వర్గం: అనువాదాలు
-
ఇసుకకట్ట దాటుతున్నప్పుడు … టెన్నీసన్, ఆంగ్ల కవి.
అదిగో సూర్యుడస్తమిస్తున్నాడు, అదే రేచుక్క, నన్ను రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి! ఇసుకకట్ట*దాటి నేను కడలిలోకి అడుగిడుతున్నపుడు వీడ్కోలుచెప్పే కెరటాల కళ్ళు చెమరించకుండుగాక! ఈ అపారపారావారపు అగాధమైన లోతులలోనుండి వెలువడి, సాగి, అలసిసొలసిన ఈ కెరటం తిరిగి తనువచ్చినచోటికే పోతూ నురగలతో సడిచెయ్యడానికీ ఓపికలేనిది. అదిగో మునిచీకటి, అవే సాంధ్యఘంటారావాలు ఇకపై అంతా చిక్కని చీకటి! నేను నావలోకెక్కుతున్నప్పుడు, సాగనంపినవారిలో విషాదము లేకుండు గాక; దేశాకాలావధులుదాటి నా ప్రయాణం కొనసాగినా నన్ను తీరానికి చేర్చే శక్తి కెరటాలకు కలుగుగాక,…
-
ఆత్మలేని మనిషి … సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ కవి
ఇది నాది, నా జన్మభూమి అని ఎన్నడూ తనకు తాను సంభావించుకోని ఆత్మలేని మనిషి ఒకడక్కడ ఉన్నాడు. పరాయి నేలలమీద తిరిగి తిరిగి కాళ్ళు ఇంటిముఖం పట్టినపుడు ఎవరి మనసు జన్మభూమిని తలుచుకుని పులకరించదు? వాడిలాంటి మనిషి కనిపిస్తే, జాగ్రత్త; ఏ జానపద సంగీతమూ అతనికై హోరెత్తదు; బిరుదులూ,పదవులతో,అతనిపేరు మార్మ్రోగిపోవచ్చు గాక, కోరికల అవధులకి ధనం పోగుచేసుకుని ఉండవచ్చు గాక; కానీ, అతని పేరుకీ, అధికారానికీ, ఆ తుచ్ఛుడు తనకోసం పోగేసుకున్న తుచ్ఛమైన సంపదకీ, ఉన్నంతకాలమూ మంచిపేరుతెచ్చుకోలేడు…
-
గుడ్లగూబ… ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి
ఆకలితోనే కొండ దిగేను; ఐతే కడుపు నకనకలాడిపోలేదు; చలిగాలి బాగా వీస్తోంది. అయినా, నా ఒంట్లో ఇంకా ఈ ఉత్తరగాలిని తట్టుకోగల వేడి ఉంది; వొళ్ళు ఎంత అలిసిందంటే ఏ గూట్లోనో తలదాచుకుంటే ఎంతహాయిగా ఉంటుందో చెప్పలేను. . నాకు ఎంత ఆకలిగా, చలిగా, అలసటగా ఉందో తెలుసుగనుక బసలో చలి కాగి,ఆకలితీర్చుకుని విశ్రాంతి తీసుకున్నాను; ఇక బయటి ప్రపంచంతో సంపర్కంలేకుండా రాత్రి గడిచిందిగాని, హృదయవిదారకమైన గుడ్లగూబ అరుపుమాత్రం వేధిస్తూనే ఉంది . పాపం!సంతోషపెట్టే స్వరం గాని,తగిన…
-
The Tiger… Silalolita, Telugu Poetess, Indian
All the blessings for longevity, and happiness shall be confined to age four or five. They may blossom to the same twig of a plant but each of the flowers meets a different fate: Clear barriers, destinies, veils of fidelity, Adorning the bode and putting on lingering shades of blushing Are inseverable fetters to womanhood that follow up…
-
విడిపోవడం కష్టసాధ్యం … మైకేల్ డ్రేటన్, ఇంగ్లీషు కవి
వేరే మార్గం లేదు గనుక, దా, మనిద్దరం ముద్దుముద్దుగానే విడిపోదాం లాభం లేదు, నేను విసిగిపోయాను, నన్నిక నువ్వుచూడడం కుదరదు. నాకు సంతోషంగా ఉంది, నిజం, మనసుకి చాలా హాయిగా ఉంది ఇలా ఇంత నిర్మలంగా నేను విముక్తుడిని అవుతున్నందుకు. కడపటిసారి చేతులు కలుపుకుందాం, ప్రమాణాలు గట్టుమీదపెడదాం, భవిష్యత్తులో ఎప్పుడైనా కలుసుకోవడం తటస్థిస్తే, మనిద్దరిలో ఏ ఒక్కరూ మన పూర్వపు ప్రేమఛాయలు లేశమైనా మనిద్దరి కనుబొమలలో మిగలనీవద్దు. “ప్రేమ” ఇపుడు ఎగవూపిరితో చివరిశ్వాశకై పాకులాడుతూ, దాని నాడి…
