వర్గం: అనువాదాలు
-
Gujjalam… ( Gulab Jamun in Childy Jargon) … Dr. Pulipati Guruswamy
(There is nothing more a fascinating in the world than listening to a child’s incessant barrage of why’s and what’s, its playing smart with parents, and its utter innocence as it tries to understand the nature in all its varied hues. That brings us to memory our own childhood. This is one of the few…
-
నరకంలో ప్రయాణం…ఛార్లెస్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ప్రజలందరిలో అలసట, అసంతుష్టి, నిరాశ ప్రజలందరిలో దెబ్బతిన్న అహం, ప్రతీకారేచ్ఛ ప్రజలందరిలో నయవంచన, భయం, ప్రజలందరిలో ఆశాభంగం, మృగ్యమైన కల్పనాశక్తి వాళ్ళందరి మధ్యనుండి ఫ్రీవే (రాజమార్గం) మీద నేను నా వాహనం నడుపుతుంటాను… వాళ్ళు వాళ్ళ వాహనం నడిపే తీరులో వాళ్ళల్లో శేషించిన “వ్యక్తిత్వం” ప్రతిఫలిస్తుంటారు. కొందరు ఇతరులకంటే ఎక్కువ ద్వేషిస్తూ, అడ్డుపడుతుంటారు కొందరు ఎవరూ తమని దాటిపోవడాన్ని ఇష్టపడరు కొందరు ఇతరులు తమని దాటిపోలేకుండా నియంత్రిస్తుంటారు కొందరి లైన్లు మారకుండా అడ్డుకుంటుంటారు కొందరికి కొత్తకార్లన్నా, కొత్త…
-
చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు కాని నాకు నువ్వు పునరావృతం అవవనిమాత్రం తెలుసు నాకు గుర్తుంది… నగరం యూదులూ అరబ్బులని రెండుగా చీలిపోవడమే కాదు నీకూ నాకూ మధ్య కూడా చీలిపోయింది మనిద్దరం అక్కడ కలిసిబ్రతుకుతున్నప్పుడు మనిద్దరం ప్రమాదాల్లో ఒకతల్లిబిడ్డల్లా ఉండేవాళ్లం ఉత్తరాన్న ఎక్కడో దూరంగా ధృవప్రాంతాల్లో ఉండేవాళ్ళు మంచునుండికాపాడుకుందికి కట్టుకున్న ఇళ్ళలా యుధ్ధాలనుండి రక్షించుకుందికి మనం ఇళ్ళుకట్టుకున్నాం . ఇప్పుడు నగరం మళ్ళీ ఏకమయ్యింది మనం మాత్రం ఇప్పుడు ఏకం కాలేకపోయాం నాకు…
-
While Returning… Mohanatulasi Ramineni, Indian
I did not realize it when infatuation for words seized me amidst incense clouds of experience . Nor did it strike me when the whirling stream of charged words emitted streaks of lightning . So was the state when mind wandered in every direction breaking through concrete structures. . What a distress it is to…
-
కవిత్వం పలకని రోజుల్లో … రిఛర్డ్ జోన్స్, అమెరికను కవి
కవిత్వం బాగా రాయగలిగే రోజుల్లో నే నొక రాజకుమారుణ్ణి; మరుభూమిలోని ఒక అంతఃపురంలో పూతోటలో జలయంత్రాలు నీరుపైకిచిమ్ముతుంటే విలాసంగా మఖ్మలు తలగడమీద చేయి ఆన్చి రజతపాత్రలో మధుపానం సేవిస్తుంటాను; ఎదురుగా కవితలన్నీ గులాబీ రేకులు శృంగారంగా సజ్జీకరించిన విందులోని భక్ష్యభోజ్యాల్లా నా ముందు తివాసీలమీద రంగురంగుల్లో పరచబడి ఉంటాయి. . కానీ, ఒకసారి అంతఃపురం నుండి దూరమైతే, కాలుతున్న ఇసుకమీద డేకురుకుంటూ, నిర్మానుష్యమైన ఇసుకతిన్నెలమీద దాహంతో నాలుక పిడచగట్టుకొనిపోతూ, ఆ హృదయంలేని ఎండమావులు ఖర్జూరపుచెట్లూ చల్లని చలివేంద్రాలంత…
