వర్గం: అనువాదాలు
-
కడపటి సమాధానాలు … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
. నేను తుషారం మీద ఒక కవిత రాసేను ఒకావిడ నన్నడిగింది: “దానికి అర్థం ఏమిటి?” అని నేను అప్పటివరకు మంచుబిందువుల సౌందర్యం గురించే ఆలోచించేను, వాటి ముత్యపు మెరుపూ, బూడిద వర్ణమూ ఎంతబాగా కలగలిసిపోయి చీకటిపడ్డాక చిరు దీపాలవెలుగులో కళావిహీనంగా పడుండే పూరిపాకలపై తేలికగా జల్లుగా కురుస్తూ వాటికి, రంగురంగుల్లో కదలాడే అద్భుతమైన రహస్య స్థావరాలనే భ్రమ కల్పిస్తాయి కదా అని. . సమాధానంగా ఇలా అన్నాను: “ఒకప్పుడు ఈ సృష్టి అంతా హిమమయమే కొన్నాళ్లకి…
-
బుజ్జి పిట్ట … రాబర్ట్ ఫ్రాస్ట్
. రోజల్లా మా ఇంటిపక్కనే కూస్తున్న ఒక పిట్టని తరిమేద్దామనుకున్నాను . ఇక ఎంతమాత్రం భరించలేననుకున్నాక ద్వారం దగ్గరనిలబడి చప్పట్లుకొట్టేను . నాలో కూడ కొంతలోపం ఉంది ఉండాలి అది పాడుతోందంటే దాని లోపం కాదు . అసలు ఆ మాటకొస్తే, ఏ పాటనైనా అణచివెయ్యాలనుకోవడంలోనే ఏదో లోపం ఉంది . రాబర్ట్ ఫ్రాస్ట్ . (ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కవితలో ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఏ పాటనైనా అణచివేయాలనుకోడం లోనే ఏదో లోపం…
-
Fragrant soil … Anisetti Rajita, Indian poetess
. It is a surprise if a man is ignorant of the fragrance of the soil, which he is born out of and unto which he ultimately returns to. . Whenever it rains the vapors of nascent scent of earth and the aroma of the delicate natal baby blossoms on the young green plants shooting…
-
When It Is Time to Leave …. Mukunda Rama Rao, Indian
Neither you want to leave Nor I want to send you off Not that we are aware that it is an ineluctable choice Helplessly stand you and I. Yet, with a hope like the dawns… and the endless tomorrows… eagerly awaiting that miracle which stops you from leaving. . Y. Mukunda Rama Rao Poet and Translator…
-
పచ్చని చెట్టు నీడలో… షేక్స్పియర్
. పచ్చని చెట్టు నీడలో, నాతోపాటు విశ్రమిద్దామనుకుంటున్నవాళ్ళు; కమ్మని పక్షిపాటకి అనుగుణంగా తమ ఆనందరాగా లాలపిద్దామనుకున్నవాళ్ళు, ఇక్కడకు రండి… రండి… రండి, మీకు విరోధులెవరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . ఎవనికైతే అత్యాశ ఉండదో, ఎండలో పనిచెయ్యడం ఇష్టమో, తినేదే కోరుకుంటూ, దొరికినదానితో సంతృప్తి పడగలడో, ఇక్కడకి రండి … రండి … రండి, మీకు విరోధులెవ్వరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . షేక్స్పియర్ . Under the…
-
మాట నేర్చిన కోళ్ళు… బెంజమిన్ జెఫానియా, ఇంగ్లీషు కవి
(గమనిక: సారూప్యత, సందర్భం (ఇవి దసరారోజులు కదా), దేశీయతల కోసం, ఇంగ్లీషు టర్కీ కోళ్లని నాటుకోళ్ళుగానూ (అవే ఎక్కువగా బలి అవుతాయని నే ననుకుంటున్నాను), క్రిస్మస్ పండుగను దసరా పండుగగానూ మార్చి వ్రాసేను. తదనుగుణంగా మరికొన్ని మార్పులుకూడా అక్కడక్కడ చెయ్యడం జరిగింది.) . ఈ దసరాకి కోళ్ళతో మంచిగా ప్రవర్తించండి ఎందుకంటే, వాటికి కూడా దసరాసరదాల్లో పాల్గోవాలనుంటుంది. కోళ్ళు చాలా సరసంగా ఉంటాయి, కొన్ని చెడ్డవుండొచ్చు, అయినా, ప్రతి కోడి నోరుమూసుకుని పడి ఉంటుంది కదా! మీ…
-
పల్లెటూరి బడిపంతులు… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఇంగ్లీషు-ఐరిష్ కవి.
(విజయనగరంలో గంటి వెంకటరమణయ్యపంతులనే లెక్కలమేష్టారు MRMP School లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఇంగ్లీషులోకూడ దిట్ట. ఆయన మా గురువుగారు. చాలకాలం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కి సెక్రటరీగా కూడ పనిచేశారు. గురాచారివారి వీధిలో వాళ్ళ ఇల్లు ఉదయాన్నే ఎప్పుడూ పిల్లలతో కళకళలాడుతుండేది. ఈ కవిత చదువుతుంటే నాకు ఆయనే గుర్తువస్తారు. ఈ కవితలో చెప్పిన స్కూలు టీచరుకి ఉన్న చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా మాటకరుకుగా ఉన్నా మనసు మెత్తదనం, Strict Discipline, లెక్కలలో…
-
కాలం… యదార్థమూ, మిధ్యా … S T కోలరిడ్జ్
చదునుగా విశాలంగా ఉన్న ఆ పర్వతాగ్రం మీద (అదెక్కడో సరిగ్గా తెలీదు గాని, గంధర్వలోకం అయిఉండొచ్చు) ఆస్ట్రిచ్ లా తమ రెండు రెక్కలూ తెరచాపల్లా జాపుకుంటూ ఇద్దరు ముచ్చటైన పిల్లలు ఒక అక్కా, తమ్ముడూ అనంతంగా పోటీపడుతూ పరిగెత్తుతున్నారు . అక్క అతన్ని మెడ్డాయించింది అయినా వెనక్కి తిరిగిచూస్తూ పరిగెడుతోంది ఎప్పుడూ తమ్ముడివంకే చూస్తూ, అతని మాటలు వింటూ ఎందుకంటే, పాపం! అతనికి చూపులేదు. గరుకుతోవైనా, మెత్తని నేల అయినా ఒక్కలాగే అడుగులు వేసుకుంటూ సాగుతున్నాడు. అతనికి…
-
ఆత్మ వంచన … ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి
ఒక ప్రకాశవంతమైన రోజున సన్నజాజుల సుగంధాన్ని మోసుకొచ్చి నా ఆత్మని పిల్లగాలి అడిగింది: “నా సన్నజాజుల సుగంధానికి బదులుగా నీ గులాబుల పరిమళాలు ఇస్తావా?” అని . అయ్యో! నా దగ్గర గులాబులు లేవే; నా తోటలోని పూలన్నీ వాడివత్తలైపోయాయి” “సరే! అలాగైతే, ఈ వాడిపోయిన రేకలూ, రాలిన పండుటాకులూ నీ చెలమలలోని నీళ్ళే తీసికెళ్తాను లే.” . చెప్పినట్టుగా గాలి అవి మోసుకుపోయింది. నేను వలవలా ఏడ్చాను. నా ఆత్మతో అన్నా: ఎంతపనిచేశావు? ఎంత నమ్మకంతో…