వర్గం: అనువాదాలు
-
గెలుపు … ఎమిలీ డికిన్సన్
. [ఈ మధ్య కొంతమంది మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, మాట్లాడే విధానమూ చూస్తుంటే, ఈ కవితలో డికిన్సన్ చెప్పిన అభిప్రాయంలోని లోతైన భావన అవగతం అవుతుంది. మొన్న ఈమధ్య ఒకరాష్ట్రమంత్రిమండలి సమావేశంలో ఒక మంత్రిగారు “ఎవర్నడిగి సి.బి.ఐ. దాడులు జరుగుతున్నా” యని ముఖ్యమంత్రిని నిలదీశారట. అంటే, రాజ్యాంగము ఇచ్చిన అధికారంతో మంత్రిగా ప్రమాణస్వీకారము చేసినపుడు, ఏ రకమైన బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతమూ లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నవాళ్ళే ప్రమాణాలకు విరుధ్ధంగా ప్రవర్తించినపుడు, అదే రాజ్యాంగపు ఇంకొక అంగం అవి…
-
మృత్యువుతో సంభాషణ … స్విన్ బర్న్
I ఓ మృత్యువా! నీకభ్యంతరంలేకపోతే, నిన్నొకటడగాలని ఉంది. మేము ఎన్నో ఆశల గూళ్ళను నిర్మించుకున్నామే. నువ్వుతలుచుకుంటే, మా ఆత్మలు ప్రశాంతంగా ఉండడానికి ఓ మృత్యువా! ఒక్కటంటే ఒక్కటి మాకు ప్రసాదించలేవా? ఏ సార్వభౌమ చిహ్నాలూ అక్కరలేదు. సూర్యుడూ, మంచు ముత్యాల మెరుపులు పొదిగిన గోపురాలూ అక్కరలేదు. అధికారముద్రలనీ, కరవాలాలపిడులనీ ఉంచడానికి యోగ్యతలేనిదైనా సరే, ఏదో ఒక అడవిచెక్కతో చేసినదైనా, తలమీద ఒకకప్పు, చాలు! మార్పులూ, భయాలూ, పీడకలలూ,అపరాథభావనలనుండి విముక్తమై, ప్రేమ శాశ్వతంగా నిద్రించేలా ఎంత హీనమైనదైనా, ఒక చిన్న…
-
విన్నపం … డాంటే గేబ్రియల్ రోజెటీ
. సుందరీ! అతిశయించిన నీ కన్నుల్లో అలసట ఛాయలు కనబడుతున్నై; ‘ఇకపై, మగవాని మనసు చదివేసిన పుస్తకమే’ నని ఆలోచించినందుకు ఎవరో దెబ్బలాడినట్టు వాటిలో మేమెరిగిన మెరుగులు చిన్నబుచ్చుకున్నాయి. . సుందరీ! ఎత్తిన నీ ముఖంలో కనిపించే ఒంటరితనం భరింపరానిది; నిజమైన ఒంటరితనం పదిమందిలోనున్నా వెంటాడుతుంది. నా మనసులోమాట చెప్పడం వల్ల అది పెరగదూ, తరగదు గదా? నన్ను చెప్పనీ? . సుందరీ! నా మనసులోని ఆలోచనలేమిటో నువ్వు ఆమాత్రం పసిగట్టలేవూ? బహుశా నువ్వు వాటిని ఉపేక్షించదగినవిగా భావిస్తునా వేమో!…
-
మంచుమరక … రాబర్ట్ ఫ్రాస్ట్
ఆ మూల నొక మంచుమరక ఉంది గాలి ఎగరేసుకుపోతున్న కాగితాన్ని వర్షం అదిమిపెట్టినట్టు; నేను దాన్ని ఈపాటికి పోల్చుకుని ఉండాల్సింది. . కాగితం మీద ముద్రించిన అక్షరాల్లా బురద అక్కడక్కడ మచ్చలా కనిపిస్తోంది. దానిమీద ఏమిటి రాసుందో, చదివుంటే, నాకిపుడు గుర్తు లేదు. . రాబర్ట్ ఫ్రాస్ట్ . A Patch of Old Snow … . There’s a patch of old snow in a corner That I should have guessed…
-
Life is an Enigma … Kopparthy
. Man must survive. Even if death is inviolable, Man should last as long as he can. Living is a wonderful process… To live with the consciousness of being alive and vitality of spirit is a feat… Possible only with man Living is a grace, an elegance A yearning, an adventure Sadly, life is… an…
