వర్గం: అనువాదాలు
-
జపనీస్ కవిత … అజ్ఞాత జపనీస్ కవి
. ఈ కొండకుసుమానికి మనోహరమైన రేకు*లనేకం ఉన్నాయి; కానీ, ఏమి ప్రయోజనం, చెప్పాలంటే సిగ్గుగా ఉంది, ఒక్కటీ వర్షానికి అక్కరకు రాదు. . అజ్ఞాత జపనీస్ కవి. ఆంగ్లానువాదం: విలియం ఎన్. పోర్టర్. (వివరణ: *రేకు: (1) పుష్ప దళము or, Petal of a Flower (2) దుప్పటి, చద్దరు (ఈ కవిత వెనక ఒక అందమైన జానపద కథ ఉంది. అది ఒకప్పుడు జపానులో బాగా ప్రచారంలో ఉన్నది. ఇప్పటి సంగతి…
-
చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి
. ఆ చిన్న కుక్క బొమ్మ నిండా దుమ్ము పేరుకుంది, అయినా అది బలంగా స్థిరంగా నిలబడి ఉంది; ఆ చిన్న బొమ్మ సిపాయి తుప్పుపట్టి ఎర్రగా ఉన్నాడు అతనిచేతిలో తుపాకీ బూజుపడుతోంది. ఒకప్పుడు ఆ కుక్క బొమ్మ కొత్తది గానూ ఆ బొమ్మ సిపాయి అందంగా ఉన్న రోజులున్నాయి అదెప్పుడంటే, మన నీలిరంగు బుజ్జాయి వాటితో ఆడి ముద్దుపెట్టుకున్న రోజుల్లో. “నువ్విప్పుడు నేను తిరిగివచ్చేదాకా ఎక్కడికీ కదలకేం? నువ్వుకూడా ఏ చప్పుడూ చెయ్యకు!” అని వాటితో…
-
మర నాగలి … లూయీ అంటర్మేయర్, అమెరికను కవి.
. విధేయతతో శ్రమిస్తూ కువకువలాడే ఈ భీకర మూర్తి కంటే ఏ నగ్నత్వం ఇంతకంటే అందంగా ఉంటుంది? ఏ ఆచ్ఛాదనా లేని జిడ్డోడుతున్న ఈ కండరాలూ గురితప్పని ఈ ఇనప కడ్డీలూ ఎన్నడూ ఆగవు పక్కలంట పొడవుగా, మెరిసే ఈ ఇనప రేకు కందెన కూడా పాడుచెయ్యలేని ఇంద్రజాలం. భూమిని రెండుగా చీల్చగల ఈ భారీ యంత్రం దాని కోపాన్ని ఉస్ ఉస్ అని నెమ్మదిగా ప్రకటిస్తుంది. దాన్ని అయిష్టాన్ని వెళ్ళగక్కదు; సృష్టికర్తలమీద చంపెద్దామన్నంత కోపంతో ఎదురుతిరగదు.…
-
అబూ సయ్యద్ రుబాయీలు… పెర్షియన్ సూఫీ కవి.
. 67 ప్రభూ! నా ఆలోచనలను ఈ ఇహ, పర లోకాలనుండి తప్పించు; పేదరికపు కిరీటంతో నన్ను ఉన్నతుడిని చెయ్యి. నిన్ను వెతకడంలో గల రహస్యాలను నాకు ప్రకటించు నీదగ్గరకు దారితీయని దారులనుండి నా అడుగులు మళ్ళించు. (ఒక సారి మన్సూర్ అల్ హలజ్ (858 – మార్చి 26, 922, పెర్షియన్ సూఫీ) ని ఎవరో అడిగేరట “దేముని దగ్గరకి త్రోవ ఏది?” అని. దానికతను ” రెండడుగులే, నువ్వు అక్కడ చేరుకున్నట్టే; మొదటి అడుగు…
-
ఎదురీత … కార్ల్ సాండ్ బెర్గ్, అమెరికను కవి
. ధీరులు అలా పుడుతూనే ఉంటారు… వాళ్లని కాల్చి చంపుతారు, ఉరితీస్తారు, వేధించి, మానసికంగా కృంగదీస్తారు; అయినా వాళ్ళు పోరాడుతూ, గీతాలాలపిస్తూ, జీవితాన్ని పణం పెడుతూ జీవిస్తూనే ఉంటారు. ధీరులు …. అలా పుడుతూనే ఉంటారు గుండెబలమున్న వాళ్ళ తల్లులు వాళ్ళని ఏ సముద్రం నుండో, ఏ గొప్ప మైదానాలనుండో, ఏ కొండ శిఖరాలనుండో లాక్కొస్తారు మంగళహారతులివ్వు, ఆశీర్వదించు, కృతజ్ఞతలు చెప్పు. (వాటితో నిమిత్తం లేదు.) ధీరులు అలా పుడుతూనే ఉంటారు. . కార్ల్ సాండ్ బెర్గ్,…
-
సానెట్ LXII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
