వర్గం: అనువాదాలు
-
నే నొకరి ఆస్థినికాదు… షేక్స్పియర్
[ఇది షేక్స్పియర్ చారిత్రక నాటకాలలో భిన్నమైనది. కింగ్ జాన్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ నాటకం వ్రాసినా, ఇందులో రసపోషణకంటే, వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకి రాజ్యాధికారం ఉంటుందా అన్న నైతికచర్చమీద ఎక్కువ కేంద్రీకృతమైంది. దానికి అనుబంధంగా వారసత్వపు అర్హత ముఖ్యమా? లేక సమర్థత ముఖ్యమా? అన్న చర్చ ఉంటుంది. ఇంగ్లాండు రాజు కింగ్ జాన్, పూర్వ చక్రవర్తి ఎంపికచెయ్యబడిన రాజు. పూర్వ చక్రవర్తి అన్న కుమారుడు ఆర్థర్ అసలు వారసుడు. లూయీ ఫ్రెంచి యువరాజు. పెండల్ఫ్…
-
ఆడవాళ్ళ పని… మాయా ఏంజెలో
. నేను పిల్లల్ని సంబాళించాలి దుస్తులకి చిన్నమార్పులు చెయ్యాలి నేల తడిగుడ్దతో తుడవాలి బజారుకెళ్ళి సరుకులు కొనుక్కురావాలి కోడికూర వేపుడు చెయ్యాలి ఆ పిల్లని తుడవాలి స్నేహితులకి ఫలహారం తయారుచెయ్యాలి తోటలో కలుపుతియ్యాలి చొక్కాలు ఇస్త్రీ చెయ్యాలి పసివాళ్లకి బట్టలుతొడగాలి ఆ డబ్బామూత తెరవాలి ఈ ఇల్లంతా ఊడవాలి తర్వాత అస్వస్థుల్ని పలకరించాలి పత్తికాయలు కొయ్యాలి ఓ సూర్య కిరణమా! నా మీద ప్రసరించు. ఓ వర్షమా! నా మీద ఒకసారి వర్షించు! ఓ హిమబిందువులారా! నా…
-
నీ తరమా? … నికొలస్ గిగేన్ … క్యూబన్ కవి
(ఈ కవిత ఈ వస్తువు నాది అన్న గర్వంతో విర్రవీగే మనిషిని నిలదీస్తుంది. నేలా, నింగీ, నీరూ, గాలీ వీటిలో ఏ ఒక్కటీ అతని అధీనానికి తలఒగ్గేది కాదు. అంతేకాదు, వాటి అనేకప్రతిరూపాలు కూడ అతని చెప్పుచేతల్లో లేవు. ఇందులో ఏ ఒక్కటీ అతను సృష్టించలేడు. లౌకికమైన సరిహద్దులుగీసుకుని మనిషి ప్రకృతి వనరుల్ని ఇతరులకి (మనుషులకీ, జీవరాశులకీ) అందకుండా, ఒక్కడే అనుభవిస్తే ఎలా? ఈ భూమిమీద జీవరాసులన్నిటికీ స్వేఛ్చగా బ్రతకడానికి హక్కు ఉంది అని చెబుతున్నాడు కవి)…
-
ఉపదేశం … సారా టీజ్డేల్
[సారా టీజ్డేల్ చాలా తక్కువపదాలతో అపురూపమైన తాత్త్వికచింతనని ఈ కవితలో అందించింది. మనశరీరంలో ఉన్న ధాతువులన్నీ భూమి పుట్టిననాటి నుండీ ప్రకృతిలో పరిణామం చెందుతూ, నిత్యం పునరుపయోగమవుతున్నవే. ఈ శరీరం అంతపురాతనమైనది. అలాగే మనలోని భావాలు… మన పూర్వీకులు దారిలోని ముళ్ళన్నీ ఏరి మనకు మార్గం సుగమం చెస్తే వచ్చినవే. మనగొంతు మనదికాదు. మనపూర్వీకులదే. ఇక్కడ నాకు న్యూటను మహాశయుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మీరు చాలా గొప్ప ఆవిష్కరణలు చేశారని ఎవరో ఆయనని పొగడబోతే, ఆయన…
-
ఒక గుక్కెడు సూర్యరశ్మి … జాన్ కీట్స్
[కీట్స్ కవితలని అర్థం చేసుకోవడం ఎప్పుడూ సవాలే. ఎందుకంటే అతని ప్రతీకలు అన్ని రకాల అన్వయాలకి అనువుగా ఉంటాయి. కొందరు దీన్ని లౌకిక ప్రేమకు అన్వయించిచెబితే, మరికొందరు తాగుబోతు తనానికి అన్వయించేరు. కొందరు క్రిస్టియానిటీకి అన్వయించి చెప్పేరు. ఇది కీట్స్ క్షయవ్యాధితో బాధపడుతున్నప్పుడు వ్రాసిన కవిత. చిత్రంగా ఇందులో భారతీయ ఆధ్యాత్మిక చింతనకు సంభంధించిన పదాలూ, విషయాలూ, అచ్చం అలాగే కాకపోయినా, కొన్ని ద్యోతకమవుతాయి. ఉదాహరణకి సూర్యమడలంలోనుండి ఆత్మ ప్రయాణించడం. నామలింగానుశాసనంలో సూర్యమండలానికి ఇచ్చిన పేర్లలో “పోరనీల్గెడు…
-
చివరి కోరిక … రబీంద్రనాథ్ టాగోర్.
