వర్గం: అనువాదాలు
-
ప్రజాస్వామ్యం… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి

ప్రజాస్వామ్యం భయంద్వారా, రాజీద్వారా, ఈ రోజు కాదు, ఈ ఏడు కాదు ఏనాటికీ సాధించబడదు. నా రెండు కాళ్ళ మీద నిలబడడానికీ, కాసింత నేల కొనుక్కుందికీ అవతలివ్యక్తికి ఎంతహక్కుందో నాకూ అంతే హక్కు ఉంది. దేని సమయం దానికి కావాలి అని అందరూ అనడం విని విని విసిగెత్తిపోయింది. రేపన్నది, మరో రోజు నేను చచ్చిన తర్వాత నాకు స్వాతంత్య్రం అవసరం లేదు. రేపటి రొట్టితిని ఈ రోజు బ్రతుకలేను. స్వాతంత్య్రం గొప్ప అవసరంలో పాతిన బలమైన…
-
ఛైర్మన్ టామ్ తో ఏమన్నాడు?… బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి
కవిత్వం రాస్తావా? అది ఖాళీగా ఉన్నప్పుడు చేసె వ్యాసంగం. నేను బొమ్మ ట్రెయిన్లు నడుపుతాను. ఆ “షా” ని చూడు. అతను పావురాలు పెంచుతాడు. కవిత్వం పనేమీ కాదు. ఒక్క చెమటచుక్క కారదు. దానికెవడూ డబ్బులివ్వడు. అంతకంటే నువ్వు సబ్బులకి ప్రచారం చెయ్యడం మెరుగు. కళ, అంటే సంగీతం; లేదా నాటకం, The Desert Song సంగీత రూపకంలో నాన్సీ కోరస్ లో పాడింది తెలుసా. ఏమిటీ? వారానికి 12 పౌండ్లు కావాలా… నీకు పెళ్ళయింది. అవునా.…
-
Before You Embark upon a Search… Mahesh, Telugu Poet
Ah! At last, I could make out. I was sitting blissfully under the shade of a tree. With lays of unseen birds Sweet scent of flowers, A cool breeze, leaves turned upon me, and A train of travellers criss-crossing And the tales of adventures they shared. never for once my mind turned towards…
-
ఒక జ్ఞాపకం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. రాత్రి నిర్మలంగా, ప్రకాశంగా ఉంది, ఆ చోటు గుర్రాలశాల వాసనేసింది; మేజాకి చేరబడి, చలిమంటకేసి చూస్తూ కూచున్నాం, కొండకొమ్మున ఆరుబయట ఆకాశం క్రింద వెన్నెట్లో పడుక్కున్నాం; గాలి ఈలలు వేస్తూనే ఉంది,అంతలోనే సూర్యోదయం కాజొచ్చింది. బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. నువ్వో ఆపిలు తిన్నావు, నేనో నేరేడుపండు తిన్నాను,…
-
సంగీత స్తుతి… రైనర్ మారియా రిల్కే, బొహీమియన్-ఆస్ట్రియన్ కవి
సంగీతం: శిల్పాల ఊపిరి. బహుశా చిత్రాల మౌనం. భాష ఏదైనా దాని శబ్దసర్వస్వమంతా ఆ పొలిమేర దాటలేదు. ఓహ్! మర్త్యహృదయాల స్పందనలపై కాలం నిలుకడ. సంగీతమా! ఈ అనుభూతులెవరికోసమని? ఈ అనుభూతుల్ని ఎలా పరివర్తిద్దామని? … శ్రవణదృశ్యాలుగా రూపుదిద్దడానికా? ఓ అపరిచిత సంగీతమా… నీ హృదయాంతరం మా ఆత్మ జనితం. మా అంతరాంతర కుహరసీమ ఛేదించుకుని, త్రోవచేసుకు బయటపడి మమల్ని ముంచెత్తుతుంది. మా అంతరంతరాలలోని తావు ఎదురుగా సాక్షాత్కరించడం, ఎంత పవిత్రమైన ప్రస్థానం! చేజాపుదూరంలో, గాలికి అవతలి…
-
భరతవాక్యం … బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి
జీవిత చరమాంకంలోకి వచ్చిన వాళ్ళకి మిగిలేది తమజీవితం గురించిన పునశ్చరణ, మూల్యాంకనం చేసుకోవడమూను. ఎక్కువ శాతం అందులో సంతృప్తికంటే అసంతృప్తే ఉంటుంది. అందుకే (వ్యక్తిగత ప్రమాణాలననుసరించి) ఎవరికి వారు జీవితంలో సఫలత సాధించిన వారి గురించి వినడానికి ఇష్టపడతారు. ఇక్కడ “నిశ” చీకటి గాని రాత్రి గాని కాదు. మృత్యువు; మదిర … అమృతసేవనానికి అర్రులుజాచడం. ఎవరు ఎన్ని సాధించినా సాధించకపోయినా, లేక సాధించామనో సాధించలేకపోయామనో అనుకున్నా, వాళ్ళగురించి ఏదీ మిగలదు. వాళ్ళు పోగొట్టుకున్నదీ లేదు. మిగిల్చిపోయిందీ…
-
మరో ట్రాయ్ ఎక్కడుంది? … విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి
Maud Gonne Picture Courtesy: Wikipedia ఇది యేట్స్ తన ప్రియురాలు, ఐరిష్ నటి, విప్లవకారిణి Maud Gonne మీద వ్రాసిన కవిత. ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని తీసుకుని (హెలెన్ కోసం ట్రాయ్ పట్టణం దహించబడడం), ఒక విలక్షణమైన ప్రతిపాదన చేస్తున్నాడు: అందం నిప్పులాంటిది. అది ఇతరులనైనా దహిస్తుంది. తనని తానైనా దహించుకుంటుంది. “యేట్స్ ప్రేయసి Maud Gonne కోసం ఇప్పుడెవరూ యుద్ధం చెయ్యడం లేదు గనుక (ఇది అతని ఊహ మాత్రమే), ఆమె తన…
-
ప్రేమంటే ఇదే… రూమీ, పారశీక కవి
ప్రేమంటే ఇదే: ఎరుగని విహాయస పథాల్లోకి ఎగిరిపోవడం. ప్రతి క్షణం కొన్ని వందల తెరలు తొలగేలా చేసుకోవడం . మునుముందుగా, జీవితంపై మమకారాన్ని విడిచిపెట్టడం, చివరకి, అడుగువెయ్యకుండానే, ముందడుగు వెయ్యడం; ఈ ప్రపంచం అగోచరమని నిశ్చయించుకోవడం, చివరకి, ‘నేను’ గా కనిపిస్తున్నదాన్ని ఉపేక్షించడం. హృదయమా! ఇటువంటి ప్రేమికుల సమూహంలో ప్రవేశించగలగడం ఎంతో అదృష్టమని నే చెప్పలేదూ? చూపుల పరిధిదాటి చూడగలగడం వంటిది; హృదయాంతరం చేరుకుని అనుభూతి చెందడం వంటిది. . రూమీ (30 September 1207 –…
-
What the Thunder Had said… Vadrevu Chinaveerabhadrudu, Indian Poet
One early afternoon of Chaitra, As I was lazying with ambulant nap Under the shades of Mango grove in the village, The thunder started its conversation. Like mushrooms that shoot up At the first showers of summer rain, For that roll of thunder There was such a commotion within, as though Some eons-old deep…
-
సహజమైన ఆశ… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
నశ్వరమైన ఈ మట్టికి ఎక్కడైనా మరో ప్రపంచం ఉందా, ప్రాణంపోసుకుని వెచ్చగా వెనకటిలా ఉండడానికి? నా చుట్టూ ఉన్న దేదో అటువంటి అవకాశం ఉన్నాదని చెబుతోంది. లేకుంటే నిష్కారణంగా ఎందుకు మన స్వభావం అటువంటి ఆశలు కల్పించుకుంటుంది? అటువంటి అవకాశం ఉంటుందన్నది ఈ ప్రకృతి భవిష్యవాణి కూడా. అందుకే అంతభద్రంగా దాచిన మహోన్నతమైన రహస్యాన్ని విప్పిచెప్పడానికి ప్రతీదీ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. శాశ్వతత్వం మీద ఎంతోఆశ ఉండబట్టే, కాలంకూడా అంత ధీమాగా ముందుకి నడుస్తోంది ఆ ప్రశాంతస్థితినందుకుని విశ్రాంతి…