వర్గం: అనువాదాలు
-
కృతజ్ఞతలతో … థామస్ లక్స్, అమెరికను కవి
ఓ భగవంతుడా! నువ్వెవ్వరో గాని నీకు నా కృతజ్ఞతలు… ఊపిరి పీల్చి విడవడానికి ఇచ్చిన ఈ గాలికీ, చిట్టడవిలో తలదాచుకుందికి ఈ చిన్న గుడిశకీ, నిప్పురాజేసుకుందికి పుల్లలకీ, దీపపు వెలుతురుకీ, చిగురాకు మెరుగువంటి సహజకాంతికీ, పచ్చని ప్రకృతికీ, విహంగాలకీ, సంగీతానికీ, ప్రకృతి ఒడిలోకి తిరిగిచేర్చే సాధనాలకీ చిమ్మటలు కొట్టేసిన కంబళ్లకీ మంచుముక్కలాంటి నీటికీ, నిజం, చల్లని ఈ నీటికీ అనేక కృతజ్ఞతలు. . ప్రభూ, నీకు కృతజ్ఞతలు! నన్నిక్కడకితీసుకొచ్చి పడేసినందుకు… ఇక నా సంగతి నేను చూసుకుంటాను…
-
నా కిటికీ క్రిందనున్న శ్మశానంలోని మృతులకు … ఏడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి.
. చలనంలేకుండా అలా ఎలా పడుక్కోగలుగుతున్నారు? మీరక్కడ అశాంతితో కదులుతున్నారని అనడానికీ, విసుగెత్తి ఆవులిస్తూ చెయ్యి జాచేరనో, చాలా రోజులై తిరగక కాళ్ళు పట్టేసి నొప్పిపెడుతున్నాయనో సూచించడానికి రోజల్లా నేను గమనించినా ఒక్క గడ్డిదుబ్బూ కదలదు. రాత్రంతా గమనిస్తూనే ఉంటాను; అయినా, ఒక్క ఆత్మా లేచిరాదు అర్థరాత్రి చల్లనిగాలిలో స్వేచ్ఛగా విహరించడానికి. . ఏం? మీ ఎముకల్లో పోరాట పటిమ నశించిందా? మీతోపాటు ఉండే క్రిములు మిమ్మల్ని అసహ్యించుకుంటాయి: పాలిపోయి, చివికిపోతూ, మట్టిలోకలిసిపోతున్న అన్నిటికీ తలలూపే పౌరుషంలేని…
-
నా మాట … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి.
అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో, నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం; ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం. . రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది, అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి, వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది, వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది. . కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ, ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో …
-
I want No Life… Ravinder Verelly, Telugu Poet
. Then: There was no form. There were no limits at all. My term of life was the same as that of Milky Ways. I had a full-fledged freedom to touch the bourns of skies and the depths of abysses same time. My existence was at the threshold of nine planets. . Now: I am a…
-
నిశాసమాగమము … రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
. విభూతిరంగులో సముద్రం, నీలివర్ణంలో సుదీర్ఘమైన నేల; దిగంతాల అంచున పసుపురంగులో అర్థచంద్రబింబం; నిద్రలో జడుసుకుని లేచినట్టు ఉవ్వెత్తుగా ఎగసి వడివడిగా చిన్నచిన్న వృత్తాల్లో పరిగెడుతున్న అలలు. నావలో నేను ఒడ్దుసమీపించి, ఉప్పుటేరుని కలిసి, దాని అలసటతీర్చడానికి పర్రలో లంగరు వేశాను . సంద్రపువాసనవేస్తూ మైలుపొడవు వెచ్చని తీరం; కళ్ళం చేరడానికి ఇంకా దాటవలసిన మూడు పొలాలు; కిటికీఅద్దం మీద నెమ్మదిగా తట్టిన ఒక తట్టు, తత్తరగా గీచిన అగ్గిపుల్లచప్పుడు, ఒక్కసారిగా లేచిన నీలిమంట,…
-
గడియారాలన్నీ ఆపేయండి…WH ఆడెన్. ఇంగ్లీష్-అమెరికను కవి
గడియారాలన్నీ ఆపేయండి. టెలిఫోన్లు మోగనివ్వకండి కుక్క అరవకుండా రసాలూరే బొమిక ఒకటి ఇవ్వండి పియానోలు మూసి, అట్టే చప్పుడుచెయ్యకుండా డోలు వాయిస్తూ శవపేటిక బయటకు తీసుకురండి, దుఃఖితులంతా వెనక నడవండి. . విమానాలు రోదిస్తూ నెత్తిమీద ఆకాశంలోచక్కర్లు కొట్టనీండి అలా తిరుగుతూ, అతని మరణ వార్తని గాలిలో లిఖించనీండి స్వేచ్ఛాపావురాల తెల్లని మెడలకు నల్లని సిల్కురిబ్బన్లు ముడివెయ్యండి రాకపోకలునియంత్రించే పోలీసుల్ని నల్ల చెయిజోళ్లు తొడుక్కోమనండి . అతనే నాకు తూరుపు, పడమర, ఉత్తరం, దక్షిణం అపరాహ్ణమైనా,…
-
ప్రయాస… వీరన్ కుట్టీ, మలయాళ కవి.
