వర్గం: అనువాదాలు
-
నీకు పెనుగాలంటే భయమా?… హామ్లిన్ గార్లాండ్, అమెరికను
నీకు పెనుగాలి హోరంటే భయమా? వర్షం కత్తిలాకోస్తుంటే భయమా? ఫో! వాటిని ఎదుర్కో. వాటితో పోరాడు! మళ్ళీ ఆటవికుడివయిపో! తోడేల్లా ఆకలితో అలమటించి చలిలో వడకట్టిపో! వెళ్ళు, వెళ్ళు, కొంగలా బురదలో నడూ. నీ అరచేతులు బండబారుతాయి, నీ బుగ్గలు ఎండకి నలుపెక్కుతాయి, నువ్వు చింపిరిజుత్తుతో, అలసి, నల్లనడతావు. అయితేనేం, నువ్వొక మనిషిలా తిరుగుతావు. . హామ్లిన్ గార్లాండ్ (September 14, 1860 – March 4, 1940) అమెరికను . . DO YOU…
-
ఒక చిన్ని పక్షికి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఒక రోజు నువ్వు గూడునుండి రాలిపడడం చూసేను నీ రెక్కకి గాయమై, నువ్వు బెదురుచూపులు చూస్తున్నావు. నీ గాయాన్ని నయం చేసి నెమ్మదిగా నీ భయంపోగొట్టాను అప్పుడు నువ్వు ధైర్యంగా కూస్తూ పాడటం మొదలెట్టావు. నిన్ను పెంచుకుందామని నీకొక పంజరం తెచ్చాను నీకిక్కడ అడవి అంతగా తెలియదు కనుక నువ్వు కొద్దికాలంలోనే ఆ విషయం మరిచిపోయి నాతో కలిసి ఉండటానికి నిశ్చయించుకుంటావని అనుకున్నాను. కానీ వేసవి రాగానే, నీలో ఆశలు మోసులువేశాయి ఎక్కడికో అలా దూరదూరంగా ఎగరడానికి.…
-
యువత – యాత్రికుడూ…. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఓ వృద్ధయాత్రికుడా, చాలా దేశాలు తిరిగావు, ప్రేమలేని తావు ఎక్కడన్నా కనిపించిందా? ఏ సముద్రతీరమైన ఫరవా లేదు ఉంటే, దయచేసి నాకు విశదీకరించు. నేను దేముడంటే విసిగిపోయాను నాకతన్నించి దూరంగా పారిపోవాలనుంది దిగంతాల అంచునున్న సముద్రతీరాలకి నావవేసుకుని వెళ్ళాలన్నా నేను సిద్ధమే. ప్రేమలేని రేవు నాకు తెలిసినదొకటుంది అక్కడికి చేర్చే నావ నీ చేతిలోనే ఉంది నీ కత్తిని నీ గుండేల్లోకి బలంగా దింపు నువ్వు ఆ తీరానికి తిన్నగా చేరుకుంటావు. . సారా టీజ్డేల్ (August…
-
అతను వాళ్ళ ఆటలో కేవలం ఒక పావు … బాబ్ డిలన్, అమెరికను గాయకుడు
Whether it is America or it is India, it is easy to flare up passions in the name of any divisive factor you can conceive of. It is for the bounden duty of intellectuals to repair the damage caused by such vested interests instead of backing them up identifying with their cause. “Life and right to survive”is…
-
ఓ గులాబీ, పోయి చెప్పు… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి
ఓ గులాబీ! ఆమె సమయాన్నీ, నా సమయాన్నీ వృథా చేసే ఆమెకి పోయి చెప్పు, ఇప్పుడు ఆమెను నీతో సరిపోలుస్తున్నానని ఆమెకి తెలుసు గనుక ఆమె ఎంత అందంగా మనోహరంగా ఉంటుందో! ఆమె సౌందర్యాన్ని తిలకించడాన్ని నిరసించే ప్రాయంలో ఉన్న ఆమెకు చెప్పు నువ్వేగాని మనిషిజాడలేని ఎడారిలో పుట్టి ఉంటే నిన్ను కీర్తించేవాళ్ళు లేక సమసిపోయేదానివని. వెలుగుపొడ సోకని ఎంతటి అందానికైనా విలువ అల్పమని చెప్పు ఆమెని నలుగురిలోకీ రమ్మను ఆమెను అందరూ కోరుకోడాన్ని సహించమను ఆమెని పొగిడితే…
-
