియమూ లేకుండా వాళ్ళు నా చుట్టూ గోడలు కట్టేరు, ఎత్తుగా… మందంగా. ఇప్పుడు నేనిక్కడ కూచుని నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాను. నేను మరొకటి ఆలోచించలేకున్నాను; ఈ దుస్థితి నా మనసు నమిలేస్తోంది కారణం, ఆవల నేను చెయ్యవలసింది చాలా ఉంది. వాళ్ళీ గోడలు కడుతున్నపుడు, నేనెలా పోల్చుకోలేకపోయానబ్బా!!! నా కెన్నడూ మేస్త్రీలు కనిపించలేదు, పిసరంత చప్పుడైనా లేదు. నేను గ్రహించలేనంత నేర్పుగా నన్ను బాహ్యప్రపంచానికి దూరం చేసేసేరు. . కన్స్టాంటిన్ కవాఫిజ్ April 29…
-
ప్రేమ ఒక దృష్టిలోపం … సిల్వియా ప్లాత్, అమెరికను
చూసే దృష్టికోణం ద్వైదీభావనతో మోసగిస్తుంది: రైలుపట్టాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి, మరెక్కడోకాదు, అసంభవమైన మనోనేత్రంలో. సముద్ర తరంగాలు నింగిని కడుగుతున్నట్టు భ్రమింపజేసే క్షితిజరేఖను దాటిపోదామని మేధోసాగరాలమీద దిగంతరాలకు వెళుతున్న కొద్దీ, అవి వెనుకంజవేస్తూనే ఉంటాయి” ఇది నిజమని మనం అంగీకరిస్తే, ఒకరి దేముడు మరొకరికి దయ్యంగా కనిపించడం మనకి ఆశ్చర్యం కలిగించదు; లేదా, సప్తవర్ణాల సూర్య కాంతి, నీడలోని అనేకానేక వన్నెలుగా కనిపించవచ్చు; సందేహాల ఊబిలో చిక్కినపుడు, ఎటూ తేల్చుకోలేకపోడమే మనజీవితాలకి అధిగమించలేని పెద్ద అవరోధం .…
-
సాగరసుమాలు… ఇ.జె.ప్రాట్, కెనేడియన్ కవి.
అవి విహరిస్తూ ఒక క్షణంలో చేసిన విన్యాసాన్ని వివరించడానికి భాషలో తగిన ఉపమానాలు లేవు… రజతము, స్ఫటికము, దంతము అన్నీ కళతప్పేయి. వినీలాకాశం మీద చెక్కినట్టున్న లిప్తపాటు కదలికలేని ఆ దృశ్యానికి సాటిలేదు, ఆ రెక్కల కదలిక, తేలి తేలి ఎగిరే తీరూ ముందు ఉష్ణమండలంలో నీలి నేపథ్యంలో తేలిపోయే చుక్కలూ పర్వతాగ్రాలమీద కురిసిన మంచూ దిగదుడుపే. సూర్యుడి ఏడురంగుల్ని పట్టుకున్న కొండకొమ్ముల్లోనో మధ్యలో ఎక్కడో లంకల్లో కనిపించిన పచ్చికమైదానాల్లోనో ఒకదాని వెనక ఒకటి ఇపుడు క్రిందకి…
-
యుద్ధభూములమీదుగా తూరుపుగాలి … ఏలన్ డూగన్
రాత్రల్లా కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేసి వచ్చింది గాలి ఈ ఉదయం దగ్గరగా దువ్వుకున్న నీ జుత్తును చెదరగొడుతూ. అది దీర్ఘప్రయాణం చేసి, త్రోవమరచిన సముద్రపక్షుల్ని తనతో తీసుకొచ్చింది, పాడుతూ. ఎప్పటివో పురాతన గీతాలు పాత రణస్థలాలూ, శ్మశానాలనుండి, కొత్తచోట్లలో కొత్తగా వినిపిస్తూ. అవి కొత్తగా వినిపించడానికి వసంతం కారణం కావచ్చు, నీ కురులలో బద్ధకంతీర్చుకుంటున్న నిన్నటి తెమ్మెరలా. మనదికాని వాతావరణం ఏదైనా ఎంతో కొత్తగా కనిపిస్తుంది. దాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, గుండెనిండా పీల్చుకుంటూ, ఆ…
-
చెడుసావాసాలకి వ్యతిరేకంగా… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి
ఆడుతున్నవాళ్ళతో నేనెందుకు కలవాలి వాళ్ళతో జతకలవడం నాకిష్టం లేదు. వాళ్ళు తిట్లూశాపనార్థాలు పెడతారు, ఎన్నడూ ప్రార్థించరు అన్ని రకాలపేర్లూ పెట్టి పిలుస్తారు, పోట్లాడుతారు. నాకు ఆ పోకిరీ పాట వినడమంటే అసహ్యం వాళ్ళ మాటలు నా చెవులకు కఠోరంగా వినిపిస్తాయి వాళ్ళు మాటాడే భాష ఉపయోగించి నేను నా నాలికని అపవిత్రం చేయ సాహసించను ఆ మూర్ఖులనుండి నా దృష్టి తప్పిస్తాను ఆ ఎగతాళి చేసే వాళ్ళతో కూడమన్నా కూడను. నేను తెలివైన వాళ్ళతో అడుగులు కలుపుతాను…
-
మనిషి మాట… శామ్యూల్ రాత్, అమెరికను
నాకు తెలుసు సందేహంగా కదలాడే దాని అలలగురించి అవి పురాతన ఆలోచలా తీరాలవెంట ఎప్పటిలా తిరుగుతుంటాయి; దాని రాగద్వేషాలూ; తుఫానులు నేర్పినవీ, సహజమైనవీ అవస్థలు. ఎండనీ, తుఫాన్లనీ భయం భయంగా ఎదిరించే ఇనుప మెరుగులక్రింద మహాసాగరాలలాగే కొన్ని లక్షల సమాధుల్ని దాచుకుంటుంది; సముద్రంలాగే పైకెగసిపడుతుంది జీవంతో ఉట్టిపడుతూ, వెనువెంటనే జ్ఞాపకాల్లోకి జారుకుంటుంది ఒకవంక కేశకుహరాల్లోకి పరుగులు తీస్తూనే. జీవితపు హృదయఫలకం మీద సృష్టికర్త మూడు మహా నిశ్శబ్దాలు రాసిపెట్టాడు: పుట్టకముందు మరొకసారి చైతన్యంలోకి వస్తూ మృతులుచేసే కదలికల…
-
పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవి
కొందరు పక్కవాళ్ళది కొరికెస్తారు మోచెయ్యో, కాలో, ఏది దొరికితే అది. దానిని పళ్ళ మధ్య బిగబట్టి వీలయినంత వేగంగా పరిగెడతారు. దాన్ని మట్టిలో కప్పెస్తారు. అందరూ అన్ని దిక్కులా పరిగెడతారు వాసన చూడ్డం, వెతకడం, వాసనచూడ్డం, వెతకడం భూమినంతటినీ తవ్వెస్తారు. అదృష్టం బాగుంటే వాళ్లకో చెయ్యో లేదా కాలో, మరొకటో దొరుకుతుంది ఇప్పుడిక కొరకడం వాళ్ళ వంతు. ఈ ఆట మహా జోరుగా సాగుతుంది చేతులు దొరికినంత కాలం కాళ్ళు దొరికినంతకాలం అసలేదో ఒకటి…
-
జీవనామృతం ప్రేమే… రూమీ, పెర్షియన్ కవి
భగవంతునిపై ప్రేమను మించి మిగిలిన సర్వస్వమూ అది అమృతాశనమైనప్పటికీ ఆత్మకి ఎంత వేదనాత్మకము? జీవనామృతాన్ని చేజిక్కించుకోకుండానే మృత్యువును సమీపించడం లాంటిది. . రూమీ Everything other than love for the most beautiful God though it be sugar- eating. What is agony of the spirit? To advance toward death without seizing hold of the Water of Life. . Rumi Persian Poet, Sufi 13th…
-
Wait For Me… Sivasagar, Telugu, Indian
Through the song that was snapped by noose the incarcerated cataract the wounded footpath the breath of life, and the sonority of violin I return I resurrect Look for me Wait for me Through the sensitive grain of sand, Summer’s first drop of rain the open veins of the flute the ultimate star on the…