జీవితంలో విఫలమై, నిరాసక్తతో నే నలా దేశాలు తిరుగుతూ మారుతున్న స్థలంతో కేవలం వేదనలలోనే మార్పు గమనించేను; నేను ఎంతకాలంనుండో వెతుకుతున్న ప్రశాంతతను వా రనుభవిస్తూ ఆ పల్లె శ్రామికులు కలతలేని నిదురలో హాయిగా విశ్రమిస్తున్నారు! ఊరు ఇప్పుడు పూర్తిగా మాటుమణిగింది; చూరు దిగువగా ఉన్న ఆ తాటాకు గుడిశ కిటికీలోంచి చలికాచుకుందికి వేసుకున్న నెగళ్ళు మంటతగ్గి బుసి ఆరుతున్నాయి; పాలిపోయిన చంద్రకిరణాలు మెరుస్తున్న మంచుమీద పడి దానికి కొత్త సొబగు ఇస్తున్నాయి. గడ్డకట్టుకుపోతున్న ఈ రాత్రి,…
-
జ్ఞానోదయం .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
అవి వసంతకాలపు తొలిరాత్రులు హేమంతపు మత్తు నిదర ఇంకా వదల్లేదు మా చుట్టూ ఉన్న నీడలూ, గాలీ మేము మాట్లాడుకోని మాటలకి చెవులురిక్కిస్తున్నాయి. పది సంవత్సరాలు దొర్లిపోయాయి గాని వసంతం ఇప్పుడూ అప్పటంతవాడిగానే ఉంది మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే అప్పుడు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తాం ఎదురుచూసిన వసంతం అయితే ఎన్నడూ రాలేదు కాని, అదేమిటో తెలుసుకోగలిగినంత జీవితం గడిచిపోయింది మనకి లేనిది ఎప్పుడూ లేకుండానే మిగిలిపోతుంది, మనకున్న వస్తువుల్నే మనం పోగొట్టుకునేది. . . సారా…
-
మరణించిన పిదప … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
. అతను నేను నిద్రిస్తున్నానేమో ననీ, వినిపించదనుకునీ నా మీదకి వాలి, “అయ్యో పాపం, చిన్న పిల్ల” అనడం విన్నాను. తర్వాత గాఢమైన నిశ్శబ్దం, నాకు అర్థమయింది అతను రోదిస్తున్నాడని. అతను తెరని తొలగించడంగాని, నా ముఖం మీది ముసుగు తియ్యడం గాని, నా చేయి తన చేతిలోకి తీసుకోవడం గాని, నా తలక్రింద ఉంచిన తలగడ సవరించడం గాని చెయ్యలేదు. అతను నేను బ్రతికుండగా ప్రేమించలేదు; కాని మరణించిన పిదప నా గురించి జాలి పడుతున్నాడు;…
-
పరాయీ!… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
. అలా పక్కనుండి నడిచిపోయే పరాయీ! నీకు తెలీదు నే నెంత ఆశగా నీకోసం వెతుకుతున్నానో, నే నెదురుచూస్తున్న పురుషుడు, లేదా స్త్రీ, నువ్వే కావచ్చు, (నా కది ఒక కలలా అనిపిస్తుంటుంది) నే నెక్కడో నీతోపాటు ఆనందంగా జీవితం గడిపేను, ఒకరికొకరు తారసపడి కనుమరుగవగానే, లీలగా అంతాగుర్తుకువస్తున్నట్టనిపిస్తుంది, నువ్వు నా ఈడు బాలుడివో, బాలికవో, వాత్సల్యంతో, నిష్కల్మషంగా, యుక్తవయసుకి నాతోపాటే ఎదిగావునువ్వు మనిద్దరం కలిసే తిన్నాం, కలిసే పడుక్కున్నాం— నీ శరీరం నీదీ, నా దేహం…
-
సుఖమయజీవితాన్ని సాధించే మార్గాలు… ఎర్ల్ ఆఫ్ సరే, ఇంగ్లీషు కవి
. ఓ మార్షల్! సుఖమయమైన జీవితానికి కావలసినవి ఎవో నేను కనుక్కున్నాను: బాధపడి కూడబెట్టినది గాక, దానంచేసిన సంపదా, ప్రశాంత చిత్తమనే సారవంతమైన నేలా ఈర్ష్యా అసూయలులేని సమ్యక్ దృష్టి పాలకుడూ కాని, పాలితుడూ గాని స్వేచ్ఛా, ఏ రోగమూ లేని ఆరోగ్య జీవనమూ, వంశాన్ని కొనసాగించే సంతానమూ నిస్సారము కాని మితమైన ఆహారమూ నిరాడంబరతతో కూడిన నిజమైన జ్ఞానమూ ఏ చీకూ చింతలూ లేని రాత్రీ, అప్పుడు వివేకాన్నికోల్పోకుండా చేసే మద్యపానమూ వాదోపవాదాలు చేయని విశ్వాసమైన…