వర్గం: అనువాదాలు
-
షాంటుంగ్ నుండి తు ఫు కి … లి పో, చీనీ కవి
. కాలం ఎలాగడుస్తోందని నువ్వడుగుతావు… నే నో చెట్టు మొదలుకి వెచ్చగా చేరబడి రాత్రీ పగలూ పైన్ చెట్లలో వీచే శరద్వీచికలను వింటుంటాను . . షాంటుంగ్ మదిర నన్ను మైమరపించలేదు ఇక్కడికవులంటే నాకు విసిగేస్తుంది. వెన్ నదిలా అనంతంగా ప్రవహిస్తూ నా ఆలోచనలన్నీ నీవైపు దారితీస్తాయి. . లి పో (701 – 762) చీనీ కవి . . To Tu Fu from Shantung . You ask how I spend…
-
గత సంవత్సరం… జాన్ క్లేర్, ఇంగ్లండు
బ్లాగ్మిత్రులకి, సందర్శకులకీ 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ ఆయురారోగ్యైశ్వర్యానందసందోహాల్ని కొనితెచ్చుగాక అని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. . పాత సంవత్సరం వెళ్ళిపోయింది… చీకటిలోకి… శూన్యం లోకి: ఇక పగలు ఎంత వెతికినా కనిపించదు రాత్రి దాని సంగతి ఎవరూ చెప్పరు. అది దాని అడుగుజాడలు గాని, గుర్తులుగాని, వెలుగునీడల చిరునామా గాని వదలలేదు. క్రిందటేడు పక్కింటివాళ్ల పోలిక లుండేవి దానికి ఈ ఏడు అదంటే అందరూ తెల్లమొహం వేస్తారు. . కనిపించేదంతా…
-
నువ్వు హేమంతంలో వస్తే … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నువ్వు గాని హేమంతంలో వస్తే నేను గ్రీష్మాన్ని తగిలేస్తాను గృహిణులు ఈగల్ని తోలేసినట్టు సగం చీదరతోనూ, సగం సంతోషంతోనూ . నిన్ను ఏడాదికొకసారైనా చూడగలిగితే నేను నెలలన్నిటినీ ఉండల్లా చుట్టి ఒక్కొకటీ ఒక్కో సొరుగులో దాచెస్తాను మళ్ళీ వాటి అవసరం వచ్చేదాకా . నీ రాక శతాబ్దాలు ఆలశ్యమైతే నేను వాటిని నా చేత్తో లెక్కపెడతాను ఒక్కొక్కవేలూ విరిచి చివరికి అన్నీ నా నేరానికి పరిహారంగా చెల్లించే వరకూ. . ఇక ఈ జీవితం ముగియనున్నప్పుడు, ఇద్దరికీ…
-
అర్థరాత్రి వేళ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి నాకు జీవితం అంటే అర్థమయింది, ప్రతిదానికీ ప్రారంభమే గాని, దేనికీ ముగింపు ఉండదు, మనం గెలిచామనుకుని సంబరపడే గొప్పవిజయాలన్నీ, మన భ్రమతప్ప నిజానికి ఎన్నడూ గెలిచినవి కావు. . దేనికోసమైతే నా ఆత్మ గూడుకట్టుకుందో ఆ ప్రేమ కూడా, చివరికి, కలతతో ఆలోచనలలోపడ్ద అతిథిలా వస్తుంది. సంగీతమూ, మగవారి పొగడ్తలూ, ఆఖరికి చిరునవ్వైనా సరే, మిగతావాటికంటే అంతగొప్పగా ఏమీ ఉండవు. . సారా టేజ్డేల్ (August 8, 1884 – January 29,…
-
శోకనాయిక … జో ఏకిన్స్, అమెరికను కవయిత్రి
. కడలిమీద తుఫాను కమ్ముకుంటోంది పగలు చీకటిమయం, కెరటాలూ నలుపే దూరాన సీగల్స్,విషాదంగా అరుస్తూఎగురుతున్నాయి, కెరటాలు తుఫానుని తోసుకొస్తున్నాయి. . ఎడారినుండి వీస్తున్న పెనుగాలులకి నగరం తన మీనారుల తలలెత్తుతోంది బురుజులలోనూ, మీనారుల క్రిందా బందీలైన మహిళలు రోదిస్తున్నారు. . థెసలీలోని ఒకానొక పర్వతాగ్రాన, ఉపేక్షతో మరుగుపడ్డ కోవెల నాల్గుపక్కలా విరిగి స్థంభాలు క్రమంలో నిలిచి ఉన్నై, క్రింద తెల్లగా పండు వెన్నెల. . అయినా, సృష్టిలో నీ ముఖంలో ప్రతిబింబించేంత విషాదమూ, ఒంటరితనం ఎక్కడా కనిపించవు.…
-
మిణుగురుల సయ్యాట… కాన్రాడ్ అయికెన్, అమెరికను కవి
