వర్గం: అనువాదాలు
-
మృత్యువంటే… ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు

మృత్యువు రకరకాలుగా ఉంటుంది: అందులో గెలుపూ లేదు ఓటమీ లేదు: కేవలం ఒక బాల్టీ ఖాళీ అవడం, పలక శుభ్రంగా తుడిచిపెట్టడం లాంటిది, అప్పటివరకూ ఉనికిగలదానికి దయతో చరమగీతం పాడడం. అంతే! మనకి తెలిసినది ఇంతవరకే: మృత్యువు జీవనం కాదు, ఒక క్షీణస్థితి, ప్రాణం చిదిమివెయ్యబడుతుంది, బాల్టీ పగులుతుంది. ఎన్నో గొప్ప వింతలూ, విశేషాలు చూసినవారికి కూడా ముగింపుమాత్రం ఇంకా తెలీదు. మరణంలో విజయుడూ, విజితుడూ ఒక్కటిగా కలిసి పోతారు; పిరికివాడూ, సాహసికుడూ: మిత్రుడూ శత్రువూ, ఒకటే.…
-
పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి

కొందరు మనుషులు అవతలివాడిది కాలో, చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు. తక్కినవాళ్ళు నాలుగుపక్కలా కమ్ముకుని భూమంతా, వాసనచూడ్డం – తవ్వడం వాసనచూడ్డం – తవ్వడం చేస్తారు. వాళ్ళకి అదృష్టం కలిసొస్తే ఒక చెయ్యో, కాలో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని కొరికి పరిగెత్తడం వాళ్ళ వంతు. చేతులు దొరికినంత కాలం, కాళ్ళు అందినంతకాలం, చివరికి ఏదో…
-
నా బ్రతుకులో వైరుధ్యాలు… డెల్మైరా ఆగస్టినీ, ఉరుగ్వే కవయిత్రి

నే బ్రతుకుతాను, మరణిస్తాను, దహిస్తాను, మునిగిపోతాను ఏకకాలంలోనే వేడినీ చల్లదనాన్నీ అనుభవిస్తాను. జీవితం ఒకప్రక్క మెత్తగా ఉంటూనే చాలా కఠినంగా ఉంటుంది నా కష్టాలలో ఆనందం కలగలిసే ఉంటుంది. ఒక్కొక్కసారి నవ్వుతోపాటే ఏడుపూ వస్తుంది నా ఆనందం ఎన్నో కష్టాలను దిగమింగగలిగేలా చేసింది. నా సుఖం క్రమేణా పల్చబడినా మార్పులేక స్థిరంగా ఉంటుంది జీవితం నిస్సారమైన క్షణంలోనే పచ్చగా మొలకెత్తుతుంటాను. ప్రేమలోని వైరుద్గ్యాలూ అలాగే భరిస్తుంటాను. ‘నా వల్లకాదు, ఈ బాధ భరించలేను’ అని నే ననుకుంటానా…
-
An Unburnt Pot… Sikhamani, Telugu Poet, Indian
Some unknown person I met on my way Put a Pot of clay In my hands, and left Asking me to take care of it. From that day I have been carrying it with me Without rest or relent. And over time I got used to Carrying it unaware i did. Having…
-
మా అన్న మిగెల్ స్మృతిలో… సిజార్ వలేహో, పెరూ కవి
అన్నా! ఈ రోజు మనింట్లో ఇటుకబెంచీ మీద కూర్చున్నాను. అక్కడ నువ్వొక లోతెరుగని శూన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నాకు బాగా గుర్తు, మనం ఈ సమయంలో దొంగాట ఆడుకునే వాళ్లం. అమ్మ “ఒరే పిల్లలూ” అంటూ జాగ్రత్తలు చెబుతుండేది. నేను ఎప్పటిలాగే ఇప్పుడూ దాక్కుంటునాను సాయంత్రపు నీతిబోధలనుండి. ఎక్కడున్నానో నువ్వెవరికీ చెప్పవని నా నమ్మకం. చావడిలోనో,వాకిలి సందులోనో, వసారాలోనో, ముందు నేను; తర్వాత నువ్వు దాక్కుంటే, ఎక్కడున్నావో నెవరికీ చెప్పేవాణ్ణి కాదు. అన్నా! నాకు ఇంకా గుర్తే,…
-
అతను చంపిన వ్యక్తి … థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

