వర్గం: అనువాదాలు
-
నా సమాధి దగ్గర ఏడవకు – మేరీ ఎలిజబెత్ ఫ్రై
. నా సమాధి దగ్గర నిలబడి ఏడవకు నే నక్కడ లేను. నేను నిద్రించను . నేనిపుడు శతసహస్ర పరీమళ పవనప్రసారాన్ని నేనిపుడు హిమోధ్భూత వజ్రసదృశ ప్రతిఫలాన్ని . ఈడేరిన వరికంకులమీది వెలుగురేని లే కావి కిరణాన్ని నేను, ఆకాసంనుండి మంద్రంగా జాలువారే వర్షాకాలపు చిరుజల్లుని నేను . ప్రాభాత నీరవప్రశాంతతలో నువు కనుదెరిచినపుడు సడిసేయక వడి ఎగిరే ఆవృత్త ద్విజసమూహాన్ని నేను నిశాతమస్సులో అల్లన మెరిసే మృదుతారానివహాన్ని నేను . నా సమాధి ప్రక్కన నిలబడి…
-
దూరం గా తొలగిపోకు… పాబ్లో నెరూడా
దూరంగా తొలగి పోకు, ఒక్క రోజుకైనా సరే! ఎందుకంటే… ఎందుకంటే… నాకెలాచెప్పాలో తెలియడం లేదు, రోజంటే… చాలా సమయం. ట్రైన్లన్నిట్నీ ఎక్కడో యార్డ్ లో విశ్రాంతికి తీసుకుపోతే, ఖాళీ ప్లాట్ ఫారం మీద వాటికోసం నిరీక్షించినట్టు, నేను నీకోసం నిరీక్షిస్తుంటాను . నన్ను ఒక గంటసేపైనా విడిచిపెట్ట వద్దు. ఎందుకంటే, నా పరివేదనా బిందువులు ఒక్కొక్కటీ కలిసి ప్రవాహమౌతాయి, గూడుకై దిమ్మరిగా తిరిగే పొగ, అలా దారితప్పి తేలియాడుతూ నాగుండెల్లోకి జొరబడి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .…
-
అజేయ … విలియం ఎర్న్ స్ట్ హెన్లీ
నా బ్లాగు సందర్శకులకందరికీ దీపావళి శుభాకాంక్షలు . భూ నభోంతరాలు వ్యాపించిన కాలబిలంలా నన్ను కమ్ముకున్న ఈ నిశీధినుండి, ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలున్నారో వారందరికి నా కృతజ్ఞతలు లొంగదీసుకోలేని ఆత్మ నాకున్నందుకు . పరిస్థితుల పళ్ళచక్రం పట్టి బిగించినా బాధతో మూలగనూలేదు, వెనుకంజవెయ్యనూలేదు. యాదృఛ్ఛిక సంఘటనల గాయాలకి తల రక్తసిక్తమైంది గాని అవనతం కాలేదు . ఈ క్రోధాలూ కన్నీళ్ళ సీమ కావల కనిపిస్తున్నది కేవలం మృత్యుఛ్ఛాయ ఐనా, వత్సరాల బెదిరింపుల పిదప,…
-
నిప్పూ-నీరూ… రాబర్ట్ ఫ్రాస్ట్
. కొందరు యుగాంతం సౌరాగ్నికీలల్లో జరుగుతుందంటారు. కొందరు, హిమయుగము పునరావృతమవడం వలననంటారు కాంక్షాపరితప్తానుభవమున్న నేను, అగ్నికీలలనే సమర్థిస్తాను. కానీ, నాకు పునర్మరణమంటూ ఉంటే, నాకు ద్వేషం గురించి తగినంత అవగాహన ఉండడం వలన, వినాశానికి మంచుకూడా గొప్పదని చెప్పడంతో పాటు, అది సమర్థవంతమైనది అని కూడా చెప్పగలను . రాబర్ట్ ఫ్రాస్ట్ . Fire And Ice . Some say the world will end in fire, Some say in ice. From…
-
అయితే … రుడ్ యార్డ్ కిప్లింగ్
. నీ చుట్టూ ఉన్నవారు విచక్షణకోల్పోయి నిన్ను నిందిస్తున్నప్పటికీ, నీ సంయమనం కోల్పోకుండ నిగ్రహించుకోగలిగినట్టయితే, ప్రతిఒక్కరూ నీ సామర్ధ్యాన్ని శంకిస్తున్నపుడు, నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకుండా, వాళ్ళ అంచనాలకుకూడా కొంత ఆస్కారంలేకపోలేదు అని అనుకోగలిగినట్టయితే తగిన అవకాశం కోసం నిరీక్షించగలిగి, నిరీక్షించడానికి విసుగుచెందకుండా ఉండగలిగినట్టయితే లేదా, నీ గురించి ఒకరు అబద్ధం చెప్పినపుడు, నువ్వు తిరిగి అబధ్ధాలతోనే ఎదుర్కోడానికి పూనుకోకుండా ఉన్నట్టయితే లేదా, నిన్ను ద్వేషిస్తున్నపుడు, నువ్వు తిరిగి ద్వేషించకుండా, అతి మంచిగా ఉండడం గాని,…