మెరిసే వలలాంటి ఉలిపొర వలువల్లో నను చూడు చీకటిలోంచి వెలుగులోకి అలవోకగా ఇట్టే ఎగురుతూ చప్పుడు చెయ్యకుండా తిరిగి చీకట్లోకి జారుకుంటాను! మిణుగురును నేను, ఎవరికీ పట్టుదొరకను . నువ్వు మిణుగురువా? ఎవరి పట్టుకీ దొరకవా? నేనుమాత్రం నిన్ను చీకటిలా వెన్నాడుతా నిన్ను ఎప్పుడూ పట్టి గుప్పిట్లో మూసి, కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నువ్వు నశించేదాకా. . కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నే నశించేదాకా…ఊం! అయితే నువ్వేనా అంత ప్రశాంతంగా నా వెంటబడుతున్నది? నా…
-
ప్రణయ తత్త్వము … షెల్లీ, ఆంగ్ల కవి
1 చిన్నచిన్ననీటిబుగ్గలు నదులలో కలుస్తే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి; రసనిష్యందమైన భావనలతోనింగిలో కలుస్తాయి సువాసనలు వెదజల్లే పిల్లగాలులు ; ప్రకృతిలో ఏదీ ఒంటరిదికాదు. దైవసంకల్పం వలన ఆత్మలు అన్యోన్యానురక్తితో ఏకమౌతున్నప్పుడు, నేను నిన్నెందుకు కూడతగదు? 2 అనంతాకాశాన్నిగిరిశిఖరాలు ముద్దాడుతున్నై కెరటాలు ఒకదాన్నొకటి కాగలించుకుని పరుగిడుతునై; ఒక చెట్టు పూలే, అయినా,ఒకదాన్నొకటి నిరశించి పెడముఖం పెట్టడం లేదే; వేల బాహువులతో సూర్యుడు భూమిని ఆలింగనం చేస్తున్నాడు చంద్రకిరణాలుకూడా సముద్రాన్ని చుంబిస్తున్నై ఇంతటి ప్రకృతి రాగరసార్ణవానికీ ప్రయోజనమేముంది ప్రేమతో నువ్వు…
-
When the Heart Takes over… BVV Prasad, Telugu, Indian Poet
. Why do we witness those rare drops of tear in a mother’s eyes when her son, who constantly chafes at her for nothing, touches her feet for a blessing; . Why do tears stream out from her pale eyes when you sincerely apologise your wife pleading guilty for the hurt; . Why do the eyes…
-
సృష్టి … ఎడ్నా విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి,
. ఓ విశ్వమా!నిన్నింకాగాఢంగా హత్తుకోవాలనుంది! ఏమి నీ అద్భుత పవనాలు! ఏమి నీ విశాల వినీల గగనాలు! ఏమా తెరలు తెరలుగా దిగి వ్యాపించే పొగమబ్బు దొంతరలు ! ఈ శిశిరఋతు పొద్దు, రంగులకై తపిస్తూ నీ పండుతోపులు తీపుతోవాలి పరితపిస్తున్నాయి; ఆ కాటుకకొండ తన వాలు కప్పిపుచ్చుకుందికీ ఆ శుష్కించిన మోడు చిగురించడానికీ ఆరాటపడుతున్నై; ఓ ప్రకృతీ! పుడమితల్లీ! నీనింతకంటే చేరువకాలేకున్నానే! . ఇక్కడి సౌందర్యాలగురించి ఎప్పటినుండో తెలుసు కానీ,ఇవి ఇంత సుందరంగా ఉంటాయని ఊహించలేదు! ఎంత పట్టరాని…
-
పోస్టాఫీసులోని సిరాబుడ్డికి … క్రిష్టఫర్ మోర్లీ, అమెరికను కవి
. ఎన్ని హృదయాలు వినయంగా నీలో మునకలిడి తమ చేతివ్రాతలుగా మిగిలి ఉంటాయి! తమ ఆంతరంగిక విషయాలు పంచుకునీ, బాధల్ని వెలిబుచ్చీ, తమ వింత, తమాషా వ్యవహారాల్ని నీతో చెప్పుకుని ఉంటాయి! నీ సిరా స్రవంతీ, నీ తడబడిరాసే కలమూ ఎన్ని పుట్టబోయే జీవితాలని ప్రభావితంచేసి ఉంటాయి, నిట్టూర్పులు విడుస్తూ, విరహులైన యువ జంటలు స్వర్గాన్నే పోస్టుకార్డుమీదకి ఎక్కించడం చూసి ఉంటాయి! . క్రిష్టఫర్ మోర్లీ (5 May 1890 – 28 March 1957 )…