వర్గం: అనువాదాలు
-
ఉదాత్త స్వభావము… బెన్ జాన్సన్ , ఇంగ్లీషు కవి
చెట్టులా ఏపుగా బలంగా పెరగడం మనిషిని మెరుగైనవాడిగా చెయ్యదు; ఓక్ చెట్టులా మూడు వందల ఏళ్ళు బ్రతికినా అంతే. చివరకి ఎండి, నిస్సారమై, బోడి మానై, రాలి ముక్కలవాల్సిందే. లిల్లీపువ్వు జీవితం ఒకరోజే వేసవిలో బహుసుందరంగా ఉంటుంది. పగలుపూచినది రాత్రికి వాడి, రాలిపోవచ్చు. ఐతేనేం, మన రోజంతటినీ దేదీప్యమానం చేసే పువ్వు అది. మనం సౌందర్యాన్ని చిన్నచిన్న మోతాదుల్లోనే చూస్తాం. చిన్న చిన్న ప్రమాణాల్లోనే జీవితం పరిపూర్ణమై ఉంటుంది. . బెన్ జాన్సన్ (11 June 1572…
-
విధి ఒక దయలేని కుమ్మరి… భర్తృహరి, సంస్కృత కవి
నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన విషయం భర్తృహరిని (ఇంకా, అమర సింహుడు మొదలుగా సంస్కృత కవుల్ని, చాలమంది చీనీ కవుల్ని) ఇంగ్లీషులోకి ఎంతో అందంగా అనువాదం చెయ్యడం. . విధి ఒక నిపుణుడైన, దయలేని కుమ్మరి. మిత్రమా! ఆరాటాల సారెను బలంగా తిప్పి వదలి దురదృష్టమనే పనిముట్టు అందుకుంటుంది ఆకారాన్ని దిద్దడానికి. నా హృదయమనే రేగడిమట్టిని ఇపుడది పిసికి మర్దించి సాగదీసి తన సారెమీద ఉంచి గట్టిగా ఒక తిప్పు తిప్పింది. న న్నేవిధి మలచ…
-
నే నొక పల్లెటూరివాడిని … హాన్ షాన్, చీనీ కవి
నే నొక పల్లెటూరిలో నివసిస్తున్నాను. అక్కడ అందరూ నన్ను సాటిలేనివాడినని పొగుడుతూ ఉంటారు. కానీ, నిన్న నగరానికి వెళ్ళాను అందుకు భిన్నంగా, ఇక్కడ “కుక్కలు” ఎగాదిగా చూడ్డం ప్రారంభించేయి. నా పంట్లాము మరీ బిగుతుగా ఉందని కొందరంటే మరికొందరు నా చొక్కా మరీ పొడుగ్గా ఉందన్నారు. ఎవరైనా ఈ డేగకళ్ళను తప్పించగలిగితే బాగుణ్ణు చిన్నారి పిచ్చుకలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తలెత్తుకు తిరగ గలుగుతాయి. . హాన్ షాన్, చీనీ కవి C 680 – 760 Chinese…
-
భట్రాజులుంటారు జాగ్రత్త… సిడియాస్, గ్రీకు శిల్పి
ఈ కవిత చదివేక, ఈ మధ్య ఆంధ్రలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు ఒకరు తన నాయకునికి విధేయత ప్రకటిస్తూ, భగవంతుడు చనిపోమంటే, తన నాయకుని తండ్రి పొందిన మరణంవంటి మరణాన్ని కోరుకుంటాను అని ప్రకటించడం గుర్తొచ్చింది. . అతి ముఖస్తుతిచేసే వాళ్ళుంటారు. జాగ్రత్త. వాళ్ళు, సింహానికి ఎదురుగా నిలబడి అది ఆకలితో అలమటిస్తోందేమోననన్న ఆలోచనకే భయంతో వణుకుతూ చస్తారు. . సిడియాస్ క్రీ. పూ. 4 వ శతాబ్దం. గ్రీకు శిల్పి . Beware . Beware. …
-
Nongtongpaw… ఛార్లెస్ డిబ్డిన్, ఇంగ్లీషు గీత రచయిత
నా చిన్నతనంలో బొత్తిగా సంస్కృతం చదువుకోని అల్లుడిని, పండగకి అత్తవారింటికి వచ్చినపుడు ఆటపట్టిస్తూ చేసిన గందరగోళం గురించి ఒక చిన్న నాటకం పాఠ్యభాగంలో ఉండేది. అలాగే, ఈ “Nongtongpaw” కూడా. Jonathan Swift, Alexander Pope కీ మిత్రుడైన John Arbuthnot తొలిసారిగా, United Kingdom నీ మరీ ముఖ్యంగా ఇంగ్లాండుని ఆటపట్టిస్తూ సృష్టించిన రాజకీయ వ్యంగ్య పాత్ర John Bull. ఈ John Bull కి ఒకసారి ఫ్రాన్సు చూడాలన్న కోరిక కలిగింది. అక్కడ అతనికి…
-
ఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
