When Song Takes Wing … Vimala, Telugu, Indian . Letters in blood shall be written On the muted corpse of city at midnight. The same events appear again and again Opposite to police stations, On the walls facing bus stops, On the buses that passively and disinterestedly carry the living human bodies, On the black cloaks of Courts That cannot visualize the truth, And on the undried posters of yesterday… Changing their names and places They stand questioning us. Fowls of pamphlets Open up their wings in the evenings Near yawning factories, Among offices and educational institutions, At the cross roads crammed like meddled anthills, Crowded shift-buses, And amidst herds of sheep Searching for safety in the life’s unsafe burrows. The capitalist press Which gorged lies all through the night, Shall vomit news in the morning In the public streets. There appear few careless lines somewhere in the last page As briefly as they can be. Police drink elixir. So guns, bombs and missiles can’t hurt them. They merely drop down touching them. The patrolling dogs smell Naxalites at night Police haunt in the “Hunter” streets. They, With marks of childhood not receding yet, Still hold smooth delicate skin on their body Thaw to the tweets of birds and to the Moonlight Shake like leaf-buds for peoples’ love and sacrifices Became strong by their sheer will power Shed blood on razor’s edge To see dreams blossom in every direction… Are people Who loved life and light Who fearlessly walked into the face of death. Why should we grieve for them? Not one or two. How many can we count? No comrades! NO! Let there be no words of consolation. Nor, sympathies that do not slip beyond lips No Comrades! NO! Let not their memories overcast us like melancholic clouds And their songs like elegies. The proud deer of the moon smiling after killing the tiger, at night the glistening margins of coconut leaves like knives under moonlight Then, Like clouds that let out a thunder Their slogans reverberate through the cosmos. Their song shall flow like an endless Psalm of Life, Brightening darkness briefly like Lightning. Their song shall rustle like a red flag In the whole world, spewing fire. Come! Let’s walk amidst Concrete jungles, villages, and forests, To sing full throttle those songs of unsmoldering fire. The mechanised mortal masses Shall always look at people With love, jealousy, fear and suspicion Who Let birds fly free, Forecast seeds in all directions, Laugh to tears, And run up to Sun to hug him. Sometimes it hurts, pains and despairs us. But, take heart, A collection shall swell into a stream one day People shall catch those sanguine strains And the whole lot of them Shall become theme of that song. . Vimala . పాట పక్షులైన వేళ . అర్థరాత్రి నగర నిశ్శబ్ద శవం మీద నెత్తుటి అక్షరాలు రాయబడతాయి పోలీసుస్టేషన్ ఎదుటా బస్టాపు గోడలపైనా నీరసం గా నిర్లిప్తంగా మానవ సజీవ దేహాల్ని మోసుకెళ్ళే బస్స్సులపైనా నిజాల్ని చూడలేని కోర్టుల నల్లకోట్లపైనా తడి ఆరని నిన్నటి పోస్టర్ల పైనా మళ్ళీ అవే అవే ఘటనలు పేర్లు, స్థలాలు మారి మనల్ని ప్రశ్నిస్తూ నిలబడతాయి ఆవులించే ఫ్యాక్టరీలు, ఆఫీసులు విద్యాలయాల మధ్యా పగిలిన చీమలపుట్టల్లా కిక్కిరిసిన చౌరస్తాల్లో ముసురుకునే షిఫ్టు బస్సులవద్దా భద్రతా రహిత జీవితపు కలుగుల్లో భద్రతను వెతుక్కునే గొర్రెల మందల మధ్యా సాయంత్రాలు కరపత్రాల పక్షులు రెక్కలు విప్పుతాయి వీధుల్లో కరెంటు తీగలపై విద్యుత్ సంగీతాన్ని మీటుతాయి రాత్రి అదేపనిగా అబధ్ధాల్ని మింగిన పెట్టుబడిపత్రికలు ఉదయం వీధుల్లో వార్తల్ని వాంతి చేసుకుంటాయి. ఆఖరిపేజీలో ఓ మూల నిర్లక్ష్యంగా ముక్తసరిగా నాలుగు ముక్కలు… పోలీసులు అమృత, తాగిన వాళ్ళు. తుపాకులు, బాంబులు, మీస్సైల్స్… తాకితే రాలిపడతాయే తప్ప వాళ్లనేమీ చెయ్యలేవు రాత్రి పెట్రోలింగ్ కుక్కలకు నక్సలైటువాసన వేస్తుంది ‘హంటర్ ‘ వీధుల్లో పోలీసులు వేటాడుతారు. పసితనం ఇంకా చెరిగిపోని వాళ్ళు, లేలేత శరీరాలు కలవాళ్ళూ, పక్షులపాటలకూ, వెన్నెలకూ పరవశించిపోయే వాళ్ళూ, ప్రజల ఆప్యాయతకూ, త్యాగాలకూ చిగురుటాకుల్లా చలించిపోయే వాళ్ళూ, సంకల్పంవల్ల ధృఢమైనవాళ్ళూ, స్వప్నాల్ని నలుదిక్కులా పూయంచేందుకై కత్తి అంచులపై నెత్తుర్ని చిందించిన వాళ్ళూ- వాళ్ళు వెలుగునీ జీవితాన్నీ ప్రేమించిన వాళ్ళు నిర్భీతితో మృత్యు గహ్వరం లోకి నడిచిపోయిన వాళ్ళు వాళ్లకోసం మనం దుఃఖించడం ఎందుకు? ఒకరా ఇద్దరా ఎందర్ని లెక్కిద్దాం వద్దు- మిత్రులారా వద్దు మనకి ఓదార్పు మాటలు వద్దు మనకి పెదవులు దాటని సానుభూతులూ వద్దు వద్దు మిత్రులారా వద్దు వాళ్ల జ్ఞాపకాల్ని దుఃఖపు మబ్బుల్లా వాళ్లపాటల్ని విషాద గీతాల్లా మనల్ని చుట్టుకోనీ వద్దు రాత్రి- జాబిలిలోని పులిని చంపి సగర్వంగా నవ్వే జింకా వెన్నెలలో ఊగాడే కొబ్బరాకుల కొసల విచ్చుకత్తుల తలతళలు- అప్పుడు – మేఘాలు ఉరిమినట్లు వాళ్ళ నినాదాలు హోరెత్తుతాయి చీకటిలో తళుక్కుమనే మెరుపులా సాగి అనంత జీవనగానంలా వాళ్లపాట ప్రవహిస్తుంది సమస్త ప్రపంచానా వాళ్ళపాట నిప్పులు కక్కుతూ రక్తకేతనంలా రెపరెపలాడుతూ ఎగురుతుంది కాంక్రీటు అరణ్యాల మధ్యా, పల్లెల్లో అడవుల్లో తిరుగుతూ ఆరని నిప్పులాంటి ఆ పాటల్ని ఎలుగెత్తి చాటుదాం రండి- పక్షుల్ని ఎగరేసే వారి వంకా విత్తనాల్ని చల్లే వారి వంకా తడికళ్ళతో నవ్వేవారి వంకా పరిగెత్తుకెళ్ళి సూర్యుడ్ని కావలించుకునే వారి వంకా మరలు బిగించబడ్డ మానవ సమూహాలు ప్రేమతో అసూయతో, భయంతో అనుమానం తో అదే పనిగా చూస్తాయి. ఒక్కొక్కప్పుడు మనకు కష్టం గానూ, బాధగానూ నిరాశగానూ వుంటుంది. అయినా, సమూహం ప్రవాహమవుతుంది. ప్రజలు నెత్తుటిపాటల్ని అందుకుంటారు సమస్త ప్రజలు పాటలోని భావమవుతారు. . విమల “అడవి ఉప్పొంగిన రాత్రి” కవితా సంకలనం నుండి Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే అక్టోబర్ 21, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు"అడవి ఉప్పొంగిన రాత్రి"విమల A Downy Mother is better than a Doughty Father… Gogu SyamalaA Smile On Migration— Y. Mukunda Rama Rao స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.