వర్గం: అనువాదాలు
-
మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

విరివిగా వాడడంవల్ల అరిగి అరిగి, నీ చేతికి అలవాటై, నీ అవసరానికి తగినట్టు మలచబడిన పనిముట్టునవాలనీ, నీ సేవకై నన్ను అలవోకగా వినియోగించుకోమనీ నా వినతి. నిగనిగలాడే నీ జీవితపు రంగురంగుల కలనేత వస్త్రంలో నన్నొక గుర్తింపులేని దారపుపోగుగా మసలనీ; ఆ రంగురంగులమిశ్రమంలో నేనూ ఒక కణాన్నై దాగి, చిరకాలం ఆ రంగుల్ని స్ఫుటంగా ప్రతిఫలిస్తాను. నీ పగటికలల్లో నేనూ విహరించాలని నా ఆకాంక్ష, మొయిలుదారులలో నువ్వు పరుచుకున్న మెట్ల అంచున, దివ్యమైన వెన్నెల ప్రవాహపు పరవళ్ళలో…
-
ముఖాలు… కేథరీన్ సావేజ్ బ్రాజ్మన్, అమెరికను కవి
బ్రిటిష్ మ్యూజియం లో ఈజిప్టునుండి ఇక్కడికి ప్రయాణంచేసి, మ్యూజియంలో రాతిమీద, కర్రమీద శాశ్వతంగా చిత్రించబడ్డ పురాతన మానవకళేబరాల్ని చూడడానికి వచ్చి అలవాటుగా కిటికీలోంచి మృదువుగా ప్రవహిస్తున్న నగరదృశ్యాన్ని ఒంటరిగా పరికిస్తున్నాను. శీతకాలమైనా ఎండ చురుక్కుమంటోంది. వసారాలో పావురాలు అటూఇటూ ఎగురుతూ రెక్కలతో ఆకాశంవంక గుడ్లప్పగించి చూస్తూ విశ్రాంతి లేకుండా ప్రాంగణాన్ని శుభ్రంచేస్తున్నాయి. లోపలికి ప్రవేశించి, సంప్రదాయంగా కనిపిస్తున్న మేధావుల్నీ, జపనీస్ యాత్రికులప్రవాహాన్ని తప్పుకుని, టిక్కట్టుతీసుకుని, బారులుతీరిన సుందర చైతన్య మానవప్రవాహాన్ని దాటి, అక్కడ అడుగుపెట్టడానికి మృత్యువుసైతం క్షణకాలం…
-
(ఐరిష్) ద్వీపకల్పం… సీమస్ హీనీ, ఐరిష్ కవి
కవీ! నీకు చెప్పడానికి ఏమీ లేనపుడు, ఒకరోజు రోజల్లా ఈ ద్వీపకల్పం చుట్టూ కారులో తిరిగి రా. ఆకాశం నీకు రాజమార్గంలా ఎదురుగా ఎత్తుగా కనిపిస్తుంది కానీ ఎక్కడా గమ్యం గుర్తులుండవు గనుక ఆగే పని లేదు. కానీ, ఏ క్షణంలోనైనా జారి దొర్లిపోవచ్చన్న భయంతో నడుపు. చీకటిపడేసరికి, దిగంతాలు సముద్రాన్నీ కొండల్నీ మింగేస్తాయి, దున్నిన పొలం, పక్కనే సున్నంకొట్టిన భవనాన్ని మింగేస్తుంది నువ్వు ఎలాగూ చీకట్లోనే కారు నడపవలసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మెరిసే సముద్రతీరాన్నీ,…
-
నిండుచంద్రుడు… తూ ఫూ, చీనీ కవి

