వర్గం: అనువాదాలు
-
A Pan of Musk… Munipalle Raju, Indian
Rammurty was getting accustomed to fasting these days. On the first few days he said to his wife, “Rama, I am not feeling hungry, don’t cook food for me.” Later he started inventing one reason or the other saying, “It is Ekadasi today, I fast in the day; It is Saturday today, I don’t take…
-
పాళా ఐస్ క్రీం … శ్రీ మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా
Watch the poem in video here. ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ. కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా. నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు…
-
Becoming a Rain… Kondamudi Saikiran Kumar, Telugu, Indian
Eons have passed Landscapes have changed But the nascent smell of the rain Sinking into the earth has not changed. How many feelings Shall it spray Springing back to life Memories from the depths of heart! For once I long to turn into a cloudlet And roll over in the dust… . Kondamudi Saikiran Kumar 1st…
-
జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు
వాళ్ళింటికెళ్ళినపుడు, తనుకూర్చున్న కుర్చీలోంచి ఒక్కసారి ఉరికి మరీ, జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది; కాలమా! దొంగదానా! నీ చిఠాలోకి మంచివన్నీ రాసి దాచుకుంటావుగదా! దీన్ని కూడా రాసుకో! ఫో! నేను జీవితంలో అలిసిపోయాననో, దుఃఖంతో ఉన్నాననో ఆరోగ్యం బాగులేదనీ, డబ్బులేనివాడిననీ, ఒకటేమిటి ముసిలాడినయిపోతున్నాననీ, ఎన్నైనా రాసుకో. వాటితో పాటే, ఇదికూడా రాయడం మరిచిపోకు: జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది. . జేమ్స్ లే హంట్, (19 October 1784 – 28 August 1859), ఇంగ్లండు. లే హంట్ పేరు చెప్పగానే,…
-
ఒక్కోసారి… షెనా ప్యూ
. ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది; పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి; మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని, ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి; కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు.…
-
ఏదీ శాశ్వతం కాదు… సిసిలీ హెర్బర్ట్, ఇంగ్లండు
. ప్రతీదీ మార్పుకులోనౌతుంది. మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుతాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము. . జరిగిందేదో జరిగిపోయింది. సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము, అయినా, అన్నీ మార్పుకిలోనౌతాయి మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుదాం. . సిసిలీ హెర్బర్ట్ ఇంగ్లండు ఈ కవితలోని సౌందర్యం, అనులోమంలోనూ విలోమంలోనూ ఒకే రకమైన మాటలు ఉపయోగించి, ఒక సారి నిరాశా నిస్పృహలు సూచిస్తే, రెండవ సారి ఆశావహమైన…
-
నేను ఏకాకిని కాను … నికి జియొవాని, అమెరికను
నేను ఒంటరిగా నిద్రించే ఏకాకిని కాను… నేను భయపడతానని అనుకున్నావు ఏంలేదు, నేనిపుడు పెద్ద పిల్లనయ్యాను నేనిప్పుడు ఏడవటం లాంటివి ఏవీ చెయ్యడం లేదు. నాకిప్పుడు చాలా పెద్ద మంచం ఉంది దాని మీద సరిపడా జాగా ఉంది విశాలంగా ఎటుపడితే అటు దొర్లవచ్చు; ఇకమీదట… పూర్వం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినట్టు వచ్చినలాంటి పీడకలలు మరి రావు నువ్వింక నన్ను వదిలి వెళ్ళిపోయేవు కనుక నాకు కలలే రావు. నువ్వేమనుకున్నా సరే…
-
నిర్లక్ష్యానికి నివేదన… ఫేనీ గ్రెవిల్,ఇంగ్లండు
నా ప్రేమకి ప్రతిగా ప్రేమని కోరను, ఆకర్షించడానికి ఏ అందాలూ కోరను; ప్రశాంతతకోసం, సుఖంకోసం నిట్టూర్చే మనసునుండి అవి దూరంగా తొలగిస్తే చాలు. మనసుకి సుఖమూ శాంతీ రెండూ తెలీవు, అది ఒక వాడి సూది మొనలాగ ఆనందమూ, విషాదమూ స్పర్శిస్తే చాలు స్పందిస్తుంది, స్పందిస్తూ, భయపడుతుంది కూడా. దుఃఖాలు మనసుకి గాయం చెయ్యడం మాటకి వస్తే అది ఎప్పుడూ బాధే, తప్పితే, అవస్థలోనే తేడా; సుఖాల విషయానికి వస్తే, ఎప్పుడూ హద్దులే; హద్దుదాటితే, తీరని వేదనే.…
-
చరమశ్లోకం … జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి.
నీలాగే ఒకప్పుడు జీవనసాగరాన్ని ఈదేను, నీలాగే నిరర్థకమైన సుఖాలకై ప్రాకులాడేను నీలాగే జీవితపు పెను తుఫానులో శ్రమించేను స్వల్ప విషయాలకు బాధపడి, ఆటబొమ్మలకు ఆనందించేను. నా బలహీనతలు మరిచిపో; నీకూ బలహీనతలున్నాయి; నా పొరపాట్లు మన్నించు; నువ్వూ పొరపాట్లు చెయ్యకపోవు; ఏ సొగసులూలేని నా దీనగాథ విని నిర్వికారంగా ఉండకు. ఓ మనిషీ! నీకూ, మీ కందరికీ నేను స్నేహితుడినే. . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803) స్కాటిష్ కవీ, తత్త్వవేత్త.…