-
We Don’t Want This Tradition … Kondepudi Nirmala
. Tradition is not a thunderbolt… Yet it has incinerated thousands of lives. . Tradition is not darkness Yet, it has thrown into immeasurable precipices . Tradition is not a despot Yet, it has reduced history to armchair fiction . Tradition is not a prison… Yet, it has confined expanses of unsullied waters into the…
-
Tete-a-tete with Silence…Anil Dani, Telugu Poet
Sh!… No Noise! I am in conversation with My silence. . Submitting to the dictates of my conscience I am reconning and counting my mistakes in my silence and trying to address them . . It’s time to take tougher decisions… I am reinventing myself Where I lost my way. . Well, Be that it…
-
మానవజాతికి చరమశ్లోకం … Edna St Vincent Millay, American
కాలువకి గండిపడింది, కరకట్ట కోసుకుపోయింది పంటచేలన్నీ ముంపుకిగురై, పశువులుమునకేశాయి నమ్ముకున్న నేల దూరమై, దొరికింది ప్రమాదకరంగా ఉంది ఎటుచూసినా వేళ్లతోసహా పెకలింపబడి కొట్టుకొస్తున్నచెట్లూ, పునాదుల్తో కొట్టుకొస్తున్న ఇళ్ళతో వరద భీభత్సం తప్ప మరేమీ లేదు ఇంతకష్టమూ పడి, చివరకి మనిషి తనజీవితం చావుకంటే భారమని తలచి తన నీడపై చప్పుడు లేకుండా ఈరోజు రాలిపోవలసిందేనా? లేదు లేదు. నీటిలో సూర్యుడు అస్తమించినతర్వాత ఇంకా సంధ్యవెలుగుంటుండగా తోటకి ఆవల ఒక్క తెడ్డు మీద వాలి ఉన్నప్పుడు చూసాను…. అదిగో…
-
కాలేజీ కిటికీ… DH Lawrence
గట్టిగాకాస్తున్న ఎండకి నిద్రలో జోగుతున్న నిమ్మచెట్టు వెలుగులు వణుకుతున్నట్టు నామీద నుండికదిలి, అలా కాలేజీ గోడ ఎగబాకుతున్నై. నేలమీద లేత నీలి రంగులో పచ్చిక చాలా బాగుంది నిశ్చలంగా ఉన్న డెయిజీలగుత్తులు మెత్తగా మనసు హరిస్తున్నాయి. వీధిలోకి వేలాడుతున్న కొమ్మలకి దూరంగా హద్దులుగీసి ఉన్న , వేసవి తెలుపులా స్వచ్ఛమైన కాలిబాటమీద తమనీడలు కాళ్ళకింద పడుతుంటే ప్రపంచం కుడి ఎడమల నడిచిపోతోంది. ఎక్కడో దూరంగా, ముష్టివాడి దగ్గు నాకు వినిపిస్తున్నా వాడికి నాణెం వేస్తున్న అందమైన స్త్రీ వేళ్ళుకనిపిస్తున్నాయి నేను…
-
కలలు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి
ఏ భూగర్భశాస్త్రవిజ్ఞానమూ, నైపుణ్యమూ లేకున్నా అయస్కాంతాల్నీ, రేఖా చిత్రాల్నీ, ప్రపంచ పటాల్నీ త్రోసిరాజంటూ బాహ్యప్రపంచంలో కనిపించేటంత కఠినమైన మహాపర్వతాలని లిప్తపాటులో, మనముందు కుప్పపోస్తుంది కల. ఆక్కడినుండీ … ముందుగా కొండలూ, తర్వాత లోయలూ, మైదానాలూ వాటికి ఉండేహంగులన్నిటితోసహా కల్పిస్తుంది… ఇంజనీర్లుగాని, కంట్రాక్టర్లుగాని, పనివాళ్లుగాని బుల్డోజర్లు గాని, తవ్వేవాళ్లుగాని, ఏ వస్తు సరఫరాలూ లేకుండానే సువిశాలమైన రాజమార్గాలు, తక్షణ వారధులు, జనాలతో కిటకిటలాడే మహానగరాలు ప్రత్యక్షమౌతాయి ఏ దర్శకుడూ చెప్పకుండానే, మెగాఫోనులూ, ఛాయాగ్రాహకులూ లేకుండానే ప్రజలందరికీ ఎలా తెలుస్తుందోగాని…