ఒక పాత వసతిగృహంలో ఎప్పుడైనా అతనూ నేనూ కలుసుకుని ఉంటే ఇద్దరం కలిసి కూచుని ఎన్ని చషకాలైనా తాగేసి ఉండేవాళ్ళం. కానీ, పదాతిదళంలో పెరగడం వల్ల ఒకరికొకరు ఎదురుపడి తీక్ష్ణంగా చూసుకుంటూ అతను నామీదా, నే నతనిమీదా కాల్పులుజరుపుకున్నాం. నే నతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా కాల్చిచంపాను. అతన్ని నేను ఎందుకు కాల్చి చంపేనంటే… అతను నా శత్రువు గనుక; అదంతే! అతను నా శత్రువు, వైరి వర్గం; అందులో సందేహం లేదు, కాకపోతే నా లాగే, అనుకోకుండా,…
-
మాటల యుద్ధం … దిమిత్రిస్ వారోస్, గ్రీకు కవి
నేనొక ఎడారిలో జలపాతాన్ని మేఘంలేకుండా కురిసిన చినుకుని అందరికీ తెలిసిన, ఇంకాపుట్టని బిడ్డని నువ్వు ఎన్నడూ అనుభూతిచెందని ఒకానొక అనుభవాన్ని. నేను నీ మనసుమీద పైచెయ్యి సాధించగలను తలుపుతాళం తీసి,నువ్వు సముద్రాన్ని తలుచుకున్నపుడు ‘ఇది అని అనలేని’ జ్ఞాపకాన్నై నీ దరిజేరుతాను. నువ్వు వాచీ చూసుకుని సమయం మించిపోయిందనుకున్నప్పుడు నేనొక క్షణికమైన భ్రాంతినై కనిపిస్తాను. నేను నీ మనసుతో ఆడుకోగలను నేను నీ కనులవెనుకే దాగి ఉన్నాను నేను నీ కలలనిండా పరుచుకున్నాను నన్ను నీ ప్రతి…
-
ఫ్రెడెరిక్ డగ్లస్… రాబర్ట్ హేడెన్, అమెరికను కవి
ఈ అద్భుత, భయానకమైన స్వాతంత్య్రం, ఈ స్వేచ్ఛ, మనిషికి ప్రాణవాయువంత అవసరమైనదీ, ఈ మట్టి అంత ఉపయోగించదగినదీ; చివరకి అది మనకందరికీ స్వంతమైనపుడు; ఎలాగైతేనేం అది మనకందరికీ చెందినపుడు, అది నిజంగా మన బుద్ధీ, స్వభావంగా మారినపుడు, లబ్ డుబ్ లబ్ డుబ్ మని మన గుండెచప్పుడైనపుడు, మన జీవనంలో అంతర్భాగమైనపుడు, కడకి దాన్ని మనం సాధించగలిగినప్పుడు; అది రాజకీయనాయకులు వల్లించే అర్థంలేని అందమైన అట్టహాసపు పదబంధాలకి అతీతంగా నిజమైనపుడు, ఫ్రెడెరిక్ డగ్లస్ అనబడే ఈ వ్యక్తి, ఒకప్పటి…
-
చావుతప్పినవాడు … థియొడోర్ రెట్కీ, అమెరికను కవి
ఈ కవిత ప్రస్తుతం అన్ని సమాజంఅలలోనూ ఉన్న విద్యావ్యవస్థలమీద నిశితమైన వ్యాఖ్యగా నేను భావిస్తున్నాను. విద్యాలయాలలో బోధిస్తున్న విషయాలు మనిషినీ- మృగాన్నీ; వెలుగునీ-చీకటినీ, ప్రేమనీ- ద్వేషాన్నీ, వేరుచేసి చూడలేని అశక్తతను కలిగిస్తున్నాయి. మన ఆలోచనలకు రూపాన్నిచ్చే పదాలు, వాటి భావచిత్రాలు, కేవలం శుష్కమైన పర్యాయపదాల్లో ఇమిడిపోతున్నాయి తప్ప, సారూప్యంగా ఉన్న విరుద్ధవిషయాలను విశ్లేషించి వేరుచేయగల సమర్థతను అందించలేకున్నాయి. ఈ చదువు ఒకరకంగా గొర్రెపిల్లను వేటకు తీసుకెళుతున్న చందాన ఉంది. ఆ ఉరికంబంనుండి ఏ కొద్దిమందో మాత్రమే బయటపడగలుగుతున్నారు.…
-
గాలిపరగడ వచ్చేముందు… ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి

సముద్రంమీద గాలి విసురు మెల్లగా పుంజుకుంటోంది, వెలినురుగునర్తకీమణులు గాలివాటుకి నర్తిస్తున్నారు అపారపారావారము నిద్రపోవాలని ఒత్తిగిలినా, నిద్రరామికి అయిష్టంగా మూలుగుతోంది. నేలమీద దరువువేస్తూ ఇసుకపొరల్ని ఎగరేసి, తేమగాలితో చెల్లాచెదరుచేస్తున్న అదృశ్యహస్తాలేవో, ఒకటొకటిగా పొడచూపుతున్న కొండశిఖరాలని ఆ ఇసుకమేటుతోనే సమాధిచేస్తున్నాయి. కనుచూపుచివర క్షితిజరేఖ సమీపంలో ఆకాశం ఒంగినచోట గోడలా ఏదో కనిపిస్తోంది… ధూళిదూసర వర్ణంలో ఉన్న అది బహుశా, రానున్న గాలిపరగడ సూచించే తెరచాపల ఉబుకులేమో! . ఆర్థర్ సైమన్స్ (28 February 1865 – 22 January 1945)…