వర్గం: అనువాదాలు
-
అయినా, నేను పైకి లేస్తాను… మాయా ఏంజెలో
. నువ్వు కసిగా, వక్రీకరించిన అబధ్ధాలతో, చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు, అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను. . నా ఎదురుసమాధానం నిన్ను కలవరపెడుతోందా? నువ్వెందుకు దుఃఖం లో ములిగి ఉన్నావు? నా ఇంట్లో చమురుబావులు తోడుతున్నంత ధీమాగా నే నడుగువేస్తున్నాననా? . సూర్య చంద్రుల్లాగా అలుపెరుగని కడలి తరంగాల్లాగా ఎగసిపడే ఆశల్లా విరజిమ్ముకుంటూ నేనింకా పైకి ఉబుకుతాను. . నేను క్రుంగిపోతే చూడాలనుకున్నావుకదూ? శిరసు…
-
మేం ఏడుగురం … వర్డ్స్ వర్త్
(బహుశా వర్డ్స్ వర్త్ రాసిన కవితలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ, అత్యంత హేళనకు గురి కాబడిందీ కూడా ఈ కవితేననుకుంటాను. ఇందులో కవిత్వం లేదని సమకాలీన విమర్శకులు గేలి చేసినా, కవిత్వీకరణలేదని ఈసడించినా, ఈ కవితలోని సౌందర్యం సంభాషణ మాధ్యమంలో అందజేసిన అపురూపమైన ఆధ్యాత్మిక చింతనా సరళిగా తర్వాతి తరం వారు ఎంతో మెచ్చుకున్నారు. అంతర్యుధ్ధాలూ, మతయుధ్ధాలూ, ఫ్రాన్సుతో వందేళ్ళ యుధ్ధం, సింహాసనం వారసత్వం కోసం పోరాటాలూ, అనైతిక వర్తనకి రోజుకి కనీసం ఇద్దరికి బహిరంగ మరణ…
-
ప్రపంచమొక నాటక రంగం — షేక్స్పియర్
. ప్రపంచమొక నాటక రంగం స్త్రీ పురుషులందరూ కేవల పాత్ర ధారులు. ఎవరి ప్రవేశ నిష్క్రమణలు వారివి తనజీవిత కాలంలో మనిషి బహుపాత్రాభినయం చేస్తాడు అతని ఏడు దశలూ ఏడు అంకాలు. . మొదటిదశ శైశవం దాది చేతుల్లో పసికూనై మూలుగుతూ, కక్కుకుంటూ . తర్వాతదశ బడికి మారాం చేసే పిల్లాడు… ఉదయాన్నే కళకళలాడే ముఖంతో, సంచి భుజాన్నేసుకుని నత్తలా కాళ్ళీడ్చుకుంటూ అయిష్టంగా బడికి కదులుతూ… . తర్వాతదశ ప్రేమికుడు కొలిమిలా వేడి ఊర్పులు విడుస్తూ, ప్రేయసి …
-
నేనున్నాను … జాన్ క్లేర్
See Video: I Am — By John Clare. . నేనున్నాను. కానీ నేనెవరో, ఏమిటో ఎవరికీ తెలీదు… లక్ష్యపెట్టరు. నా మిత్రులు నన్నొక స్మృతిపథంలోలేని విషయంలా వదిలేస్తారు. నా బాధలు నేనే అనుభవిస్తున్నాను. అవి గుంపులు గుంపులుగా ఎగసిపడి మాయమవుతుంటాయి ప్రేమ ఛాయలు మృత్యువులో మరణించినట్టు… అయినా నేనున్నాను. కోలాహలం, అలక్ష్యాల శూన్యం లోకి పగటికలల చైతన్య సముద్రం లోకి, నీడలతో బాటు విసిరివేయబడినప్పటికీ, బ్రతికే! అక్కడ బ్రతుకు పట్ల స్పృహ గాని, హర్షాతిరేకాలుగాని…
-
కిటికీ పక్కన… కార్ల్ శాండ్బర్గ్
. నన్ను ఆకలితో అలమటివ్వనిండి. హాయిగా కూచుని సృష్టికి ఆదేశాలిచ్చే దేవతలారా! నాకు ఆకలీ, బాధా, లేమి అన్నీ ఇవ్వండి, కీర్తికీ, సిరులకూ నెలవైన మీ ద్వారాలను అవమాన, వైఫల్యాలతో కొట్టుకునే నాకు శాశ్వతంగా మూసివేయండి. మీరు ఎంత దుర్భరమైన దుస్సహమైన ఆకలికి నన్నుగురిచెయ్యాలనిపిస్తే, అంతగా శపించండి. ఫర్వాలేదు . కానీ, నాకు కొంచెం ప్రేమని మాత్రం మిగల్చండి … రోజు ముగియగానే నాతో సంభాషించడానికి ఒక గొంతునీ చీకటి గదిలో సుదీర్ఘమైన ఏకాంతాన్ని ఛేదిస్తూ సాదరంగా…