గోపురం మీద… ఒంటరిగా, రెండురెట్లు కనిపిస్తున్న చంద్రుడు. రాత్రి నిండిన ఇళ్ళ వరుసలుదాటి, చల్లగా తగిలే నది కెరటాలమీద నిలకడలేని వర్ణమిశ్రమాన్ని నలుదిక్కులా వెదజల్లుతున్నాడు. అల్లికచాపలమీద చూస్తే పట్టువలకంటే మిన్నగా మెరుస్తున్నాడు. ఆచ్ఛాదనలేని కొండ శిఖరాలు; అంతటా నిశ్శబ్దం. ఉన్న నాలుగు చుక్కలమధ్యనుండీ అడుగుతడబడకుండా తేలిపోతున్నాడు. నా తాతలనాటి తోటలో పైన్, లవంగ చెట్లు బాగా పెరిగాయి. ఎటుచూసినా వెలుగు వరద. ఏకకాలంలో, పదివేల చదరపుమైళ్ల మేరా దాని కాంతిలో మునిగిపోయింది. . తూ-ఫూ (712- 770)…
-
శిలగా మరణించాను… రూమీ, పెర్షియన్ కవి
నేను శిలగా మరణించేను కానీ మొక్కనై తిరిగి మొలకెత్తాను నేను చెట్టుగా మరణించేను కానీ జంతువుగా తిరిగి పుట్టేను. నేను జంతువుగా మరణించేను కానీ మనిషిగా తిరిగి జన్మించేను. భయం దేనికి? మరణంలో పోగొట్టుకున్నదేమిటిట? . రూమీ 13 వ శతాబ్దం పెర్షియన్ సూఫీ కవి . . A Stone I died . A stone I died and rose again a plant; A plant I died and…
-
గుప్పెడు మట్టి… హెన్రీ లూయీ వివియన్ డెరోజియో, భారతీయ (బెంగాలీ) కవి
అప్పటికి ఆకాశం లేతనీలిరంగు సంతరించుకుంది గగన మండలం మీదకి సూర్యుడు ఇంకా అడుగుపెట్టలేదు. చిటారుకొమ్మమీద కోయిల గొంతెత్తి ప్రభాతగీతమాలపిస్తోంది, చిక్కని ఆకుపచ్చని ప్రకృతి సువాసనలతో గుబాళిస్తోంది. జూలియన్, నేనూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ నేల గర్వించే గొప్ప వ్యక్తి సమాధి దగ్గర ఆగేము. శిలాఫలకం అతని పేరూ, వయసూ, ఘనతా ప్రకటిస్తోంది. అతను సాధించిన ఘనకార్యాలకీ, అతనిమీద కురిపించిన ప్రశంసల జల్లుకీ నాకు నోటమాట రాలేదు, నాకు తెలియకుండానే అతని సాధనకీ, జీవిత విస్తృతికీ నాలో…
-
పేదరికం… మూన్ బ్యూంగ్ రాన్, దక్షిణ కొరియా కవి
మనందరికీ తెలిసినదే నాలుగు చెలకలైనా వరిపొలం లేని రైతుకి ఎంతశ్రమో నలుగురు పిల్లల్ని పెంచి బడికి పంపించాలంటే. తనకంటూ ఇల్లులేని, నగరంలోని గృహస్థు ఇల్లు సంపాదించుకుందికి జీవితమంతా ఎన్ని కష్టనష్టాలు పడతాడో కూడా తెలుసు. పిల్లల్ని పెంచిన వారందరికీ తెలుసు నలుగురు పిల్లల్ని పెంచాలంటే అందరిలాగే బడికి పంపించాలంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఒళ్ళు తెగకోసుకోవడం లాంటిదని. ఓ పిల్ల పెళ్ళిచెయ్యాలంటే, ఒక ఇంటిస్తంబం మాయమౌతుంది, కుర్రాణ్ణి కాలేజీకి పంపాలంటే ఒక పొలం అమ్మెయ్యాల్సొస్తుంది. రోజుకి ఎనిమిది గంటలు…
-
మన కృతులు … హెన్రీ ఏబీ, అమెరికను కవి

మన ఆలోచనలు అవి పుట్టినప్పటి మన ఆవేశాల వన్నెల్ని ఎలా సంతరించుకుంటాయో, అలాగే మన కృతులు కూడా మన అంతరాంతరాలలోని అశాంతిని ప్రతిఫలిస్తూ ముందటిదాన్ని విడిచిపెట్టి కొత్తది అందుకుంటాయి. మానవ నిర్మితాలైన గర్వించదగిన మహత్తర కళాఖండాలు వాటి సృష్టికర్తలు వాటితో సంతృప్తి చెందలేదని సూచిస్తుంటాయి. కారణం, తన కృతుల సోపానాలని అధిరోహించి క్రిందకి చూసినపుడు పూర్ణవృత్తాలుకూడా సన్నగా కనిపిస్తాయి; అసలు తను చేసిన సృష్టి అంతా కళాకారుడికి లోపభూయిష్టంగా కనిపిస్తుంది; గుండె రక్తమోడుతుంది; పశ్చాత్తాపం తెరలు తెరలుగా…
-
శిధిల సమాధి… ఫేనీ స్టెరెన్ బోర్గ్, డచ్చి కవయిత్రి
ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత తనప్రియమైన వ్యక్తి గురించి రాసిన స్మృతిగీతం కాదు. ఒక శిధిల సమాధినీ, అక్కడి శిలా ఫలకం మీది తేదీనీ, మృత్యుల్లేఖనాన్నీ చూసిన తర్వాత కవి మదిలో మెదిలిన ఆలోచనల పరంపర. . “ప్రియాతి ప్రియ సఖా! ఎప్పటికీ నీ ప్రేమలో” అని ఆ శిలాఫలకం మీద చెక్కి ఉంది, ఎన్నేళ్ళ క్రిందటో. ఆ ఆప్త వచనాలక్రింద నిద్రిస్తోంది ఒక శరీరం మరీ తొలిప్రాయంలోది, విగతాత్మయై. ప్రతి ఏడూ…
-
కొత్త సంవత్సరపు కోరిక… జూడిత్ రైట్, ఆస్ట్రేలియన్ కవయిత్రి
కొత్త సంవత్సరం నాకు ఏ బహుమతి అందించాలా అని గనక ఆలోచిస్తూంటే, అది, కళలపట్ల ఆమెకున్న మక్కువ గురించి కథలుగా చెప్పుకునే మా ముత్తవ్వ వైఖరి లాంటిది కావాలని కోరుకుంటాను. ఎనిమిదిమంది సంతానంతో, పాపం ఆమెకు ఎన్నడూ బొమ్మలు గీయడానికి అవకాశం చిక్కలేదు; ఒక రోజు ఆమె స్విట్జర్లాండు దేశంలో ఒక నది ఒడ్డున చాలా ఎత్తైన కొండగుట్టపై కూర్చుంది. దూరంగా ఆమె రెండో కొడుకు మంచునీటిప్రవాహం మీద తేలుతూ పట్టుతప్పి ప్రవాహదిశలో ఎనభై అడుగుల దిగువన…