మనిషి సంక్షిప్తంగా ఏమి చెప్పగలడో వినాలనుందా? అయితే, పఠితా! నిలు, నిలు! ఎంత అందం మట్టిలో కలవగలదో అంత అందమూ ఈ రాతికింద మట్టిలో కలిసి పోయి ఉంది. అది జీవితానికిచ్చినదానికంటే ఎక్కువ పాలు శీలానికి తననితాను ధారపోసుకుంది. ఆమెలో మచ్చుకి ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని ఈ సమాధిలోనే విడిచిపెట్టండి. ఆ అందానికి ఉన్నది ఒక్కటే పేరు: ఎలిజబెత్ శరీరాన్ని మృత్యువుతో శయనించనీయండి. మృతిలోకూడా ఆజ్ఞనీయగల సమర్థురాలు ఆమె పేరుకి జీవించి ఉన్నప్పటికంటే. శలవు! .…
-
మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… అజ్ఞాత ఈజిప్టు కవి
మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… రోగికి ఆరోగ్యంలా రోగనివారణ తర్వాత పడకగది వదులుతున్నట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… సాంబ్రాణి వాసనలా ఈదురుగాలిలో దుప్పటిక్రింద కూచున్నట్టు మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… వాన వెలిసినట్టు విదేశాలలో యుద్ధంచేసిన సైనికుడు ఇల్లుచేరినట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… మబ్బులువీడి నిర్మలంగా ఉన్న ఆకాశంలా బానిసత్వంలో మగ్గుతున్న వ్యక్తికి ఇంటిమీది ధ్యాసలా. . అజ్ఞాత ఈజిప్టు కవి క్రీస్తు…
-
జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవి
జంటబాసిన పులుగొకటి శీతవేళ కొమ్మపై కూర్చుని రోదిస్తున్నది ; పైన గడ్డకట్టిన శీతగాలి కోత క్రింద గడ్దకడుతున్న సెలయేటి పాత. ఆకురాలిన అడవిలో మచ్చుకైన లేదు చిగురు నేలమీద వెతికితే దొరకదు పూలతొగరు గాలిలో లేదు సన్ననిదైన విసరు ఉన్నదొక్కటే మిల్లు చక్రపు విసురు. . P. B. షెల్లీ (4 August 1792 – 8 July 1822) ఇంగ్లీషు కవి . . The Widow Bird . A widow bird sate…
-
పిచ్చుక తొలి జాడ… చార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
పోడు మీద ముళ్లపొదలు పచ్చగా కనిపిస్తున్నై చెరువుగట్ల నీలిపూలు ఆనందంతో లాస్యంచేస్తున్నై సిందూర వృక్షాలు పూతకొచ్చాయి, వాటి మొదళ్ళలో ముళ్ళగోరింటలు త్వరలోనే మాలలు అల్లనున్నాయి, మే నెల ఎండలో కనిపించే పూమాలలు. చిక్కబడిన వసంతఋతువు తొలి చుట్టం పిచ్చుక కూడ చివరకి అడుగుపెట్టింది. సరిగ్గా సూర్యాస్తమయవేళ, పిట్టలు కూసే వేళ అది తుర్రుమంటూ పరిగెత్తుకు రావడం చూసేను ఎప్పటిలాగే దానికి స్వాగతం పలికేను. ఓ వేసవి చుట్టమా! రా! రా! నా రెల్లుగడ్డి ఇంటిచూరుకు నీ మట్టిగూడు…
-
పిచ్చికుక్కపై స్మృతిగీతం… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి
సదయులారా! సహృదయులారా! నా కథని ఒకసారి ఆలకించండి! ఇందులో మీకు కొత్తదనం కనిపించకపోతే మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టదు. అనగనగా ఇస్లింగ్టన్ అనే ఊరిలో ప్రపంచమంతటా కీర్తిగణించిన, ప్రార్థనచెయ్యడంలో అతన్ని మించినవాడు లేడనిపించుకున్న ఒక భక్తుడుండేవాడు. శత్రువునైనా, స్నేహితుడినైనా సమదృష్టితో చూసి సాంత్వననీయగల కరుణార్ద్ర హృదయుడాతడు అతనికి వస్త్రధారణపై మమకారం లేక ఎప్పుడూ దిగంబరిగానే తిరిగే వాడు. అన్ని ఊళ్ళలో ఉన్నట్టే ఆ ఊరిలోకూడా, ఒకానొక కుక్క ఉండేది, అక్కడ మేలుజాతి వేటకుక్కనుండి, సంకరజాతి, ఊరకుక్కల వరకు అన్నిరకాలూ…