వర్గం: అనువాదాలు
-
నల్లపిల్ల మరణం… కౌంటీ కలెన్, అమెరికను కవి

ఆమె గుండెలమీద రెండు తెల్ల గులాబులతో తలదగ్గరా, కాళ్ళదగ్గరా రెండు తెల్ల కొవ్వొత్తులతో నల్ల ‘మెడోనా’ లా ఆమె సమాధిలో పరుంది. పెళ్ళికొడుకు మృత్యువుకి ఆమె పట్ల ప్రేమ. తల్లి ఆమెని పెళ్ళికూతురులా అలంకరించడానికి ఆమె ప్రధానపుటుంగరాన్ని తాకట్టు పెట్టింది; ఈ రాత్రి తనను తాను చూసుకుని పెళ్ళికూతురు గర్వంగా నృత్యం చేస్తూ ఆడుతూ పాడుతుంది. . కౌంటీ కలెన్ (30 May 1903 – 9 January 1946) అమెరికను కవి . . A…
-
దేముడి పక్షపాతం … అర్నా బాంటెమ్, అమెరికను కవి

బంగరుదేహచాయగలవారికి దేముడు వయసులో ఉన్నప్పుడు అన్నీ అనుగ్రహిస్తాడు ఎంతో ఆసక్తితో, వెదుకాడే కళ్ళకు అనతికాలంలోనే కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ వారి కలలన్నీ పండేలా చూస్తాడు. నీలికళ్ళ వారికి పెద్దపెద్ద భవంతులూ అందులో అన్నిదిక్కులా తిరిగే కుర్చీలూ, ఎన్నోసార్లు నేలమీదా, ఓడల్లోనూ ప్రయాణాలూ, కాపలాకి అంగరక్షకుల్నీ, రక్షకభటుల్నీ అనుగ్రహిస్తాడు. దేముడికి నల్లవాడిగురించి అంత శ్రమపడ నవసరం లేదు అతని కన్నీటిపాత్రని తరచు నింపుతూ ప్రోత్సాహకంగా అప్పుడప్పుడు ఒక చిరునవ్వు అనుగ్రహిస్తే చాలు. దేముడు చిన్నవాళ్ళని వారి మనోకామనల…
-
అప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి

నువ్వూ నేనూ అప్పచెల్లెళ్ళం ఇద్దరం ఒక్కలా ఉంటాం. నువ్వూ నేనూ ఇద్దరం ఒకతల్లి బిడ్డలం. నువ్వూ నేనూ ఒకరితప్పులు మరొకరు సరిదిద్దుతూ ఒకరికొకరు సహకరించుకుంటాం. నీకూ నాకూ పోకిరీవాళ్ళన్నా మాదకద్రవ్యాలన్నా గొప్ప భయం. నువ్వూ నేనూ ఒకసారి పర్డీ స్ట్రీట్ నుండి తుళ్ళుతూ తేలుతూ వచ్చినప్పుడు నిన్నూ నన్నూ చూసి అమ్మ నవ్వుతూనే తలతాటిస్తూ మందలించింది. నువ్వూ నేనూ ఇద్దరం పిల్లల్ని కన్నాం ఇద్దరికీ ముప్ఫై ఐదేళ్ళు పైబడ్డాయి కొంచెం నల్లబడ్డాం మన జుత్తు కూడా పలచబడింది…
-
A Teasing Phrase… Yakoob, Telugu Poet, India

Once a beautiful idea molds itself into a phrase, And if you do not appropriate it instantly, You are done. It suddenly disappears into ether! However much you long for it, you can’t recall. Search wherever you like, you can rarely find it. And even in that rare unlikely chance event, Like a depetalled rose,…
-
తెల్లవారుఝాము వచ్చిన కల … లీ చింగ్ చావో, చీనీ కవయిత్రి

ఈ కవితలో చాలా కుతూహలమైన విషయాలున్నాయి : తెల్లవారుఝామున వచ్చిన కల నిజమౌతుందన్న నమ్మకం, అక్కడి ప్రజల్లో కూడా ఉండేదన్నమాట. దాన్ని మూఢనమ్మకంగా గుర్తించిన మేధావి వర్గం కూడా ఉండేదన్నమాట. మనసులో చాలా గాఢంగా ఉన్న కోరికలే కలలరూపంలో వస్తాయని ప్రతీతి. ఇష్టమైన కలలు వచ్చినపుడు ఆ కలలలోంచి బయటపడడానికి మనసు ఇష్టపడదు. అందుకే ఆ సమయంలో ఎవరైనా మేలుకొలపబోతే విసుక్కుంటాం. లేవవలసిన అవసరం వస్తే అయిష్టంగా బయటపడతాం.ఆ కలనే పదే పదే నెమరువేసుకుంటాం. మేధావులు మేధావులతో…
-
పొద్దు పోయింది… తూ-ఫూ, చీనీ కవి

ఆలమందలూ, జీవాలూ ఎప్పుడో ఇల్లు చేరాయి,పసులదొడ్డి ద్వారాలు మూయబడ్డాయి. స్పష్టమైన ఈ రేయి, తోటకి దూరంగా పర్వతాలమీదా నదులమీదా గాలి ఎగరగొట్టినట్టు చంద్రుడు పైకి లేస్తున్నాడు. ఎత్తైన, నల్లని చీకటి కొండగుహల్లోంచి సెలయేళ్ళు పలచగా జారుతున్నాయి, కొండ అంచున పచ్చిక మీద మంచు మెల్లగా పేరుకుంటోంది. లాంతరు వెలుగున నా జుత్తు ఇంకా తెల్లగా మెరుస్తోంది. పదే పదే అదృష్టాన్ని సూచిస్తూ దీపం ఎగుస్తోంది… ఎందుకో? . తూ- ఫూ 712- 770 చీనీ కవి .…
-
కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను. అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది. ప్రియతమా!నేను నిద్రలో మేల్కొన్నట్టు కలగన్నాను నేలమీద, తెల్లగా పిండారబోసినట్టున్న వెన్నెల చేతితో తాకాను; కానీ ఎక్కడో దూరంగా వదులుగా ఉన్న కిటికీ ఒకటి కిర్రుమని చప్పుడైంది గాలికి ఊగుతూ… కానీ గాలి వీచిన జాడలేదు, నాకు భయంవేసి నీ వైపు చూశాను నీ భరోసాకోసం చెయ్యి జాచేను కానీ, నువ్వక్కడలేవు!…
-
నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

“ఇవాళ నేను బడికి వెళ్ళలేను” అంది పెగ్గీ ఏన్ మెకే. నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి. నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది నాకు కుడికన్ను కనిపించడం లేదు. నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి ఇదిగో, దీనితో కలిపి పదిహేడు నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ? నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి… బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం…
-
కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని. చివరకి వానా, ఎండా, రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి. వాటిని భరించడం కంటే విడిచిపెట్టడం ఉత్తమం. రేడియోలో ఎవరిదో పియానో వాద్యం వినిపిస్తుంటే మరో కవిత రాస్తున్నాను. గొప్పకవులు రాసింది చాలా తక్కువ చెత్తకవులు మరీ ఎక్కువ రాసేరు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను కవి As The Poems…