-
ఒక కల మరణించింది …డొరతీ పార్కర్
. ఇక్కడ ఒక కల దీర్ఘనిద్రలో ఉంది. దయచేసి మీరు చూపులు అటువైపు మరల్చి ఇక్కడనుండి నెమ్మదిగా కదలండి. జీవితంకోసం పోరాడి అలసిపోయిన తర్వాత ఎలా ఉందో చూడటానికి ప్రయత్నించకండి. దుఃఖంతో నడవొద్దు కాని కాసేపు, మీ అడుగులు నెమ్మదిగా పడినా ఫర్వాలేదు. ఇక మీ దయార్ద్రమైన పరామర్శల విషయానికొస్తే, కాలమే గాయం నయం చేస్తుందనీ, మంచిరోజులు ముందున్నాయనీ మొదలైన తియ్యని మాటలు చెప్పకండి. సత్యం ఏమిటంటే ఇక్కడ ఒక కల మరణించి ఉంది. అది అందరూ…
-
A Smile On Migration— Y. Mukunda Rama Rao
. When my own bustling beaut blossom Bids me good-bye It seems as though the dove That huddled close to my heart this long Has Taken wing Throwing a misty screen fore eyes Knowing fully well like a Siberian bird on migration. … That she has packed up all festivities and frolic with her So…
-
When Song Takes Wing … Vimala, Telugu, Indian
. Letters in blood shall be written On the muted corpse of city at midnight. The same events appear again and again Opposite to police stations, On the walls facing bus stops, On the buses that passively and disinterestedly carry the living human bodies, On the black cloaks of Courts That cannot visualize the truth, And on…
-
A Downy Mother is better than a Doughty Father… Gogu Syamala
(A Short Story) . As the afternoon turned to evening, all of us children gathered in the open on the outskirts of the village. Reminiscent of the rain that had stopped a while ago, droplets of water on the blades of grass glistened in the lukewarm amber sun. All the elder boys were playing Kabaddi…
-
హేమనగరి (Eldorado) … ఎడ్గార్ ఏలన్ పో
. ఒక సాహస ఆశ్వికుడు ఆహ్లాదకరమైన ఆహార్యాన్ని ధరించి, రాత్రనక పగలనక, ఆడుతూ పాడుతూ దౌడుతీస్తూ చాలాకాలం ప్రయాణించాడు “హేమనగరి”ని (Eldorado) అన్వేషిస్తూ. . వయసు పైబడింది. కాని ఈ సాహస ఆశ్వికునికి ఎంతవెతికినా, హేమనగరిని పోలిన నేల కనిపించకపోయేసరికి, అతని మనసులో విషాదఛ్ఛాయ అలముకుంది. . చివరికి జవసత్త్వాలుడిగినవేళకి అతనికొక యాత్రికఛాయ కనిపించింది. దాన్ని ఉద్దేశించి: “ఓ సఛ్ఛాయమా! హేమనగరి ఎక్కడుంటుందో తెలుసా?” అని అడిగేడు. అపుడానీడ అందికదా: “తెలియకేం? అదిగో, ఆ హిమమయూఖపర్వతసానువుల్లో, నీడల…