వర్గం: అనువాదాలు
-
సంతోషహృదయము… జాన్ వాన్స్ చీనీ, అమెరికను కవి
సూర్యుడి రథచక్రాలు తోలే సారథి సైతం వాటిని పగటిపూట మాత్రమే శాసించగలడు; అంతకంటే, నిత్యం చిన్న చిన్న పనులు చేస్తూ వినయంతో ఒదుక్కుని ఉండడమే ఉత్తమం. ఎంత కీర్తి వహించిన కత్తికైనా తుప్పు పట్టక మానదు కిరీటంకూడా చివరకి మట్టిలో కప్పబడిపోతుంది; కాలం తనచేత్తో క్రిందకి లాగి విసరలేనంత ఎత్తుకి తమ పేరుని నిలబెట్టగలిగిన వాళ్ళింకా పుట్టలేదు. సంతోషంగా కొట్టుకుంటున్న గుండె ఏదైనా ఉందంటే అది, దైనందిన జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కుని తక్కినదంతా భగవంతునిమీద భారం వేసి…
-
నేను లెక్కచెయ్యను… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నేను మరణించి, ఏప్రిల్ నెల వర్షానికి తడిసిన తమ కురులతో చెట్లు నా మీద వాలినపుడు, గుండె పగిలి నువ్వుకూడా నా మీద వాలితే వాలవచ్చు అయినా, నేను లక్ష్య పెట్టను. గుబురుగా పెరిగిన కొమ్మలతో వర్షానికి వంగిన చెట్లకున్నంత ప్రశాంతంగా ఉంటాను నేను. అంతేకాదు. నువ్వు ఇప్పుడున్న దాని కంటే మౌనంగా, ఉదాసీనంగా ఉంటాను నేను. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . I…
-
అమ్మ… థెరెసా హెల్బర్న్, అమెరికను కవయిత్రి

నా కవితల్లో ఇష్టమైన వారి నెందరినో కీర్తించాను; కానీ, ఈ జీవితమంతా ఆమెకే చెందే అమ్మ బొమ్మ ముందు మాత్రం ఒట్టి చేతులతో నిలుచున్నాను. బహుశా, పక్వానికి వచ్చిన వయసులో ఆమెగూర్చి చెప్పని విషయాలు చెప్పే అవకాశం కలుగవచ్చు; ఇప్పుడు కాదు; అయినా, మనుషులెప్పుడూ తాము తినే అన్నం మీద కవిత రాయలేదు. . థెరెసా హెల్బర్న్ 12 Jan 1887 – 18 Aug 1959 అమెరికను కవయిత్రి . . Mother I have…
-
ఇంగ్లీషు కవి T E ఎర్ప్ మూడు కవితలు
1. మరోమార్గం… . నేను సుమారుగా ఇరవై ఏళ్ళనించి పుస్తకాలు చదువుతూ ఉన్నాను; అందరూ ఎక్కడ నవ్వితే, నేనూ అక్కడ నవ్వేను ఎక్కడ ఏడిస్తే , నేనూ అక్కడ ఏడిచేను. జీవితం ఇన్నాళ్ళూ అరిగిపోయినదారిలోనే ప్రయాణించింది. నా అంతట నేను మరోదారి వెతుక్కుంటాను. 2. ప్రేమ కవిత . ఏం చెప్పమంటావు?! నేను నీలో ఒక భాగాన్నైపోయాను. అందులో మరీ దౌర్భాగ్యం ఏమిటంటే వెనక మగాళ్ళు చేసే పొగడ్తలు వింటూ…
-
అందం అంటే ఏమిటి?… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి

నశ్వరమైన ఈ శరీరంలో అతి సూక్ష్మ భాగాన్ని అదెంత చిన్నదైనా, సజీవంగా ఉంచే … ఒక సంకేతం; ఒక సరసు మీదా, రాతిగుట్టమీదా అకస్మాత్తుగా సమానంగా పడే అద్భుతమైన … ఆవేశ లేశము, నిద్రిస్తున్న దైవత్వాన్ని నిద్రమేల్కొలిపి జరిగినదీ, జరుగనున్నదీ గుర్తుచేస్తూ భరించలేని గుండె గాయాలను మాన్పి సాంత్వన నిచ్చే … ప్రతీక, ఒక జ్ఞాపిక; అంతేనా? పాటలో, ప్రేమలో, చిన్నపిల్లల కళ్ళలో క్షణక్షణమూ కొత్తగా మనకి మనం చేసుకునే ప్రమాణం, విశాలగగనం మీదా, రోదించే సముద్రం…
-
మరణానంతర ప్రార్థన… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నేను మరణించిన తర్వాత నన్ను అనుసరించడానికి ప్రయత్నించవద్దు. ఇపుడు నా మనసు, నా సమాధి ప్రక్కన మొలిచిన చెట్టుమీది ఎర్రని లేచివుళ్ళలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ నా ప్రశాంతతని పాడుచెయ్యవద్దు. నీకు నా మీద నిజంగా కనికరం ఉంటే రాత్రి నా కోసం ఇలా ప్రార్థన చెయ్యి: “నేను అన్నిటినీ క్షమించేను; విచారంలో మునిగి, ఏమీ చెయ్యలేకున్నాను; వెలుగుల్ని చుట్టుకుని, ఉరుముల్ని తురుముకున్న ప్రియా, నువ్వుకూడా నన్ను క్షమించు.” . డొరతీ పార్కర్ August…
-
వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో వచ్చిన గొప్ప కవితలలో ఇదొకటి. యుద్ధంలో స్వయంగా పాల్గొని, మృత్యువుని దగ్గరగా చూసిన అనుభవంతో యుద్ధం ఎంత నిష్ప్రయోజనమో ససూన్ చాలా చక్కగా వివరించడంతో పాటు, అందులో పాల్గొనకుండా, యుద్ధాన్ని గొప్పగా కీర్తించే వాళ్ళ ఆత్మవంచన స్వభావాన్ని ఎండగడుతుంది ఈ కవిత. . బిషప్ మాతో ఇలా అన్నాడు: “వాళ్ళు యుద్ధం నుండి తిరిగొచ్చేక మునపటిలా ఉండరు; కారణం వాళ్ళు క్రీస్తుకి వ్యతిరేకులపై చిట్టచివరి ధర్మ యుద్ధం చెయ్యడానికి వెళ్ళేరు; వాళ్లు…
-
మళ్ళీ వానలు పడతాయి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

(యుద్ధసమయం) మళ్ళీ వానలు పడతాయి, నేల మంచి వాసన వేస్తుంది. పిచ్చుకలు ఎప్పటిలా కిచకిచమంటూ తిరుగుతుంటాయి. రాత్రిపూట చెరువుల్లో కప్పలు బెక బెక మంటాయి నిగ నిగ మెరుస్తూ చెట్లకు పళ్ళు కాస్తాయి రాబిన్ లు ఎప్పటిలా అగ్నిశిఖలాంటి ఈకలతో వాలిన దండెం మీద నచ్చిన ఊసులాడుకుంటాయి. ఒక్కడికికూడా యుద్ధం గురించి తెలియదు; చివరకి అదెప్పుడు ముగిసిందోకూడా ఏ ఒక్కడికీ పట్టదు. మానవజాతి సమూలంగా నాశనమైనా చెట్టుకిగాని, పిట్టకుగాని ఏ దిగులూ ఉండదు. అంతెందుకు, తెల్లవారుతూనే అడుగుపెట్టిన…
-
అదే పాట… థామస్ హార్డీ , ఇంగ్లీషు కవి
ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను. అయినా, ఆ రసప్రవాహంలో ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు. ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం అంత మైమరపించే సంగీతంలోనూ ఇన్నేళ్ళవుతున్నా ఒక్క అపస్వరమూ దొర్లకుండా ఎలా కొనసాగించగలుగుతున్నదన్నదే! … ఓహ్! పాడుతున్న పిట్ట మాత్రం ‘ఒక్కటి ‘ కాదు. అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది. దానితో పాటే నా కంటే ముందు ఆ పాటని విన్నవాళ్ళు కూడా. . థామస్ హార్డీ…
-
తొలకరి జల్లు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
నులివెచ్చని తొలకరి వర్షమా! సన్నగా మృదువుగా రాలే నీ జల్లుకై పులకరిస్తూ నా ముఖాన్ని ఎదురొడ్డుతున్నాను. అవ్యాజమైన నీ ప్రేమనీ, సామర్థ్యాన్నీ నా మనసు గ్రహించాలనీ మంచుసోనలవంటి స్వచ్ఛమైన కలలు కనాలనీ కోరుకుంటున్నాను. కలలు దారితప్పినా, మంచుతెరలలో చిక్కిన ప్రేమలా అందంగా, చక్కగా, తారకలంత సన్నని మెరుపుతోనో; రాజమార్గంమీదా, సెలయేటిగట్లమీది దట్టమైన చెట్లమధ్యా, ఎక్కడపడితే అక్కడ అడవిపూలతీగలా అల్లుకుని చామంతిపూలంత పచ్చని వెలుగులు వెదజల్లాలనీ కోరుకుంటున్నాను… లేకపోతే వాటికి అంత మెరుపు ఎక్కడనుండి వస్తుంది? నీ అమృతవృష్టి…