-
నిరాశాస్తుతి … ఛార్లెట్ స్మిత్, ఆంగ్ల కవయిత్రి
దిక్కులేని హృదయాలకీ, దైన్యపు చూపులకీ రాజువై నీ ప్రభావంతో నామమాత్ర వివేకమూ నశింపజేసి మనుషులను మతిభ్రష్టులుగా మార్చగల భీకరాకారిణీ! భూత స్వరూపిణీ! భయద ముఖీ, నిరాశా! నేను సంసిద్ధం, రా! నన్ను ఆవహించి బలితీసుకో! నీ నిరంకుశత్వాన్ని, నాపై అనుగ్రహంగా భావిస్తాను! . ఉల్లాసపు తూలికలతో ఆనందపుచిత్రాలుగీసి వెంటనే అవి కనపడకుండా మాయంచేసే ఓ నయ వంచకీ, ఇచ్చకపుబుచ్చీ ఆశా! ఇక నీ ముఖం నాకెన్నడూ చూపించకు ! నీ కల్పనలకు విరుధ్ధంగా, నా కళ్ళముందు వాటి ఆభాసలు…
-
కవిత్వమూ – శిల్పమూ… గేథే, జర్మను కవి
. బంకమట్టిని తను ఊహించుకున్న ఆకృతిలోకి గ్రీకుశిల్పిని మలుచుకోనీ, తన చేతిలో రూపుదిద్దుకున్న శిల్పాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బవనీ… నాకు మాత్రం యూఫ్రటీస్ నదిని తాకి, ఆ ప్రవహిస్తున్న నీటిలో చేతులు అటూ ఇటూ కదిపితే చాలు ఒళ్ళు తన్మయత్వంతో పులకరిస్తుంది. తపిస్తున్న నా ఆత్మని శమింపజేసి నా అనుభూతిని ప్రకటిస్తాను నిష్కల్మషమైన కవి దోసిలిలో ఒదిగిన ఆ నీరు… ఘనీభవిస్తుంది. . గేథే 28 August 1749 – 22 March 1832 జర్మను కవి,…
-
పునరుత్థానము … క్రిస్టినా రోజేటి … ఆంగ్ల కవయిత్రి
. ఓ ప్రభూ! నన్ను త్వరగా తీసుకుపో! నాకు వివేకము శూన్యం, మాటలు రావు, కన్నీళ్ళింకిపోయాయి; నా మనసు శిలగా మారి ఎంత చైతన్యవిహీనమయినదంటే ఇపుడిక ఏ ఆశలూ, ఏ భయాలూ దాన్ని మేల్కొలపలేవు. కుడి ఎడమల ఎటుచూసినా తోడులేని ఒంటరి జీవిని; కళ్ళెత్తి చూతునా, దుఃఖపుపొరతో చూపుమందగిస్తుంది శాశ్వతమైన ఏ మహోన్నత శృంగాల్నీచూడలేను. నా జీవితమిపుడు పండుటాకులా రాలిపోతోంది. . ఓ ప్రభూ! నాలో నువ్వు తిరిగి ఉదయించు! నా జీవితం రంగువెలిసిన ఆకు పోలికలోనూ …
-
స్వరకర్త… WH ఆడెన్, బ్రిటిషు-అమెరికను కవి
ఇతర కళాకారులంతా అనువాదకులే; మెచ్చినా, మరచినా, చిత్రకారుడు కనిపిస్తున్న ప్రకృతిని గీస్తాడు; తనజీవితాన్ని శోధించి శోధించి ప్రతీకల్నిబయటకి తీస్తాడు కవి, మనసుని కలచి, అనుభూతి పంచుకుందికి. “జీవితం నుండి కళ” ఒక బాధామయమైన రూపాంతరీకరణ మధ్య అగాధాన్ని మనమేదో పూడ్చగలిగినట్టు ఆధారపడుతూ; ఒక్క నీ స్వరాలే స్వచ్ఛమైన కల్పనలు ఒక్క నీ గీతమే పరిపూర్ణమైన బహుమతి! . ఓ చెవులపండువా! జలపాతంలా సాక్షాత్కరించు! ఈ స్తబ్ధ వాతావరణాన్నీ, మా సందేహాల్నీ ఛేదిస్తూ, వంగుతున్న నడుముల్నీ, వాలుతున్న మోకాళ్ళనీ…
-
నా ఆత్మ పిరికిదేం కాదు… ఎమిలీ బ్రాంటే, ఇంగ్లీషు కవయిత్రి
తుఫానులలో చిక్కుకున్న ఈ గోళం మీద భయపడడానికి, నా ఆత్మ పిరికిదేం కాదు: స్వప్రకాశములైన దేవుని మహిమలు నే చూస్తున్నా నమ్మకమూ అంతస్థిరంగానే ఉంది, అభయ కవచంలా. నా హృదయంతరాల్లోని ఓ దైవమా! సర్వవ్యాపీ! సర్వ శక్తిమయా! నీలోలీనమై నేను అమరత్వాన్ని పొందినపుడు నాలోని జీవుడికి ఊరట దొరుకుతుంది! మనుషుల హృదయాల్ని కదిలించగల మతాలు వెయ్యైనా నిష్ప్రయోజనం: బొత్తిగా పనికిరావు; విశాల సాగరాలపై ఊరికే తేలియాడే నురగలా వాడివత్తలైన కలుపుమొక్కల్లాగా వ్యర్థం; నిశ్చలమైన అవినాశపు శిలపై హాయిగా…