వర్గం: అనువాదాలు
-
Begum Akhtar (Part 2) … Samala Sadasiva, Indian
. The experience of cognoscente Kishan Sing Chavda is worth mentioning. He was then working as Diwan with Maharaja of Nilam Nagar. It was a common practice those days for the native rulers having some work with the Viceroy to keep him in good humor, and stay close to Viceroy. Calcutta in December is delectable. So,…
-
Begum Akhtar (Part 1) … Samala Sadasiva
మతాన్నీ, విశ్వాసాల్నీ జీవనమార్గంగా అనువదించుకుని, హిందూ-ముస్లిం సఖ్యతకూ, పాలూ నీళ్లలా కలగలిసిన సంస్కృతీ వారసత్వాలకు నిలువెత్తు నిదర్శనాలుగా, మనకు మార్గదర్శకులుగా మనకళ్ళెదుటే ఉదాత్తమైన వ్యక్తిత్వాల్ని కనబరుస్తూ,సహజీవనాన్ని సాగించిన అద్భుతమైన వ్యక్తులు కొద్దికాలంక్రిందట ఈ నేలమీద నడిచేరు. సంగీతమూ, సాహిత్యమూ భాషా ఒక మతానికో ప్రాంతానికో చెందినవని కాకుండా, అవి ఈ దేశ సంపదగా భావించి వాటిలోని స్వారస్యాన్ని గ్రహించి ఆనందించిన ఒక జీవన ప్రక్రియ ఈ గడ్దమీద నిలిచింది. అటువంటి సంఘీభావం మధ్య కొయ్యలు దిగ్గొట్టి వేరుచేసిన…
-
పెంపుడుపిల్లి స్మృతికి… హోర్షే లూయీ బోర్షెస్ , అర్జెంటీనా కవి
. నీకున్న నిశ్శబ్దపు ముసుగు అద్దాలకి కూడా ఉండదు తొలిసంధ్యవేకువకి కూడ నీపాటి రహస్యోదయం లేదు, వెన్నెల వెలుగులో, మేము దూరం నుండి మాత్రమే రహస్యంగా కనిపెట్టగలిగిన చిరుతవి నువ్వు. . ఏ దైవేచ్ఛా పరికల్పనో తెలీదుగాని, మేమెంత వెంటాడినా నిన్ను అందుకోలేము; భాగీరథి కన్నా, సూర్యాస్తమయంకన్నా సుదూరంగా నీ ఏకాంతం నీది, నీ రహస్యం నీది. . చెయిజాచి అందించిన నా క్షణమాత్ర లాలనని నీ వెన్ను అంగీకరించింది; నువ్వు కనికరించావు, నాటినుండి అనునిత్యం ఈ…
-
సీలియా కి ప్రేమతో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
. నీకు అంగీకారమైతే, నను నీ చూపులతో సేవించు, ప్రతిగా, నేను నా కళ్లతో ప్రమాణం చేస్తాను; పోనీ,ఒక్క ముద్దైనా కప్పుమీద గుర్తుగా విడిచిపో, ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్ళనేవెళ్ళను. మనసులో చెలరేగుతున్న దాహార్తి తీరడానికి దివ్యసుధలను కోరుకుంటోంది. కానీ, భగవంతుడే స్వయంగా అమృతాన్ని అందించినా నీకు బదులుగా అమరత్వాన్ని స్వీకరించలేను. . ఈ మధ్యనే, గులాబీలమాల ఒకటి పంపించాను, దానితో నిన్నేదో సత్కరిద్దామని కాదు; అక్కడయితే తను వసి వాడదని దానికి ఒక ఆశ్వాసనను…
-
ధూళికణానికి… ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
. కంటికి కనరాని ఓ చిన్ని వ్యోమగామీ! ఒక సన్నని గాలితీగకు వేలాడుతూ, సూర్యకిరణాలమీద తేలియాడే చైతన్య అణుపదార్థమా! నీ గాలివాటు ప్రయాణానికి గమ్యం ఏది? ఏ ఆలోచనతో నువ్వు ఈ ఈథర్ లో నీ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టావు? కంటిచూపుని ఎగతాళిచెయ్యడానికా? పాపం! దట్టమైన నీలిమేఘాల మేలిముసుగు నిను దాచేలోగానే వెంటాడే సుడిగాలి నీ ఖగోళయానానికి తెరదించుతుందే. అయ్యో! అచ్చం అలాగే, ఊహాకల్పిత పసిడితీగెలమీద ఆశల ఊపిరులూదే బూటకపుముఖస్తుతులకు పొంగిపోయి ఏడుపొరల ఇంద్రధనుస్సులు తన కళ్ళలో…
-
అదంతా కలేనా? … గై ద మొపాసా, ఫ్రెంచి కథా రచయిత
హెచ్చరిక: గుండెదిటవు లేనివాళ్ళు ఈ కథని దయచేసి చదవ వద్దు. అలా చదివినపుడు వచ్చే సమస్యలకి అనువాదకుడు బాధ్యుడు కాడు. . ఈ కథ ఉత్తమపురుషలో పురుషుడు చెప్పిన కథ అయినప్పటికీ, దీనిని స్త్రీ చెప్పినట్టు ఊహించినా, ఇందులోని సౌందర్యం ఎంతమాత్రం తగ్గదు. చెడదు. (శ్మశానంలో రాత్రిగడపటం అన్నది కథకుడికి కూడ suspension of disbelief క్రింద ఇచ్చే రాయితీయే గనుక). అసలు విషయం, బలహీనతలనీ, గొప్పదనాలనీ తులనాత్మకంగా పరిశీలించి ఇవ్వవలసినవాటికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వలేని మనబలహీనత వల్ల,…
-
ఆవగింజల టపటపలు … మనుజ్ బ్రహ్మపాద, Malayalam, Indian Poet.