(విశ్వకవి రవీంద్రుని 151 వ జయంతి సందర్భంగా) . నన్ను ఇతరులు అడిగినవన్నీ, నే నివ్వలేకపోయాను. అంతమట్టుకు నాకు తెలుసు. నాకు ఎరికే… నే చేసిన మోసాలూ, తీర్చని ఋణాలూ, నెరవేర్చని పనులూ. ప్రపంచానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. మరయితే, ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నట్టు? సంధిపేలాపనా? పశ్చాత్తాపమా? కోరికతోనా? అవసరముకొద్దీనా? నేను ప్రపంచం నుండి కోరుకునేవి చాలానే ఉన్నాయి. మాటల్లోచెప్పలేని లాలసతో కోరుకుంటూనే ఉన్నాను. కోరికలు నెరవేరని నిస్పృహలో, అవసరాలు తీరని నిరాశలో, నేను శపిస్తుంటాను, ఏడుస్తుంటాను. .…
-
ముఖపరిచయం … హెన్రీ డేవిడ్ థొరో
. నాకో వ్యక్తి బాగా ముఖం పరిచయం, లోపాలేమీ కనిపించని వాడు. ఏడాదవుతుందో, లేదా కొంచెం ఎక్కువో రోజూ మా ఇంటి పక్కనుండే వెళుతుండేవాడు. అయితే అతనితో నే నెన్నెడూ మాటాడ లేదు. . ఓ సారి ఎందుకో మూడు మైళ్ళ దూరం వెళ్ళడం తటస్థించింది. అక్కడ అతను ఓ వీధిలో తారసపడ్డాడు. చేతికర్రతో సహా. అతన్ని నేనూ నన్ను అతనూ ఎగాదిగా చూసుకున్నాం చాలసేపు. . తర్వాత ఏదో దూరపుటూర్లో కనిపించాడు. అతని ముఖం చూడగానే అసంకల్పితంగా…
-
ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor
(శీల పరీక్ష (Test of Character) అంటారు దీన్నే. మనం కోరికకీ, విలువలకీ మధ్య సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు విలువలకి కట్టుబడుతూనో, లేక కోరికకి లొంగిపోయో మనం అమలుపరిచే నిర్ణయమే మన శీలాన్ని ఋజువుచేస్తుంది. అటువంటి అద్భుతమైన సమస్యని చిన్న ఇతివృత్తంలో ఆవిష్కరించాడీ కథానిక రచయిత. దురదృష్టవశాత్తూ ఈ రచయితగురించి ఏ సమాచారమూ నేను సంపాదించలేకపోయాను. ఎవరైనా అందించగలిగితే ఎంతో ఋణపడి ఉంటాను. ) . జాన్ బ్లాం షార్డ్ బెంచీమీంచి లేచి నిలుచున్నాడు. తన యూనిపారం ఒకసారి…
-
ఆత్మవిశ్వాసం… లేయాన్ ఫెలిపె, స్పానిష్ కవి
(ఆధునిక స్పానిష్ సాహిత్యం లో ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందిన ఫెలిపె, ఫార్మసీ చదివి, తండ్రి ఆనందం కోసం కొంతకాలం ఫార్మసిస్టుగా పనిచేసినా, సాహిత్యం పట్ల ఉన్న వ్యామోహం కొద్దీ, సంచార నాటకబృందంలో జేరితే, బాధ్యతా రహితంగా ప్రవర్తించి వ్యాపారం నష్టపరచినందుకు రెండేళ్ళు కారాగార శిక్ష అనుభవించేడు. 1936-39 మధ్య స్పానిష్ సివిల్ వార్ లో రిపబ్లికనుల తరపున పోరాడేడు. 1938 లో స్వయంగా దేశం వదిలి మెక్సికోలో జీవితాంతం ప్రవాసజీవితం గడిపేడు. చే గెవాడా…