-
స్త్రీ స్వభావము … డొరతీ పార్కర్
. నేను ఇటలీలో ఉన్నంతసేపూ నా మనసెందుకు ఇంటిమీదకి పోతుంది, అదే నా స్వంతగడ్డమీద ఉన్నప్పుడు, ఇటలీ చూడాలని ఎందుకు మనసు పరితపిస్తుంది? . స్వామీ! ప్రియతమా! నువ్వెదురుగా ఉన్నంతసేపూ చిత్రంగా, నన్ను ఎక్కడలేని నిరుత్సాహమూ ఆవహించి, అదే నువ్వు లేచి కనుమరుగవగానే, మనసు నీ కోసం, నువ్వు వెనక్కి రావాలని తహతహలాడుతుందెందుకు? . డొరతీ పార్కర్ . On Being A Woman . Why is it, when I am in Rome, I’d…
-
ఏదో ఒకరోజు … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
ఏదో ఒకరోజు నన్ను మృత్యువు సమీపిస్తుంది అది వెలుగులు విరజిమ్మే ఆమని ఉషోదయం కావచ్చు లేదా, సుదూర శీతల సాయం సంధ్య కావచ్చు లేదా, మంచుతెరలలో కరడుగట్టిన నిశ్శబ్ద హిమ నిశీధి కావచ్చు… . ఆ రోజు నా చేతులు పాలిపోయిన కాగితంపై వాలిపోతాయి… లయబద్ధమైన నా ఆలోచనా విహంగాలు పంజరం వదిలి ఎగిరిపోతాయి ఈ చిట్టచివరి కవిత ప్రతిస్పందనలు మనసుకి అందక ఇక ఏ బాధా, విచారమూ, ఆగ్రహమూ… ఉండవు. . ఈ నేల నా పేరు పదేపదే పిలుస్తుంటే,…
-
ఒక్కతెనే… సారా టీజ్డేల్
. నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పటికీ, ఎంతో అపురూపంగా చూచుకుంటున్నప్పటికీ, నేను నా సర్వస్వం ఇచ్చి, పుచ్చుకుంటున్నప్పటికీ, ఎందుకో, ఒక్కోసారి జీవితం పై విరక్తి కలుగుతోంది. . ఈ వేసారిన వివర్ణ విశ్వశృంగాగ్రంపై ఒక్కతెనే నిలబడి నట్టు ఒంటరితనం ఆవహించి, పురులువిప్పుకుంటున్న మంచు నా చుట్టూ పొరలుతూ, తలపై అనంత రోదసి తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. . భూమ్యాకాశాలు అదృశ్యమై, ప్రకృతిలో లీనమై, ఒంటరితనమెరుగని వారి ప్రశాంతత నే ననుభవించకుండా నా అస్తిత్వపు అహంకారం అడ్డుగా నిలుస్తుంది. . సారా టీజ్డేల్…
-
ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా
. ఓహ్! ఈ సాయంసంధ్యకూడా మనకి కాకుండా పోయింది. . సన్నని కారుచీకటి తెరలుకమ్ముకుంటుండగా మనిద్దరం చెట్టపట్టాలేసుకునిఉండడమెవరూ చూడలేదులే. . నా కిటికీలోంచి గమనించాను దూరాన కొండకొనకొమ్ములలో సూర్యాస్తమయ వేడుక . ఒకోసారి, ఎండతునక నా అరచేతుల్లో నిప్పుకణికలా మండుతుంది. . నీకు తెలుసు… ఇంతవిచారంలోనూ, నా మనసు ఉగ్గపట్టుకుని నిన్ను తలుచుకుంటానని! అవును, ఇంతకీ నువ్వపుడెక్కడున్నావు? నీతో ఎవరెవరున్నారు? ఏం చెబుతున్నారు? నువ్వు దూరంగా ఉన్నావన్న బాధలో నేనున్నప్పుడే, నీ మీద నా ప్రేమ నన్ను…
-
ఒక శ్లోకం…
[The reason for selecting this Sloka is the spate of incidents that are occupying headlines of late about the elimination of honest government servants by the mafia. People are increasingly concerned if the governments are negligent in protecting the honest officers from threats to their lives.The impunity with which the culprits escape or choose the…