. విరబూచినచెట్టు ఒకటి కిటికీ పక్కకి వంగి, పిట్టలా మూతిముడిచి సన్నగా ఊళవేసింది: “ఏయ్, బాబూ! బయటికి దా! నేను నీ కోసం పువ్వులు కురియడానికి ఎదురుచూస్తున్నా.” . మనసు చికాకు తెప్పించే సోషలు పుస్తకాన్ని ఒక్కసారి అవతలకు విసిరేసి, ఒక ఆకును మీటింది పళ్లతోటలోకి పరుగెత్తడం గురించి ఆలోచిస్తూ… . సరిగ్గా అప్పుడే వంటింట్లోంచి ఒక కేక వినిపించింది: “ఓరే, బాబూ! రేపు పరీక్ష …” . ఎక్కడికో ఎగిరిపోడానికి పావురం రెక్కలు అల్లాడించింది; చెట్టు…
-
ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. ఇక అందులో ఇంద్రజాలం ఉండదు, అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం, నేను నీకూ, నువ్వు నాకూ ఇక అద్భుతాలుగా అనిపించం. . ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని— ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు… నేను సముద్రపొడ్డునే అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను. . ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే, ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది. . సారా టీజ్డేల్ August…
-
ఒక బానిస కల … H W లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇంకా కోతకొయ్యని వరిచేను గట్టున చేతిలో కొడవలితో అతను మోకరిల్లి ఉన్నాడు; అతని ఒంటిమీద బట్టలేదు, అట్టగట్టిన తల ఇసుకలో కూరుకుని ఉంది. పదే పది సార్లు కలత నిదుర మగతలో అతను తన మాతృభూమిని చూశాడు. . అతని విశాలమైన కలలప్రపంచంలో నైగర్ నది విలాసంగా ప్రవహిస్తోంది. దాని ఒడ్దున మైదానాలలోని తాటిచెట్లక్రింద మరొకసారి అతను మహరాజులా నడుస్తున్నాడు; కొండమీదనుండి దిగుతున్న సార్థవాహుల బండ్ల ఎద్దులమెడగంటలు వినిపిస్తున్నాయి. . మరొకసారి తన నీలికన్నుల రాణిని తన పిల్లలమధ్యలో…
-
దంతవైద్యుడూ— మొసలీ…. రోవాల్ డాల్ , బ్రిటిషు కవి
. ఒక మొసలి, చిలిపిగా నవ్వుతూ , దంతవైద్యుడి ఎదురుగా కుర్చీలో కూచుని: “ఇదిగో ఈ పన్నూ, మిగతా అన్నిపళ్ళూ కూడా సలుపుతున్నాయి. బాగుచెయ్యాలి,” అంది. దంతవైద్యుడి ముఖంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు. భయంతో గడగడలాడుతూ, వణికిపోసాగేడు. “అలాఅయితే, ఒకసారి చూడాల్సి ఉంటుంది “అన్నాడు. “నాకు కావలసిందీ అదే,” అని “ముందు వెనక పళ్ళు పరీక్షించండి అన్నిటిలోకీ ఆ దంతాలే బాగా నొప్పెడుతున్నై,” అంది. అని దాని భారీ దవడలు తెరిచింది. అది మహా భయంకరమైన దృశ్యం… కనీసం…