హృదయంలేని ప్రియురాలు … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఓ ప్రకృతి కాంతా! నీ పాదాలముందు మోకరిల్లే వాడిని పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా అని అడగవు. మనస్ఫూర్తిగా ఎవడు నిన్ను సేవిస్తూ గీతాలు పాడినా, గీతలు గీసినా విషాదంనుండి వినోదంవరకూ స్పష్టంగా మోహనంగా రూపుకట్టే అసంఖ్యాక ఛాయల నీ సౌందర్యవిలాసాన్ని పదిలంగా దాచుకుంటాడు. అతని స్తోత్రపాఠాల పరిమళ ధూపం నిను చుట్టుముట్టుతుంది ఒకవంక అతను నీ పాదాలముందు మోకరిల్లుతూంటే. నీవే గనక హృదయంలేని ప్రియురాలిగా మారినట్టయితే పాపం అతని పేద హృదయం మనశ్శాంతికై వెంపర్లాడుతుంది. అపుడు అతనికి నీమీద…
-
వాళ్ళిచ్చిన ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? … ఓసిప్ మాండెల్ స్టామ్, రష్యను
ఇంత స్వంతమై, నాతో ఇంత ఆత్మీయంగా మసిలే ఈ శరీరాన్ని నేనేం చేసుకోను? బ్రతికున్నందుకూ, ప్రశాంతంగా ఊపిరిపీలుస్తున్నందుకూ, తెలిస్తే నాకు చెప్పు, ఎవర్ని స్తుతించాలో? నేనే పువ్వునీ, తోటమాలిని కూడా ఈ అఖండ భూగృహంలో నేను ఒంటరివాణ్ణి కాను. నేను విడుస్తున్న ఈ వెచ్చని ఊపిరి కాలమనే నిర్మలమైన అద్దంమీద నువ్వు చూడగలవు. అందులో ఇప్పటిదాకా కనీకనిపించని ఒక ఆకారం స్పష్టంగా రూపుకట్టి ఉంది. ఈ ఊపిరి దాని జాడ మిగల్చకుండా ఎక్కడికో నిష్క్రమిస్తుంది కానీ, ఈ…
-
తెల్లబడుతున్న ప్రకృతి… జేమ్స్ డి సెనెటో, సమకాలీన అమెరికను కవి
నాకు తెలుసు అటకమీది కిటికీదగ్గర చంద్రవంకల్లాంటి మంచుపలకలు ఈ హేమంతంలో పేరుకుంటాయి. వాటిలోంచి ప్రసరించే సూర్యకిరణాలు ఎర్రగా, నీలంగా విడివడుతూ నా కళ్ళలో ప్రతిఫలిస్తుంటాయి. అక్కడి చల్లదనంలో అచేతనత్వంలో నేను నా ఊహల్లో సిగరెట్లు తాగుతూ ప్రపంచం చలికి గడ్డకట్టుకుపోవడం గమనిస్తాను. ఆ నా ఏకాంతంలో నా కిటికీప్రక్కన దూదిమంచు తేలియాడడం గమనిస్తున్నాను. నేనున్న అనువైన ప్రదేశంనుండి చెట్టు చివరలనుండి క్రిందనున్న కంచెమీదకి ఒక మంచు పలక ప్రయాణాన్ని చూడగలుగుతున్నాను. క్రమక్రమంగా పొదలన్నీ “క్రంబ్ కేకు”ముక్కల్లా మారుతున్నై.…
-
నాకు ప్రేమగా పలకరించే గతవ్యధల ముఖాలంటేనే ఇష్టం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి
స్నేహంగా పలకరించే పాతవ్యధల ముఖాలే నాకిష్టం; వాటికి తెలియని రహస్యాలంటూ నాకు ఏవీ లేవు. అవెంత పాతవంటే, అప్పుడెప్పుడో, ఎంత పరుషమైన మాటలు నేను వినాల్సొచ్చిందో అవి ఈపాటికి మరిచిపోయి ఉంటాయి. తీక్ష్ణమైన, కనికరంలేని కొత్త వ్యధలచూపులంటే నాకసహ్యం; ఎప్పుడూ ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను పట్టుకుని అలా నిలబడి నన్నే పరీక్షిస్తుంటాయి. పాత వ్యధలు ఎంత మార్పుకు లోనయ్యాయో గుర్తుంచుకోగలిగితే బహుశా, నేను మరింత ధైర్యంగా ఉండగలిగేదాన్నేమో! . కార్ల్ విల్సన్ బేకర్ 13 Oct 1878…
-
శ్రామికుడు…. స్కడర్ మిడిల్ టన్, అమెరికను కవి
ష్! నా గుండెలో పనిచేసే శ్రామికుడా! నువ్వలా పోటుపెడుతుంటే, నాకు నొప్పెడుతోంది. రాత్రీ, పగలూ లేక, నీ సుత్తి బాదుతూనే ఉంటుంది నువ్వేమిటి నిర్మిస్తున్నావో నాకు తెలియడం లేదు. నీ శ్రమకి నాకు అలుపు వచ్చేసింది. చక్కగా ప్రకాశిస్తున్న కొండమీద దారితప్పిన ఒంటరి గొర్రెలా నాకు నిశ్చలంగా ఉండాలనుంది. విశ్రాంతిలేని నీ పిచ్చి బాదుడు ఆపు! ఉత్సాహం తగ్గించుకుని తెలివిగా మసలుకో! నువ్వు కలకాలం నిలిచేదేదీ నిర్మించడం లేదు. నన్ను కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోనీ! .…