ఈ నీడ, ముందుకీ వెనక్కీ నడయాడుతూ తనరూపాన్ని పెంచుకుంటూ, కుంచించుకుంటూ పోవడం అదేదో కాలక్షేపానికి ఆడే వినోదక్రీడ కాదు. . అది, తను ఎల్లకాలమూ ఒకరి పాదాలక్రిందే పొర్లుతూ తన ఉనికి కోల్పోతున్నందుకు పడే దుఃఖాన్ని మరిచిపోడానికి చేసే ప్రయాస… . వీరన్ కుట్టీ, మలయాళ కవి . Veeran Kutty is a Lecturer at Government College, Madapally, Kerala. . The Effort . This is no trivial pastime, This…
-
కథలుగా చెప్పుకునే అడ్డంకులు… జాన్ మాంటగే, ఐరిష్ కవి.
. మనిద్దరి మధ్యా కథలుగా చెప్పుకునే అడ్డంకులన్నీ ఉన్నాయి ఊహకందని సుదీర్ఘమైన మైదానమూ… భయభ్రాంతుల్ని చేసే కొండల వరుసలూ… రాత్రల్లా విడువకుండా విసరికొడుతూ శాక్రమెంటోనీ, శాన్ జోక్విన్ నీ ముంచెత్తి రివ్వున ఈదురుగాలులతో తేలియాడిన హేమంతపు వానా… . పగలల్లా నిరీక్షిస్తూనే ఉన్నాను, స్టేషనుకీ, బారుకీ మధ్య భయం భయంగా తిరుగాడుతూ. మధ్యలో ఇంకో రైలు వెళ్ళడం చూసాను శాన్ ఫ్రాన్సిస్కో చీఫో, గోల్డెన్ గేటో తెలీదు గాని ముందుకి పొడుచుకొచ్చిన చక్రాలంట నీళ్ళుధారాపాతంగా కారుతూ… .…
-
సొంపులో ఉన్న సొగసు … Ben Jonson
. ఎప్పుడూ అలంకరించుకుని ఎప్పుడూ నీటుగా తయారై, పౌడరు రాసుకుని, సెంటు పూసుకుని, కళగా ఏదో విందుభోజనానికి వెళుతున్నట్టుంటావు. కళల అంతరార్థం గ్రహించశక్యంకాదనుకో! కానీ, సుందరీ! అంతా బాగుంటుందనీ, అంతా మంచేననీ అనుకోనవసరం లేదు. . ఏదీ ఒక సారి ఇటు చూడు, నీ ముఖం చూడనీ ఆ పొందికలోనే సౌందర్యం ఉంది! వేలాడుతున్న బట్టలూ, రేగిపోయిన జుత్తూ వంటి నిర్లక్ష్యం … కళలో చేసే ప్రయోగాలకంటే ఎక్కువగా నా దృష్టి ఆకర్హిస్తుంది. నిజమే. అయితే అది…
-
పొరపాట్లలో ఆనందం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషుకవి.
. ధరించిన ఉడుపులలో తమాషా తికమకలు, మనలో రగిగించే కొంత కొంటెతనం . మన ఏకాగ్రతని భగ్నం చేసే భుజాలు దిగిపోయిన వస్త్రాలు . అక్కడక్కడ తప్పిపోయిన లేసు ఎర్రని జాకెట్టుకి కలిగించే ఆకర్షణ . మరిచిపోయిన ముంజేతి చొక్కామడతకి అటూ ఇటూ ఊగే అక్కడకట్టిన రిబ్బన్లు . గాలికి రెపరెపలాడే పరికిణీలో, చూసితీరాల్సిన జయకేతనపు విసురులు . నాగరికత ఉట్టిపడే నెక్ టై కట్టిన అతనే అశ్రధ్ధగా వదిలేసిన షూ లేసు . ఏ లోపంలేకుండా…