-
నడవని త్రోవ … రాబర్ట్ ఫ్రాస్ట్
Image Courtesy: http://preapism.com . రెండు దారులు చీలి ఉన్నాయి అడవిలో. నేను బాటసారినై, ఒక్కడ్నే రెండు దారులంటా వెళ్లలేను. అదే విచారం! చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగేవరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ. . ఇపుడునేను రెండో బాట పట్టేను, మొదటి తోవంత నాణ్యమైనదే. బహుశావెళ్ళాలనిపించడానికీ దానికంటే కొంచెం మెరుగనిపించడానికీ గడ్డి బాగా మొలిచి ఎక్కడా నలగకపోవడం కారణమేమో. ఆమాటకొస్తే, నడుస్తుంటే రెండూ ఒక్కలాగే నలిగేవేమో. . ఆ…
-
నిశ్శబ్దం – ఎడ్గార్ ఏలన్ పో
. కొన్ని గుణాలున్నాయి- నిరాకారమైనవి, వాటి ప్రత్యేకతని గుర్తించడానికి అనువుగా పదార్థమూ- వెలుగూ; ఆకారమూ-నీడా వంటి ద్వైదీభావాలనుండి ఉత్పన్నమయేవి. . నిశ్శబ్దానికి రెండంచెలున్నాయి… సముద్రమూ- ఒడ్డూ; శరీరమూ- ఆత్మా లా. ఒకటి ఏకాంత మరుసీమల్లో వసిస్తుంది… కొత్తగా ఒత్తుగా పెరిగిన దర్భశయ్యల అంతరం లా. రెండవది భయద గంభీర లావణ్యమైనది… మానవ విషాద చరితలతో, స్మృతులతో, కలగలిసి అది అంటే భయాన్ని హరిస్తుంది. … అదే మృత్యువు… అదే అనంత నిరాకారమైన నిశ్శబ్దం. దానికి భయపడవద్దు. దానికి …
-
విలక్షణమైన స్త్రీ … మాయా ఏంజెలో
. అందమైన స్త్రీలంతా, నా సౌందర్య రహస్యం ఎక్కడుందా అని ఆశ్చర్యపోతుంటారు. నిజానికి నేనంత తీర్చినట్టుండను, ఫేషను మోడల్ అంత ఎత్తులో అసలుండను. నేను చెప్పడం ప్రారంభిస్తే, నేనబద్ధం చెబుతున్నాననుకుంటారు. నా సౌందర్యం నా పొడవైన చేతులలో ఉంది… నా జఘన విస్తృతిలో ఉంది… నా దీర్ఘమైన అడుగులలో ఉంది… నా పెదవుల వంపులలో ఉంది… నేనొక అసాధారణమైన స్త్రీని. విలక్షణమైన స్త్రీ అంటే అది నేనే! . నేను గదిలోకి అడుగు పెడితే చాలు,…
-
ఓ సమయం వస్తుంది… ఫెర్నాండో పెసో
. ఓ రోజు వస్తుంది… మన శరీరానికి అతుక్కుపోయి దాని ఆకారం పొందిన దుస్తుల్ని వదిలివేయవలసి సమయం. . మనల్ని ఎప్పుడూ వెళ్ళినచోటికే తీసుకువెళ్ళేదారుల్ని మరచిపోవలసిన సమయమూ వస్తుంది. . దానర్థం ఇప్పుడు మనం కొత్త దారి వెతుక్కోవలసిన సమయం ఆసన్నమైందని… ఇప్పుడు ధైర్యం చెయ్యలేకపోయామో ఉన్నచోటే … శాశ్వతంగా… మన రాదారి నుండి పక్కకి మనల్ని మనమే ఈడ్చుకుపోయినట్టన్నమాట. . ఫెర్నాండో పెసో పోర్చుగీసు కవి . There is a time where you have…
-
Knowing full well … Vimala, Telugu, Indian
. (The agony and angst of the poem can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both of them attending different assignments) who was later…